News In Pics : చిత్రం చెప్పే సంగతులు (25-11-2022)

Updated : 25 Nov 2022 13:02 IST
1/32
గోవాలో నిర్వహించిన 53వ అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఇలా రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. గోవాలో నిర్వహించిన 53వ అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఇలా రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు.
2/32
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోని ఖండవా జిల్లాలో సాగుతోంది. రాహుల్‌కు సంఘీభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్న ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఓ బాలికకు ఇలా షూ లేస్‌ కడుతూ కనిపించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోని ఖండవా జిల్లాలో సాగుతోంది. రాహుల్‌కు సంఘీభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్న ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఓ బాలికకు ఇలా షూ లేస్‌ కడుతూ కనిపించారు.
3/32
ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ కుటుంబ సమేతంగా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ కుటుంబ సమేతంగా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
4/32
చూడటానికి కారులా కనిపిస్తోంది. తిప్పడానికి స్టీరింగ్‌ ఉంది. లోపలికి వెళ్లితే తెలుస్తోంది ఇది సైకిల్‌ అని... గుంటూరు ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు పి.రంజిత్‌కుమార్, ఎం.హేమంత్, ఎస్‌కే జోగిశ్వరరావులు ఈ వినూత్నమైన ప్రాజెక్టు రూపొందించారు. ముందు భాగంలో రెండు, వెనుక వైపు ఒక చక్రాన్ని ఏర్పాటు చేశారు. చూడటానికి కారులా కనిపిస్తోంది. తిప్పడానికి స్టీరింగ్‌ ఉంది. లోపలికి వెళ్లితే తెలుస్తోంది ఇది సైకిల్‌ అని... గుంటూరు ఎంబీటీఎస్‌ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు పి.రంజిత్‌కుమార్, ఎం.హేమంత్, ఎస్‌కే జోగిశ్వరరావులు ఈ వినూత్నమైన ప్రాజెక్టు రూపొందించారు. ముందు భాగంలో రెండు, వెనుక వైపు ఒక చక్రాన్ని ఏర్పాటు చేశారు.
5/32
ఆగస్టు 29న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమైన పెద్దపల్లి సమీకృత పాలనా సౌధం(కలెక్టరేట్‌) సందర్శించే వారికి ఓ దృశ్యం కట్టిపడేస్తోంది. మెట్ల పక్కన ఉంచిన రెండు ఎద్దుల బండ్లు(కచ్చురాలు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పాడి పంటలు బాగుంటే జిల్లా సుభిక్షంగా ఉంటుందని.. దీనికి సూచికగానే కచ్చురాలను కలెక్టరేట్‌లో ప్రదర్శిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆగస్టు 29న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభమైన పెద్దపల్లి సమీకృత పాలనా సౌధం(కలెక్టరేట్‌) సందర్శించే వారికి ఓ దృశ్యం కట్టిపడేస్తోంది. మెట్ల పక్కన ఉంచిన రెండు ఎద్దుల బండ్లు(కచ్చురాలు) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పాడి పంటలు బాగుంటే జిల్లా సుభిక్షంగా ఉంటుందని.. దీనికి సూచికగానే కచ్చురాలను కలెక్టరేట్‌లో ప్రదర్శిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
6/32
 గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువారం జరిగిన సాంస్కృతిక ఉత్సవాల్లో మంత్రి రోజా నృత్యం చేశారు. కళాకారులతో కాలు కదిపి అందరినీ అలరించారు. గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో గురువారం జరిగిన సాంస్కృతిక ఉత్సవాల్లో మంత్రి రోజా నృత్యం చేశారు. కళాకారులతో కాలు కదిపి అందరినీ అలరించారు.
7/32
బాపట్ల మండలం సూర్యలంక అటవీ భూముల్లో సాలీడు గూడుపై మంచు కురిసి ముత్యాల హారంలా మెరిసిపోతూ చూపరులను విశేషంగా ఆకర్షించింది. ఈ మనోహర దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది. బాపట్ల మండలం సూర్యలంక అటవీ భూముల్లో సాలీడు గూడుపై మంచు కురిసి ముత్యాల హారంలా మెరిసిపోతూ చూపరులను విశేషంగా ఆకర్షించింది. ఈ మనోహర దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌ మనిపించింది.
8/32
ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు ఏర్పాటు చేసిన నెల్లూరు నగరవనాన్ని ఎట్టకేలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ వనంలో వివిధ రకాల జంతువులు, పక్షుల బొమ్మలను జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఇప్పటికే అక్కడికి వచ్చి.. వాటిని తిలకిస్తున్న వారు భలే అంటున్నారు.   ప్రజలకు ఆహ్లాదం కలిగించేందుకు ఏర్పాటు చేసిన నెల్లూరు నగరవనాన్ని ఎట్టకేలకు అందుబాటులోకి తెస్తామని అధికారులు ప్రకటించారు. త్వరలో ప్రారంభమయ్యే ఈ వనంలో వివిధ రకాల జంతువులు, పక్షుల బొమ్మలను జీవం ఉట్టిపడేలా తీర్చిదిద్దారు. ఇప్పటికే అక్కడికి వచ్చి.. వాటిని తిలకిస్తున్న వారు భలే అంటున్నారు.
9/32
 నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై.. ఫర్హాబాద్‌-వట్వర్లపల్లి మధ్య బుధవారం పెద్దపులి రోడ్డు దాటుతూ ప్రయాణికులకు కనిపించింది. వారు సెల్‌ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.  నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ పులుల అభయారణ్యంలోని శ్రీశైలం ప్రధాన రహదారిపై.. ఫర్హాబాద్‌-వట్వర్లపల్లి మధ్య బుధవారం పెద్దపులి రోడ్డు దాటుతూ ప్రయాణికులకు కనిపించింది. వారు సెల్‌ఫోన్లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు.
10/32
బంజారాహిల్స్‌ కాసు బ్రహ్మానందరెడ్డి ఉద్యానంలో చిరన్‌ చెరువు సోయగం చూపరులను ఆకర్షిస్తోంది. బంజారాహిల్స్‌ కాసు బ్రహ్మానందరెడ్డి ఉద్యానంలో చిరన్‌ చెరువు సోయగం చూపరులను ఆకర్షిస్తోంది.
11/32
సిరిసిల్ల పట్టు ఖ్యాతిని చాటేలా హైదరాబాద్‌ నుంచి సిరిసిల్ల వెళ్లే మార్గంలో శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ (బాహ్య వలయ రహదారి) కూడలిలో చేనేత కార్మికులు వాడే ‘కండెలు’ ఇలా ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సిరిసిల్ల పట్టు ఖ్యాతిని చాటేలా హైదరాబాద్‌ నుంచి సిరిసిల్ల వెళ్లే మార్గంలో శామీర్‌పేట్‌ ఓఆర్‌ఆర్‌ (బాహ్య వలయ రహదారి) కూడలిలో చేనేత కార్మికులు వాడే ‘కండెలు’ ఇలా ఏర్పాటు చేశారు. ఇవి అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
12/32
అమీన్‌పూర్‌లో రోడ్డు పక్కన మంచి వ్యాపార సముదాయం.. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు.. ఇప్పటికే ఈ రోడ్డులో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నిర్మాణంతో మరింత ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతాయి. వ్యాపార భవనానికి రోడ్డుపై నుంచి ఇనుప మెట్లను ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 15 అడుగులు రోడ్డు పైకి గోడల నిర్మాణం చేస్తున్నారు. దీనిపై స్థానికులు పురపాలిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమీన్‌పూర్‌లో రోడ్డు పక్కన మంచి వ్యాపార సముదాయం.. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు.. ఇప్పటికే ఈ రోడ్డులో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నిర్మాణంతో మరింత ట్రాఫిక్‌ సమస్యలు పెరుగుతాయి. వ్యాపార భవనానికి రోడ్డుపై నుంచి ఇనుప మెట్లను ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 15 అడుగులు రోడ్డు పైకి గోడల నిర్మాణం చేస్తున్నారు. దీనిపై స్థానికులు పురపాలిక అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
13/32
మధ్యప్రదేశ్‌లో గురువారం నిర్వహించిన భారత్‌ జోడో యాత్రలో విల్లు ఎక్కుపెట్టిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. చిత్రంలో రాహుల్ గాంధీ. మధ్యప్రదేశ్‌లో గురువారం నిర్వహించిన భారత్‌ జోడో యాత్రలో విల్లు ఎక్కుపెట్టిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ. చిత్రంలో రాహుల్ గాంధీ.
14/32
భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోతే ఎవరికీ ఇబ్బందులు కలగకుండా వాహనాలు సాఫీగా సాగేలా చేసే ట్రాఫిక్‌ ప్రత్యేక బైకు ఇది. వైజంక్షన్‌ వద్ద నోపార్కింగ్‌ ప్రాంతంలో కాలిబాటపై కనిపించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎడాపెడా జరిమానాలు వేసే ట్రాఫిక్‌ పోలీసులకు అవి వర్తించవేమో మరి! భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోతే ఎవరికీ ఇబ్బందులు కలగకుండా వాహనాలు సాఫీగా సాగేలా చేసే ట్రాఫిక్‌ ప్రత్యేక బైకు ఇది. వైజంక్షన్‌ వద్ద నోపార్కింగ్‌ ప్రాంతంలో కాలిబాటపై కనిపించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎడాపెడా జరిమానాలు వేసే ట్రాఫిక్‌ పోలీసులకు అవి వర్తించవేమో మరి!
15/32
మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై ఎట్టకేలకు రక్షణ కంచె ఏర్పాటు చేశారు. గత వర్షాలకు బ్రిడ్జిపై ఉన్న కంచె కొట్టుకుపోవడంతో.. ‘రక్షణ మూణ్నాళ్ల ముచ్చటేనా’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన చిత్రవార్తకు అధికారులు స్పందించారు. మూసారాంబాగ్‌ బ్రిడ్జిపై ఎట్టకేలకు రక్షణ కంచె ఏర్పాటు చేశారు. గత వర్షాలకు బ్రిడ్జిపై ఉన్న కంచె కొట్టుకుపోవడంతో.. ‘రక్షణ మూణ్నాళ్ల ముచ్చటేనా’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన చిత్రవార్తకు అధికారులు స్పందించారు.
16/32
హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తున్న మెట్రో రైళ్లు.. పంజాగుట్ట, నల్గొండ క్రాస్‌ రోడ్ల వద్ద పైవంతెనల పైనుంచి వెళుతూ కనువిందు చేస్తాయి. త్వరలో మెట్రో రైలు మార్గం పై నుంచి సైతం వాహనాలపై దూసుకెళ్లవచ్చు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మిస్తున్న పైవంతెనతో ఇది సాధ్యం కానుంది. వీఎస్‌టీ-ఇందిరా పార్కు పైవంతెనను ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద మెట్రో రైలు మార్గంపై నుంచి వెళ్లేలా నిర్మాణం చేపడుతున్నారు. హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో ప్రయాణికులకు సేవలు అందిస్తున్న మెట్రో రైళ్లు.. పంజాగుట్ట, నల్గొండ క్రాస్‌ రోడ్ల వద్ద పైవంతెనల పైనుంచి వెళుతూ కనువిందు చేస్తాయి. త్వరలో మెట్రో రైలు మార్గం పై నుంచి సైతం వాహనాలపై దూసుకెళ్లవచ్చు. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద నిర్మిస్తున్న పైవంతెనతో ఇది సాధ్యం కానుంది. వీఎస్‌టీ-ఇందిరా పార్కు పైవంతెనను ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద మెట్రో రైలు మార్గంపై నుంచి వెళ్లేలా నిర్మాణం చేపడుతున్నారు.
17/32
మూసాపేట ప్రగతినగర్‌లోని ప్రధాన రహదారిలో నిత్యం నీళ్లు నిలుస్తూ రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. కమ్యూనిటీహాల్‌ రోడ్డులోని ఇళ్ల నుంచి వృథా నీటిని రోడ్డుపైకి వదులుతున్నారు. మూసాపేట ప్రగతినగర్‌లోని ప్రధాన రహదారిలో నిత్యం నీళ్లు నిలుస్తూ రాకపోకలకు ఇబ్బందిగా ఉంది. కమ్యూనిటీహాల్‌ రోడ్డులోని ఇళ్ల నుంచి వృథా నీటిని రోడ్డుపైకి వదులుతున్నారు.
18/32
కూకట్‌పల్లిలోని మలేసియన్‌ టౌన్‌షిప్‌ ఎదురు సర్వీస్‌ రోడ్డులో వర్షపు నీటి నాలా ఛాంబర్‌ ప్రమాదకరంగా మారింది. ఛాంబర్‌పై మట్టి, ఇసుక పేరుకుంది. మూతలు పటిష్టంగా లేవు. రహదారి తవ్వి వదిలేయడంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. ఛాంబర్‌కు మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది. కూకట్‌పల్లిలోని మలేసియన్‌ టౌన్‌షిప్‌ ఎదురు సర్వీస్‌ రోడ్డులో వర్షపు నీటి నాలా ఛాంబర్‌ ప్రమాదకరంగా మారింది. ఛాంబర్‌పై మట్టి, ఇసుక పేరుకుంది. మూతలు పటిష్టంగా లేవు. రహదారి తవ్వి వదిలేయడంతో వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. ఛాంబర్‌కు మరమ్మతులు చేయించాల్సిన అవసరం ఉంది.
19/32
ఆకాశహర్మ్యాలతో వెలుగులీనుతున్న ఈ ప్రాంతం రాయదుర్గంలోని నాలెడ్జిసిటీలోది. ఇక్కడ నిర్మిస్తున్న పలు భవనాలు ఇటీవల పూర్తయ్యాయి. వాటిలో కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడంతో విద్యుద్దీప కాంతులతో ఆ ప్రాంతానికి శోభ వచ్చింది. ఆకాశహర్మ్యాలతో వెలుగులీనుతున్న ఈ ప్రాంతం రాయదుర్గంలోని నాలెడ్జిసిటీలోది. ఇక్కడ నిర్మిస్తున్న పలు భవనాలు ఇటీవల పూర్తయ్యాయి. వాటిలో కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించడంతో విద్యుద్దీప కాంతులతో ఆ ప్రాంతానికి శోభ వచ్చింది.
20/32
  ఉప్పల్‌ కూడలిలో సుమారు రూ.35 కోట్ల వ్యయంతో 660 మీటర్ల మేర స్కైవాక్‌ వంతెన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన రహదారుల్లో పాదచారులు ప్రమాదకరంగా రాకపోకలు సాగించకుండా దీనిపైకి వెళ్లి వినియోగించుకునేలా ఆరు ద్వారాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇది పూర్తయితే ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని అధికారులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ఉప్పల్‌ కూడలిలో సుమారు రూ.35 కోట్ల వ్యయంతో 660 మీటర్ల మేర స్కైవాక్‌ వంతెన నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రధాన రహదారుల్లో పాదచారులు ప్రమాదకరంగా రాకపోకలు సాగించకుండా దీనిపైకి వెళ్లి వినియోగించుకునేలా ఆరు ద్వారాలు ఏర్పాటుచేస్తున్నారు. ఇది పూర్తయితే ఆ ప్రాంత రూపురేఖలే మారిపోతాయని అధికారులు చెబుతున్నారు. కొత్త సంవత్సరంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
21/32
ఐటీ కారిడార్‌ను బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేస్తూ నిర్మించిన శిల్పా లేఅవుట్‌ మొదటి దశ పైవంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఐకియా మాల్‌ వెనక మొదలయ్యే ఈ పై వంతెన 30 అంతస్తుల ఎత్తైన భవనాల మధ్య నుంచి సాగిపోతూ విశాలమైన ఓఆర్‌ఆర్‌పైకి చేరుతుంది. బహుళ అంతస్తుల మధ్య వంపులు తిరుగుతూ.. రెండు అంతస్తుల్లో రూపుదిద్దుకున్న ఈ వంతెనకు అనేక ప్రత్యేకతలున్నాయని, ఆకాశం నుంచి చూస్తే శిల్పంలా కనిపిస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. శిల్పా లేఅవుట్‌ మొదటి దశ పై వంతెనను శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. రెండోదశ ప్రాజెక్టు డిసెంబరు 2023 నాటికి పూర్తవుతుందని అంచనా. ఐటీ కారిడార్‌ను బాహ్యవలయ రహదారి (ఓఆర్‌ఆర్‌)తో అనుసంధానం చేస్తూ నిర్మించిన శిల్పా లేఅవుట్‌ మొదటి దశ పైవంతెన ప్రారంభానికి సిద్ధమైంది. ఐకియా మాల్‌ వెనక మొదలయ్యే ఈ పై వంతెన 30 అంతస్తుల ఎత్తైన భవనాల మధ్య నుంచి సాగిపోతూ విశాలమైన ఓఆర్‌ఆర్‌పైకి చేరుతుంది. బహుళ అంతస్తుల మధ్య వంపులు తిరుగుతూ.. రెండు అంతస్తుల్లో రూపుదిద్దుకున్న ఈ వంతెనకు అనేక ప్రత్యేకతలున్నాయని, ఆకాశం నుంచి చూస్తే శిల్పంలా కనిపిస్తుందని ఇంజినీర్లు చెబుతున్నారు. శిల్పా లేఅవుట్‌ మొదటి దశ పై వంతెనను శుక్రవారం పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నట్లు జీహెచ్‌ఎంసీ ప్రకటించింది. రెండోదశ ప్రాజెక్టు డిసెంబరు 2023 నాటికి పూర్తవుతుందని అంచనా.
22/32
 పోలిపాడ్యమిని పురస్కరించుకుని పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిపై కొలువైన కైలాసనాథుడిని మందారాలతో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ఆవరణ, గర్భగుడి ఆవరణ అంతా సుమారు రెండు వేల మందారాలతో అలంకరించిన తీరు సందర్శకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పోలిపాడ్యమిని పురస్కరించుకుని పర్యాటక ప్రాంతమైన కైలాసగిరిపై కొలువైన కైలాసనాథుడిని మందారాలతో అలంకరించారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ ఆవరణ, గర్భగుడి ఆవరణ అంతా సుమారు రెండు వేల మందారాలతో అలంకరించిన తీరు సందర్శకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
23/32
 విశాఖ తీరానికి చేరువగా వచ్చిన భారీ నౌకలు బీచ్‌లోని సందర్శకులను ఆకట్టుకున్నాయి. వాటితో పాటు జతగా ప్రయాణించిన చిన్నచిన్న నౌకలు, పడవలను తిలకించటానికి చాలా మంది ఆసక్తి చూపారు. వచ్చే నెల నాలుగో తేదీన జరిగే నావికాదళ దినోత్సవానికి సన్నద్ధమవుతున్న రక్షణ నౌకల రాజసం ఆకట్టుకుంటోంది. విశాఖ తీరానికి చేరువగా వచ్చిన భారీ నౌకలు బీచ్‌లోని సందర్శకులను ఆకట్టుకున్నాయి. వాటితో పాటు జతగా ప్రయాణించిన చిన్నచిన్న నౌకలు, పడవలను తిలకించటానికి చాలా మంది ఆసక్తి చూపారు. వచ్చే నెల నాలుగో తేదీన జరిగే నావికాదళ దినోత్సవానికి సన్నద్ధమవుతున్న రక్షణ నౌకల రాజసం ఆకట్టుకుంటోంది.
24/32
పొగమంచు పెరిగింది. రాత్రయితే చాలు రహదారులు కనిపించని రీతిలో కమ్మేస్తోంది. గురువారం తెల్లవారుజామున ఒంగోలులోని కర్నూల్‌ రోడ్డులో దట్టంగా అలుముకున్న మంచు ఇది. జాతీయ రహదారులపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. పొగమంచు పెరిగింది. రాత్రయితే చాలు రహదారులు కనిపించని రీతిలో కమ్మేస్తోంది. గురువారం తెల్లవారుజామున ఒంగోలులోని కర్నూల్‌ రోడ్డులో దట్టంగా అలుముకున్న మంచు ఇది. జాతీయ రహదారులపై వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
25/32
రామచిలకల కోసం వేసిన బియ్యపు గింజలను తినేందుకు  పావురాలు సైతం వచ్చాయి. అయితే రామచిలుకకు ఇబ్బంది లేకుండా కోకిల మాత్రం ఇటు తిరిగి గింజలను తింటుంటే, మరోవైపు పావురం మాత్రం ఏకంగా రామచిలకలనే పైకి వస్తే తంతాను అని కాలుఎత్తుతున్న చిత్రం విజయవాడ గులాబీతోట సాయిబాబా వీధిలో కనిపించింది. రామచిలకల కోసం వేసిన బియ్యపు గింజలను తినేందుకు పావురాలు సైతం వచ్చాయి. అయితే రామచిలుకకు ఇబ్బంది లేకుండా కోకిల మాత్రం ఇటు తిరిగి గింజలను తింటుంటే, మరోవైపు పావురం మాత్రం ఏకంగా రామచిలకలనే పైకి వస్తే తంతాను అని కాలుఎత్తుతున్న చిత్రం విజయవాడ గులాబీతోట సాయిబాబా వీధిలో కనిపించింది.
26/32
ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద గురువారం వేకువజామునే దీపాలు వదులుతున్న మహిళలు.. ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద గురువారం వేకువజామునే దీపాలు వదులుతున్న మహిళలు..
27/32
కార్తికమాసం చివరిరోజు కృష్ణానదీ తీరం దేదీప్యమానంగా ప్రకాశించింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గురువారం తెల్లవారుజాముకే దుర్గాఘాట్‌లో మహిళలు కిక్కిరిసిపోయారు. అరటిదొప్పల్లో దీపాలు ఉంచి పోలిస్వర్గం నిర్వహించేందుకు వారంతా పోటీపడ్డారు. కార్తికమాసం చివరిరోజు కృష్ణానదీ తీరం దేదీప్యమానంగా ప్రకాశించింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గురువారం తెల్లవారుజాముకే దుర్గాఘాట్‌లో మహిళలు కిక్కిరిసిపోయారు. అరటిదొప్పల్లో దీపాలు ఉంచి పోలిస్వర్గం నిర్వహించేందుకు వారంతా పోటీపడ్డారు.
28/32
ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యానికి నిలువుటద్దం  ఈ చిత్రం. మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడివలసలో గిరిజనుల తాగునీటి   అవసరాలు తీర్చడానికి చేతిపంపులు ఏర్పాటు చేశారు. ఒకటి పాడైతే మరమ్మతులు చేపట్టకుండానే, దాని పక్కనే మరొకటి వేసుకుంటూ ఇలా ఒకే ప్రాంతంలో బోర్లు వేశారు. ప్రభుత్వ శాఖల నిర్లక్ష్యానికి నిలువుటద్దం ఈ చిత్రం. మారేడుమిల్లి మండలం గుజ్జుమామిడివలసలో గిరిజనుల తాగునీటి అవసరాలు తీర్చడానికి చేతిపంపులు ఏర్పాటు చేశారు. ఒకటి పాడైతే మరమ్మతులు చేపట్టకుండానే, దాని పక్కనే మరొకటి వేసుకుంటూ ఇలా ఒకే ప్రాంతంలో బోర్లు వేశారు.
29/32
 తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం పల్లకీ వాహనసేవ జరిగింది. వాహనంపై అమ్మవారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం పల్లకీ వాహనసేవ జరిగింది. వాహనంపై అమ్మవారు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
30/32
బంగారు ఛాయతో కాంతులీనుతున్న అరుదైన చేప చిత్తూరు జిల్లా పిచ్చాటూరులోని అరణియార్‌ జలాశయంలో జాలరి మారయ్య వలకు గురువారం చిక్కింది. జలాశయంలోని చేపలకు భిన్నమైన రంగులో కనిపించిన ఈ చేపను చూడటానికి ప్రజలు ఆసక్తి చూపారు. బంగారు ఛాయతో కాంతులీనుతున్న అరుదైన చేప చిత్తూరు జిల్లా పిచ్చాటూరులోని అరణియార్‌ జలాశయంలో జాలరి మారయ్య వలకు గురువారం చిక్కింది. జలాశయంలోని చేపలకు భిన్నమైన రంగులో కనిపించిన ఈ చేపను చూడటానికి ప్రజలు ఆసక్తి చూపారు.
31/32
కొల్లేరుకు వచ్చే విశిష్ట అతిథి చింతవాఖీ (బ్లాక్‌ క్రౌన్డ్‌ నైట్‌ హెరాన్‌) చీకటి వేళల్లో మాత్రమే వేటాడుతోంది. అందుకే దీనిని స్థానికంగా చీకటి వేటగాడు అని పిలుస్తారు.
కొల్లేరుకు వచ్చే విశిష్ట అతిథి చింతవాఖీ (బ్లాక్‌ క్రౌన్డ్‌ నైట్‌ హెరాన్‌) చీకటి వేళల్లో మాత్రమే వేటాడుతోంది. అందుకే దీనిని స్థానికంగా చీకటి వేటగాడు అని పిలుస్తారు.
32/32
గుంతలకు లెక్కే లేదు...  మరమ్మతుల ఊసే లేదు..  అడుగడుగునా గుంతలతో కనిపిస్తున్న ఈ రహదారి అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట-బడికాయపల్లె ప్రధాన రహదారి. ఈ దారిలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతలకు లెక్కే లేదు... మరమ్మతుల ఊసే లేదు.. అడుగడుగునా గుంతలతో కనిపిస్తున్న ఈ రహదారి అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట-బడికాయపల్లె ప్రధాన రహదారి. ఈ దారిలో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts