News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (03-12-2022)

Updated : 03 Dec 2022 20:19 IST
1/20
హైదరాబాద్‌ నగర శివారు పీర్జాదిగూడలో తాటి చెట్టు తొర్రలో నుంచి బయటకు చూస్తున్న గుడ్లగూబ ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది హైదరాబాద్‌ నగర శివారు పీర్జాదిగూడలో తాటి చెట్టు తొర్రలో నుంచి బయటకు చూస్తున్న గుడ్లగూబ ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది
2/20
ప్రకాశం జిల్లాలోని యర్రగొండ పాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వందల అడుగుల లోతు బోర్లు వేస్తున్నా నీరు రావడం లేదు. దీంతో మిర్చి రైతులు కొందరు కలిసి పంటలను కాపాడుకునేందుకు నెలకు లారీ ట్యాంకర్‌కు రూ.1.30లక్షల అద్దె ఇచ్చి 15కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలువ నుంచి నీటిని తెప్పిస్తున్నారు. డీజిల్‌, డ్రైవర్‌ ఖర్చులు దీనికి అదనం. చిన్న, సన్నకారు రైతులు రోజుకు ఒక్కో ట్రాక్టరుకు రూ.300 చొప్పున చెల్లించి పంటలు తడుపుతున్నారు. పలువురు రైతులు ఈ నీటిని కుంటల్లో నిలిపి ఉంచి బిందు సేద్యం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలోని యర్రగొండ పాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం మండలాల్లోని కొన్ని గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. వందల అడుగుల లోతు బోర్లు వేస్తున్నా నీరు రావడం లేదు. దీంతో మిర్చి రైతులు కొందరు కలిసి పంటలను కాపాడుకునేందుకు నెలకు లారీ ట్యాంకర్‌కు రూ.1.30లక్షల అద్దె ఇచ్చి 15కిలోమీటర్ల దూరంలో ఉన్న కాలువ నుంచి నీటిని తెప్పిస్తున్నారు. డీజిల్‌, డ్రైవర్‌ ఖర్చులు దీనికి అదనం. చిన్న, సన్నకారు రైతులు రోజుకు ఒక్కో ట్రాక్టరుకు రూ.300 చొప్పున చెల్లించి పంటలు తడుపుతున్నారు. పలువురు రైతులు ఈ నీటిని కుంటల్లో నిలిపి ఉంచి బిందు సేద్యం చేస్తున్నారు.
3/20
ఇనుప విద్యుత్తు స్తంభాలతో ప్రమాదాలు సంభవించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన జయేంద్ర పాటస్కర్‌ అప్రమత్తమై శాంతినగర్‌లోని తన ప్రైవేటు పాఠశాల ఎదుట ఉన్న విద్యత్తు స్తంభానికి నాలుగు వైపులా చెక్క పలకలతో రక్షణ ఏర్పాటు చేశారు. ఇనుప విద్యుత్తు స్తంభాలతో ప్రమాదాలు సంభవించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన జయేంద్ర పాటస్కర్‌ అప్రమత్తమై శాంతినగర్‌లోని తన ప్రైవేటు పాఠశాల ఎదుట ఉన్న విద్యత్తు స్తంభానికి నాలుగు వైపులా చెక్క పలకలతో రక్షణ ఏర్పాటు చేశారు.
4/20
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడి రథోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా స్వామి నామస్మరణతో మార్మోగింది. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడి రథోత్సవానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా స్వామి నామస్మరణతో మార్మోగింది.
5/20
తన తండ్రి కృష్ణ మృతి కారణంగా కొన్ని రోజుల విరామం తీసుకున్న మహేశ్‌బాబు తిరిగి షూటింగ్‌లు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆయన ‘బ్యాక్‌ టు వర్క్‌’ అని పోస్టు పెట్టారు. తన తండ్రి కృష్ణ మృతి కారణంగా కొన్ని రోజుల విరామం తీసుకున్న మహేశ్‌బాబు తిరిగి షూటింగ్‌లు మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న ఆయన ‘బ్యాక్‌ టు వర్క్‌’ అని పోస్టు పెట్టారు.
