News In Pics : చిత్రం చెప్పే సంగతులు-1 (28-11-2022)

Updated : 28 Nov 2022 13:42 IST
1/32
ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ కొత్త సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మూడు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ధనుష్‌ హీరోగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ఓ కొత్త సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మూడు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది.
2/32
అగ్రకథానాయకుడు రజనీకాంత్ నటించిన బాబా సినిమాను డిసెంబర్‌ 12న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేశ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలైంది. క్లైమాక్స్‌ సన్నివేశాలు ఆసక్తిగా లేకపోవడంతో అప్పట్లో ఈ సినిమా ఫలితం నిరాశ పర్చింది. దీంతో తాజాగా కొన్ని సన్నివేశాలు జోడించినట్లు సమాచారం. వాటికి రజనీ డబ్బింగ్‌ చెబుతున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అగ్రకథానాయకుడు రజనీకాంత్ నటించిన బాబా సినిమాను డిసెంబర్‌ 12న ఆయన పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేశ్‌ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2002లో విడుదలైంది. క్లైమాక్స్‌ సన్నివేశాలు ఆసక్తిగా లేకపోవడంతో అప్పట్లో ఈ సినిమా ఫలితం నిరాశ పర్చింది. దీంతో తాజాగా కొన్ని సన్నివేశాలు జోడించినట్లు సమాచారం. వాటికి రజనీ డబ్బింగ్‌ చెబుతున్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
3/32
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చివరి రోజైన నేడు పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచి తితిదే అధికారులు, అర్చకులు పద్మావతి అమ్మవారికి సారె
 తీసుకొచ్చి సమర్పించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చివరి రోజైన నేడు పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీ‌వారి ఆల‌యం నుంచి తితిదే అధికారులు, అర్చకులు పద్మావతి అమ్మవారికి సారె తీసుకొచ్చి సమర్పించారు.
4/32
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పే పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ పరిశీలించారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ సమీపంలో 125 అడుగుల ఎత్తయిన అంబేడ్కర్‌ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పే పనులు చకచకా సాగుతున్నాయి. ఈ పనులను మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌ పరిశీలించారు.
5/32
మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం జగన్‌, ఎంపీలు మార్గాని భరత్, విజయసాయిరెడ్డి మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న సీఎం జగన్‌, ఎంపీలు మార్గాని భరత్, విజయసాయిరెడ్డి
6/32
జ్యోతిబా ఫులే వర్ధంతిని పురస్కరించుకుని విజయనగరానికి చెందిన శ్రీనివాస ఆర్ట్స్‌ అకాడమీ ఆదివారం గాజులరేగలో పలురకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులు ఇలా ఫులే వేషధారణలో అలరించారు. అకాడమీ అధ్యక్షుడు రామానాయుడు, నారాయణ పాఠశాల కరస్పాండెంట్‌ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.  జ్యోతిబా ఫులే వర్ధంతిని పురస్కరించుకుని విజయనగరానికి చెందిన శ్రీనివాస ఆర్ట్స్‌ అకాడమీ ఆదివారం గాజులరేగలో పలురకాల సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులు ఇలా ఫులే వేషధారణలో అలరించారు. అకాడమీ అధ్యక్షుడు రామానాయుడు, నారాయణ పాఠశాల కరస్పాండెంట్‌ నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
7/32
ఇదేదో చిన్న మొక్కకు పూచిన పువ్వులోంచి సూరీడు నవ్వినట్లుంది కదూ. ఆదివారం సూర్యోదయ సమయంలో జీవ కోటికి  వెలుగులు ప్రసాదించే ప్రభాకరుడు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడులో ఓ ఇంటిపైన పూల కుండీలోని పుష్పంపైనున్నట్లుగా కనిపించినప్పుడు తీసిన చిత్రమిది. ఇదేదో చిన్న మొక్కకు పూచిన పువ్వులోంచి సూరీడు నవ్వినట్లుంది కదూ. ఆదివారం సూర్యోదయ సమయంలో జీవ కోటికి వెలుగులు ప్రసాదించే ప్రభాకరుడు డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం కోడూరుపాడులో ఓ ఇంటిపైన పూల కుండీలోని పుష్పంపైనున్నట్లుగా కనిపించినప్పుడు తీసిన చిత్రమిది.
8/32
గాల్లో తేలినట్టుంది కదూ.. నిజమే.. ఇది పట్టుకుంటే పడిపోయేలా ఉంది. ఇదెక్కడంటారా.. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం పిప్పల్‌గావ్‌ గ్రామం నుంచి మేడిగూడకు వెళ్లేదారిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభం. ప్రస్తుతం చేలలో రైతులు శనగ పంట సాగు చేస్తున్నారు. ఈ దారిన వస్తూపోతుంటారు. ప్రమాదం జరగకముందే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. గాల్లో తేలినట్టుంది కదూ.. నిజమే.. ఇది పట్టుకుంటే పడిపోయేలా ఉంది. ఇదెక్కడంటారా.. ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం పిప్పల్‌గావ్‌ గ్రామం నుంచి మేడిగూడకు వెళ్లేదారిలో ప్రమాదకరంగా ఉన్న విద్యుత్తు స్తంభం. ప్రస్తుతం చేలలో రైతులు శనగ పంట సాగు చేస్తున్నారు. ఈ దారిన వస్తూపోతుంటారు. ప్రమాదం జరగకముందే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
9/32
ఈ చిత్రం ఆనందపురం-విశాఖపట్నం మార్గంలోనిది. ద్విచక్ర వాహనంపై చిన్నారిని ఇలా తీసుకెళ్లడం ప్రమాదం కాదా అని చూపరులు ఆందోళన వ్యక్తపర్చారు. ఈ చిత్రం ఆనందపురం-విశాఖపట్నం మార్గంలోనిది. ద్విచక్ర వాహనంపై చిన్నారిని ఇలా తీసుకెళ్లడం ప్రమాదం కాదా అని చూపరులు ఆందోళన వ్యక్తపర్చారు.
10/32
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం కొంతమంది భక్తులు కాలినడకన మహారాష్ట్రలోని పర్బణి నుంచి తిరుపతి చేరుకున్నారు. గత నెల 28న పిల్లలు, పెద్దలతో కలిపి 102 మంది బయలుదేరామని, రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 870 కిలోమీటర్లు నడిచి ఆదివారం మధ్యాహ్నం అలిపిరికి చేరుకున్నామని చెప్పారు.  
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం కొంతమంది భక్తులు కాలినడకన మహారాష్ట్రలోని పర్బణి నుంచి తిరుపతి చేరుకున్నారు. గత నెల 28న పిల్లలు, పెద్దలతో కలిపి 102 మంది బయలుదేరామని, రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 870 కిలోమీటర్లు నడిచి ఆదివారం మధ్యాహ్నం అలిపిరికి చేరుకున్నామని చెప్పారు.
11/32
‘జగన్‌ మామా.. ఉపాధ్యాయులు లేరు మామా’ అంటూ పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగులలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. గురజాలలో ఆదివారం గుంటూరు- మాచర్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇద్దరు ఉపాధ్యాయులే పదో తరగతి పాఠాలు బోధిస్తుంటే ఎలా చదువుకోవాలంటూ ప్లకార్డులతో ఆవేదన వ్యక్తం చేశారు.  ‘జగన్‌ మామా.. ఉపాధ్యాయులు లేరు మామా’ అంటూ పల్నాడు జిల్లా గురజాల మండలం మాడుగులలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. గురజాలలో ఆదివారం గుంటూరు- మాచర్ల రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇద్దరు ఉపాధ్యాయులే పదో తరగతి పాఠాలు బోధిస్తుంటే ఎలా చదువుకోవాలంటూ ప్లకార్డులతో ఆవేదన వ్యక్తం చేశారు.
12/32
నరసాపురం నుంచి సఖినేటిపల్లి వెళ్లేందుకు రోజూ వందల మంది గోదావరి మీదుగా పంటుపై రాకపోకలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం నదీ ప్రయాణంలో లైఫ్‌ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలి. కానీ, ఇక్కడ ప్రయాణికులెవరూ వాటిని ధరించడం లేదు. అలంకారప్రాయంగా పంటు పైభాగంలో వేలాడదీశారు. నరసాపురం నుంచి సఖినేటిపల్లి వెళ్లేందుకు రోజూ వందల మంది గోదావరి మీదుగా పంటుపై రాకపోకలు సాగిస్తున్నారు. నిబంధనల ప్రకారం నదీ ప్రయాణంలో లైఫ్‌ జాకెట్లు తప్పనిసరిగా ధరించాలి. కానీ, ఇక్కడ ప్రయాణికులెవరూ వాటిని ధరించడం లేదు. అలంకారప్రాయంగా పంటు పైభాగంలో వేలాడదీశారు.
13/32
ఒకే పుష్పం ఒకేరోజు మూడు వర్ణాల్లో మెరిసింది. ఉదయం 8 గంటలకు తెల్లగా, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలోని కోమనేని రఘు నివాసంలో శనివారం ఈ మందారజాతి పువ్వు వికసించింది. ఈ మొక్కను హైబిస్కస్‌ ముటాబిలిస్‌ అని పిలుస్తారు. ఒకే పుష్పం ఒకేరోజు మూడు వర్ణాల్లో మెరిసింది. ఉదయం 8 గంటలకు తెల్లగా, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారింది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాకలోని కోమనేని రఘు నివాసంలో శనివారం ఈ మందారజాతి పువ్వు వికసించింది. ఈ మొక్కను హైబిస్కస్‌ ముటాబిలిస్‌ అని పిలుస్తారు.
14/32
అల్లుకుపోయిన రంగురంగుల, రకరకాల తీగజాతులు, మొక్కలతో చూపరులకు పొదరిల్లులా కనిపిస్తున్నా.. నిజానికి ఇదో శౌచాలయం అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సమీప మాణికేశ్వర్‌ నగర్‌ ప్రాంతంలోని హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంకులో మరుగుదొడ్లను ఇలా తీర్చిదిద్దారు. వాహనదారుల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన వీటిని చూసి.. టాయిలెట్లు అంటే ఎవరూ నమ్మటం లేదని సిబ్బంది చెప్తున్నారు. అల్లుకుపోయిన రంగురంగుల, రకరకాల తీగజాతులు, మొక్కలతో చూపరులకు పొదరిల్లులా కనిపిస్తున్నా.. నిజానికి ఇదో శౌచాలయం అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఉస్మానియా విశ్వవిద్యాలయ సమీప మాణికేశ్వర్‌ నగర్‌ ప్రాంతంలోని హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌ బంకులో మరుగుదొడ్లను ఇలా తీర్చిదిద్దారు. వాహనదారుల కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన వీటిని చూసి.. టాయిలెట్లు అంటే ఎవరూ నమ్మటం లేదని సిబ్బంది చెప్తున్నారు.
15/32
గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రొ కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం పోటీలను తిలకించేందుకు వచ్చిన నటులు నిరుపమ్, కిరణ్, సంతోష్‌ శోభన్, సంగీత్‌ శోభన్‌ ఆటగాళ్లను ఉత్సాహపర్చారు. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ప్రొ కబడ్డీ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఆదివారం పోటీలను తిలకించేందుకు వచ్చిన నటులు నిరుపమ్, కిరణ్, సంతోష్‌ శోభన్, సంగీత్‌ శోభన్‌ ఆటగాళ్లను ఉత్సాహపర్చారు.
16/32
ఘట్‌కేసర్‌ నుంచి అవుషాపూర్‌ వెళ్లే వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై హెచ్‌పీసీఎల్‌ సంస్థకు చెందిన వాహనాలు నిలుపుతున్నారు. రాకపోకలకు వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఘట్‌కేసర్‌ నుంచి అవుషాపూర్‌ వెళ్లే వరంగల్‌-హైదరాబాద్‌ జాతీయ రహదారి సర్వీసు రోడ్డుపై హెచ్‌పీసీఎల్‌ సంస్థకు చెందిన వాహనాలు నిలుపుతున్నారు. రాకపోకలకు వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
17/32
ఇటీవల స్కైవే పునాది గుంతలో పడి ఓ మహిళ మరణించినా అధికారుల్లో కదలిక లేదు. మెహిదీపట్నం సర్వీహోటల్‌ నుంచి మెరాజ్‌ చౌరస్తా రహదారిలో రేకులతో పనులు జరుగుతున్నాయి. రేకులు బిగించే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. వంతెనపై నుంచి ఇనుప రేకులు కిందపడి, ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల స్కైవే పునాది గుంతలో పడి ఓ మహిళ మరణించినా అధికారుల్లో కదలిక లేదు. మెహిదీపట్నం సర్వీహోటల్‌ నుంచి మెరాజ్‌ చౌరస్తా రహదారిలో రేకులతో పనులు జరుగుతున్నాయి. రేకులు బిగించే సమయంలో ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. వంతెనపై నుంచి ఇనుప రేకులు కిందపడి, ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
18/32
కేంద్ర పర్యాటకశాఖ మంత్రి  కిషన్‌రెడ్డి ఆదివారం సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. తుకారాంగేట్‌ వద్ద కూరగాయల వ్యాపారితో మాట్లాడారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆదివారం సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. తుకారాంగేట్‌ వద్ద కూరగాయల వ్యాపారితో మాట్లాడారు.
19/32
విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి గేటు బయట దీనంగా ఉన్న అనాథలు వీరు. యాచనచేసి బతికే వీరు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వచ్చారు. తోడు ఎవరూ లేరని అడ్మిట్‌ చేసుకోకపోవడంతో ఇలా గేటు బయట ఉంటున్నారు. మార్కాపురానికి చెందిన శ్రీను కాలికి గాయమై ఆసుపత్రికి వస్తే.. సిబ్బంది కట్టుకట్టి బయటకు పంపించారని వాపోయారు. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రి గేటు బయట దీనంగా ఉన్న అనాథలు వీరు. యాచనచేసి బతికే వీరు ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రికి వచ్చారు. తోడు ఎవరూ లేరని అడ్మిట్‌ చేసుకోకపోవడంతో ఇలా గేటు బయట ఉంటున్నారు. మార్కాపురానికి చెందిన శ్రీను కాలికి గాయమై ఆసుపత్రికి వస్తే.. సిబ్బంది కట్టుకట్టి బయటకు పంపించారని వాపోయారు.
20/32
సఫిల్‌గూడ లేక్‌ పార్కు ప్రధాన గేటు వద్ద చిరు వ్యాపారులు, ఇతరులు తమ వాహనాలు అడ్డంగా నిలుపుతున్నారు. లోపలికి వెళ్లేందుకు సందర్శకులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. సఫిల్‌గూడ లేక్‌ పార్కు ప్రధాన గేటు వద్ద చిరు వ్యాపారులు, ఇతరులు తమ వాహనాలు అడ్డంగా నిలుపుతున్నారు. లోపలికి వెళ్లేందుకు సందర్శకులకు ఇబ్బందులు తప్పడం లేదు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
