News In Pics : చిత్రం చెప్పే సంగతులు-2 (27-11-2022)

Updated : 27 Nov 2022 22:29 IST
1/26
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌కు టాలీవుడ్ నటులు కిరణ్ అబ్బవరం, సంతోష్ శోభన్, సంగీత్ శోభన్‌, కార్తిక దీపం సీరియల్ ఫేమ్‌ నిరుపమ్ విచ్చేసి సందడి చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతున్న ప్రొ కబడ్డీ లీగ్‌కు టాలీవుడ్ నటులు కిరణ్ అబ్బవరం, సంతోష్ శోభన్, సంగీత్ శోభన్‌, కార్తిక దీపం సీరియల్ ఫేమ్‌ నిరుపమ్ విచ్చేసి సందడి చేశారు.
2/26
హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సింధు, బిందు సోదరిణులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చి రంగప్రవేశం చేశారు. కార్యక్రమానికి దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబు సనా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో సింధు, బిందు సోదరిణులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చి రంగప్రవేశం చేశారు. కార్యక్రమానికి దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు సుకుమార్, బుచ్చిబాబు సనా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
3/26
4/26
హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘మిసెస్‌ మామ్‌’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇందులోభాగంగా పలువురు గర్భిణులు ర్యాంప్‌వాక్‌ చేశారు. గర్భిణులకు వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ‘మిసెస్‌ మామ్‌’ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇందులోభాగంగా పలువురు గర్భిణులు ర్యాంప్‌వాక్‌ చేశారు. గర్భిణులకు వచ్చే ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
5/26
6/26
నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ‘శ్రీమతి నెల్లూరు’ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో ‘శ్రీమతి నెల్లూరు’ పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మహిళలు పాల్గొని ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.
7/26
కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఆదివారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారు ఆదివారం రాత్రి క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.
8/26
హైదరాబాద్‌లో నిర్వహించిన సినీనటుడు అలీ కుమార్తె ఫాతిమా వివాహానికి మంత్రి రోజా, ప్రముఖ సినీనటుడు నాగార్జున-అమల దంపతులు హాజరై సందడి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సినీనటుడు అలీ కుమార్తె ఫాతిమా వివాహానికి మంత్రి రోజా, ప్రముఖ సినీనటుడు నాగార్జున-అమల దంపతులు హాజరై సందడి చేశారు.
9/26
ఫిపా వరల్డ్‌కప్‌ పోటీల్లో భాగంగా దోహాలో క్రొయేషియా, కెనడా మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చిన ఓ క్రొయేషియా అభిమాని ఇలా సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. ఫిపా వరల్డ్‌కప్‌ పోటీల్లో భాగంగా దోహాలో క్రొయేషియా, కెనడా మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చిన ఓ క్రొయేషియా అభిమాని ఇలా సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు.
10/26
మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కేసు కోసి సంబరాలు చేసుకున్నారు. మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య కేసు కోసి సంబరాలు చేసుకున్నారు.
11/26
నంద్యాల జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రాన్ని సినీనటుడు శరత్‌బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం ఇచ్చారు. నంద్యాల జిల్లాలోని మహానంది పుణ్యక్షేత్రాన్ని సినీనటుడు శరత్‌బాబు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం ఇచ్చారు.
12/26
ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హరిప్రసాద్ స్వహస్తాలతో నేసిన G-20 లోగోను తనకు పంపినట్లు వెల్లడించారు. అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలుపుతూ మోదీ కొనియాడారు. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హరిప్రసాద్‌ను కలిసి సన్మానించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’లో సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. హరిప్రసాద్ స్వహస్తాలతో నేసిన G-20 లోగోను తనకు పంపినట్లు వెల్లడించారు. అద్భుతమైన బహుమానం చూసి ఆశ్చర్యపోయినట్లు తెలుపుతూ మోదీ కొనియాడారు. ఈ నేపథ్యంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ హరిప్రసాద్‌ను కలిసి సన్మానించారు.
13/26
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని లాలాపేట్ డివిజన్‌లో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వివిధ బస్తీల ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం డివిజన్‌లో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌లోని లాలాపేట్ డివిజన్‌లో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వివిధ బస్తీల ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం డివిజన్‌లో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలతో ఆయన మాట్లాడారు.
14/26
ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్, హరీశ్‌ శంకర్‌ కలిసి సందడి చేశారు. ఈ ఫొటోను హరీశ్‌ శంకర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. తనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉండే గురూజీ(పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి)కి ధన్యవాదాలు అని పోస్టు పెట్టారు. ప్రముఖ దర్శకులు పూరీ జగన్నాథ్, హరీశ్‌ శంకర్‌ కలిసి సందడి చేశారు. ఈ ఫొటోను హరీశ్‌ శంకర్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. తనకు ఎల్లప్పుడూ మద్దతుగా ఉండే గురూజీ(పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశించి)కి ధన్యవాదాలు అని పోస్టు పెట్టారు.
15/26
సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని ఎన్‌ఐఎంహెచ్‌ ఆడిటోరియంలో వందే భారతం-నృత్య ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలో, జానపద, గిరిజన తదితర విభాగాల్లో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. వీరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి 2023 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నృత్యం చేసే అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సికింద్రాబాద్‌ బోయిన్‌పల్లిలోని ఎన్‌ఐఎంహెచ్‌ ఆడిటోరియంలో వందే భారతం-నృత్య ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సోలో, జానపద, గిరిజన తదితర విభాగాల్లో కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. వీరిలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి 2023 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో నృత్యం చేసే అవకాశం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
16/26
ఇప్పటంలో కూల్చివేతలు జరుగుతున్న తరుణంలో తనను బిడ్డా అంటూ అక్కున చేర్చుకున్న వృద్ధురాలికి పవన్‌ పాదాభివందనం చేశారు. ‘ఆనాడు ఇలాంటి తల్లులే నాకు మద్దతుగా నిలబడ్డారు. అదే నన్ను కదిలించింది. మీ ప్రేమ ముందు ముఖ్యమంత్రి పదవి అయినా చిన్నదే’ అన్నారు. ఇప్పటంలో కూల్చివేతలు జరుగుతున్న తరుణంలో తనను బిడ్డా అంటూ అక్కున చేర్చుకున్న వృద్ధురాలికి పవన్‌ పాదాభివందనం చేశారు. ‘ఆనాడు ఇలాంటి తల్లులే నాకు మద్దతుగా నిలబడ్డారు. అదే నన్ను కదిలించింది. మీ ప్రేమ ముందు ముఖ్యమంత్రి పదవి అయినా చిన్నదే’ అన్నారు.
17/26
థాయ్‌లాండ్‌లోని లొప్‌బురి ప్రావిన్స్‌లో ‘మంకీ ఫీస్ట్‌ ఫెస్టివల్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా కోతులు వివిధ రకాల పండ్లు తింటూ సందడి చేశాయి. ఏటా కోతులకు కృతజ్ఞత తెలుపుతూ థాయలాండ్‌లో ‘మంకీ ఫీస్ట్‌ ఫెస్టివల్‌’ నిర్వహిస్తుంటారు. థాయ్‌లాండ్‌లోని లొప్‌బురి ప్రావిన్స్‌లో ‘మంకీ ఫీస్ట్‌ ఫెస్టివల్‌’ నిర్వహించారు. ఈ సందర్భంగా కోతులు వివిధ రకాల పండ్లు తింటూ సందడి చేశాయి. ఏటా కోతులకు కృతజ్ఞత తెలుపుతూ థాయలాండ్‌లో ‘మంకీ ఫీస్ట్‌ ఫెస్టివల్‌’ నిర్వహిస్తుంటారు.
18/26
కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుల్లెట్‌ బండి నడిపి పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెంచారు. కాంగ్రెస్‌ చేపట్టిన భారత్‌జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుల్లెట్‌ బండి నడిపి పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెంచారు.
19/26
ఇటీవల మృతిచెందిన సినీనటుడు కృష్ణ పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు, నమ్రత, మంజుల, సుధీర్‌బాబు తదితరులు కృష్ణ చిత్రపటానికి నివాళి అర్పించారు. ఇటీవల మృతిచెందిన సినీనటుడు కృష్ణ పెద్దకర్మను ఆదివారం కుటుంబ సభ్యుల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్‌బాబు, నమ్రత, మంజుల, సుధీర్‌బాబు తదితరులు కృష్ణ చిత్రపటానికి నివాళి అర్పించారు.
20/26
ఇప్పటం గ్రామంలో కూల్చివేత కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు జనసేన ఆధ్వర్యంలో ఆర్థికసహాయం అందజేశారు. మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఇప్పటం గ్రామంలో కూల్చివేత కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు జనసేన ఆధ్వర్యంలో ఆర్థికసహాయం అందజేశారు. మంగళగిరిలోని కార్యాలయంలో పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఒక్కొక్కరికి రూ.లక్ష విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
21/26
గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘పబ్లిక్‌ టాక్‌ ఆన్‌ ది ఐడియా ఆఫ్‌ ఇండియా’ చర్చాగోష్టిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ప్రసంగించారు. గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ‘పబ్లిక్‌ టాక్‌ ఆన్‌ ది ఐడియా ఆఫ్‌ ఇండియా’ చర్చాగోష్టిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి ప్రసంగించారు.
22/26
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి కే శివారులో పిప్పల్‌కోటి రిజర్వాయర్ పనులు జరుగుతున్న ప్రదేశంలో శనివారం అర్ధరాత్రి పులి కనిపించింది. ఇది గమనించిన వాహనదారులు ఉలిక్కిపడ్డారు. భయపడి పనులు ఆపి క్యాంపునకు చేరుకున్నారు. ఆ వాహనంలోని ఒకరు పులి ఫొటోలు తీయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని తాంసి కే శివారులో పిప్పల్‌కోటి రిజర్వాయర్ పనులు జరుగుతున్న ప్రదేశంలో శనివారం అర్ధరాత్రి పులి కనిపించింది. ఇది గమనించిన వాహనదారులు ఉలిక్కిపడ్డారు. భయపడి పనులు ఆపి క్యాంపునకు చేరుకున్నారు. ఆ వాహనంలోని ఒకరు పులి ఫొటోలు తీయగా.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
23/26
జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక సభ నిర్వహించారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి అవయవాలను దానం చేసి ఇతరుల ప్రాణాలను నిలబెట్టిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సన్మానించారు. జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రత్యేక సభ నిర్వహించారు. బ్రెయిన్‌డెడ్‌ అయిన వారి అవయవాలను దానం చేసి ఇతరుల ప్రాణాలను నిలబెట్టిన కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు సన్మానించారు.
24/26
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఈ ఉదయం రథోత్సవం నిర్వహించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.	తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన ఈ ఉదయం రథోత్సవం నిర్వహించారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో సాగిన ఈ వేడుకను వీక్షించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
25/26
అమీర్‌పేటలోని ఆస్టర్‌ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మొబైల్‌ ఆస్పత్రి వ్యాన్‌ ప్రతి రోజూ హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఆగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 150 మంది రోగులకు అక్కడే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పేదలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఏడాదిగా ఈ మొబైల్‌ వైద్యశిబరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. లక్డీకపూల్‌ వద్ద కనిపించాయి ఈ దృశ్యాలు.	అమీర్‌పేటలోని ఆస్టర్‌ ప్రైమ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మొబైల్‌ ఆస్పత్రి వ్యాన్‌ ప్రతి రోజూ హైదరాబాద్‌ నగరంలోని వివిధ ప్రదేశాల్లో ఆగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపు 150 మంది రోగులకు అక్కడే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. పేదలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఏడాదిగా ఈ మొబైల్‌ వైద్యశిబరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది. లక్డీకపూల్‌ వద్ద కనిపించాయి ఈ దృశ్యాలు.
26/26
హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. కాసేపు పడుతూ.. కాసేపటి తరువాత ఆగిపోతూ ఉంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.	హామిల్టన్‌ వేదికగా జరుగుతున్న భారత్, న్యూజిలాండ్‌ రెండో వన్డే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. కాసేపు పడుతూ.. కాసేపటి తరువాత ఆగిపోతూ ఉంది. దీంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు