News In Pics : చిత్రం చెప్పే సంగతులు (27-11-2022)

Updated : 27 Nov 2022 13:50 IST
1/28
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఈ ఉదయం రథోత్సవం నిర్వహించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఈ ఉదయం రథోత్సవం నిర్వహించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
2/28
అమీర్‌పేటలోని ఆస్టర్‌ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మొబైల్‌ ఆస్పత్రి వ్యాన్‌ ప్రతి రోజూ హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఆగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 150 మంది రోగులకు అక్కడే ఉచితంగా వైద్య పరీక్షలు  నిర్వహిస్తారు. పేదలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఏడాదిగా ఈ మొబైల్‌ వైద్యశిబరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. లక్డీకపూల్‌ వద్ద కనిపించాయి ఈ దృశ్యాలు.
అమీర్‌పేటలోని ఆస్టర్‌ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మొబైల్‌ ఆస్పత్రి వ్యాన్‌ ప్రతి రోజూ హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఆగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 150 మంది రోగులకు అక్కడే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పేదలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఏడాదిగా ఈ మొబైల్‌ వైద్యశిబరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. లక్డీకపూల్‌ వద్ద కనిపించాయి ఈ దృశ్యాలు.
3/28
హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. కాసేపు పడుతూ.. కాసేపటి తరువాత ఆగిపోతూ ఉంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు. హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. కాసేపు పడుతూ.. కాసేపటి తరువాత ఆగిపోతూ ఉంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.
4/28
త్వరలో విశాఖ తీరంలో జరిగే నావికాదళ దినోత్సవానికి నేవీ సిబ్బంది ప్రత్యేక విన్యాసాలతో కసరత్తు చేస్తున్నారు. అలాగే ప్రముఖులు వాటిని వీక్షించేందుకు అత్యంత రక్షణాత్మకంగా ఉండే ప్రత్యేక అద్దాల గదిని కూడా నిర్మిస్తున్నారు. సాగరజలాల నుంచి తీరానికి వచ్చే ప్రత్యర్థులను ముట్టడించే విన్యాసాలు...బాంబులతో దాడి..తదితర నమూనా విన్యాసాలు ప్రజలు తిలకించారు.  త్వరలో విశాఖ తీరంలో జరిగే నావికాదళ దినోత్సవానికి నేవీ సిబ్బంది ప్రత్యేక విన్యాసాలతో కసరత్తు చేస్తున్నారు. అలాగే ప్రముఖులు వాటిని వీక్షించేందుకు అత్యంత రక్షణాత్మకంగా ఉండే ప్రత్యేక అద్దాల గదిని కూడా నిర్మిస్తున్నారు. సాగరజలాల నుంచి తీరానికి వచ్చే ప్రత్యర్థులను ముట్టడించే విన్యాసాలు...బాంబులతో దాడి..తదితర నమూనా విన్యాసాలు ప్రజలు తిలకించారు.
5/28
కంటిచూపు లేని వారికి దారి చూపే కర్ర ఇది.. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఏదైనా వాహనం కాని, జంతువు కాని ఎదురొచ్చిన వెంటనే చేతిలో ఉన్న కర్రకు అమర్చిన సెన్సర్స్‌ అప్రమత్తం చేస్తాయి. చేతి కర్ర నుంచి బీప్‌ సౌండ్స్‌ వస్తాయి. దీన్ని అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు తయారుచేశారు. కంటిచూపు లేని వారికి దారి చూపే కర్ర ఇది.. రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఏదైనా వాహనం కాని, జంతువు కాని ఎదురొచ్చిన వెంటనే చేతిలో ఉన్న కర్రకు అమర్చిన సెన్సర్స్‌ అప్రమత్తం చేస్తాయి. చేతి కర్ర నుంచి బీప్‌ సౌండ్స్‌ వస్తాయి. దీన్ని అనకాపల్లి జిల్లా చోడవరం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల విద్యార్థులు తయారుచేశారు.
6/28
సాధారణంగా బెండ మొక్కలు ఐదు అడుగుల వరకు పెరుగుతుంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని గంగాధరి దినేష్‌ ఇంటి ఆవరణలో పెరిగిన బెండ మొక్కను చూడాలంటే మాత్రం తల ఎత్తాల్సిందే. ఏకంగా 11 అడుగుల మేర ఎదిగి ఇంకా చిగురిస్తూనే ఉంది.  సాధారణంగా బెండ మొక్కలు ఐదు అడుగుల వరకు పెరుగుతుంటాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని గంగాధరి దినేష్‌ ఇంటి ఆవరణలో పెరిగిన బెండ మొక్కను చూడాలంటే మాత్రం తల ఎత్తాల్సిందే. ఏకంగా 11 అడుగుల మేర ఎదిగి ఇంకా చిగురిస్తూనే ఉంది.
7/28
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా పోలీసులు కళాక్షేత్రం వైపు ఉన్న రహదారితో పాటు, పాత ప్రభుత్వాసుపత్రి రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే ప్రయాణికులు ఇలా లగేజీతో, పిల్లలతో, గర్భిణులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడ్డారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ట్రాఫిక్‌ నియంత్రణలో భాగంగా పోలీసులు కళాక్షేత్రం వైపు ఉన్న రహదారితో పాటు, పాత ప్రభుత్వాసుపత్రి రహదారిలో రాకపోకలు నిలిపివేశారు. దీంతో రైల్వేస్టేషన్‌ నుంచి ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లే ప్రయాణికులు ఇలా లగేజీతో, పిల్లలతో, గర్భిణులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడ్డారు.
8/28
యాచారంలో మైనింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయడంలో భాగంగా శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభను వ్యతిరేకిస్తూ తెరాస నేతలు వేదికపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కుర్చీలను బయటకు విసిరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. యాచారంలో మైనింగ్‌ జోన్‌ ఏర్పాటు చేయడంలో భాగంగా శనివారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సభను వ్యతిరేకిస్తూ తెరాస నేతలు వేదికపైకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కుర్చీలను బయటకు విసిరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.
9/28
ఐకియా సమీపం నుంచి వచ్చి శిల్పా లేఅవుట్‌ వంతెన వైపు వెళ్లేందుకు యూటర్న్‌ తీసుకునే మలుపులో భారీ వాహనాలను నిలుపుతున్నారు. అసలే ఇరుకుగా ఉండే ఆ మలుపు వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలను నిలుపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. ఐకియా సమీపం నుంచి వచ్చి శిల్పా లేఅవుట్‌ వంతెన వైపు వెళ్లేందుకు యూటర్న్‌ తీసుకునే మలుపులో భారీ వాహనాలను నిలుపుతున్నారు. అసలే ఇరుకుగా ఉండే ఆ మలుపు వద్ద వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలను నిలుపకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
10/28
హైదరాబాద్‌-సాగర్‌ ప్రధాన రహదారిలో తుర్కయాంజల్‌ వద్ద వాహనం ఢీకొనడంతో 33 కేవీ విద్యుత్తు టవర్‌ వంగిపోయింది. నెలన్నర గడుస్తున్నా మరమ్మతులు చేయడం లేదు. వాహనాలపై పడితే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంది. హైదరాబాద్‌-సాగర్‌ ప్రధాన రహదారిలో తుర్కయాంజల్‌ వద్ద వాహనం ఢీకొనడంతో 33 కేవీ విద్యుత్తు టవర్‌ వంగిపోయింది. నెలన్నర గడుస్తున్నా మరమ్మతులు చేయడం లేదు. వాహనాలపై పడితే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉంది.
11/28
గాంధీ ఆసుపత్రిలో కొత్తగా టిఫా స్కానింగ్‌ యంత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. ఈ సమయంలో ఆసుపత్రిలో కొద్దిసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో అంధకారంలో ఉన్న గైనిక్‌ మరియు లేబర్‌ వార్డుల రోగులు వారి సంబంధీకులు సెల్‌ఫోన్ల వెలుతురులో ఇలా తిరిగారు. గాంధీ ఆసుపత్రిలో కొత్తగా టిఫా స్కానింగ్‌ యంత్రాలను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చేతుల మీదుగా శనివారం ప్రారంభించారు. ఈ సమయంలో ఆసుపత్రిలో కొద్దిసేపు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో అంధకారంలో ఉన్న గైనిక్‌ మరియు లేబర్‌ వార్డుల రోగులు వారి సంబంధీకులు సెల్‌ఫోన్ల వెలుతురులో ఇలా తిరిగారు.
12/28
పీపుల్స్‌ ప్లాజాలో సరస్‌ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. హస్త కళాకారుల ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. పీపుల్స్‌ ప్లాజాలో సరస్‌ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. హస్త కళాకారుల ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
13/28
ఫార్ములా-ఈ రేస్‌ కోసం ఎన్టీఆర్‌ మార్గ్‌లో ప్రత్యేకంగా గతంలో రోడ్డు వేశారు. ఇది ఎత్తుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ‘రేసు ముగిసె.. రోడ్డు సంగతేంటి?’ శీర్షికన ‘ఈనాడు’ చిత్రం ప్రచురించింది. స్పందించిన అధికారులు ఎట్టకేలకు రోడ్డు సరిచేశారు. ఫార్ములా-ఈ రేస్‌ కోసం ఎన్టీఆర్‌ మార్గ్‌లో ప్రత్యేకంగా గతంలో రోడ్డు వేశారు. ఇది ఎత్తుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ‘రేసు ముగిసె.. రోడ్డు సంగతేంటి?’ శీర్షికన ‘ఈనాడు’ చిత్రం ప్రచురించింది. స్పందించిన అధికారులు ఎట్టకేలకు రోడ్డు సరిచేశారు.
14/28
అనూహ్య ఘటనల నేపథ్యంలో కంటిచూపు కోల్పోయినా వెరవక.. తాను నేర్చిన పరిజ్ఞానంతో ఆటో మెకానిక్‌గా ముందుకెళ్తున్నారు హఫీజ్‌. వరంగల్‌  కాశీబుగ్గకు చెందిన ఆయన తొలుత ఆటోనగర్‌లో ఎలక్ట్రీషియన్‌గా గుర్తింపు పొందారు. 2003లో రోడ్డు ప్రమాదంలో ఎడమ కన్ను కోల్పోయాడు. 2005లో దీపావళి టపాసులు కాలుస్తుంటే కుడికన్నూ పోగొట్టుకున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా తనకున్న అవగాహనతో ఆటోకు మరమ్మతులు చేయటం ప్రారంభించిన ఆయన... ఇప్పుడు ద్విచక్ర వాహనాల రిపేరింగ్‌నూ మొదలుపెట్టారు. వాహనం నుంచి వచ్చే శబ్దాన్ని బట్టే బండిలోని లోపాన్ని గుర్తించి ఇట్టే మరమ్మతులు చేస్తున్న హఫీజ్‌ పనితనాన్ని గుర్తించిన వాహనదారులంతా ఆయన వద్దకు చేరుతున్నారు. అనూహ్య ఘటనల నేపథ్యంలో కంటిచూపు కోల్పోయినా వెరవక.. తాను నేర్చిన పరిజ్ఞానంతో ఆటో మెకానిక్‌గా ముందుకెళ్తున్నారు హఫీజ్‌. వరంగల్‌ కాశీబుగ్గకు చెందిన ఆయన తొలుత ఆటోనగర్‌లో ఎలక్ట్రీషియన్‌గా గుర్తింపు పొందారు. 2003లో రోడ్డు ప్రమాదంలో ఎడమ కన్ను కోల్పోయాడు. 2005లో దీపావళి టపాసులు కాలుస్తుంటే కుడికన్నూ పోగొట్టుకున్నాడు. ఎలక్ట్రీషియన్‌గా తనకున్న అవగాహనతో ఆటోకు మరమ్మతులు చేయటం ప్రారంభించిన ఆయన... ఇప్పుడు ద్విచక్ర వాహనాల రిపేరింగ్‌నూ మొదలుపెట్టారు. వాహనం నుంచి వచ్చే శబ్దాన్ని బట్టే బండిలోని లోపాన్ని గుర్తించి ఇట్టే మరమ్మతులు చేస్తున్న హఫీజ్‌ పనితనాన్ని గుర్తించిన వాహనదారులంతా ఆయన వద్దకు చేరుతున్నారు.
15/28
హుషారైన పాటలు.. ఉర్రూతలూగించే నృత్యాలతో విద్యార్థినులు సందడి చేశారు. ఐఎస్‌సదన్‌లో సాన్వి కళాశాల  స్వాగతోత్సవం శనివారం ఘనంగా జరిగింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టిన వారికి సీనియర్లు స్వాగతం  పలుకుతూ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. హుషారైన పాటలు.. ఉర్రూతలూగించే నృత్యాలతో విద్యార్థినులు సందడి చేశారు. ఐఎస్‌సదన్‌లో సాన్వి కళాశాల స్వాగతోత్సవం శనివారం ఘనంగా జరిగింది. డిగ్రీ మొదటి సంవత్సరంలో అడుగుపెట్టిన వారికి సీనియర్లు స్వాగతం పలుకుతూ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
16/28
రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. అమృతలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు భారతదేశ చిత్రపటం ఆకృతిలో మానవహారం ఏర్పాటు చేశారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. అమృతలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు భారతదేశ చిత్రపటం ఆకృతిలో మానవహారం ఏర్పాటు చేశారు.
17/28
జిల్లా కేంద్రం నరసరావుపేటలోకి ప్రవేశించే పల్నాడు రోడ్డులో రహదారి విభాగినితో పాటు ఇరువైపులా కనువిందు చేస్తున్న పచ్చదనం. జిల్లా కేంద్రం నరసరావుపేటలోకి ప్రవేశించే పల్నాడు రోడ్డులో రహదారి విభాగినితో పాటు ఇరువైపులా కనువిందు చేస్తున్న పచ్చదనం.
18/28
రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరు లాడ్జి సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని పూలమాలలు ముంచెత్తాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా గుంటూరు లాడ్జి సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహాన్ని పూలమాలలు ముంచెత్తాయి.
19/28
జిల్లా యువజన సేవలు- స్టెప్‌ ఆధ్వర్యంలో గుంటూరు నగరం శ్రీనివాసరావుపేటలోని గుంటూరు కన్వెన్షన్‌ హాలులో జిల్లా యువజనోత్సవాలు శనివారం జరిగాయి.  ఈ సందర్భంగా యువత తమలోని నైపుణ్యాలు, కళలను ప్రదర్శించి శెభాష్‌ అనిపించుకున్నారు. జిల్లా యువజన సేవలు- స్టెప్‌ ఆధ్వర్యంలో గుంటూరు నగరం శ్రీనివాసరావుపేటలోని గుంటూరు కన్వెన్షన్‌ హాలులో జిల్లా యువజనోత్సవాలు శనివారం జరిగాయి. ఈ సందర్భంగా యువత తమలోని నైపుణ్యాలు, కళలను ప్రదర్శించి శెభాష్‌ అనిపించుకున్నారు.
20/28
మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో భారత్‌ జోడో యాత్రలో ప్రజలతో కలిసి నడుస్తున్న రాహుల్‌గాంధీ. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో భారత్‌ జోడో యాత్రలో ప్రజలతో కలిసి నడుస్తున్న రాహుల్‌గాంధీ.
21/28
అధిక జనసాంద్రతతో అందమైన బీచ్‌లు, స్పాలకు ప్రసిద్ధి చెందిన ఇటలీలోని పర్వత ద్వీపం ఇస్కియాలో శనివారం తెల్లవారుజామున భారీవర్షం కలకలం రేపింది. పలుచోట్ల మట్టిచరియలు విరిగిపడి 12 మంది గల్లంతయ్యారు. అధిక జనసాంద్రతతో అందమైన బీచ్‌లు, స్పాలకు ప్రసిద్ధి చెందిన ఇటలీలోని పర్వత ద్వీపం ఇస్కియాలో శనివారం తెల్లవారుజామున భారీవర్షం కలకలం రేపింది. పలుచోట్ల మట్టిచరియలు విరిగిపడి 12 మంది గల్లంతయ్యారు.
22/28
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రక ప్రదేశమైన నర్మెట్ట గ్రామంలోని పాటిగడ్డమీద 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న కొత్తరాతియుగపు అమ్మదేవత మట్టి శిల్పం లభించినట్లు పురావస్తు పరిశోధకులు తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రక ప్రదేశమైన నర్మెట్ట గ్రామంలోని పాటిగడ్డమీద 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న కొత్తరాతియుగపు అమ్మదేవత మట్టి శిల్పం లభించినట్లు పురావస్తు పరిశోధకులు తెలిపారు.
23/28
షష్ఠి తీర్థ మహోత్సవాల సందర్భంగా రావులపాలెం, అంబాజీపేట అరటి మార్కెట్‌లలో కొనుగోళ్ల సందడి మొదలైంది. ఈ నెల 29న షష్ఠి తీర్థమహోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. దీంతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి సమర్పించే కర్పూర రకం అరటి గెలల ధరకు రెక్కలొచ్చాయి. షష్ఠి తీర్థ మహోత్సవాల సందర్భంగా రావులపాలెం, అంబాజీపేట అరటి మార్కెట్‌లలో కొనుగోళ్ల సందడి మొదలైంది. ఈ నెల 29న షష్ఠి తీర్థమహోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. దీంతో సుబ్రహ్మణ్యేశ్వరస్వామికి సమర్పించే కర్పూర రకం అరటి గెలల ధరకు రెక్కలొచ్చాయి.
24/28
 ఒంగోలులో జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో భాగంగా 243 మంది యువతీ యువకులు ప్రదర్శనలు ఇచ్చారు. సహచరులు ఈలలు, కేకలతో ప్రోత్సహించారు. కర్ణాటిక్‌, హిందుస్థాని సంగీతం; కూచిపూడి, భరతనాట్యం, కథక్‌, మణిపురి, ఒడిస్సీ నృత్యాలు; వీణ, సితార, తబలా, మృదంగం, గిటారు, హార్మోనియం, ప్లూట్‌ వాయిద్యాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు. ఒంగోలులో జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో భాగంగా 243 మంది యువతీ యువకులు ప్రదర్శనలు ఇచ్చారు. సహచరులు ఈలలు, కేకలతో ప్రోత్సహించారు. కర్ణాటిక్‌, హిందుస్థాని సంగీతం; కూచిపూడి, భరతనాట్యం, కథక్‌, మణిపురి, ఒడిస్సీ నృత్యాలు; వీణ, సితార, తబలా, మృదంగం, గిటారు, హార్మోనియం, ప్లూట్‌ వాయిద్యాలతో తమ ప్రతిభను ప్రదర్శించారు.
25/28
విజయనగరం జిల్లా వంగర మండలం చిన్నరాజులగుమ్మడ, పెద్దరాజుల గుమ్మడ, తలగాం, శివ్వాం, కొండచాకరాపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి పథకాలు ఉన్నప్పటికీ చుక్కనీరు ఇవ్వడం లేదు. ఆయా గ్రామాల మహిళలు సమీపంలోని నాగావళిలో చెలమల నుంచి, కొండచాకరాపల్లి గ్రామస్థులు సువర్ణముఖిలో నిత్యం నీరు తోడుకుని దాహం తీర్చుకుంటున్నారు. విజయనగరం జిల్లా వంగర మండలం చిన్నరాజులగుమ్మడ, పెద్దరాజుల గుమ్మడ, తలగాం, శివ్వాం, కొండచాకరాపల్లి తదితర గ్రామాల్లో తాగునీటి పథకాలు ఉన్నప్పటికీ చుక్కనీరు ఇవ్వడం లేదు. ఆయా గ్రామాల మహిళలు సమీపంలోని నాగావళిలో చెలమల నుంచి, కొండచాకరాపల్లి గ్రామస్థులు సువర్ణముఖిలో నిత్యం నీరు తోడుకుని దాహం తీర్చుకుంటున్నారు.
26/28
ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత శనివారం సింహాచలంలో స్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభం వద్ద ప్రార్థన చేశారు. పండితులు ఆమెను వేదమంత్రాలతో   ఆశీర్వదించి తీర్థ  ప్రసాదాలు అందజేశారు. ప్రముఖ సినీ నేపథ్య గాయని సునీత శనివారం సింహాచలంలో స్వామిని దర్శించుకున్నారు. కప్పస్తంభం వద్ద ప్రార్థన చేశారు. పండితులు ఆమెను వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
27/28
నర్సీపట్నం గవర వీధిలోని గౌరమ్మ అమ్మవారికి పట్టణవాసులు శనివారం ఘనంగా సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, బూరెలు, గారెలు, లడ్డూలు, కాజాలు, రకరకాల పండ్లు, పూలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. కార్తిక మాసోత్సవాల్లో భాగంగా గౌరీపరమేశ్వరుల కల్యాణం అనంతరం తమ ఇంటి ఆడపడుచుగా భావించే గౌరమ్మకు సారె సమర్పించడం ఆనవాయితీ అని భక్తులు పేర్కొన్నారు. నర్సీపట్నం గవర వీధిలోని గౌరమ్మ అమ్మవారికి పట్టణవాసులు శనివారం ఘనంగా సారె సమర్పించారు. పసుపు, కుంకుమ, బూరెలు, గారెలు, లడ్డూలు, కాజాలు, రకరకాల పండ్లు, పూలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. కార్తిక మాసోత్సవాల్లో భాగంగా గౌరీపరమేశ్వరుల కల్యాణం అనంతరం తమ ఇంటి ఆడపడుచుగా భావించే గౌరమ్మకు సారె సమర్పించడం ఆనవాయితీ అని భక్తులు పేర్కొన్నారు.
28/28
అంతర్జాతీయ నృత్యకళాకారులు ప్రదర్శించిన రామాయణ నృత్య రూపకం నగరవాసులను  ఆకట్టుకుంది. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శనివారం ఇండోనేషియా, లండన్‌కు చెందిన విదేశీ నృత్య కళాకారులు హిందూ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు. అంతర్జాతీయ నృత్యకళాకారులు ప్రదర్శించిన రామాయణ నృత్య రూపకం నగరవాసులను ఆకట్టుకుంది. నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలోని కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో శనివారం ఇండోనేషియా, లండన్‌కు చెందిన విదేశీ నృత్య కళాకారులు హిందూ సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పారు.

మరిన్ని