21/32
  ‘సృజనాత్మక ఆవిష్కరణలు, స్థిరాభివృద్ధి’లో విశేష కృషిచేసిన లద్దాఖ్‌ ఇంజినీర్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌కు డాక్టర్‌ పౌలోస్‌ మార్‌ గ్రెగోరియస్‌ అవార్డును ఆదివారం యూపీలోని గాజియాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ‘సృజనాత్మక ఆవిష్కరణలు, స్థిరాభివృద్ధి’లో విశేష కృషిచేసిన లద్దాఖ్‌ ఇంజినీర్‌ సోనమ్‌ వాంగ్‌చుక్‌కు డాక్టర్‌ పౌలోస్‌ మార్‌ గ్రెగోరియస్‌ అవార్డును ఆదివారం యూపీలోని గాజియాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రదానం చేస్తున్న మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు
22/32
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన దీపక్‌ విశ్వకర్మ అనే శిల్పి రాళ్లపై బొమ్మలను అద్భుతంగా చెక్కుతున్నాడు. మనుషులను చూసి వారిని అచ్చుగుద్దినట్లుగా రాళ్లపై వారి రూపాన్ని చెక్కడం అతడి ప్రత్యేకత. మహాత్మాగాంధీ, బి.ఆర్‌.అంబేడ్కర్, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని వాజ్‌పేయీ, అమితాబ్‌ బచ్చన్‌ వంటి ప్రముఖుల రూపాలను రాళ్లపై సుందరంగా చెక్కాడు. అంతేకాదు.. దేవుళ్ల ప్రతిరూపాలనూ అద్భుతంగా చెక్కగలడు


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన దీపక్‌ విశ్వకర్మ అనే శిల్పి రాళ్లపై బొమ్మలను అద్భుతంగా చెక్కుతున్నాడు. మనుషులను చూసి వారిని అచ్చుగుద్దినట్లుగా రాళ్లపై వారి రూపాన్ని చెక్కడం అతడి ప్రత్యేకత. మహాత్మాగాంధీ, బి.ఆర్‌.అంబేడ్కర్, సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్, ప్రధాని మోదీ, మాజీ ప్రధాని వాజ్‌పేయీ, అమితాబ్‌ బచ్చన్‌ వంటి ప్రముఖుల రూపాలను రాళ్లపై సుందరంగా చెక్కాడు. అంతేకాదు.. దేవుళ్ల ప్రతిరూపాలనూ అద్భుతంగా చెక్కగలడు
23/32
సాధారణంగా డిసెంబరు, జనవరి నెలల్లో మామిడి తోటల్లో పూత ప్రారంభమై మేలో కాయలు పక్వానికి వస్తాయి. చిత్తూరుజిల్లా పాకాల మండలం బొబ్బావారిపల్లి వద్ద ఓ రైతుకు చెందిన తోటలో కాసిన మామిడి కాయలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తోటలో ఖాదర్, తోతాపురి, పుల్లూరా రకాల కాయలు గుత్తులుగా వేలాడుతున్నాయి. రైతుకు చెందిన మూడు ఎకరాల పొలంలో 60 శాతం చెట్లు ఇలా కాపునకు వచ్చాయి. సేంద్రియ ఎరువులు వినియోగించడం, ఉద్యానశాఖ నిపుణుల సూచనలతో సస్యరక్షణ చర్యలు చేపట్టడమే పంట రహస్యమని రైతు చెబుతున్నారు. 


సాధారణంగా డిసెంబరు, జనవరి నెలల్లో మామిడి తోటల్లో పూత ప్రారంభమై మేలో కాయలు పక్వానికి వస్తాయి. చిత్తూరుజిల్లా పాకాల మండలం బొబ్బావారిపల్లి వద్ద ఓ రైతుకు చెందిన తోటలో కాసిన మామిడి కాయలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తోటలో ఖాదర్, తోతాపురి, పుల్లూరా రకాల కాయలు గుత్తులుగా వేలాడుతున్నాయి. రైతుకు చెందిన మూడు ఎకరాల పొలంలో 60 శాతం చెట్లు ఇలా కాపునకు వచ్చాయి. సేంద్రియ ఎరువులు వినియోగించడం, ఉద్యానశాఖ నిపుణుల సూచనలతో సస్యరక్షణ చర్యలు చేపట్టడమే పంట రహస్యమని రైతు చెబుతున్నారు.
24/32
కంబాల కొండలోని ప్రకృతి సౌందర్యంపర్యాటకులను రారమ్మంటోంది. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం గురించి తెలిసి ఇటీవల పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కొండల ప్రాంతంలో ఏర్పాటు చేసిన తీగల వంతెనపై నడిచేందుకు ఆదివారం ఎక్కువ మంది ఆసక్తి చూపారు (చిత్రంలో). కంబాల కొండలోని ప్రకృతి సౌందర్యంపర్యాటకులను రారమ్మంటోంది. ఇక్కడి ఆహ్లాదకర వాతావరణం గురించి తెలిసి ఇటీవల పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కొండల ప్రాంతంలో ఏర్పాటు చేసిన తీగల వంతెనపై నడిచేందుకు ఆదివారం ఎక్కువ మంది ఆసక్తి చూపారు (చిత్రంలో).
25/32
ఆర్కేబీచ్, రుషికొండ తీరాలకు పర్యాటకులు ఆదివారం భారీగా తరలివచ్చారు. ఆర్‌కేబీచ్‌లో నావికాదళ దినోత్సవ ఏర్పాట్లను ఆసక్తిగా తిలకించారు ఆర్కేబీచ్, రుషికొండ తీరాలకు పర్యాటకులు ఆదివారం భారీగా తరలివచ్చారు. ఆర్‌కేబీచ్‌లో నావికాదళ దినోత్సవ ఏర్పాట్లను ఆసక్తిగా తిలకించారు
26/32
శిల్పారామంలో ఆదివారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. నాట్యగురువు సంతోష్‌కుమార్‌ తమంగ్‌ శిష్యబృందం చూడముచ్చటైన హావభావాలతో లయబద్ధంగా నృత్యం చేసి అలరించారు. వారు ప్రదర్శించిన పుష్పాంజలి, జతిస్వరం, శివస్తుతి నృత్యాంశాలు నయనానందకరంగా సాగాయి.   


శిల్పారామంలో ఆదివారం సాయంత్రం కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. నాట్యగురువు సంతోష్‌కుమార్‌ తమంగ్‌ శిష్యబృందం చూడముచ్చటైన హావభావాలతో లయబద్ధంగా నృత్యం చేసి అలరించారు. వారు ప్రదర్శించిన పుష్పాంజలి, జతిస్వరం, శివస్తుతి నృత్యాంశాలు నయనానందకరంగా సాగాయి.
27/32
పెయింటింగ్‌లా అనిపిస్తున్నా.. కాలుష్యానికి నిలువుటద్దం ఈ చిత్రం. అత్తాపూర్‌ వద్ద మూసీలో వ్యర్థాలు తగలబెడుతుండడంతో పొగ ధాటికి చేపల కోసం వచ్చిన కొంగలు ఎగిరిపోతున్న దృశ్యం పెయింటింగ్‌లా అనిపిస్తున్నా.. కాలుష్యానికి నిలువుటద్దం ఈ చిత్రం. అత్తాపూర్‌ వద్ద మూసీలో వ్యర్థాలు తగలబెడుతుండడంతో పొగ ధాటికి చేపల కోసం వచ్చిన కొంగలు ఎగిరిపోతున్న దృశ్యం
28/32
గర్భిణుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ వారిని ఉల్లాసంగా ఉంచేందుకు కిమ్స్‌ కడుల్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో మిసెస్‌ మామ్‌ పోటీలు నిర్వహించారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన తుది పోటీల్లో 40 మంది గర్భిణులు ర్యాంప్‌వాక్‌ చేశారు. అంతకుముందు కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కిమ్స్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ బి.భాస్కర్‌రావుతో కలిసి ప్రారంభించారు. గర్భిణుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిస్తూ వారిని ఉల్లాసంగా ఉంచేందుకు కిమ్స్‌ కడుల్స్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో మిసెస్‌ మామ్‌ పోటీలు నిర్వహించారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో ఆదివారం రాత్రి జరిగిన తుది పోటీల్లో 40 మంది గర్భిణులు ర్యాంప్‌వాక్‌ చేశారు. అంతకుముందు కార్యక్రమాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కిమ్స్‌ ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ బి.భాస్కర్‌రావుతో కలిసి ప్రారంభించారు.
29/32
వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో నృత్య ప్రదర్శన ఇచ్చే కళాకారుల ఎంపిక ప్రక్రియ న్యూబోయిన్‌పల్లిలో ఆదివారం జరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు చెందిన వారు తమ కళలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. 


వచ్చే గణతంత్ర దినోత్సవం రోజున దిల్లీలో నృత్య ప్రదర్శన ఇచ్చే కళాకారుల ఎంపిక ప్రక్రియ న్యూబోయిన్‌పల్లిలో ఆదివారం జరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాలకు చెందిన వారు తమ కళలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
30/32
థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి ప్రావిన్స్‌ కేంద్రంలో ఆదివారం మకాక్‌ వానరాలు రుచికరమైన ఆహారాన్ని ఆరగించాయి. వివిధ రకాల పళ్లు, కూరగాయలు, చాక్లెట్లు, జెల్లీలతో  నిర్వాహకులు వాటికి విందు సిద్ధం చేశారు. ఈ దృశ్యాలను పర్యాటకులు కెమెరాల్లో బంధించారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.


థాయ్‌లాండ్‌లోని లోప్‌బురి ప్రావిన్స్‌ కేంద్రంలో ఆదివారం మకాక్‌ వానరాలు రుచికరమైన ఆహారాన్ని ఆరగించాయి. వివిధ రకాల పళ్లు, కూరగాయలు, చాక్లెట్లు, జెల్లీలతో నిర్వాహకులు వాటికి విందు సిద్ధం చేశారు. ఈ దృశ్యాలను పర్యాటకులు కెమెరాల్లో బంధించారు. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏటా ఈ ఉత్సవం నిర్వహిస్తారు.
31/32
కరోనా కారణంగా ఆగిపోయి, తరువాత ప్రారంభమైనా కొద్దికాలానికే పరిమితమైన పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్‌ మళ్లీ  ముస్తాబవుతోంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌ కోసం నాంపల్లి మైదానంలో రేకుల షెడ్లు వేగంగా నిర్మిస్తున్నారు. సందర్శకులకు ఆట విడుపుగా ఉండే జెయింట్‌ వీల్, ఇతర ఆట యంత్రాలు కూడా సిద్ధమవుతున్నాయి.


కరోనా కారణంగా ఆగిపోయి, తరువాత ప్రారంభమైనా కొద్దికాలానికే పరిమితమైన పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్‌ మళ్లీ ముస్తాబవుతోంది. వచ్చే నెలలో ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్‌ కోసం నాంపల్లి మైదానంలో రేకుల షెడ్లు వేగంగా నిర్మిస్తున్నారు. సందర్శకులకు ఆట విడుపుగా ఉండే జెయింట్‌ వీల్, ఇతర ఆట యంత్రాలు కూడా సిద్ధమవుతున్నాయి.
32/32
కాటారం-భూపాలపల్లి జాతీయ రహదారికి ఇరువైపులా పలుచోట్ల పెరిగిన గడ్డిపూలు దారిన పోయేవారిని ఆకర్షిస్తున్నాయి. పచ్చని అడవిలో ఎరుపు వర్ణంతో గడ్డిపూలు ఓవైపు వాలిపోయి కనులవిందు చేస్తుండగా న్యూస్‌టుడే ‘క్లిక్‌’ మనిపించింది. కాటారం-భూపాలపల్లి జాతీయ రహదారికి ఇరువైపులా పలుచోట్ల పెరిగిన గడ్డిపూలు దారిన పోయేవారిని ఆకర్షిస్తున్నాయి. పచ్చని అడవిలో ఎరుపు వర్ణంతో గడ్డిపూలు ఓవైపు వాలిపోయి కనులవిందు చేస్తుండగా న్యూస్‌టుడే ‘క్లిక్‌’ మనిపించింది.

మరిన్ని