News In Pics : చిత్రం చెప్పే సంగతులు-2 (26-11-2022)

Updated : 26 Nov 2022 20:30 IST
1/21
ఒంగోలులోని ఓ కల్యాణ మండపంలో యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కళాకారుడు ఇచ్చిన మోహినీ అట్టం నృత్య ప్రదర్శన ప్రేక్షకులను రంజింపజేసింది. ఒంగోలులోని ఓ కల్యాణ మండపంలో యువజనోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కళాకారుడు ఇచ్చిన మోహినీ అట్టం నృత్య ప్రదర్శన ప్రేక్షకులను రంజింపజేసింది.
2/21
3/21
గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రొ కబడ్డీ పోటీలను సినీనటుడు విష్వక్‌సేన్‌ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కామెంట్రీ చేసి ప్రేక్షకులు, ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రొ కబడ్డీ పోటీలను సినీనటుడు విష్వక్‌సేన్‌ వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన కామెంట్రీ చేసి ప్రేక్షకులు, ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.
4/21
అడివి శేష్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్‌2’. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 28న హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చిత్రబృందం తెలిపింది. అడివి శేష్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిట్‌2’. ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఈ నెల 28న హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు చిత్రబృందం తెలిపింది.
5/21
సినీనటుడు అడివి శేష్‌.. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ స్మారకం వద్ద నివాళి అర్పించారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన ‘మేజర్‌’ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. సినీనటుడు అడివి శేష్‌.. 26/11 దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ స్మారకం వద్ద నివాళి అర్పించారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన ‘మేజర్‌’ సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
6/21
ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతి భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ అంశాలపై ఆమెతో చర్చించారు.
7/21
సిగ్నల్‌ పడిందన్న లెక్కలేదు. నెంబర్‌ ప్లేట్‌ ఊసే లేదు. ద్విచక్రవాహనం నడిపే వ్యక్తికి శిరస్త్రాణం పట్టింపేలేదు. ఇన్ని నిర్లక్ష్యాలతో ఓ వాహనదారుడు శనివారం దర్జాగా నాంపల్లి లతా టాకీస్‌ చౌరస్తాలో సిగ్నల్‌ జంప్‌ చేసి ప్రమాదకరంగా వెళ్తూ కనిపించాడు. సిగ్నల్‌ పడిందన్న లెక్కలేదు. నెంబర్‌ ప్లేట్‌ ఊసే లేదు. ద్విచక్రవాహనం నడిపే వ్యక్తికి శిరస్త్రాణం పట్టింపేలేదు. ఇన్ని నిర్లక్ష్యాలతో ఓ వాహనదారుడు శనివారం దర్జాగా నాంపల్లి లతా టాకీస్‌ చౌరస్తాలో సిగ్నల్‌ జంప్‌ చేసి ప్రమాదకరంగా వెళ్తూ కనిపించాడు.
8/21
హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లోని సాన్వి డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌ సంతోష్‌నగర్‌లోని సాన్వి డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్‌ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు నృత్య, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
9/21
మంచిర్యాల జిల్లా జన్నారం సమీపంలోని వాగులో పెద్దఎత్తున కొంగలు, నీటి బాతుల గుంపు పోటీ పడుతూ చేపలను వేటాడాయి. ఈ గుంపులో కొన్ని.. చిన్న చేపలను నోట కరుచుకొని ఎగిరిపోతుంటే.. మరికొన్ని అక్కడే గుటుక్కుమన్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం సమీపంలోని వాగులో పెద్దఎత్తున కొంగలు, నీటి బాతుల గుంపు పోటీ పడుతూ చేపలను వేటాడాయి. ఈ గుంపులో కొన్ని.. చిన్న చేపలను నోట కరుచుకొని ఎగిరిపోతుంటే.. మరికొన్ని అక్కడే గుటుక్కుమన్నాయి.
10/21
ఇదేంటి రైలు పట్టాలు తప్పి ప్రమాదం జరిగిందనుకుంటున్నారా. అదేం లేదండి.. బెంగళూరులోని ఇండియన్‌ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌.. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖలతో కలిసి రైలు ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలనే అంశంపై మాక్ డ్రిల్‌ నిర్వహించింది. నవంబర్‌ 21 నుంచి 25వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఇదేంటి రైలు పట్టాలు తప్పి ప్రమాదం జరిగిందనుకుంటున్నారా. అదేం లేదండి.. బెంగళూరులోని ఇండియన్‌ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌.. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక శాఖలతో కలిసి రైలు ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలనే అంశంపై మాక్ డ్రిల్‌ నిర్వహించింది. నవంబర్‌ 21 నుంచి 25వరకు ఈ కార్యక్రమం జరిగింది.
11/21
ముంబయిలో నేవీ వీక్‌ వేడుకల్లో భాగంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉంచిన తుపాకులను పాఠశాల విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు. ముంబయిలో నేవీ వీక్‌ వేడుకల్లో భాగంగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉంచిన తుపాకులను పాఠశాల విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు.
12/21
శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో విజయానికి గుర్తుగా ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌, శాస్త్రవేత్తలు రాకెట్‌ నమూనాను ఇలా చూపారు. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో విజయానికి గుర్తుగా ఇస్రో ఛైర్మన్‌ సోమ్‌నాథ్‌, శాస్త్రవేత్తలు రాకెట్‌ నమూనాను ఇలా చూపారు.
13/21
అర్జెంటీనాలోని ఒబిలిస్క్‌ టవర్‌పై ఆ దేశ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీ చిత్రాన్ని ప్రదర్శించారు. ఫిఫా వరల్డ్‌కప్‌ పోటీల్లో భాగంగా ఈరోజు అర్ధరాత్రి అర్జెంటీనా జట్టు మెక్సికోతో తలపడనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. అర్జెంటీనాలోని ఒబిలిస్క్‌ టవర్‌పై ఆ దేశ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు మెస్సీ చిత్రాన్ని ప్రదర్శించారు. ఫిఫా వరల్డ్‌కప్‌ పోటీల్లో భాగంగా ఈరోజు అర్ధరాత్రి అర్జెంటీనా జట్టు మెక్సికోతో తలపడనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
14/21
క్యూబాలోని హవానా యూనివర్సిటీలో ఫిడెల్‌ కాస్ట్రో వర్ధంతి సందర్భంగా విద్యార్థులంతా కలిసి నివాళి అర్పించారు. ఫిడెల్‌ కాస్ట్రో 2016 నవంబర్‌ 25న 90ఏళ్ల వయసులో మృతిచెందారు. క్యూబాలోని హవానా యూనివర్సిటీలో ఫిడెల్‌ కాస్ట్రో వర్ధంతి సందర్భంగా విద్యార్థులంతా కలిసి నివాళి అర్పించారు. ఫిడెల్‌ కాస్ట్రో 2016 నవంబర్‌ 25న 90ఏళ్ల వయసులో మృతిచెందారు.
15/21
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు
16/21
విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొని అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పాల్గొని అంబేడ్కర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు.
17/21
కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. రాహుల్‌ గాంధీతో కలిసి ఆయన సోదరి ప్రియాంక గాంధీ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరు ఇలా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. రాహుల్‌ గాంధీతో కలిసి ఆయన సోదరి ప్రియాంక గాంధీ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారిద్దరు ఇలా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.
18/21
కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు శనివారం ఉదయం సూర్యనారాయణ స్వామివారి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు శనివారం ఉదయం సూర్యనారాయణ స్వామివారి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు.
19/21
శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్‌ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఈవోఎస్‌ శాట్‌-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించిన పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ)-సి54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీ-54 రాకెట్‌ ద్వారా 9 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపించారు. ఈవోఎస్‌ శాట్‌-6 సహా 8 నానో ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ సీ-54 నిర్దేశిత కక్ష్యలోకి మోసుకెళ్లింది.
20/21
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
21/21
రెండో ఆడిట్‌ దివస్‌ సందర్భంగా పలువురు ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఏజీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ మార్గం వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బెలూన్లు ఎగురవేసి సంబరం వ్యక్తం చేశారు. రెండో ఆడిట్‌ దివస్‌ సందర్భంగా పలువురు ఉద్యోగులు హైదరాబాద్‌లోని ఏజీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్‌ మార్గం వరకు వాకథాన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బెలూన్లు ఎగురవేసి సంబరం వ్యక్తం చేశారు.

మరిన్ని