News In Pics : చిత్రం చెప్పే సంగతులు-1 (29-11-2022)

Updated : 29 Nov 2022 14:14 IST
1/15
ఈఎల్ సాల్వెడార్‌లోని చాపర్రాస్టిక్యూ అగ్నిపర్వతం నుంచి భారీగా పొగ, ఇతర వాయువులు విడుదలవుతున్నాయి. ఈ ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈఎల్ సాల్వెడార్‌లోని చాపర్రాస్టిక్యూ అగ్నిపర్వతం నుంచి భారీగా పొగ, ఇతర వాయువులు విడుదలవుతున్నాయి. ఈ ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
2/15
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009వ సంవత్సరం నవంబర్‌ 29న తెరాస అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ నాటి పోరును స్మరించుకుంటూ తెరాస శ్రేణులు నేడు దీక్షా దివస్‌ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, జడ్పీ ఛైర్మన్‌ విజయ తదితరులు సీఎం కేసీఆర్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేసి.. అమరవీరులకు నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009వ సంవత్సరం నవంబర్‌ 29న తెరాస అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ నాటి పోరును స్మరించుకుంటూ తెరాస శ్రేణులు నేడు దీక్షా దివస్‌ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, జడ్పీ ఛైర్మన్‌ విజయ తదితరులు సీఎం కేసీఆర్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేసి.. అమరవీరులకు నివాళులర్పించారు.
3/15
సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
4/15
 ముంబయి జుహులోని తన నివాసం జల్సాలో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఏర్పాటుచేసిన రాతి బల్ల ఇది. టన్ను బరువున్న ఈ బల్లను బిగ్‌బీ తండ్రి హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ రాసిన మధుశాల పుస్తకం ఆకారంలో రూపొందించడం విశేషం. దీనిని పోలండ్‌లోని వ్రోట్‌స్వాఫ్‌ నగరంలో తయారు చేసి ముంబయికి తీసుకొచ్చారు. హరివంశ్‌రాయ్‌ బచ్చన్‌ 115వ జయంతి(ఆదివారం)ని పురస్కరించుకుని అమితాబ్‌ సోమవారం ఈ విశేషాలను పంచుకున్నారు. 

5/15
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 19న జరిగిన పోటీల్లో మిసెస్‌ ఆసియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. అల్లూరి సరోజ తండ్రి రాంబాబు, తల్లి పార్వతి స్వగ్రామం సఖినేటిపల్లి. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. సరోజ అమెరికాలో ఐటీఉద్యోగం చేస్తున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఈనెల 19న జరిగిన పోటీల్లో మిసెస్‌ ఆసియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. అల్లూరి సరోజ తండ్రి రాంబాబు, తల్లి పార్వతి స్వగ్రామం సఖినేటిపల్లి. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు. సరోజ అమెరికాలో ఐటీఉద్యోగం చేస్తున్నారు.
6/15
 రాత్రివేళ వచ్చే భక్తులకు యాదాద్రి పసిడి వర్ణ కాంతుల్లో పచ్చటి పూలమొక్కల మధ్య, పండు వెన్నెల కురిసే వీధి దీప కాంతుల మధ్య ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. భక్తులకు కనువిందు గొలుపుతోంది. కీసర వైపు నుంచి వచ్చే భక్తులకు సోమవారం యాదాద్రి ఇలా కనిపించింది. రాత్రివేళ వచ్చే భక్తులకు యాదాద్రి పసిడి వర్ణ కాంతుల్లో పచ్చటి పూలమొక్కల మధ్య, పండు వెన్నెల కురిసే వీధి దీప కాంతుల మధ్య ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. భక్తులకు కనువిందు గొలుపుతోంది. కీసర వైపు నుంచి వచ్చే భక్తులకు సోమవారం యాదాద్రి ఇలా కనిపించింది.
7/15
విశాఖపట్నం కేజీహెచ్‌లో తల్లిపిల్లల వార్డు నుంచి చిన్నపిల్లల వార్డుకు వెళ్లే మార్గంలో నిత్యం ఓ స్వచ్ఛంద సంస్థ అన్నదానం చేస్తుంది. ఆసుపత్రికి వచ్చే పేద రోగుల సహాయకులు, బంధువులు ఈ భోజనం కోసం ఉదయం 10.30 గంటల నుంచే వేచి ఉంటారు. ఒక్కొక్కసారి అందరికీ అందదు. ముందొచ్చిన వారికే లభిస్తుంది. అందుకే పలువురు ముందే వచ్చి ఇలా తమతో పాటు తెచ్చకున్న బాక్సులు, ప్లేట్లను వరుసలో పెట్టి వేచి చూస్తుంటారు.

8/15
నావికాదళ దినోత్సవానికి సన్నద్ధంగా సోమవారం విశాఖ  తీరంలో నిర్వహించిన నమూనా విన్యాసాల్లో ఓ దృశ్యమిది.

నావికాదళ దినోత్సవానికి సన్నద్ధంగా సోమవారం విశాఖ తీరంలో నిర్వహించిన నమూనా విన్యాసాల్లో ఓ దృశ్యమిది.
9/15
 ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలం శ్రీలక్ష్మీనారాయణ స్వామి కోనేరులో పెరుగుతున్న తుమ్మ చెట్లను చూస్తే నిండా తెల్లని పువ్వులు పూసినట్లుగా కనిపిస్తుంటాయి. వాటిని తీక్షణంగా గమనిస్తేనే అవి పువ్వులు కాదు కొంగలని తెలుస్తాయి. సాయంత్రం వేళల్లో ఇలా చెట్లపై వాలి.. తెల్లవారుజామున వేటకు ఎగిరిపోతాయి. నాలుగు రోజులుగా పెరుగుతున్న చలి తీవ్రతకు ఉదయం 8 గంటలైనా ఎటూ ఎగరకుండా ఇలా చెట్లపైనే ఉండిపోతున్నాయంటూ స్థానికులు చెబుతున్నారు.

10/15
అమీర్‌పేట్‌లోని ఆస్టర్‌ప్రైమ్‌ ఆసుపత్రి బృందం వైద్య పరికరాలున్న బస్సుతో లక్డికాపూల్‌లో ఉచిత సేవలు అందిస్తున్న చిత్రమిది. తమ బృందం రోజుకో ప్రాంతం వెళ్లి దాదాపు 150మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్‌ విజయచందర్‌ తెలిపారు అమీర్‌పేట్‌లోని ఆస్టర్‌ప్రైమ్‌ ఆసుపత్రి బృందం వైద్య పరికరాలున్న బస్సుతో లక్డికాపూల్‌లో ఉచిత సేవలు అందిస్తున్న చిత్రమిది. తమ బృందం రోజుకో ప్రాంతం వెళ్లి దాదాపు 150మందికి పరీక్షలు నిర్వహిస్తున్నామని డాక్టర్‌ విజయచందర్‌ తెలిపారు
11/15
పోలీసు ఉద్యోగ పరీక్షల కోసం బడంగ్‌పేట మున్సిపల్‌ మైదానంలో   దాదాపు 500 మంది అభ్యర్థులు నిత్యం ఉదయం 5 గంటల నుంచి   9గంటల దాకా కఠోర సాధన చేస్తున్నారు. వీరిలో 200 మంది మహిళా అభ్యర్థులే.  వీరి ఇబ్బందుల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్‌  తరపున  సంచార టాయ్‌లెట్‌  సౌకర్యం కల్పించారు. పోలీసు ఉద్యోగ పరీక్షల కోసం బడంగ్‌పేట మున్సిపల్‌ మైదానంలో దాదాపు 500 మంది అభ్యర్థులు నిత్యం ఉదయం 5 గంటల నుంచి 9గంటల దాకా కఠోర సాధన చేస్తున్నారు. వీరిలో 200 మంది మహిళా అభ్యర్థులే. వీరి ఇబ్బందుల నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్‌ తరపున సంచార టాయ్‌లెట్‌ సౌకర్యం కల్పించారు.
12/15
 కేపీహెచ్‌బీ నెక్సెస్‌ మాల్‌లో కాందానీ రాజ్‌ధాని హోటల్‌లో వచ్చేనెల 1 నుంచి పలురకాల వంటకాలు ఘుమఘుమలాడనున్నాయి. రాజస్థానీ, గుజరాతీ, ఇతర ఉత్తర భారత వంటకాలు 32 రకాలు అందుబాటులో ఉంచనున్నట్లు హోటల్‌ నిర్వాహకులు తెలిపారు. కేపీహెచ్‌బీ నెక్సెస్‌ మాల్‌లో కాందానీ రాజ్‌ధాని హోటల్‌లో వచ్చేనెల 1 నుంచి పలురకాల వంటకాలు ఘుమఘుమలాడనున్నాయి. రాజస్థానీ, గుజరాతీ, ఇతర ఉత్తర భారత వంటకాలు 32 రకాలు అందుబాటులో ఉంచనున్నట్లు హోటల్‌ నిర్వాహకులు తెలిపారు.
13/15
బంజారాహిల్స్‌లో చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య ఠీవిగా కనిపిస్తున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనం. బంజారాహిల్స్‌లో చుట్టూ పచ్చని ప్రకృతి మధ్య ఠీవిగా కనిపిస్తున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ భవనం.
14/15
ఖైరతాబాద్‌ కూడలిలో లవ్‌ హైదరాబాద్‌ అని మొక్కలతో అలంకరించిన ప్రాంతంలో మొక్కలకు నీరు అందించే పైపు సోమవారం పగిలిపోయింది. దీంతో నీరు ఇలా దూరంగా రోడ్డుపై చిమ్మటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఖైరతాబాద్‌ కూడలిలో లవ్‌ హైదరాబాద్‌ అని మొక్కలతో అలంకరించిన ప్రాంతంలో మొక్కలకు నీరు అందించే పైపు సోమవారం పగిలిపోయింది. దీంతో నీరు ఇలా దూరంగా రోడ్డుపై చిమ్మటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
15/15
హుస్సేన్‌ సాగర తీరాన సాయం సంధ్యా సమయంలో బంగారు వర్ణ సూర్యకిరణాలు పడుతుండగా.. పక్షుల కిలకిలారవాలు.. హుస్సేన్‌ సాగర తీరాన సాయం సంధ్యా సమయంలో బంగారు వర్ణ సూర్యకిరణాలు పడుతుండగా.. పక్షుల కిలకిలారవాలు..

మరిన్ని