News In Pics: చిత్రం చెప్పే సంగతులు-1 (02-12-2022)

Updated : 02 Dec 2022 13:18 IST
1/18
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు తెరాస మహిళా నేతలు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు తెరాస మహిళా నేతలు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు.
2/18
అడివి శేష్‌ కథానాయకుడిగా శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 2’ ఇవాళ విడుదలైంది. పబ్లిక్‌ టాక్‌ తెలుసుకొనేందుకు అడివి శేష్‌, మీనాక్షి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వద్దకు వెళ్లి సందడి చేశారు.  
అడివి శేష్‌ కథానాయకుడిగా శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 2’ ఇవాళ విడుదలైంది. పబ్లిక్‌ టాక్‌ తెలుసుకొనేందుకు అడివి శేష్‌, మీనాక్షి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వద్దకు వెళ్లి సందడి చేశారు.
3/18
నెల్లూరులో ఓ నూతన హోటల్‌ ప్రారంభోత్సవంలో సినీతారలు సందడి చేశారు. కృతిశెట్టి(బేబమ్మ), హెబ్బాపటేల్‌, సిమ్రాన్‌ చౌదరి, శివారెడ్డి, నిరుపమ్‌, బిగ్‌బాస్‌ ఫేంలు శ్యామల, అషూరెడ్డి, హిమజ, భాను, సిరి, అరియానా తదితరులు ప్రేక్షకులను అలరించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నెల్లూరులో ఓ నూతన హోటల్‌ ప్రారంభోత్సవంలో సినీతారలు సందడి చేశారు. కృతిశెట్టి(బేబమ్మ), హెబ్బాపటేల్‌, సిమ్రాన్‌ చౌదరి, శివారెడ్డి, నిరుపమ్‌, బిగ్‌బాస్‌ ఫేంలు శ్యామల, అషూరెడ్డి, హిమజ, భాను, సిరి, అరియానా తదితరులు ప్రేక్షకులను అలరించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
4/18
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం నుంచి మండలంలోని మహానంది ఫారం వరకు ఉన్న దారి అధ్వానంగా మారింది. గోతుల కారణంగా ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు ‘ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి’ కార్యక్రమం చేపట్టి గోతుల దారిపై వినూత్నంగా నిరసన తెలియజేశారు.  నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం నుంచి మండలంలోని మహానంది ఫారం వరకు ఉన్న దారి అధ్వానంగా మారింది. గోతుల కారణంగా ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు ‘ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి’ కార్యక్రమం చేపట్టి గోతుల దారిపై వినూత్నంగా నిరసన తెలియజేశారు.
5/18
ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయం గురువారం పసిడి కాంతులతో కనువిందు చేసింది. జీ20 దేశాల సమావేశాలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న సందర్భంగా దేశంలోని 100 చారిత్రక కట్టడాలను పురావస్తు శాఖ ఆధ్వర్యంలో విద్యుత్తు వెలుగులతో అలంకరించారు.   

ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలంలోని రామప్ప ఆలయం గురువారం పసిడి కాంతులతో కనువిందు చేసింది. జీ20 దేశాల సమావేశాలకు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనున్న సందర్భంగా దేశంలోని 100 చారిత్రక కట్టడాలను పురావస్తు శాఖ ఆధ్వర్యంలో విద్యుత్తు వెలుగులతో అలంకరించారు.
6/18
రామడుగు మండలం గోపాల్‌రావుపేట ఉన్నత పాఠశాలను గురువారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయుడి అవతారమెత్తి తొమ్మిది, పదో తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. అనంతరం పాఠశాలలో బయోమెట్రిక్‌ హాజరు నమోదు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు.  రామడుగు మండలం గోపాల్‌రావుపేట ఉన్నత పాఠశాలను గురువారం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయుడి అవతారమెత్తి తొమ్మిది, పదో తరగతి గదుల్లో పాఠాలు బోధించారు. అనంతరం పాఠశాలలో బయోమెట్రిక్‌ హాజరు నమోదు మొదలుపెట్టాలని అధికారులను ఆదేశించారు.
7/18
జీ-20 సదస్సు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాల్లో జీ-20 లోగోను ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం చార్మినార్‌ వద్ద లోగోను పురావస్తుశాఖ ప్రదర్శించింది.  జీ-20 సదస్సు నేపథ్యంలో దేశవ్యాప్తంగా 100 చారిత్రక ప్రదేశాల్లో జీ-20 లోగోను ప్రదర్శించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం చార్మినార్‌ వద్ద లోగోను పురావస్తుశాఖ ప్రదర్శించింది.
8/18
మంచిర్యాల జిల్లా జన్నారం సమీపంలోని వాగులో పెద్ద ఎత్తున కొంగలు, నీటి బాతుల గుంపు పొటీ పడుతూ చేపలను వేటాడాయి. ఈ గుంపు వరుసగా నీటిలో అటూఇటూ ఎగురుతూ నీటిలో ఉన్న చిన్న చేపలను నోట కరుచుకొని కొన్ని ఎగిరిపోతుంటే.. మరికొన్ని అక్కడే మింగేస్తున్నాయి. అటుగా వెళ్లేవారు వాహనాలు ఆపి కాసేపు చూశారు. మంచిర్యాల జిల్లా జన్నారం సమీపంలోని వాగులో పెద్ద ఎత్తున కొంగలు, నీటి బాతుల గుంపు పొటీ పడుతూ చేపలను వేటాడాయి. ఈ గుంపు వరుసగా నీటిలో అటూఇటూ ఎగురుతూ నీటిలో ఉన్న చిన్న చేపలను నోట కరుచుకొని కొన్ని ఎగిరిపోతుంటే.. మరికొన్ని అక్కడే మింగేస్తున్నాయి. అటుగా వెళ్లేవారు వాహనాలు ఆపి కాసేపు చూశారు.
9/18
చింతచెట్టు మరో వృక్షానికి చోటివ్వదంటారు పెద్దలు. ఇందుకు భిన్నంగా చింతచెట్టులో మొలిచిన ఓ వృక్షం దాని తలదన్నేలా రెండింతలు పెరిగి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని పార్‌పెల్లితండా నుంచి పార్‌పెల్లి వెళ్లే మార్గంలో చింత చెట్టులో మరో తెల్లమద్ది చెట్టు మొలిచింది. ఈ మార్గంలో ప్రయాణించే వారు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.


చింతచెట్టు మరో వృక్షానికి చోటివ్వదంటారు పెద్దలు. ఇందుకు భిన్నంగా చింతచెట్టులో మొలిచిన ఓ వృక్షం దాని తలదన్నేలా రెండింతలు పెరిగి ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తోంది. నిర్మల్‌ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని పార్‌పెల్లితండా నుంచి పార్‌పెల్లి వెళ్లే మార్గంలో చింత చెట్టులో మరో తెల్లమద్ది చెట్టు మొలిచింది. ఈ మార్గంలో ప్రయాణించే వారు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
10/18
నంద్యాల జిల్లా వెలుగోడులోని ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు కింద వంట గది, శౌచాలయం పనులు జరుగుతున్నాయి. నిర్మాణాలకు క్యూరింగ్ పనులను విద్యార్థులతో చేయిస్తున్నారు. పిల్లలు గోడలపై ఎక్కి ప్రమాదకరంగా నీళ్లు పడుతున్నారు. నంద్యాల జిల్లా వెలుగోడులోని ఇందిరానగర్‌ ప్రాథమిక పాఠశాలలో నాడు-నేడు కింద వంట గది, శౌచాలయం పనులు జరుగుతున్నాయి. నిర్మాణాలకు క్యూరింగ్ పనులను విద్యార్థులతో చేయిస్తున్నారు. పిల్లలు గోడలపై ఎక్కి ప్రమాదకరంగా నీళ్లు పడుతున్నారు.
11/18
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమికి ఈ చిత్రాలే నిదర్శనం. ఒకే గదిలో అయిదు తరగతులతో పాటు అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరంగల్‌ జిల్లా సంగెం మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఒకే ఆవరణలో ఉన్నాయి. పరదా కట్టి ఒకవైపు అయిదు తరగతులు మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల లేమికి ఈ చిత్రాలే నిదర్శనం. ఒకే గదిలో అయిదు తరగతులతో పాటు అంగన్‌వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు. వరంగల్‌ జిల్లా సంగెం మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల ఒకే ఆవరణలో ఉన్నాయి. పరదా కట్టి ఒకవైపు అయిదు తరగతులు మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు.
12/18
దోమల బెడదను తగ్గించలేని అధికారుల తీరుకు నిరసనగా కౌన్సిలరే పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి పురపాలిక మొదటి వార్డు కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌ స్వయంగా కాలనీల్లో దోమల మందు పిచికారీ చేశారు.  దోమల బెడదను తగ్గించలేని అధికారుల తీరుకు నిరసనగా కౌన్సిలరే పారిశుద్ధ్య కార్మికుడి అవతారమెత్తారు. ఎన్టీఆర్‌ జిల్లా కొండపల్లి పురపాలిక మొదటి వార్డు కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌ స్వయంగా కాలనీల్లో దోమల మందు పిచికారీ చేశారు.
13/18
గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లా ఉనా నియోజకవర్గం బనేజ్‌ పోలింగు కేంద్రంలో ఒక్క ఓటు కోసం ఈసీ పోలింగు బూత్‌ ఏర్పాటు చేసింది. మహంత్‌ హరిదాస్‌జీ ఉదాసీన్‌ ఈ కేంద్రంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లా ఉనా నియోజకవర్గం బనేజ్‌ పోలింగు కేంద్రంలో ఒక్క ఓటు కోసం ఈసీ పోలింగు బూత్‌ ఏర్పాటు చేసింది. మహంత్‌ హరిదాస్‌జీ ఉదాసీన్‌ ఈ కేంద్రంలో తన ఓటుహక్కు వినియోగించుకున్నారు
14/18
బాహ్య వలయ రహదారిలో ప్రమాదాలు, ట్రాఫిక్‌ జామ్‌ను నివారించడానికి వేగాన్ని బట్టి వెళ్లాల్సిన లేన్లను కేటాయించారు. నిర్దేశిత వేగం, సంబంధిత లేన్లను సూచించే డిజిటల్‌ సూచికలను ఔటర్‌ అప్పా కూడలి చెంత ఏర్పాటుచేశారు. బాహ్య వలయ రహదారిలో ప్రమాదాలు, ట్రాఫిక్‌ జామ్‌ను నివారించడానికి వేగాన్ని బట్టి వెళ్లాల్సిన లేన్లను కేటాయించారు. నిర్దేశిత వేగం, సంబంధిత లేన్లను సూచించే డిజిటల్‌ సూచికలను ఔటర్‌ అప్పా కూడలి చెంత ఏర్పాటుచేశారు.
15/18
పటాకుల పండుగ పోయింది.. పతంగుల వేడుక రానుంది..  సంక్రాంతికి నెలన్నర ముందునుంచే ధూల్‌పేటలో గాలిపటాల సందడి మొదలైంది. ఇక్కడి పలు కుటుంబాల్లోని చిన్నా పెద్దా పతంగులు, చరకాల తయారీలో నిమగ్నమయ్యారు. కొవిడ్‌తో రెండేళ్లపాటు అంతంతమాత్రంగా సాగిన వ్యాపారంపై ఈసారి కార్మికులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. పటాకుల పండుగ పోయింది.. పతంగుల వేడుక రానుంది.. సంక్రాంతికి నెలన్నర ముందునుంచే ధూల్‌పేటలో గాలిపటాల సందడి మొదలైంది. ఇక్కడి పలు కుటుంబాల్లోని చిన్నా పెద్దా పతంగులు, చరకాల తయారీలో నిమగ్నమయ్యారు. కొవిడ్‌తో రెండేళ్లపాటు అంతంతమాత్రంగా సాగిన వ్యాపారంపై ఈసారి కార్మికులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు.
16/18
 ఆర్టీసీ బస్సులు మొరాయించడం పరిపాటైంది. గురువారం ఉదయం 11 గంటలకు చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చిన విశాఖపట్నం డిపో బస్సు కదలనని మొరాయించింది. ఎంతకీ స్టార్ట్‌ కాకపోవడంతో బస్సు డ్రైవర్‌ విద్యార్థులను కాస్త సాయం చేయమని కోరాడు. దీంతో బస్సు దిగి కొందరు, కాంప్లెక్స్‌లో మరికొందరు విద్యార్థులు బస్సును తోయడంతో ముందుకు కదిలింది.
ఆర్టీసీ బస్సులు మొరాయించడం పరిపాటైంది. గురువారం ఉదయం 11 గంటలకు చోడవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు వచ్చిన విశాఖపట్నం డిపో బస్సు కదలనని మొరాయించింది. ఎంతకీ స్టార్ట్‌ కాకపోవడంతో బస్సు డ్రైవర్‌ విద్యార్థులను కాస్త సాయం చేయమని కోరాడు. దీంతో బస్సు దిగి కొందరు, కాంప్లెక్స్‌లో మరికొందరు విద్యార్థులు బస్సును తోయడంతో ముందుకు కదిలింది.
17/18
విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేటలో భారత్, ఇండోనేషియా కళాకారులతో నిర్వహించిన నృత్యమిలాన్‌ ఆకట్టుకుంది. శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లో గురువారం ఒడిస్సీ నృత్యకారిణి శ్రీరాధాపాల్, ఇండోనేషియాకు చెందిన కొరియోగ్రాఫర్‌ జోకో సుభిద్యో, నృత్యకారుడు సంజీవ్‌కుమార్‌ జీనా బృందం ప్రదర్శన ఇచ్చింది.  విశాఖపట్టణం జిల్లా పాయకరావుపేటలో భారత్, ఇండోనేషియా కళాకారులతో నిర్వహించిన నృత్యమిలాన్‌ ఆకట్టుకుంది. శ్రీప్రకాష్‌ విద్యానికేతన్‌లో గురువారం ఒడిస్సీ నృత్యకారిణి శ్రీరాధాపాల్, ఇండోనేషియాకు చెందిన కొరియోగ్రాఫర్‌ జోకో సుభిద్యో, నృత్యకారుడు సంజీవ్‌కుమార్‌ జీనా బృందం ప్రదర్శన ఇచ్చింది.
18/18
ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు ప్లకార్డులతో ముందుకు సాగారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనల్లో థింసా నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం విజయవాడలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులు ప్లకార్డులతో ముందుకు సాగారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనల్లో థింసా నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది.

మరిన్ని