News In Pics : చిత్రం చెప్పే సంగతులు-2 (25-11-2022)

Updated : 25 Nov 2022 22:27 IST
1/19
కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.. కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు శుక్రవారం రాత్రి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు..
2/19
లద్ధాఖ్‌ సింధు లోయలోని హను-ఆర్యన్‌ గ్రామానికి చెందిన పలువురు మహిళలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. వీరంతా భారత ఆర్మీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ సమగ్రతా పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చారు. లద్ధాఖ్‌ సింధు లోయలోని హను-ఆర్యన్‌ గ్రామానికి చెందిన పలువురు మహిళలు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. వీరంతా భారత ఆర్మీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ సమగ్రతా పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చారు.
3/19
మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సినీనటి శోభన కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆమె నృత్యం ఆసాంతం ప్రేక్షకులను అలరించింది. మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో సినీనటి శోభన కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. ఆమె నృత్యం ఆసాంతం ప్రేక్షకులను అలరించింది.
4/19
5/19
కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌.. రాహుల్‌ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. వారిద్దరు మీసాలను మెలేసి పోజులిస్తూ పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్‌ పెంచారు. కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారత ప్రొఫెషనల్‌ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌.. రాహుల్‌ గాంధీతో కలిసి యాత్రలో పాల్గొన్నారు. వారిద్దరు మీసాలను మెలేసి పోజులిస్తూ పార్టీ శ్రేణులు, ప్రజల్లో జోష్‌ పెంచారు.
6/19
విశాఖలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. విశాఖలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వర్షం కురిసింది. దీంతో రాకపోకలు సాగించేందుకు వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
7/19
కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కూడలిలో భారీ కాఫీ పాత్ర నమూనాను ఏర్పాటు చేశారు. దీంతో కూడలి నూతన శోభను సంతరించుకుంది. కర్నూలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కూడలిలో భారీ కాఫీ పాత్ర నమూనాను ఏర్పాటు చేశారు. దీంతో కూడలి నూతన శోభను సంతరించుకుంది.
8/19
విశాఖలోని ఎంవీపీ డబుల్‌ రోడ్డులో విద్యుత్తు పనుల కోసం చెట్టు చుట్టూ మట్టి తవ్వారు. దీంతో వృక్షం నేలకొరిగి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలోని ఎంవీపీ డబుల్‌ రోడ్డులో విద్యుత్తు పనుల కోసం చెట్టు చుట్టూ మట్టి తవ్వారు. దీంతో వృక్షం నేలకొరిగి ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
9/19
దివంగత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డీగో మారడోనా రెండో వర్ధంతి సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది నివాళి అర్పించాడు. దివంగత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డీగో మారడోనా రెండో వర్ధంతి సందర్భంగా ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో ఆయన సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది నివాళి అర్పించాడు.
10/19
ఆదిలాబాద్‌లోని భీంపూర్‌ మండలం గుంజాల సమీపంలోనిది ఈ జలపాతం. ఇక్కడ ఓ రాయి ప్రకృతిసిద్ధంగా మనిషి రూపంతో కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. జలపాతం పైనుంచి చూస్తే నీటి కోసం నోరు తెరిచినట్లుగా ఈ రూపం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన ప్రకృతి ప్రేమికులు తమ సెల్‌ఫోన్లలో ఈ చిత్రాన్ని బంధించి మురిసిపోతున్నారు.. ఆదిలాబాద్‌లోని భీంపూర్‌ మండలం గుంజాల సమీపంలోనిది ఈ జలపాతం. ఇక్కడ ఓ రాయి ప్రకృతిసిద్ధంగా మనిషి రూపంతో కనిపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. జలపాతం పైనుంచి చూస్తే నీటి కోసం నోరు తెరిచినట్లుగా ఈ రూపం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన ప్రకృతి ప్రేమికులు తమ సెల్‌ఫోన్లలో ఈ చిత్రాన్ని బంధించి మురిసిపోతున్నారు..
11/19
బెల్జియంకు చెందిన యువతి కెమిల్‌, కర్ణాటకకు చెందిన ఆటోడ్రైవర్‌ అనంతరాజు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్ల క్రితం హంపికి వచ్చిన ఆమెకు ఆటో డ్రైవర్‌, గైడ్‌ అనంతరాజుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో శుక్రవారం ఉదయం హంపి విరూపాక్షేశ్వరుడి సన్నిధిలో వేడుకగా వీరి కల్యాణం జరిగింది. బెల్జియంకు చెందిన యువతి కెమిల్‌, కర్ణాటకకు చెందిన ఆటోడ్రైవర్‌ అనంతరాజు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నాలుగేళ్ల క్రితం హంపికి వచ్చిన ఆమెకు ఆటో డ్రైవర్‌, గైడ్‌ అనంతరాజుతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. ఇరు కుటుంబాల అంగీకారంతో శుక్రవారం ఉదయం హంపి విరూపాక్షేశ్వరుడి సన్నిధిలో వేడుకగా వీరి కల్యాణం జరిగింది.
12/19
ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలోని ఛత్తీస్‌గఢ్‌-దుర్గకొండల్ సరిహద్దు అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు చేస్తున్న వాహనాలను తగలబెట్టిన మావోయిస్టులు ఖమ్మం జిల్లా దుమ్ముగూడెంలోని ఛత్తీస్‌గఢ్‌-దుర్గకొండల్ సరిహద్దు అటవీ ప్రాంతంలో రోడ్డు పనులు చేస్తున్న వాహనాలను తగలబెట్టిన మావోయిస్టులు
13/19
కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ఖమ్మం జిల్లా ఈర్లపూడిలోని ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటీవల గొత్తికోయల దాడిలో శ్రీనివాసరావు హత్యకు గురైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ఖమ్మం జిల్లా ఈర్లపూడిలోని ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఇటీవల గొత్తికోయల దాడిలో శ్రీనివాసరావు హత్యకు గురైన సంగతి తెలిసిందే.
14/19
సినీనటుడు వరుణ్‌ సందేశ్, వితికా శేరు దంపతులు ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రామానుజాచార్యుల విగ్రహం వద్ద ఫోటోలు తీసుకొని సందడి చేశారు. సినీనటుడు వరుణ్‌ సందేశ్, వితికా శేరు దంపతులు ముచ్చింతల్‌లోని సమతా స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి రామానుజాచార్యుల విగ్రహం వద్ద ఫోటోలు తీసుకొని సందడి చేశారు.
15/19
ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చాలాకాలంగా ఇక్కడికి రావాలని వేచి చూస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. చాలాకాలంగా ఇక్కడికి రావాలని వేచి చూస్తున్నట్లు ఆయన తెలిపారు.
16/19
తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేటి ఉదయం సర్వభూపాల వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.  తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నేటి ఉదయం సర్వభూపాల వాహనంపై వెన్నముద్ద కృష్ణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
17/19
గోవాలో నిర్వహించిన 53వ అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఇలా రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు.	గోవాలో నిర్వహించిన 53వ అంతర్జాతీయ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ‘అఖండ’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి ఇలా రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు.
18/19
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోని ఖండవా జిల్లాలో సాగుతోంది. రాహుల్‌కు సంఘీభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్న ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఓ బాలికకు ఇలా షూ లేస్‌ కడుతూ కనిపించారు.	కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోని ఖండవా జిల్లాలో సాగుతోంది. రాహుల్‌కు సంఘీభావం తెలుపుతూ యాత్రలో పాల్గొన్న ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ ఓ బాలికకు ఇలా షూ లేస్‌ కడుతూ కనిపించారు.
19/19
ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ కుటుంబ సమేతంగా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.	ఏపీ సీఎస్‌ సమీర్‌శర్మ కుటుంబ సమేతంగా ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనాంతరం తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.

మరిన్ని