News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (05-12-2022)

Updated : 05 Dec 2022 20:53 IST
1/19
హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో సుందరీకరించిన మెట్లబావిని మంత్రి కేటీఆర్‌ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో సుందరీకరించిన మెట్లబావిని మంత్రి కేటీఆర్‌ సోమవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.
2/19
బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో సోమవారం నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన టికెట్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీనటి స్నేహాగుప్తా పాల్గొని సినిమా పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు. బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో సోమవారం నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన టికెట్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సినీనటి స్నేహాగుప్తా పాల్గొని సినిమా పాటలకు స్టెప్పులేస్తూ సందడి చేశారు.
3/19
మిలమిల మెరుస్తున్న ఈ వస్తువులన్నీ బంగారంతో చేసినవేం కాదు! వాహనాలకు సంబంధించిన వస్తువులు దెబ్బతిని నిరుపయోగంగా మారగా.. వాటితో ఇలా కళాఖండాలను తీర్చిదిద్ది హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శనకు ఉంచారు. బతుకమ్మ, చార్మినార్, ఒగ్గు డోలు వంటి కళారూపాల ఆకృతులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మిలమిల మెరుస్తున్న ఈ వస్తువులన్నీ బంగారంతో చేసినవేం కాదు! వాహనాలకు సంబంధించిన వస్తువులు దెబ్బతిని నిరుపయోగంగా మారగా.. వాటితో ఇలా కళాఖండాలను తీర్చిదిద్ది హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శనకు ఉంచారు. బతుకమ్మ, చార్మినార్, ఒగ్గు డోలు వంటి కళారూపాల ఆకృతులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
4/19
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు ఫ్లాష్‌ మాబ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన నృత్య ప్రదర్శన ఆసాంతం చూపరులను ఆకట్టుకుంది. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలోని ఇంజినీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు ఫ్లాష్‌ మాబ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఇచ్చిన నృత్య ప్రదర్శన ఆసాంతం చూపరులను ఆకట్టుకుంది.
5/19
ఫ్లాష్‌ మాబ్‌లో పాల్గొన్న విద్యార్థులు ఫ్లాష్‌ మాబ్‌లో పాల్గొన్న విద్యార్థులు
6/19
అంతర్జాతీయ మట్టి దినోత్సవం సందర్భంగా ‘మట్టిని రక్షించు(సేవ్‌ సాయిల్‌)’ వాలంటీర్లు హైదరాబాద్‌లోని చార్మినార్, ఉస్మానియా క్యాంపస్‌, శిల్పారామం, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో మట్టి క్షీణతపై అవగాహన కల్పించారు. అంతర్జాతీయ మట్టి దినోత్సవం సందర్భంగా ‘మట్టిని రక్షించు(సేవ్‌ సాయిల్‌)’ వాలంటీర్లు హైదరాబాద్‌లోని చార్మినార్, ఉస్మానియా క్యాంపస్‌, శిల్పారామం, ట్యాంక్‌బండ్‌ తదితర ప్రాంతాల్లో మట్టి క్షీణతపై అవగాహన కల్పించారు.
7/19
8/19
సెయింట్‌ నికోలస్‌ డే వేడుకల్లో భాగంగా జర్మనీలోని టోయింగ్‌లో ఓ డైవర్‌ సాంటాక్లాజ్‌ వేషధారణలో అక్వేరియంలోని చేపలకు మేతను అందించారు. సెయింట్‌ నికోలస్‌ డే వేడుకల్లో భాగంగా జర్మనీలోని టోయింగ్‌లో ఓ డైవర్‌ సాంటాక్లాజ్‌ వేషధారణలో అక్వేరియంలోని చేపలకు మేతను అందించారు.
9/19
ఓ తల్లి తన కుమార్తెను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లే సమయంలో ద్విచక్రవాహనం పైనుంచి కింద పడకుండా ఉండేందుకు చున్నీతో ఇలా కట్టి జాగ్రత్తగా తీసుకెళ్లింది. నల్గొండలోని దేవరకొండ రోడ్డులో ఈ చిత్రం కనిపించింది. ఓ తల్లి తన కుమార్తెను పాఠశాల నుంచి ఇంటికి తీసుకెళ్లే సమయంలో ద్విచక్రవాహనం పైనుంచి కింద పడకుండా ఉండేందుకు చున్నీతో ఇలా కట్టి జాగ్రత్తగా తీసుకెళ్లింది. నల్గొండలోని దేవరకొండ రోడ్డులో ఈ చిత్రం కనిపించింది.
10/19
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆమెకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
11/19
లండన్‌లోని కింగ్‌ క్రాస్‌ స్టేషన్‌ వద్ద ‘హోమ్‌లెస్‌ ఛారిటీ క్రైసిస్‌’ సంస్థ 4.3 మీటర్ల ఎత్తైన నిరాశ్రయుడి విగ్రహాన్ని ఆవిష్కరించింది. 17మంది వ్యక్తుల ముఖ కవళికలను వినియోగించి అధునాతన ఫేస్‌మ్యాపింగ్‌ టెక్నాలజీ సహాయంతో సహజత్వం ఉట్టిపడేలా దీన్ని తీర్చిదిద్దారు. లండన్‌లోని కింగ్‌ క్రాస్‌ స్టేషన్‌ వద్ద ‘హోమ్‌లెస్‌ ఛారిటీ క్రైసిస్‌’ సంస్థ 4.3 మీటర్ల ఎత్తైన నిరాశ్రయుడి విగ్రహాన్ని ఆవిష్కరించింది. 17మంది వ్యక్తుల ముఖ కవళికలను వినియోగించి అధునాతన ఫేస్‌మ్యాపింగ్‌ టెక్నాలజీ సహాయంతో సహజత్వం ఉట్టిపడేలా దీన్ని తీర్చిదిద్దారు.
12/19
గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. వడోదరలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. వడోదరలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
13/19
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడటంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో మాట్లాడటంతో పాటు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు..
14/19
ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్‌ బెలూగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది. తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం సోమవారం సాయంత్రం 7.20గంటల వరకు ఇక్కడ ఉండనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఎయిర్‌బస్‌ బెలూగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయింది. తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం సోమవారం సాయంత్రం 7.20గంటల వరకు ఇక్కడ ఉండనుంది.
15/19
విశ్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన ‘హిట్‌’ విజయవంతమైంది. తాజాగా అడివి శేష్‌ కథానాయకుడిగా ‘హిట్‌ 2’ విడుదలైంది. సినిమా చివర్లో ‘హిట్‌ 3’ నాని హీరోగా తెరకెక్కిస్తామని చిత్రబృందం హింట్‌ ఇచ్చింది. దర్శకుడితో కలిసి ఈ ముగ్గురు హీరోలు ఒక చోట చేరిన ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది. విశ్వక్‌సేన్‌ హీరోగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన ‘హిట్‌’ విజయవంతమైంది. తాజాగా అడివి శేష్‌ కథానాయకుడిగా ‘హిట్‌ 2’ విడుదలైంది. సినిమా చివర్లో ‘హిట్‌ 3’ నాని హీరోగా తెరకెక్కిస్తామని చిత్రబృందం హింట్‌ ఇచ్చింది. దర్శకుడితో కలిసి ఈ ముగ్గురు హీరోలు ఒక చోట చేరిన ఈ చిత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
16/19
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బాసర ‘వేద భారతి పీఠ’ వేద విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వేద విద్యార్థుల నుంచి ఆశీర్వచనం పొందారు. భాజపా అధికారంలోకి వస్తే వేద పాఠశాలల సంఖ్య మరింతగా పెంచేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.	ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బాసర ‘వేద భారతి పీఠ’ వేద విద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వేద విద్యార్థుల నుంచి ఆశీర్వచనం పొందారు. భాజపా అధికారంలోకి వస్తే వేద పాఠశాలల సంఖ్య మరింతగా పెంచేందుకు కృషి చేస్తామని ప్రకటించారు.
17/19
జమ్మూలో చలి తీవ్రత క్రమేణ పెరుగుతోంది. దీంతో వేకువజామునే పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దులోని రణ్‌బీర్‌ సింగ్‌ పురాలో కనిపించాయి ఈ చిత్రాలు.. జమ్మూలో చలి తీవ్రత క్రమేణ పెరుగుతోంది. దీంతో వేకువజామునే పొలాలకు వెళ్లే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారత్‌-పాక్‌ సరిహద్దులోని రణ్‌బీర్‌ సింగ్‌ పురాలో కనిపించాయి ఈ చిత్రాలు..
18/19
నాంపల్లి మెట్రో స్టేషన్‌ వద్ద పావురాలు గుంపులుగుంపులుగా ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి. పలువురు సందర్శకులు తమ చిన్నారులతో వచ్చి వాటికి ఆహారంగా ధాన్యపు గింజలు వేస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.	నాంపల్లి మెట్రో స్టేషన్‌ వద్ద పావురాలు గుంపులుగుంపులుగా ఎగురుతూ కనువిందు చేస్తున్నాయి. పలువురు సందర్శకులు తమ చిన్నారులతో వచ్చి వాటికి ఆహారంగా ధాన్యపు గింజలు వేస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ మురిసిపోతున్నారు.
19/19
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఇస్తీకఫాల్‌ స్వాగతం పలికారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.	రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, అర్చకులు ఆమెకు ఇస్తీకఫాల్‌ స్వాగతం పలికారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

మరిన్ని