News In Pics : చిత్రం చెప్పే సంగతులు (26-11-2022)

Updated : 26 Nov 2022 08:13 IST
1/20
ప్రయాణికుల అవస్థలు ఆర్టీసీకి ఏ మాత్రం పట్టడం లేదనేందుకు నిదర్శనమీ చిత్రాలు. ఎల్బీనగర్‌ వెళ్లే మార్గంలో దిల్‌సుఖ్‌నగర్‌లో పక్కపక్కనే ఉన్న సిటీ బస్టాపులివి. ఓ చోట ప్రయాణికుల కోసం నిర్మించిన ఏసీ షెల్టర్‌లో కొంత ఫుడ్‌కోర్ట్‌కు అద్దెకు ఇవ్వటంతో లోపల కూర్చున్న వారికి వచ్చే బస్‌ కనపడక బయటే నిలబడాల్సి వస్తోంది. ఆ పక్కనే ఉన్న హయత్‌నగర్‌ వైపు వెళ్లే బస్టాప్‌లో అసలు షెల్టర్‌ లేక ఇలా ఎండలో నిరీక్షించాల్సిన పరిస్థితి. ప్రయాణికుల అవస్థలు ఆర్టీసీకి ఏ మాత్రం పట్టడం లేదనేందుకు నిదర్శనమీ చిత్రాలు. ఎల్బీనగర్‌ వెళ్లే మార్గంలో దిల్‌సుఖ్‌నగర్‌లో పక్కపక్కనే ఉన్న సిటీ బస్టాపులివి. ఓ చోట ప్రయాణికుల కోసం నిర్మించిన ఏసీ షెల్టర్‌లో కొంత ఫుడ్‌కోర్ట్‌కు అద్దెకు ఇవ్వటంతో లోపల కూర్చున్న వారికి వచ్చే బస్‌ కనపడక బయటే నిలబడాల్సి వస్తోంది. ఆ పక్కనే ఉన్న హయత్‌నగర్‌ వైపు వెళ్లే బస్టాప్‌లో అసలు షెల్టర్‌ లేక ఇలా ఎండలో నిరీక్షించాల్సిన పరిస్థితి.
2/20
ఏపీలోని అనకాపల్లి జిల్లా మునగపాకలోని పేటకట్టు మూల ప్రాంతంలో రైతు పి.నూకరాజు పొలంలో బొప్పాయి చెట్లు ఏపుగా పెరిగాయి. దాదాపు 34 అడుగుల ఎత్తు పెరిగిన రెండు చెట్లకు అయిదేళ్లుగా పుష్కలంగా కాయలు కాస్తున్నాయని నూకరాజు తెలిపారు. సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా మునగపాకలోని పేటకట్టు మూల ప్రాంతంలో రైతు పి.నూకరాజు పొలంలో బొప్పాయి చెట్లు ఏపుగా పెరిగాయి. దాదాపు 34 అడుగుల ఎత్తు పెరిగిన రెండు చెట్లకు అయిదేళ్లుగా పుష్కలంగా కాయలు కాస్తున్నాయని నూకరాజు తెలిపారు. సేంద్రియ ఎరువులు మాత్రమే ఉపయోగిస్తున్నట్లు చెప్పారు.
3/20
నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌ శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు శుక్రవారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో గందరగోళం చోటుచేసుకుంది. అర్హులను కాదని చాలామంది అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తూ పలుచోట్ల నిరసనలు జరిగాయి. స్థానిక బుధవార్‌పేట్‌ కాలనీకి చెందిన నర్సారెడ్డి అనే వ్యక్తి ఆ కాలనీలోని చౌరస్తాలో రోడ్డుపై పడుకొని ఇలా నిరసన వ్యక్తం చేశారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని బంగల్‌పేట్‌ శివారులో నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించేందుకు శుక్రవారం నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో గందరగోళం చోటుచేసుకుంది. అర్హులను కాదని చాలామంది అనర్హులకు ఇళ్లు కేటాయించారని ఆరోపిస్తూ పలుచోట్ల నిరసనలు జరిగాయి. స్థానిక బుధవార్‌పేట్‌ కాలనీకి చెందిన నర్సారెడ్డి అనే వ్యక్తి ఆ కాలనీలోని చౌరస్తాలో రోడ్డుపై పడుకొని ఇలా నిరసన వ్యక్తం చేశారు.