6/20
శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.
7/20
బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గరెత్‌ వియిన్‌ ఓవెన్‌ శనివారం చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టును సందర్శించారు. ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2022’ పురస్కారాన్ని పొందినందుకు మెగాస్టార్‌ను ఆయన అభినందించారు. బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గరెత్‌ వియిన్‌ ఓవెన్‌ శనివారం చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్టును సందర్శించారు. ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2022’ పురస్కారాన్ని పొందినందుకు మెగాస్టార్‌ను ఆయన అభినందించారు.
8/20
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దివ్యాంగులు ఇచ్చిన సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆసాంతం రంజింపజేశాయి. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో దివ్యాంగులు ఇచ్చిన సాంస్కృతిక, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఆసాంతం రంజింపజేశాయి.
9/20
రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంతో పాటు హీరోగా నటించిన సినిమా ‘కాంతార’. ఈ చిత్రం విజయవంతంగా 50రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల ‘కాంతార’ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది. రిషబ్‌ శెట్టి స్వీయ దర్శకత్వంతో పాటు హీరోగా నటించిన సినిమా ‘కాంతార’. ఈ చిత్రం విజయవంతంగా 50రోజులు పూర్తి చేసుకుంది. ఇటీవల ‘కాంతార’ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలై ప్రేక్షకులను అలరిస్తోంది.
10/20
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్మల్‌ జిల్లా దిల్వార్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివ్యాంగులతో ముచ్చటించారు. అనంతరం వారికి బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్మల్‌ జిల్లా దిల్వార్పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దివ్యాంగులతో ముచ్చటించారు. అనంతరం వారికి బ్యాగులు, పుస్తకాలను పంపిణీ చేశారు.
11/20
తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడి ఆలయంలో రథోత్సవం సందర్భంగా ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని భక్తుల కోలాహలం మధ్య ఘనంగా ఊరేగించారు. తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వరుడి ఆలయంలో రథోత్సవం సందర్భంగా ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని భక్తుల కోలాహలం మధ్య ఘనంగా ఊరేగించారు.
12/20
వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఊరేగింపు. వల్లి, దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఊరేగింపు.
13/20
భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య వన్డే సిరీస్‌ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించారు. భారత్‌, బంగ్లాదేశ్‌ మధ్య వన్డే సిరీస్‌ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల కెప్టెన్లు ట్రోఫీని ఆవిష్కరించారు.
14/20
బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12, 2023న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
15/20
హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఇరిగేషన్ శాఖ(గజ్వేల్) ఈఎన్సీ హరిరామ్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్‌లో శనివారం జరిగిన ఇరిగేషన్ శాఖ(గజ్వేల్) ఈఎన్సీ హరిరామ్ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నారు.
16/20
శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌లోని గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల హైదరాబాద్‌లోని గన్‌పార్కు అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.
17/20
‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు (RRR) మరో ఘనత దక్కింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్’ అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు (RRR) మరో ఘనత దక్కింది. హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది న్యూయార్క్‌ ఫిల్మ్‌ క్రిటిక్స్‌ సర్కిల్’ అవార్డు ఈ చిత్రాన్ని వరించింది. అమెరికాలో తాజాగా నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఈ అవార్డు సొంతం చేసుకున్నారు..
18/20
భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. భారతదేశ మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు.
19/20
తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్‌కు తీర్థప్రసాదాలను అందజేశారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం గవర్నర్‌కు తీర్థప్రసాదాలను అందజేశారు.
20/20
పులివెందులలోని ఎస్సీఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్‌ కుమార్తె వివాహ వేడుకను నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. పులివెందులలోని ఎస్సీఎస్‌ఆర్‌ కళ్యాణ మండపంలో సీఎం వ్యక్తిగత కార్యదర్శి రవిశేఖర్‌ కుమార్తె వివాహ వేడుకను నిర్వహించారు. కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు