News In Pics : చిత్రం చెప్పే సంగతులు-2 (29-11-2022)

Updated : 29 Nov 2022 20:19 IST
1/12
మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ఉజ్జయినిలో వెలసిన శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. ఆలయంలోని శివలింగం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మధ్యప్రదేశ్‌లో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ ఉజ్జయినిలో వెలసిన శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. ఆలయంలోని శివలింగం వద్ద ప్రత్యేక పూజలు చేశారు.
2/12
ఉత్తరాఖండ్‌లోని ఔలీలో ‘యుద్ధ అభ్యాస్‌’ పేరిట భారత్‌-అమెరికా సైనికులు సంయుక్త విన్యాసాలు చేస్తున్నారు. చైనా భూభాగానికి సమీపంలో.. అతి శీతల, ఎత్తయిన పర్వతాలపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయుధం లేకుండా పోరాడే విన్యాసాలను భారత సైనికులు ప్రదర్శించగా.. అమెరికా సైనికులు ఆసక్తితో తిలకించారు. ఉత్తరాఖండ్‌లోని ఔలీలో ‘యుద్ధ అభ్యాస్‌’ పేరిట భారత్‌-అమెరికా సైనికులు సంయుక్త విన్యాసాలు చేస్తున్నారు. చైనా భూభాగానికి సమీపంలో.. అతి శీతల, ఎత్తయిన పర్వతాలపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆయుధం లేకుండా పోరాడే విన్యాసాలను భారత సైనికులు ప్రదర్శించగా.. అమెరికా సైనికులు ఆసక్తితో తిలకించారు.
3/12
హైదరాబాద్‌ మెట్రో ఐదో వార్షికోత్సవ వేడుకలు అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒగ్గు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. వారి కోరిక మేరకు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి(మధ్యలో ఉన్న వ్యక్తి) ఇలా సరదాగా కాసేపు డోలు వాయించారు. హైదరాబాద్‌ మెట్రో ఐదో వార్షికోత్సవ వేడుకలు అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒగ్గు కళాకారులు ప్రదర్శన ఇచ్చారు. వారి కోరిక మేరకు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి(మధ్యలో ఉన్న వ్యక్తి) ఇలా సరదాగా కాసేపు డోలు వాయించారు.
4/12
గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని శ్రీ కన్వెన్షన్‌లో సినీనటుడు ఆలీ కుమార్తె వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌ నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి విడదల రజని, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆయన వెంట ఉన్నారు. గుంటూరు ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని శ్రీ కన్వెన్షన్‌లో సినీనటుడు ఆలీ కుమార్తె వివాహ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌ నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రి విడదల రజని, ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆయన వెంట ఉన్నారు.
5/12
ఖతార్‌ రాజధాని దోహాలో ఫిఫా ప్రపంచకప్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి పరిపాలనా భవనం అమిరి దివాన్‌ వద్ద ఇలా ఒంటెలపై కూర్చొని రక్షకులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 
ఖతార్‌ రాజధాని దోహాలో ఫిఫా ప్రపంచకప్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి పరిపాలనా భవనం అమిరి దివాన్‌ వద్ద ఇలా ఒంటెలపై కూర్చొని రక్షకులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
6/12
హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌లు కలిసి ఈ పోటీలను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో దివ్యాంగుల రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌లు కలిసి ఈ పోటీలను ప్రారంభించారు.
7/12
సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సికింద్రాబాద్‌ పద్మారావునగర్లోని స్కందగిరి ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా సికింద్రాబాద్‌ పద్మారావునగర్లోని స్కందగిరి ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు
8/12
పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌ జిల్లా ఛాహర్‌పుర్‌ గ్రామంలోని పంట పొలాలపై ఎగురుతున్న ఓ చైనా డ్రోన్‌ను సోమవారం రాత్రి బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. ఇది పాకిస్థాన్‌ వైపు నుంచి వచ్చి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. డ్రోన్‌కు కట్టిన పాలిథిన్‌ సంచుల్లో డ్రగ్స్‌ ఉన్నట్లు సమాచారం. పంజాబ్‌ రాష్ట్రం అమృత్‌సర్‌ జిల్లా ఛాహర్‌పుర్‌ గ్రామంలోని పంట పొలాలపై ఎగురుతున్న ఓ చైనా డ్రోన్‌ను సోమవారం రాత్రి బీఎస్‌ఎఫ్‌ జవాన్లు కూల్చివేశారు. ఇది పాకిస్థాన్‌ వైపు నుంచి వచ్చి భారత భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిసింది. డ్రోన్‌కు కట్టిన పాలిథిన్‌ సంచుల్లో డ్రగ్స్‌ ఉన్నట్లు సమాచారం.
9/12
ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాల్సిన ఆవశ్యకతను సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రీకరణ రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో జరుగుతోంది. కీలక సన్నివేశాల్లో రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళలు నటించారు. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాల్సిన ఆవశ్యకతను సినిమా రూపంలో తీసుకొస్తున్నారు. అందుకు సంబంధించిన చిత్రీకరణ రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో జరుగుతోంది. కీలక సన్నివేశాల్లో రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళలు నటించారు.
10/12
ఈఎల్ సాల్వెడార్‌లోని చాపర్రాస్టిక్యూ అగ్నిపర్వతం నుంచి భారీగా పొగ, ఇతర వాయువులు విడుదలవుతున్నాయి. ఈ ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.	ఈఎల్ సాల్వెడార్‌లోని చాపర్రాస్టిక్యూ అగ్నిపర్వతం నుంచి భారీగా పొగ, ఇతర వాయువులు విడుదలవుతున్నాయి. ఈ ప్రభావం మరింతగా పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని స్థానిక ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
11/12
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009వ సంవత్సరం నవంబర్‌ 29న తెరాస అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ నాటి పోరును స్మరించుకుంటూ తెరాస శ్రేణులు నేడు దీక్షా దివస్‌ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, జడ్పీ ఛైర్మన్‌ విజయ తదితరులు సీఎం కేసీఆర్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేసి.. అమరవీరులకు నివాళులర్పించారు.	తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2009వ సంవత్సరం నవంబర్‌ 29న తెరాస అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత సీఎం కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆ నాటి పోరును స్మరించుకుంటూ తెరాస శ్రేణులు నేడు దీక్షా దివస్‌ నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా కరీంనగర్‌లో మంత్రి గంగుల కమలాకర్‌, జడ్పీ ఛైర్మన్‌ విజయ తదితరులు సీఎం కేసీఆర్‌ కటౌట్‌కు పాలాభిషేకం చేసి.. అమరవీరులకు నివాళులర్పించారు.
12/12
సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు	సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా రాజమహేంద్రవరంలోని ఓ ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు