News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (01-12-2022)

Updated : 01 Dec 2022 22:22 IST
1/21
భారత్‌ గురువారం జీ20 సదస్సు సారథ్య బాధ్యతలను స్వీకరించింది. ఈ సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై జీ20 లోగోను ప్రదర్శించారు. భారత్‌ గురువారం జీ20 సదస్సు సారథ్య బాధ్యతలను స్వీకరించింది. ఈ సందర్భంగా దిల్లీలోని ఎర్రకోటపై జీ20 లోగోను ప్రదర్శించారు.
2/21
ఉత్తరాఖండ్‌లోని దేవప్రయాగ్‌ వద్ద గంగా నది ఇలా రమణీయంగా కనిపించింది. ఇక్కడే అలకనంద, భాగీరథీ నదులు కలిసి గంగగా మారుతుంది. ఉత్తరాఖండ్‌లోని దేవప్రయాగ్‌ వద్ద గంగా నది ఇలా రమణీయంగా కనిపించింది. ఇక్కడే అలకనంద, భాగీరథీ నదులు కలిసి గంగగా మారుతుంది.
3/21
ఫిఫా వరల్డ్‌కప్‌ పోటీల్లో భాగంగా ఖతార్‌లోని అహ్మద్‌ బిన్‌ అలీ స్టేడియంలో క్రొయేషియా, బెల్జియం జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా క్రొయేషియా అభిమాని ఇలా సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు. ఫిఫా వరల్డ్‌కప్‌ పోటీల్లో భాగంగా ఖతార్‌లోని అహ్మద్‌ బిన్‌ అలీ స్టేడియంలో క్రొయేషియా, బెల్జియం జట్ల మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ సందర్భంగా క్రొయేషియా అభిమాని ఇలా సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు.
4/21
జీ20 సదస్సు సారథ్య బాధ్యతల్ని భారత్‌ నేటి నుంచి స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో ఆకట్టుకునే సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. జీ20 సదస్సు సారథ్య బాధ్యతల్ని భారత్‌ నేటి నుంచి స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో ఆకట్టుకునే సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
5/21
హైదరాబాద్‌లోని క్రీడా మైదానాలు, స్టేడియాలు కొన్నిరోజులుగా యువతీయువకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ సత్తాచాటే పనిలో నిమగ్నమయ్యారు. చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం, సాయంత్రం కసరత్తులు చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఉస్మానియా యూనివర్సిటీలోని మైదానంలో కనిపించిన చిత్రాలివి. హైదరాబాద్‌లోని క్రీడా మైదానాలు, స్టేడియాలు కొన్నిరోజులుగా యువతీయువకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఎస్సై, కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు శారీరక సామర్థ్య పరీక్షల్లోనూ సత్తాచాటే పనిలో నిమగ్నమయ్యారు. చలిని సైతం లెక్కచేయకుండా ఉదయం, సాయంత్రం కసరత్తులు చేస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఉస్మానియా యూనివర్సిటీలోని మైదానంలో కనిపించిన చిత్రాలివి.
6/21
కర్నూలు జిల్లా డోన్ సమీపంలోని పంట పొలాల్లో ధాన్యపు గింజల కోసం చిలకలు విద్యుత్తు తీగలపై వరసగా కూర్చొని కనువిందు చేశాయి. వీటి మధ్యలో తనేమి తక్కువ కాదంటూ ఓ పిచ్చుక వచ్చి చేరింది. కర్నూలు జిల్లా డోన్ సమీపంలోని పంట పొలాల్లో ధాన్యపు గింజల కోసం చిలకలు విద్యుత్తు తీగలపై వరసగా కూర్చొని కనువిందు చేశాయి. వీటి మధ్యలో తనేమి తక్కువ కాదంటూ ఓ పిచ్చుక వచ్చి చేరింది.
7/21
8/21
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
9/21
హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ‘థండర్‌ స్ట్రైక్‌’ నూతన సంవత్సర వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీనటులు శివబాలాజీ, మధుమిత దంపతులతో పాటు పలువురు మోడల్స్‌, సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ‘థండర్‌ స్ట్రైక్‌’ నూతన సంవత్సర వేడుకల పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీనటులు శివబాలాజీ, మధుమిత దంపతులతో పాటు పలువురు మోడల్స్‌, సోషల్‌ ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు.
10/21
వధూవరులు తమ వివాహ వేడుకకు ముందు తీరిక చేసుకొని వచ్చి ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లా జేసర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. వధూవరులు తమ వివాహ వేడుకకు ముందు తీరిక చేసుకొని వచ్చి ఓటేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టారు. గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లా జేసర్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
11/21
రానున్న క్రిస్మస్‌ పండగ సందర్భంగా దక్షిణ కొరియాలోని సియోల్‌లో సన్నాహక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళా డైవర్లు అక్వేరియంలో సాగరకన్యల వేషధారణలో ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు. రానున్న క్రిస్మస్‌ పండగ సందర్భంగా దక్షిణ కొరియాలోని సియోల్‌లో సన్నాహక వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మహిళా డైవర్లు అక్వేరియంలో సాగరకన్యల వేషధారణలో ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు.
12/21
ఇటీవల నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి గురువారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
13/21
సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ సినిమాలో పాటలకు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ నేపథ్యంలో చివరి పాట సైతం పూర్తి కావడంతో సల్మా్న్‌ఖాన్‌తో కలిసి ఆయన చివరిసారిగా ఓ ఫొటో తీసుకున్నారు. సల్మాన్‌ఖాన్‌ తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. సల్మాన్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కిసీ కా భాయ్‌.. కిసీ కా జాన్‌’ సినిమాలో పాటలకు జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ నేపథ్యంలో చివరి పాట సైతం పూర్తి కావడంతో సల్మా్న్‌ఖాన్‌తో కలిసి ఆయన చివరిసారిగా ఓ ఫొటో తీసుకున్నారు. సల్మాన్‌ఖాన్‌ తనకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
14/21
భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ దిల్లీలోని సుష్మాస్వరాజ్‌ భవన్‌లో ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించడంతో పాటు వారితో సెల్ఫీ తీసుకున్నారు. భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ దిల్లీలోని సుష్మాస్వరాజ్‌ భవన్‌లో ‘జీ20 యూనివర్సిటీ కనెక్ట్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించడంతో పాటు వారితో సెల్ఫీ తీసుకున్నారు.
15/21
సినీనటి జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించున్నారు. బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి కాలినడకన ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.	సినీనటి జాన్వీకపూర్‌ తిరుమల శ్రీవారిని దర్శించున్నారు. బుధవారం రాత్రి తన స్నేహితులతో కలిసి కాలినడకన ఆమె తిరుమల చేరుకున్నారు. ఈ ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు.
16/21
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ రూపొందించిన వర్చువల్ రియాలిటీ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ ‘లే మస్క్’ను సూపర్‌స్టార్‌ రజనీకాంత్ వీక్షించారు. ఆ ఫొటోను రెహమాన్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.	ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్‌ రెహమాన్‌ రూపొందించిన వర్చువల్ రియాలిటీ సినిమా ఎక్స్‌పీరియన్స్‌ ‘లే మస్క్’ను సూపర్‌స్టార్‌ రజనీకాంత్ వీక్షించారు. ఆ ఫొటోను రెహమాన్‌ తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు.
17/21
‘పుష్ప ద రైజ్‌’ ఈ నెల 8న రష్యాలో విడుదల కానుంది. అందులో భాగంగా మాస్కోలో నిర్వహించిన ప్రమోషన్‌ కార్యక్రమంలో అల్లు అర్జున్‌, రష్మిక పాల్గొని సందడి చేశారు.	‘పుష్ప ద రైజ్‌’ ఈ నెల 8న రష్యాలో విడుదల కానుంది. అందులో భాగంగా మాస్కోలో నిర్వహించిన ప్రమోషన్‌ కార్యక్రమంలో అల్లు అర్జున్‌, రష్మిక పాల్గొని సందడి చేశారు.
18/21
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ఏ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో తాజాగా ‘తిరగబడర స్వామి’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ క్లాప్‌ కొట్టారు.	రాజ్‌తరుణ్ కథానాయకుడిగా ఏ.ఎస్‌. రవికుమార్‌ చౌదరి దర్శకత్వంలో తాజాగా ‘తిరగబడర స్వామి’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా షూటింగ్‌ పూజా కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్‌ క్లాప్‌ కొట్టారు.
19/21
ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు	ప్రపంచ ఎయిడ్స్‌ దినం సందర్భంగా నెల్లూరులో నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న ట్రాన్స్‌జెండర్లు
20/21
హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ విస్తరణకు డిసెంబరు 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో తెలంగాణ పోలీస్‌ అకాడమీలో స్థల పరిశీలన చేశారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.	హైదరాబాద్‌ మెట్రో రైల్‌ రెండో దశ విస్తరణకు డిసెంబరు 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో తెలంగాణ పోలీస్‌ అకాడమీలో స్థల పరిశీలన చేశారు. హోంమంత్రి మహమూద్‌ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌, మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
21/21
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోని రూపఖేడి వద్ద సాగుతోంది. యాత్రలో బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ పాల్గొని రాహుల్‌కు సంఘీభావం తెలిపారు.	కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర మధ్యప్రదేశ్‌లోని రూపఖేడి వద్ద సాగుతోంది. యాత్రలో బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ పాల్గొని రాహుల్‌కు సంఘీభావం తెలిపారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు