News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (02-12-2022)

Updated : 02 Dec 2022 21:30 IST
1/24
హైదరాబాద్‌లోని అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో 1972 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు. స్కూల్ వదిలివెళ్లి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా రీయూనియన్ పేరుతో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్ విద్యార్థుల మాదిరిగా యూనిఫామ్‌ వేసుకొని తాము చదివిన తరగతి గదుల్లో కూర్చొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధుర స్మృతులేనని విశ్రాంత ఐపీఎస్ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు. హైదరాబాద్‌లోని అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ హైస్కూల్‌లో 1972 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు. స్కూల్ వదిలివెళ్లి 50ఏళ్లు పూర్తైన సందర్భంగా రీయూనియన్ పేరుతో గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్ విద్యార్థుల మాదిరిగా యూనిఫామ్‌ వేసుకొని తాము చదివిన తరగతి గదుల్లో కూర్చొని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మధుర స్మృతులేనని విశ్రాంత ఐపీఎస్ అధికారి దుర్గాప్రసాద్ అన్నారు.
2/24
విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ సిబ్బంది విన్యాసాలను చూస్తున్న ఓ చిన్నారి ఇలా సెల్యూట్‌ చేసి దేశభక్తిని చాటుకుంది. విశాఖ ఆర్కే బీచ్‌లో నేవీ సిబ్బంది విన్యాసాలను చూస్తున్న ఓ చిన్నారి ఇలా సెల్యూట్‌ చేసి దేశభక్తిని చాటుకుంది.
3/24
డిసెంబర్‌ 4న నిర్వహించనున్న నేవీ డే వేడుకల కోసం నేవీ సిబ్బంది విశాఖ ఆర్కే బీచ్‌లో రిహార్సల్స్‌ చేశారు. ఈ సందర్భంగా యుద్ధ హెలికాప్టర్లు, విమానాలతో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి నేవీ సిబ్బంది కుటుంబ సభ్యులు హాజరై విన్యాసాలను తిలకించారు. డిసెంబర్‌ 4న నిర్వహించనున్న నేవీ డే వేడుకల కోసం నేవీ సిబ్బంది విశాఖ ఆర్కే బీచ్‌లో రిహార్సల్స్‌ చేశారు. ఈ సందర్భంగా యుద్ధ హెలికాప్టర్లు, విమానాలతో చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి నేవీ సిబ్బంది కుటుంబ సభ్యులు హాజరై విన్యాసాలను తిలకించారు.
4/24
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌కు సంబంధించిన కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
5/24
హైదరాబాద్‌ బేగంపేటలోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో నూతన ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్లను లాంచ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లను రుచి చూశారు. హైదరాబాద్‌ బేగంపేటలోని ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌లో నూతన ఐస్‌క్రీమ్‌ ఫ్లేవర్లను లాంచ్‌ చేశారు. కార్యక్రమంలో పలువురు మోడల్స్‌ పాల్గొని వివిధ రకాల ఐస్‌క్రీమ్‌లను రుచి చూశారు.
6/24
అడివి శేష్‌, మీనాక్షి చౌదరి జంటగా నాని నిర్మించిన సినిమా ‘హిట్‌ 2’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అడివి శేష్‌, నాని సంబరాల్లో మునిగిపోయారు. అడివి శేష్‌, మీనాక్షి చౌదరి జంటగా నాని నిర్మించిన సినిమా ‘హిట్‌ 2’ శుక్రవారం విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో అడివి శేష్‌, నాని సంబరాల్లో మునిగిపోయారు.
7/24
జయంత్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఎస్‌డీటీ16(వర్కింగ్ టైటిల్‌)ను శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. జయంత్‌ దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ఎస్‌డీటీ16(వర్కింగ్ టైటిల్‌)ను శుక్రవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.
8/24
ముంబయిలో నిర్వహించిన ‘సర్కస్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో నటీనటులు రణ్‌వీర్‌సింగ్‌, పూజాహెగ్డే పాల్గొని నృత్యం చేస్తూ సందడి చేశారు.. ముంబయిలో నిర్వహించిన ‘సర్కస్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో నటీనటులు రణ్‌వీర్‌సింగ్‌, పూజాహెగ్డే పాల్గొని నృత్యం చేస్తూ సందడి చేశారు..
9/24
శ్రీనగర్‌లో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో అక్కడి రహదారులు, పరిసరాలు ఇలా మంచు దుప్పటి పరుచుకొని కనిపించాయి. శ్రీనగర్‌లో మంచు దట్టంగా కురుస్తోంది. దీంతో అక్కడి రహదారులు, పరిసరాలు ఇలా మంచు దుప్పటి పరుచుకొని కనిపించాయి.
10/24
తమిళనాడుకు చెందిన ‘లెటర్‌ డ్రాయింగ్‌’ కళాకారుడు గణేశ్‌ సుందర్‌.. మంత్రి కేటీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తెలుగు అక్షరాలతో మంత్రి కేటీఆర్‌ చిత్రాన్ని తీర్చిదిద్ది ట్విటర్‌లో పోస్టు చేశారు. అతని టాలెంట్‌ ప్రత్యేకమైందని తెలుపుతూ కేటీఆర్‌ కొనియాడారు. తమిళనాడుకు చెందిన ‘లెటర్‌ డ్రాయింగ్‌’ కళాకారుడు గణేశ్‌ సుందర్‌.. మంత్రి కేటీఆర్‌పై తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తెలుగు అక్షరాలతో మంత్రి కేటీఆర్‌ చిత్రాన్ని తీర్చిదిద్ది ట్విటర్‌లో పోస్టు చేశారు. అతని టాలెంట్‌ ప్రత్యేకమైందని తెలుపుతూ కేటీఆర్‌ కొనియాడారు.
11/24
తిరుపతి తాతయ్య గుంటలోని గంగమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనాన్ని నేటితో నిలిపేశారు. తిరిగి 2023 ఏప్రిల్ 10న కుంభాభిషేకం రోజు అమ్మవారు దర్శనమిస్తారు. అప్పటివరకు భక్తులు ఆలయ కోడి స్తంభం వద్ద బాలాలయాన్ని దర్శించుకోవచ్చు. తిరుపతి తాతయ్య గుంటలోని గంగమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అమ్మవారి దర్శనాన్ని నేటితో నిలిపేశారు. తిరిగి 2023 ఏప్రిల్ 10న కుంభాభిషేకం రోజు అమ్మవారు దర్శనమిస్తారు. అప్పటివరకు భక్తులు ఆలయ కోడి స్తంభం వద్ద బాలాలయాన్ని దర్శించుకోవచ్చు.
12/24
మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు దంపతులు శుక్రవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వారికి లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు దంపతులు శుక్రవారం విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు వారికి లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం అమ్మవారి ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు.
13/24
హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో డీఎస్సీ 2008 అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరుతూ వారి పిల్లలతో కలిసి ధర్నా చేశారు. హైదరాబాద్‌లోని ధర్నా చౌక్‌లో డీఎస్సీ 2008 అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని కోరుతూ వారి పిల్లలతో కలిసి ధర్నా చేశారు.
14/24
కడప జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్‌లో బోటింగ్‌ జెట్టీలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బోటులో విహరించి పరిసర అందాలను తిలకించారు. కడప జిల్లాలోని చిత్రావతి రిజర్వాయర్‌లో బోటింగ్‌ జెట్టీలను సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బోటులో విహరించి పరిసర అందాలను తిలకించారు.
15/24
సోమాజీగూడలోని విల్లా మేరీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ‘ది విల్లా కాన్‌క్లేవ్ 2022’ పేరిట పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినులు నాటకాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. టేబుల్ టెన్నిస్, చెస్‌ తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. సోమాజీగూడలోని విల్లా మేరీ మహిళా డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ‘ది విల్లా కాన్‌క్లేవ్ 2022’ పేరిట పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థినులు నాటకాలు, నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. టేబుల్ టెన్నిస్, చెస్‌ తదితర పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
16/24
ఇటీవల ఏపీ రాష్ట్ర సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల ఏపీ రాష్ట్ర సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జవహర్‌రెడ్డి.. గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. గవర్నర్‌ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
17/24
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జన్మదినం సందర్భంగా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్మల్‌ జిల్లా నందన్ గ్రామంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా జన్మదినం సందర్భంగా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్మల్‌ జిల్లా నందన్ గ్రామంలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు.
18/24
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. వర్తమాన రాజకీయ అంశాలపై వారు చర్చించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. వర్తమాన రాజకీయ అంశాలపై వారు చర్చించారు.
19/24
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని రాక్ గార్డెన్లో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, ఎంపీ లక్ష్మణ్‌, డీకే అరుణ తదితరులు నివాళి అర్పించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని రాక్ గార్డెన్లో మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, ఎంపీ లక్ష్మణ్‌, డీకే అరుణ తదితరులు నివాళి అర్పించారు.
20/24
ఈ చిత్రంలో కన్పిస్తున్న యువతి పేరు భాగ్య. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు గ్రామానికి చెందిన ఈమె పుట్టుకతోనే దివ్యాంగురాలు. అయితేనేం.. కళలపై అమితమైన ఆసక్తి ఉంది. దాంతో తెలుగు యూనివర్సిటీలోని జానపద కళల శాఖలో చేరి పీజీ చేస్తోంది. పట్టుదలతో నృత్యం నేర్చుకొని యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో ఇలా ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ చిత్రంలో కన్పిస్తున్న యువతి పేరు భాగ్య. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు గ్రామానికి చెందిన ఈమె పుట్టుకతోనే దివ్యాంగురాలు. అయితేనేం.. కళలపై అమితమైన ఆసక్తి ఉంది. దాంతో తెలుగు యూనివర్సిటీలోని జానపద కళల శాఖలో చేరి పీజీ చేస్తోంది. పట్టుదలతో నృత్యం నేర్చుకొని యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో ఇలా ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించింది.
21/24
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు తెరాస మహిళా నేతలు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు.	హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు తెరాస మహిళా నేతలు ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు ఉత్సాహం కనబరిచారు.
22/24
అడివి శేష్‌ కథానాయకుడిగా శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 2’ ఇవాళ విడుదలైంది. పబ్లిక్‌ టాక్‌ తెలుసుకొనేందుకు అడివి శేష్‌, మీనాక్షి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వద్దకు వెళ్లి సందడి చేశారు.	అడివి శేష్‌ కథానాయకుడిగా శైలేష్‌ కొలను తెరకెక్కించిన చిత్రం ‘హిట్‌ 2’ ఇవాళ విడుదలైంది. పబ్లిక్‌ టాక్‌ తెలుసుకొనేందుకు అడివి శేష్‌, మీనాక్షి హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమ్యాక్స్‌ వద్దకు వెళ్లి సందడి చేశారు.
23/24
నెల్లూరులో ఓ నూతన హోటల్‌ ప్రారంభోత్సవంలో సినీతారలు సందడి చేశారు. కృతిశెట్టి(బేబమ్మ), హెబ్బాపటేల్‌, సిమ్రాన్‌ చౌదరి, శివారెడ్డి, నిరుపమ్‌, బిగ్‌బాస్‌ ఫేంలు శ్యామల, అషూరెడ్డి, హిమజ, భాను, సిరి, అరియానా తదితరులు ప్రేక్షకులను అలరించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.	నెల్లూరులో ఓ నూతన హోటల్‌ ప్రారంభోత్సవంలో సినీతారలు సందడి చేశారు. కృతిశెట్టి(బేబమ్మ), హెబ్బాపటేల్‌, సిమ్రాన్‌ చౌదరి, శివారెడ్డి, నిరుపమ్‌, బిగ్‌బాస్‌ ఫేంలు శ్యామల, అషూరెడ్డి, హిమజ, భాను, సిరి, అరియానా తదితరులు ప్రేక్షకులను అలరించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
24/24
నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం నుంచి మండలంలోని మహానంది ఫారం వరకు ఉన్న దారి అధ్వానంగా మారింది. గోతుల కారణంగా ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు ‘ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి’ కార్యక్రమం చేపట్టి గోతుల దారిపై వినూత్నంగా నిరసన తెలియజేశారు.	నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రం నుంచి మండలంలోని మహానంది ఫారం వరకు ఉన్న దారి అధ్వానంగా మారింది. గోతుల కారణంగా ప్రజలు నిత్యం ప్రమాదాల బారిన పడుతున్నారు. దీంతో స్థానిక తెదేపా నాయకులు, కార్యకర్తలు ‘ఇదేం ఖర్మ- మన రాష్ట్రానికి’ కార్యక్రమం చేపట్టి గోతుల దారిపై వినూత్నంగా నిరసన తెలియజేశారు.

మరిన్ని