4/20
జీవం ఉట్టిపడేలా.. ప్రముఖ సినీ నటుడు దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలోని వడయార్‌ శిల్పాలయంలో ఒకటి, మామిడికుదురు మండలం శిల్పాలయంలో ఒకటి, మామిడికుదురు మండలం గాడిలంకలో ప్రముఖ శిల్పి పెద్ది రెడ్డి మాధవరావు మరొకటి తయారు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కృష్ణ కుటుంబ సభ్యులు విగ్రహాన్ని తయారు చేయాల్సిందిగా కోరగా ఫైబర్‌తో చేసి పంపినట్లు శిల్పి రాజ్‌కుమార్‌ వడయార్‌ తెలిపారు. జీవం ఉట్టిపడేలా.. ప్రముఖ సినీ నటుడు దివంగత సూపర్‌స్టార్‌ కృష్ణ విగ్రహాలు రూపుదిద్దుకున్నాయి. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కొత్తపేటలోని వడయార్‌ శిల్పాలయంలో ఒకటి, మామిడికుదురు మండలం శిల్పాలయంలో ఒకటి, మామిడికుదురు మండలం గాడిలంకలో ప్రముఖ శిల్పి పెద్ది రెడ్డి మాధవరావు మరొకటి తయారు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు కృష్ణ కుటుంబ సభ్యులు విగ్రహాన్ని తయారు చేయాల్సిందిగా కోరగా ఫైబర్‌తో చేసి పంపినట్లు శిల్పి రాజ్‌కుమార్‌ వడయార్‌ తెలిపారు.
5/20
హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి లోనిది ఈ చిత్రం. చెరువు తూములకు మరమ్మతులు చేసేందుకు నీటిని మొత్తం కిందికి వదిలారు. దీంతో ఆహారం కోసం ఇక్కడికి వలస వచ్చిన పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షులు అలమటిస్తూ చెరువు మధ్యలో కనిపించాయి. ఈ తటాకంలో అధికంగా నత్తలు, కీటకాలు ఉండటంతో వందల సంఖ్యలో పక్షులు వస్తుంటాయి. హైదరాబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి లోనిది ఈ చిత్రం. చెరువు తూములకు మరమ్మతులు చేసేందుకు నీటిని మొత్తం కిందికి వదిలారు. దీంతో ఆహారం కోసం ఇక్కడికి వలస వచ్చిన పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షులు అలమటిస్తూ చెరువు మధ్యలో కనిపించాయి. ఈ తటాకంలో అధికంగా నత్తలు, కీటకాలు ఉండటంతో వందల సంఖ్యలో పక్షులు వస్తుంటాయి.
6/20
ఐటీ కారిడార్‌లో కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఊపందుకున్నాయి. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే, తిరిగి ఇంటికి వచ్చే సమయాల్లో రద్దీ పెరిగి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌పై ఇలా కార్లు బారులు తీరుతూ కన్పిస్తున్నాయి.  ఐటీ కారిడార్‌లో కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ఊపందుకున్నాయి. అందుకు నిదర్శనమే ఈ చిత్రం. ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్లే, తిరిగి ఇంటికి వచ్చే సమయాల్లో రద్దీ పెరిగి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌పై ఇలా కార్లు బారులు తీరుతూ కన్పిస్తున్నాయి.
7/20
హైదరాబాద్‌ మహా నగరంలో భూమి విలువ బంగారమైంది. గజం స్థలం లక్షల ధర పలుకుతోంది. ఈ క్రమంలో ప్రతి గజాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థల యజమానులు ఆలోచిస్తున్నారు. అందుకు అద్దం పడుతోంది ఈ భవనం. ఓ పక్క నుంచి చూడడానికి ప్రహరీలా కనిపిస్తున్నా.. ఇది రెండంతస్తుల ఇల్లు. నగర శివారు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరులో ఓ వ్యక్తి తన స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించగా.. 8.8 గజాల స్థలం మిలిగింది. ఇందులోనే రెండంతస్తుల భవనం నిర్మించారు. హైదరాబాద్‌ మహా నగరంలో భూమి విలువ బంగారమైంది. గజం స్థలం లక్షల ధర పలుకుతోంది. ఈ క్రమంలో ప్రతి గజాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్థల యజమానులు ఆలోచిస్తున్నారు. అందుకు అద్దం పడుతోంది ఈ భవనం. ఓ పక్క నుంచి చూడడానికి ప్రహరీలా కనిపిస్తున్నా.. ఇది రెండంతస్తుల ఇల్లు. నగర శివారు రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌ మండలం కుంట్లూరులో ఓ వ్యక్తి తన స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించగా.. 8.8 గజాల స్థలం మిలిగింది. ఇందులోనే రెండంతస్తుల భవనం నిర్మించారు.
8/20
భారత్‌ జోడో యాత్రలో బాక్సింగ్‌ ఒలింపిక్‌ విజేత విజేందర్‌ సింగ్‌తో కలిసి మీసం మెలేస్తున్న రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రలో బాక్సింగ్‌ ఒలింపిక్‌ విజేత విజేందర్‌ సింగ్‌తో కలిసి మీసం మెలేస్తున్న రాహుల్‌ గాంధీ
9/20
జిల్లాను మంచు దుప్పటి కప్పేస్తోంది. ముఖ్యంగా వేకువజామున నుంచి ఉదయం 9గంటల వరకు దట్టంగా అలుముకొంటోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలోని చంద్రబాబునగర్‌ నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే రోడ్డుపై శుక్రవారం ఉదయం 7.30 సమయంలో పరిస్థితి ఇది. జిల్లాను మంచు దుప్పటి కప్పేస్తోంది. ముఖ్యంగా వేకువజామున నుంచి ఉదయం 9గంటల వరకు దట్టంగా అలుముకొంటోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్లూరు నగరంలోని చంద్రబాబునగర్‌ నుంచి జాతీయ రహదారిపైకి వెళ్లే రోడ్డుపై శుక్రవారం ఉదయం 7.30 సమయంలో పరిస్థితి ఇది.
10/20
 భారత్‌ జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శుక్రవారం నర్మదా ఘాట్‌ వద్ద హారతి ఇస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. భారత్‌ జోడో యాత్రలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో శుక్రవారం నర్మదా ఘాట్‌ వద్ద హారతి ఇస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ.
11/20
సత్యసాయి జిల్లాను పొగమంచు దట్టంగా కప్పేస్తోంది. తెల్లవారుజామున 20 అడుగుల దూరంలోని వస్తువులు కూడా కనిపించనంతగా దట్టంగా మంచు కురుస్తోంది. శుక్రవారం మండలంలోని చెన్నేకొత్తపల్లి పరిసరాల నుంచి ఎన్‌ఎస్‌గేట్ వరకు జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా కప్పేసింది. మంచుదుప్పటిలో సూర్యుడు కూడా చంద్రుడిలా కనిపించాడు. సత్యసాయి జిల్లాను పొగమంచు దట్టంగా కప్పేస్తోంది. తెల్లవారుజామున 20 అడుగుల దూరంలోని వస్తువులు కూడా కనిపించనంతగా దట్టంగా మంచు కురుస్తోంది. శుక్రవారం మండలంలోని చెన్నేకొత్తపల్లి పరిసరాల నుంచి ఎన్‌ఎస్‌గేట్ వరకు జాతీయ రహదారిపై పొగమంచు దట్టంగా కప్పేసింది. మంచుదుప్పటిలో సూర్యుడు కూడా చంద్రుడిలా కనిపించాడు.
12/20
పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని కోవెలగుట్లపల్లి కాజ్‌వేపై మూడు నెలలుగా నీరు ప్రవహిస్తుండటంతో నాచుపట్టింది. దీనిపై ప్రజలు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. కోవెలగుట్లపల్లి నుంచి పుట్టపర్తికి గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులు నిత్యం కాజ్‌వేపై వెళ్లాల్సిందే. ప్రమాదవశాత్తు జారితే చిత్రావతి నదిలోకి పడతారు. పుట్టపర్తి నగర పంచాయతీ పరిధిలోని కోవెలగుట్లపల్లి కాజ్‌వేపై మూడు నెలలుగా నీరు ప్రవహిస్తుండటంతో నాచుపట్టింది. దీనిపై ప్రజలు జారిపడి ప్రమాదాలకు గురవుతున్నారు. కోవెలగుట్లపల్లి నుంచి పుట్టపర్తికి గ్రామస్థులు, పాఠశాల విద్యార్థులు నిత్యం కాజ్‌వేపై వెళ్లాల్సిందే. ప్రమాదవశాత్తు జారితే చిత్రావతి నదిలోకి పడతారు.
13/20
బురదదాటితేనే బడికి..! విశాఖపట్నంలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాల మైదానంలో విద్యార్థుల అవస్థలు.. బురదదాటితేనే బడికి..! విశాఖపట్నంలోని చంద్రంపాలెం ఉన్నత పాఠశాల మైదానంలో విద్యార్థుల అవస్థలు..
14/20
విశాఖ నగరంలో శుక్రవారం ఆకస్మికంగా కురిసిన వర్షానికి ప్రధాన మార్గాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పలు చోట్ల భూగర్భ డ్రైనేజీల మ్యాన్‌హోళ్లు పొంగడంతో ఆ ప్రాంతాల్లో ప్రజలు హడలిపోయారు. విశాఖ నగరంలో శుక్రవారం ఆకస్మికంగా కురిసిన వర్షానికి ప్రధాన మార్గాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. పలు చోట్ల భూగర్భ డ్రైనేజీల మ్యాన్‌హోళ్లు పొంగడంతో ఆ ప్రాంతాల్లో ప్రజలు హడలిపోయారు.
15/20
పిల్లిని చూడగానే కుక్క దాడి చేస్తుంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురంలో మాత్రం జాతివైరం మరిచి.. స్నేహబంధం కుదుర్చుకున్నాయి. పిల్లి ఎంచక్కా.. శునకం వీపుపై ఇలా కూర్చొంది. పిల్లిని చూడగానే కుక్క దాడి చేస్తుంది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురంలో మాత్రం జాతివైరం మరిచి.. స్నేహబంధం కుదుర్చుకున్నాయి. పిల్లి ఎంచక్కా.. శునకం వీపుపై ఇలా కూర్చొంది.
16/20
 కొత్తపట్నం మండలం మడనూరు ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆనుకునే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ఓ వేదిక ఉంది. సమీప గ్రామాల్లో చెడిపోయిన విద్యుత్తు నియంత్రికలను తీసుకువచ్చి ఈ వేదిక వద్దనే ఉంచుతున్నారు. పాఠశాల విరామ సమయంలో చిన్నారులంతా ఈ నియంత్రికలపైకి ఎక్కి ప్రమాదకరంగా ఆడుతున్నారు. కొత్తపట్నం మండలం మడనూరు ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఆనుకునే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ఓ వేదిక ఉంది. సమీప గ్రామాల్లో చెడిపోయిన విద్యుత్తు నియంత్రికలను తీసుకువచ్చి ఈ వేదిక వద్దనే ఉంచుతున్నారు. పాఠశాల విరామ సమయంలో చిన్నారులంతా ఈ నియంత్రికలపైకి ఎక్కి ప్రమాదకరంగా ఆడుతున్నారు.
17/20
ప్రజాధనం వెచ్చించి నిర్మించిన పలు అభివృద్ధి పనులు పూర్తయినా సకాలంలో ప్రారంభానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధులు సమయం వెచ్చించకపోవడం తదితర కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. చాంద్రాయణగుట్టలోని హఫీజ్‌బాబానగర్‌ చౌరస్తాలో కాలిబాట వంతెన పూర్తయినా తెరవకపోవడంతో విద్యార్థులు ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు. ప్రజాధనం వెచ్చించి నిర్మించిన పలు అభివృద్ధి పనులు పూర్తయినా సకాలంలో ప్రారంభానికి నోచుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రజాప్రతినిధులు సమయం వెచ్చించకపోవడం తదితర కారణాలు ఇందుకు దోహదపడుతున్నాయి. చాంద్రాయణగుట్టలోని హఫీజ్‌బాబానగర్‌ చౌరస్తాలో కాలిబాట వంతెన పూర్తయినా తెరవకపోవడంతో విద్యార్థులు ప్రమాదకరంగా రోడ్డు దాటుతున్నారు.
18/20
 సినీనటి, ప్రముఖ నర్తకి శోభన తన నృత్యాభినయంతో కళాభిమానులను కట్టిపడేశారు. శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌ శిల్పకళావేదికలో లోటస్‌ ఫీట్‌ బై శోభన పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె తన బృందంతో కలిసి భరతనాట్య నృత్యాంశాలను ప్రదర్శించారు. సినీనటి, ప్రముఖ నర్తకి శోభన తన నృత్యాభినయంతో కళాభిమానులను కట్టిపడేశారు. శుక్రవారం సాయంత్రం మాదాపూర్‌ శిల్పకళావేదికలో లోటస్‌ ఫీట్‌ బై శోభన పేరిట ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె తన బృందంతో కలిసి భరతనాట్య నృత్యాంశాలను ప్రదర్శించారు.
19/20
పచ్చని చెట్లు.. నడక మార్గం.. కూర్చునేందుకు విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దిన నిర్మాణాలతో సందర్శకులకు కనువిందు చేస్తున్న ఈ ఉద్యానం ఏ కాలనీ మధ్యలోదో కాదు. నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే ఉప్పల్‌ కూడలిలో ప్రధాన రహదారి పక్కనే ఉంది. పచ్చని చెట్లు.. నడక మార్గం.. కూర్చునేందుకు విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దిన నిర్మాణాలతో సందర్శకులకు కనువిందు చేస్తున్న ఈ ఉద్యానం ఏ కాలనీ మధ్యలోదో కాదు. నిత్యం లక్షలాది వాహనాలు రాకపోకలు సాగించే ఉప్పల్‌ కూడలిలో ప్రధాన రహదారి పక్కనే ఉంది.
20/20
నానక్‌రాంగూడ బౌల్డర్‌ హిల్స్‌ గోల్ఫ్‌ అండ్‌ కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్లు అమిత్‌ అగర్వాల్‌, నూరు కరీం రూపొందించిన దుస్తుల్లో రూపదర్శినులు ర్యాంప్‌ వాక్‌ చేసి అలరించారు. ప్రముఖ సినీ నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్‌ ర్యాంప్‌పై షో స్టాపర్‌గా తళుక్కుమన్నారు. నానక్‌రాంగూడ బౌల్డర్‌ హిల్స్‌ గోల్ఫ్‌ అండ్‌ కంట్రీ క్లబ్‌లో శుక్రవారం రాత్రి ఫ్యాషన్‌ డిజైన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్‌ ఆద్యంతం ఆకట్టుకుంది. ప్రముఖ డిజైనర్లు అమిత్‌ అగర్వాల్‌, నూరు కరీం రూపొందించిన దుస్తుల్లో రూపదర్శినులు ర్యాంప్‌ వాక్‌ చేసి అలరించారు. ప్రముఖ సినీ నటి శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్‌ ర్యాంప్‌పై షో స్టాపర్‌గా తళుక్కుమన్నారు.

మరిన్ని