News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (04-12-2022)

Updated : 04 Dec 2022 21:44 IST
1/22
గత వారం ‘ఇఫీ’ ఉత్సవాల కోసం గోవా వెళ్లిన ప్రముఖ నటుడు చిరంజీవిని అక్కడి నేవీ అధికారులు కలిసి ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోను చిరంజీవి ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఘటనతో తనకు గతంలో ఎన్‌సీసీలో నేవీ క్యాడెట్‌గా సేవలందించిన రోజులు గుర్తుకొచ్చాయని తెలుపుతూ పోస్టు పెట్టారు. గత వారం ‘ఇఫీ’ ఉత్సవాల కోసం గోవా వెళ్లిన ప్రముఖ నటుడు చిరంజీవిని అక్కడి నేవీ అధికారులు కలిసి ఫొటో దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోను చిరంజీవి ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఘటనతో తనకు గతంలో ఎన్‌సీసీలో నేవీ క్యాడెట్‌గా సేవలందించిన రోజులు గుర్తుకొచ్చాయని తెలుపుతూ పోస్టు పెట్టారు.
2/22
తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారికి ఆదివారం తితిదే అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న తితిదే అధికారులకు శ్రీరంగం ఆలయ జాయింట్‌ కమిషనర్‌ మారిముత్తు, ప్రధానార్చకులు సుందరభట్టర్‌ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రంలో ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామివారికి ఆదివారం తితిదే అధికారులు పట్టువస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న తితిదే అధికారులకు శ్రీరంగం ఆలయ జాయింట్‌ కమిషనర్‌ మారిముత్తు, ప్రధానార్చకులు సుందరభట్టర్‌ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
3/22
ప్రపంచ మట్టి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ శంషాబాద్‌లోని మియావాకీ ఫారెస్టులో సైక్లింగ్‌ రైడ్‌, రన్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటి రెజీనా హాజరై సరదాగా డప్పుకొట్టి సందడి చేశారు. ప్రపంచ మట్టి దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ శంషాబాద్‌లోని మియావాకీ ఫారెస్టులో సైక్లింగ్‌ రైడ్‌, రన్‌ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సినీనటి రెజీనా హాజరై సరదాగా డప్పుకొట్టి సందడి చేశారు.
4/22
ఈ నెల 25న క్రిస్మస్‌ పర్వదినం ఉండటంతో పలువురు మియాపూర్‌లోని దుకాణాల్లో అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తూ సందడి చేశారు. ఈ నెల 25న క్రిస్మస్‌ పర్వదినం ఉండటంతో పలువురు మియాపూర్‌లోని దుకాణాల్లో అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తూ సందడి చేశారు.
5/22
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రెండో విడత గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌ చేరుకున్న ఆయన.. తల్లి హీరాబెన్‌ మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రెండో విడత గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌ చేరుకున్న ఆయన.. తల్లి హీరాబెన్‌ మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు.
6/22
నేవీ డే వేడుకల్లో భాగంగా నేవీ సిబ్బంది విశాఖ ఆర్కే బీచ్‌లో విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా యుద్ధ హెలికాప్టర్లు, విమానాలతో చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విన్యాసాలను తిలకించారు. నేవీ డే వేడుకల్లో భాగంగా నేవీ సిబ్బంది విశాఖ ఆర్కే బీచ్‌లో విన్యాసాలు చేశారు. ఈ సందర్భంగా యుద్ధ హెలికాప్టర్లు, విమానాలతో చేసిన ప్రదర్శన చూపరులను ఆకట్టుకుంది. కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విన్యాసాలను తిలకించారు.
7/22
8/22
హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో ఓ నూతన బేకరీని సినీ నటి రాశీసింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌ నానక్‌రాంగూడలో ఓ నూతన బేకరీని సినీ నటి రాశీసింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
9/22
గుజరాత్‌లో సోమవారం నిర్వహించనున్న రెండో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు ఈవీఎంలు తదితర సామగ్రిని తీసుకొని పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరారు. గుజరాత్‌లో సోమవారం నిర్వహించనున్న రెండో విడత అసెంబ్లీ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు ఈవీఎంలు తదితర సామగ్రిని తీసుకొని పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరారు.
10/22
‘అవతార్‌2’ కథానాయిక జోయా సాల్డానా లండన్‌లో నిర్వహించిన సినిమా ప్రమోషన్స్‌లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ‘అవతార్‌2’ ఈ నెల 16న థియేటర్లలో విడుదల కానుంది. ‘అవతార్‌2’ కథానాయిక జోయా సాల్డానా లండన్‌లో నిర్వహించిన సినిమా ప్రమోషన్స్‌లో ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. ‘అవతార్‌2’ ఈ నెల 16న థియేటర్లలో విడుదల కానుంది.
11/22
ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఓ పడవ చుట్టూ పక్షులు ఇలా విహరిస్తూ కనిపించాయి. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడానికి వచ్చిన పలువురు భక్తులు దీన్ని ఆసక్తిగా గమనించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద ఓ పడవ చుట్టూ పక్షులు ఇలా విహరిస్తూ కనిపించాయి. ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయడానికి వచ్చిన పలువురు భక్తులు దీన్ని ఆసక్తిగా గమనించారు.
12/22
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఆదివారం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
13/22
హైదరాబాద్‌లోని జీడిమెట్ల-నర్సాపూర్ రహదారిపై ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులుపడ్డారు. దుండిగల్ రింగు రోడ్డు వద్ద ఈ చిత్రం కనిపించింది. హైదరాబాద్‌లోని జీడిమెట్ల-నర్సాపూర్ రహదారిపై ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేయడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులుపడ్డారు. దుండిగల్ రింగు రోడ్డు వద్ద ఈ చిత్రం కనిపించింది.
14/22
ఇండోనేసియాలోని లుమజాంగ్‌లో మౌంట్‌ సెమెరు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో దాని నుంచి పెద్దఎత్తున పొగ, వాయువులు, దుమ్ము, లావా వెలువడుతోంది. ఇండోనేసియాలోని లుమజాంగ్‌లో మౌంట్‌ సెమెరు అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో దాని నుంచి పెద్దఎత్తున పొగ, వాయువులు, దుమ్ము, లావా వెలువడుతోంది.
15/22
గీతా జయంతిని పురస్కరించుకొని ఆదివారం తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఇందులో భాగంగా పండితులు భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలను పారాయణం చేశారు. గీతా జయంతిని పురస్కరించుకొని ఆదివారం తిరుమలలోని నాద నీరాజనం వేదికపై అఖండ భగవద్గీత పారాయణం నిర్వహించారు. ఇందులో భాగంగా పండితులు భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో 700 శ్లోకాలను పారాయణం చేశారు.
16/22
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నిర్వహించిన బీఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే వేడుకల్లో సైనికులు ద్విచక్రవాహనాలపై అదరగొట్టే విన్యాసాలు చేశారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నిర్వహించిన బీఎస్‌ఎఫ్‌ రైజింగ్‌ డే వేడుకల్లో సైనికులు ద్విచక్రవాహనాలపై అదరగొట్టే విన్యాసాలు చేశారు.
17/22
స్టూవర్ట్‌పురం దొంగగా పోలీస్‌ రికార్డులకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా... అదే పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ కథానాయకుడు. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి రేణు దేశాయ్‌ ‘హేమలత లవణం’ అనే పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సెట్లో కేక్‌ కట్‌ చేసి వేడుక చేసుకున్నారు. స్టూవర్ట్‌పురం దొంగగా పోలీస్‌ రికార్డులకెక్కిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ జీవిత కథ ఆధారంగా... అదే పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కుతోంది. రవితేజ కథానాయకుడు. నుపుర్‌ సనన్‌, గాయత్రి భరద్వాజ్‌ కథానాయికలు. వంశీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటి రేణు దేశాయ్‌ ‘హేమలత లవణం’ అనే పాత్రలో నటిస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా సెట్లో కేక్‌ కట్‌ చేసి వేడుక చేసుకున్నారు.
18/22
ఏపీ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏపీ పర్యటనకు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలుకుతున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం జగన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
19/22
భారత నేవీ డే వేడుకలు విశాఖతీరంలో ప్రారంభమయ్యాయి. సముద్ర తీరంలోని యుద్ధ స్తూపం వద్ద అమర జవాన్లకు తూర్పు నావికాదళం నివాళి అర్పించింది. అమరజవాన్ జ్యోతి ఎదుట తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా నివాళి అర్పించారు. భారత నేవీ డే వేడుకలు విశాఖతీరంలో ప్రారంభమయ్యాయి. సముద్ర తీరంలోని యుద్ధ స్తూపం వద్ద అమర జవాన్లకు తూర్పు నావికాదళం నివాళి అర్పించింది. అమరజవాన్ జ్యోతి ఎదుట తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిశ్వజిత్ దాస్ గుప్తా నివాళి అర్పించారు.
20/22
దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెలవు దినమైన నేడు దిల్లీ ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజధాని దిల్లీలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ సందర్భంగా దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సెలవు దినమైన నేడు దిల్లీ ప్రజలంతా ఓటింగ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
21/22
పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్‌ను డీవీవీ ఎంటర్‌టైనర్స్‌ విడుదల చేసింది. దీనికి సుజిత్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ దీనిని షేర్‌ చేస్తూ తెగ ఆనందపడుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్‌ను డీవీవీ ఎంటర్‌టైనర్స్‌ విడుదల చేసింది. దీనికి సుజిత్‌ దర్శకుడు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ఫ్యాన్స్‌ దీనిని షేర్‌ చేస్తూ తెగ ఆనందపడుతున్నారు.
22/22
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తయినట్లు ప్రకటిస్తూ ఈ ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీత పనుల్లో నిమగ్నమైనట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది. నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. మ్యూజిక్‌ కంపోజిషన్‌ పూర్తయినట్లు ప్రకటిస్తూ ఈ ఫొటోను చిత్రబృందం విడుదల చేసింది. సంగీత దర్శకుడు తమన్ నేపథ్య సంగీత పనుల్లో నిమగ్నమైనట్లు వెల్లడించింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని