News In Pics: చిత్రం చెప్పే సంగతులు -2 (30-11-2022)

Updated : 30 Nov 2022 22:31 IST
1/23
ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి  ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్న గూడేనికి చెందిన గుడిగుంట లక్ష్మీనారాయణ. ఇప్పటివరకు 12సార్లు శబరిమలకు వెళ్లి వచ్చారు. ఈసారి వినూత్నంగా గుర్రపుబండిని అద్దెకు తీసుకొని శబరిమలకు పయనమయ్యారు. రూ.1.85లక్షలకు గుర్రపు బండికి కూలీ ఇచ్చుకొని మరీ వెళ్తుండటం విశేషం. ఒంగోలు నగరంలో బుధవారం ఈ గుర్రపు బండి కనిపించింది. ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్న గూడేనికి చెందిన గుడిగుంట లక్ష్మీనారాయణ. ఇప్పటివరకు 12సార్లు శబరిమలకు వెళ్లి వచ్చారు. ఈసారి వినూత్నంగా గుర్రపుబండిని అద్దెకు తీసుకొని శబరిమలకు పయనమయ్యారు. రూ.1.85లక్షలకు గుర్రపు బండికి కూలీ ఇచ్చుకొని మరీ వెళ్తుండటం విశేషం. ఒంగోలు నగరంలో బుధవారం ఈ గుర్రపు బండి కనిపించింది.
2/23
సినీనటి జాన్వీ కపూర్‌ అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. సినీనటి జాన్వీ కపూర్‌ అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు.
3/23
విశాఖలోని శివాజీ పార్కులో బుధవారం వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలు, ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.. విశాఖలోని శివాజీ పార్కులో బుధవారం వనభోజనాల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు నృత్యాలు, ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు..
4/23
డిసెంబర్‌ 4న నిర్వహించనున్న నేవీ డే వేడుకల కోసం నేవీ సిబ్బంది విశాఖ ఆర్కే బీచ్‌లో రిహార్సల్స్‌ చేశారు. ఈ సందర్భంగా యుద్ధ హెలికాప్టర్లు, విమానాలతో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. డిసెంబర్‌ 4న నిర్వహించనున్న నేవీ డే వేడుకల కోసం నేవీ సిబ్బంది విశాఖ ఆర్కే బీచ్‌లో రిహార్సల్స్‌ చేశారు. ఈ సందర్భంగా యుద్ధ హెలికాప్టర్లు, విమానాలతో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి.
5/23
6/23
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట పంచాయతీ పరిధిలోని గాంధారి ఖిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో నిలిచిన నీరు, అటవీ ప్రాంతంలో జాలువారుతున్న క్షీర జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట పంచాయతీ పరిధిలోని గాంధారి ఖిల్లా పరిసర ప్రాంతాల్లో ప్రకృతి అందాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. చుట్టూ ఎత్తైన కొండలు, మధ్యలో నిలిచిన నీరు, అటవీ ప్రాంతంలో జాలువారుతున్న క్షీర జలపాతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
7/23
8/23
హైదరాబాద్‌లోని హామ్స్‌టెక్‌ కళాశాల ఫ్రెషర్స్‌ డే వేడుకకు నటీనటులు యష్‌ పూరి, స్టేఫీ పటేల్‌ హాజరయ్యారు. వీరిద్దరు జంటగా నటించిన సినిమా ‘చెప్పాలని ఉంది’ డిసెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. హైదరాబాద్‌లోని హామ్స్‌టెక్‌ కళాశాల ఫ్రెషర్స్‌ డే వేడుకకు నటీనటులు యష్‌ పూరి, స్టేఫీ పటేల్‌ హాజరయ్యారు. వీరిద్దరు జంటగా నటించిన సినిమా ‘చెప్పాలని ఉంది’ డిసెంబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
9/23
హైదరాబాద్‌లోని హామ్స్‌టెక్‌ కళాశాల ఫ్రెషర్స్‌డే వేడుకను జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థినులు నృత్యప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లోని హామ్స్‌టెక్‌ కళాశాల ఫ్రెషర్స్‌డే వేడుకను జూబ్లీహిల్స్‌లోని జేఆర్సీ కన్వెన్షన్‌లో నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థినులు నృత్యప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.
10/23
తమిళ నటుడు విజయ్‌ సినిమా రంగంలోకి వచ్చి 30ఏళ్లు అవుతున్న సందర్భంగా డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ‘అదిరింది’ సినిమాను ప్రదర్శించనున్నారు. తమిళ నటుడు విజయ్‌ సినిమా రంగంలోకి వచ్చి 30ఏళ్లు అవుతున్న సందర్భంగా డిసెంబర్‌ 4న హైదరాబాద్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో ‘అదిరింది’ సినిమాను ప్రదర్శించనున్నారు.
11/23
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నాలుగో విడత విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు రూ.684 కోట్ల విద్యాదీవెన నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు ఆయన తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో నాలుగో విడత విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమాన్ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. జులై-సెప్టెంబర్‌ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు రూ.684 కోట్ల విద్యాదీవెన నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు ఆయన తెలిపారు.
12/23
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎస్‌గా జవహర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సీఎస్‌గా జవహర్‌రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు.
13/23
హెచ్‌టూఓ అనే సంస్థ నూతన సంవత్సరానికి ‘ఎలీజియం’ అనే పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ లాంచ్‌ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పాల్గొని సందడి చేశారు. హెచ్‌టూఓ అనే సంస్థ నూతన సంవత్సరానికి ‘ఎలీజియం’ అనే పేరుతో ఓ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ లాంచ్‌ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ పాల్గొని సందడి చేశారు.
14/23
ఈ ఫొటోలో కనిపిస్తున్న సముద్ర జీవి పేరు మనాటీ. ఏప్రిల్‌లో దీన్ని ఓ నౌక ఢీకొనడంతో తీవ్రగాయాలతో సొంబ్రేరో తీరంలో విలవిల్లాడుతూ కనిపించింది. ఈక్రమంలో మనాటీని ఫ్లోరిడాలోని సంరక్షణ శిబిరంలో ఉంచి చికిత్స అందించారు. కోలుకున్న అనంతరం మంగళవారం ఫ్లోరిడా సముద్ర జలాల్లోకి వదిలిపెట్టారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న సముద్ర జీవి పేరు మనాటీ. ఏప్రిల్‌లో దీన్ని ఓ నౌక ఢీకొనడంతో తీవ్రగాయాలతో సొంబ్రేరో తీరంలో విలవిల్లాడుతూ కనిపించింది. ఈక్రమంలో మనాటీని ఫ్లోరిడాలోని సంరక్షణ శిబిరంలో ఉంచి చికిత్స అందించారు. కోలుకున్న అనంతరం మంగళవారం ఫ్లోరిడా సముద్ర జలాల్లోకి వదిలిపెట్టారు.
15/23
రష్యా ఆక్రమణలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌.. దోనెట్స్క్‌ రీజియన్‌లో ఇటీవల జన్మించిన రెండు పులి పిల్లలను యజమానులు వదిలి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వాటికి మేరియుపోల్‌ వన్యప్రాణుల పార్కులో ఆవాసం కల్పించగా ఇలా ఆడుకుంటూ కనిపించాయి. యుద్ధం కారణంగా పలువురు యజమానులు తమ పెంపుడు జంతువులను ఇలా వదిలేసి వెళ్తున్నారు. రష్యా ఆక్రమణలో ఉన్న తూర్పు ఉక్రెయిన్‌.. దోనెట్స్క్‌ రీజియన్‌లో ఇటీవల జన్మించిన రెండు పులి పిల్లలను యజమానులు వదిలి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వాటికి మేరియుపోల్‌ వన్యప్రాణుల పార్కులో ఆవాసం కల్పించగా ఇలా ఆడుకుంటూ కనిపించాయి. యుద్ధం కారణంగా పలువురు యజమానులు తమ పెంపుడు జంతువులను ఇలా వదిలేసి వెళ్తున్నారు.
16/23
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం అహ్మదాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. గుజరాత్‌లో డిసెంబర్‌ 1, 5 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 8న ఫలితాలు ప్రకటించనున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం అహ్మదాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. గుజరాత్‌లో డిసెంబర్‌ 1, 5 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 8న ఫలితాలు ప్రకటించనున్నారు.
17/23
వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్‌ స్క్వేర్‌లో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఎదుట ఓ బృందం ఆకట్టుకునే విన్యాసాలను ప్రదర్శించింది. వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్‌ స్క్వేర్‌లో పోప్‌ ఫ్రాన్సిస్‌ ఎదుట ఓ బృందం ఆకట్టుకునే విన్యాసాలను ప్రదర్శించింది.
18/23
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్‌ జిల్లా గుండెగాం గ్రామంలో పర్యటించారు. పత్తి చేనులో పని చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఇళ్లు లేవని, పింఛన్లు రావడంలేదని కూలీలు బండి సంజయ్‌ ఎదుట వాపోయారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బుధవారం ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్‌ జిల్లా గుండెగాం గ్రామంలో పర్యటించారు. పత్తి చేనులో పని చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఇళ్లు లేవని, పింఛన్లు రావడంలేదని కూలీలు బండి సంజయ్‌ ఎదుట వాపోయారు.
19/23
‘పుష్ప ద రైజ్‌’ సినిమాను డిసెంబర్‌ 1న మాస్కో, 3న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో స్పెషల్‌ ప్రీమియర్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా రష్యా చేరుకున్న అల్లు అర్జున్‌, రష్మిక మందాన, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ అక్కడి మీడియాతో మాట్లాడారు. ‘పుష్ప ద రైజ్‌’ సినిమాను డిసెంబర్‌ 1న మాస్కో, 3న సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌లో స్పెషల్‌ ప్రీమియర్‌ వేయనున్నారు. ఈ సందర్భంగా రష్యా చేరుకున్న అల్లు అర్జున్‌, రష్మిక మందాన, సుకుమార్‌, దేవిశ్రీ ప్రసాద్‌ అక్కడి మీడియాతో మాట్లాడారు.
20/23
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘RC 15’(వర్కింగ్ టైటిల్‌) న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఇక్కడి అద్భుతమైన ప్రదేశాల్లో ఓ పాటను చిత్రీకరించినట్లు వెల్లడిస్తూ రామ్‌చరణ్‌ ఈ చిత్రాలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.	మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘RC 15’(వర్కింగ్ టైటిల్‌) న్యూజిలాండ్‌ షెడ్యూల్‌ పూర్తయింది. ఇక్కడి అద్భుతమైన ప్రదేశాల్లో ఓ పాటను చిత్రీకరించినట్లు వెల్లడిస్తూ రామ్‌చరణ్‌ ఈ చిత్రాలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.
21/23
ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు కలపర్రు టోల్‌గేట్ వద్ద స్వాగతం పలుకుతున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌	ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన తెదేపా అధినేత చంద్రబాబుకు కలపర్రు టోల్‌గేట్ వద్ద స్వాగతం పలుకుతున్న దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌
22/23
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గాయకుడు, బిగ్ బాస్ ఫేం శ్రీరామ చంద్ర	తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గాయకుడు, బిగ్ బాస్ ఫేం శ్రీరామ చంద్ర
23/23
పాన్‌ ఇండియా సినిమాగా విడుదలై ఓ ఊపు ఊపేసిన ‘పుష్ప ద రైజ్‌’ డిసెంబర్‌ 8న రష్యన్‌ భాషలో విడుదల కాబోతోంది. డిసెంబర్‌ 1న మాస్కో, 3న సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో స్పెషల్‌ ప్రీమియర్‌ వేయనున్నారు. దీంతో అల్లు అర్జున్‌, రష్మిక, సుకుమార్‌ రష్యా చేరుకున్నారు. అక్కడి అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు.	పాన్‌ ఇండియా సినిమాగా విడుదలై ఓ ఊపు ఊపేసిన ‘పుష్ప ద రైజ్‌’ డిసెంబర్‌ 8న రష్యన్‌ భాషలో విడుదల కాబోతోంది. డిసెంబర్‌ 1న మాస్కో, 3న సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో స్పెషల్‌ ప్రీమియర్‌ వేయనున్నారు. దీంతో అల్లు అర్జున్‌, రష్మిక, సుకుమార్‌ రష్యా చేరుకున్నారు. అక్కడి అభిమానులు వారికి ఘన స్వాగతం పలికారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు