News In Pics: చిత్రం చెప్పే సంగతులు (08-12-2022)

Updated : 08 Dec 2022 12:31 IST
1/22
అడివి శేష్‌ కథానాయకుడిగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన ‘హిట్‌ 2’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయయాత్రలో భాగంగా చిత్రబృందం రాజమహేంద్రవరం వెళ్లింది. జ్ఞాపకం కోసం అక్కడి కళాశాల విద్యార్థులతో నటీనటులు, దర్శకుడు ఇలా సెల్ఫీ తీసుకున్నారు. అడివి శేష్‌ కథానాయకుడిగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన ‘హిట్‌ 2’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయయాత్రలో భాగంగా చిత్రబృందం రాజమహేంద్రవరం వెళ్లింది. జ్ఞాపకం కోసం అక్కడి కళాశాల విద్యార్థులతో నటీనటులు, దర్శకుడు ఇలా సెల్ఫీ తీసుకున్నారు.
2/22
మలక్‌పేట మూసారాంబాగ్‌ కూడలిలో రెండు ట్రాక్టర్లు బండరాళ్లను ఇలా అంబర్‌పేట నుంచి తరలిస్తున్నాయి. అవి జారి రోడ్డుపై పడేలా ఉండటంతో ఇతర వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. అసలే ట్రాఫిక్‌ అధికంగా ఉండే ప్రాంతంలో ఇలా ఇష్టారాజ్యంగా వెళ్తున్నా  పోలీసులు పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. మలక్‌పేట మూసారాంబాగ్‌ కూడలిలో రెండు ట్రాక్టర్లు బండరాళ్లను ఇలా అంబర్‌పేట నుంచి తరలిస్తున్నాయి. అవి జారి రోడ్డుపై పడేలా ఉండటంతో ఇతర వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. అసలే ట్రాఫిక్‌ అధికంగా ఉండే ప్రాంతంలో ఇలా ఇష్టారాజ్యంగా వెళ్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.
3/22
హైదరాబాద్‌ నగర పోలీసులు, టీఎంఐ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్‌ కనెక్ట్‌ పేరిట ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. చిక్కడపల్లిలోని ఐటీఐ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. హైదరాబాద్‌ నగర పోలీసులు, టీఎంఐ సంయుక్త ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు జాబ్‌ కనెక్ట్‌ పేరిట ప్రైవేటు కంపెనీల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. చిక్కడపల్లిలోని ఐటీఐ విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు.
4/22
గ్లిరిసిడియా చెట్లకు తల కొట్టేసి ఉండడం చూసి ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో భాగంగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి నాటినట్లు అన్పిస్తోంది కదూ. ఈ చెట్లకు మేలు తలపెట్టే ఇలా కత్తిరించారు. తద్వారా మొదళ్లు మళ్లీ చిగురించి మృదువైన పూలు పూస్తాయని ఇలా చేశారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌లో కన్పించాయి. గ్లిరిసిడియా చెట్లకు తల కొట్టేసి ఉండడం చూసి ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో భాగంగా ఎక్కడి నుంచో తీసుకొచ్చి నాటినట్లు అన్పిస్తోంది కదూ. ఈ చెట్లకు మేలు తలపెట్టే ఇలా కత్తిరించారు. తద్వారా మొదళ్లు మళ్లీ చిగురించి మృదువైన పూలు పూస్తాయని ఇలా చేశారు. ఎన్టీఆర్‌ గార్డెన్‌లో కన్పించాయి.
5/22
ఔషధ గుణాలున్న వేప చెట్లు మళ్లీ జీవం కోల్పోతున్నాయి. గతేడాది  వీటి కొమ్మలు ఎండిపోయినా కొన్ని రోజుల తరువాత చిగురించాయి. తిరిగి వేపకు ఆపద రావడానికి కారణాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలను స్థానికులు కోరుతున్నారు. నల్లచెరువు-మాడ్గుల మార్గంలో కనిపించిందీ చెట్టు. ఔషధ గుణాలున్న వేప చెట్లు మళ్లీ జీవం కోల్పోతున్నాయి. గతేడాది వీటి కొమ్మలు ఎండిపోయినా కొన్ని రోజుల తరువాత చిగురించాయి. తిరిగి వేపకు ఆపద రావడానికి కారణాన్ని గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలను స్థానికులు కోరుతున్నారు. నల్లచెరువు-మాడ్గుల మార్గంలో కనిపించిందీ చెట్టు.
6/22
హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న రేసింగ్‌ లీగ్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గ్యాలరీ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రేసర్లకు, కార్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కార్మికులు టైర్లు అడ్డుగా పెడుతున్నారు. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న రేసింగ్‌ లీగ్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. గ్యాలరీ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రేసర్లకు, కార్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కార్మికులు టైర్లు అడ్డుగా పెడుతున్నారు.
7/22
కూకట్‌పల్లి వైజంక్షన్‌ వద్ద ఫ్రీలెఫ్ట్‌లో వాహనాలు నిలపకుండా కోన్స్‌ పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే అవి ఇలా కాలిబాటపైకి చేరడంతో కొద్దిరోజులుగా మళ్లీ కొందరు నిలుపుతున్నారు కూకట్‌పల్లి వైజంక్షన్‌ వద్ద ఫ్రీలెఫ్ట్‌లో వాహనాలు నిలపకుండా కోన్స్‌ పోలీసులు ఏర్పాటు చేశారు. అయితే అవి ఇలా కాలిబాటపైకి చేరడంతో కొద్దిరోజులుగా మళ్లీ కొందరు నిలుపుతున్నారు
8/22
రంగాపూర్‌ బస్టాండ్‌ ప్రాంగణంలో ద్విచక్ర వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు రోడ్లపై నిలబడాల్సి వస్తోంది. రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు చూస్తున్నా పట్టించుకోవడం లేదు. రంగాపూర్‌ బస్టాండ్‌ ప్రాంగణంలో ద్విచక్ర వాహనాలు నిలుపుతున్నారు. దీంతో ప్రయాణికులు రోడ్లపై నిలబడాల్సి వస్తోంది. రోజూ అధికారులు, ప్రజాప్రతినిధులు చూస్తున్నా పట్టించుకోవడం లేదు.
9/22
సముద్రపు అలలను తెరపైకి తీసుకొచ్చారు.. ఇసుకతిన్నెల అందాలను కళ్ల ముందుకు చేర్చారు.. ఇలా తెరపైకి చేరిన విభిన్నమైన అందాల ముందు అందమైన భామలు వయ్యారంగా అడుగులు వేశారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో బుధవారం జరిగిన ‘టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌’ ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. ప్రదర్శనలో మిస్‌ ఫెమినా ఇండియా సిని శెట్టి షో స్టాపర్‌గా నిలిచారు. ప్రదర్శన గురువారం సైతం కొనసాగనుంది. సముద్రపు అలలను తెరపైకి తీసుకొచ్చారు.. ఇసుకతిన్నెల అందాలను కళ్ల ముందుకు చేర్చారు.. ఇలా తెరపైకి చేరిన విభిన్నమైన అందాల ముందు అందమైన భామలు వయ్యారంగా అడుగులు వేశారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో బుధవారం జరిగిన ‘టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌’ ఆద్యంతం ఆహూతులను ఆకట్టుకుంది. ప్రదర్శనలో మిస్‌ ఫెమినా ఇండియా సిని శెట్టి షో స్టాపర్‌గా నిలిచారు. ప్రదర్శన గురువారం సైతం కొనసాగనుంది.
10/22
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించేందుకు ‘వారాహి’ రూపంలో వాహనం రూపుదిద్దుకొంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, దాడులు చేసినా తట్టుకునేలా కట్టుదిట్టంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించేందుకు ‘వారాహి’ రూపంలో వాహనం రూపుదిద్దుకొంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, దాడులు చేసినా తట్టుకునేలా కట్టుదిట్టంగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు.
11/22
విశాఖ సాగర తీరాన బుధవారం రెండు విభిన్న జీవులు కనిపించాయి. సముద్రంలో చాలా లోపల ఉండే కప్ప జాతుల్లో ఇవి ఒకటని, వీటిని పఫర్‌ ఫిష్‌ అంటారని మత్స్యశాఖాధికారి డాక్టర్‌ పి.శ్రీనివాసరావు తెలిపారు. కీటకాలు, చిన్న చేపలను తింటూ మనుగడ సాగించే వీటిపై పెద్ద జీవులేవైనా దాడి చేస్తే బుడగలా ఉబ్బి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని వివరించారు. విశాఖ సాగర తీరాన బుధవారం రెండు విభిన్న జీవులు కనిపించాయి. సముద్రంలో చాలా లోపల ఉండే కప్ప జాతుల్లో ఇవి ఒకటని, వీటిని పఫర్‌ ఫిష్‌ అంటారని మత్స్యశాఖాధికారి డాక్టర్‌ పి.శ్రీనివాసరావు తెలిపారు. కీటకాలు, చిన్న చేపలను తింటూ మనుగడ సాగించే వీటిపై పెద్ద జీవులేవైనా దాడి చేస్తే బుడగలా ఉబ్బి తప్పించుకునే ప్రయత్నం చేస్తాయని వివరించారు.
12/22
ఖతర్‌ యూనివర్సిటీ స్టేడియంలోని మైదానంలో ఎమద్‌ సలేహి అనే చిత్రకారుడు గీసిన చిత్రమిది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా, సాంస్కృతిక చిత్రంగా ఇది గిన్నిస్‌ రికార్డు సాధించింది. ఖతర్‌ యూనివర్సిటీ స్టేడియంలోని మైదానంలో ఎమద్‌ సలేహి అనే చిత్రకారుడు గీసిన చిత్రమిది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా, సాంస్కృతిక చిత్రంగా ఇది గిన్నిస్‌ రికార్డు సాధించింది.
13/22
యాసంగిలో పక్షుల బారి నుంచి నారును కాపాడుకునేందుకు అన్నదాతలు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకూరు నుంచి రామన్‌పాడుకు వెళ్లే మార్గంలో ఓ నారుమడికి నలువైపులా కర్రలు పాతి, తాడును కట్టి వాటికి నీలిరంగు ప్లాస్టిక్‌ కవర్లను వేలాడదీశారు. గాలికి అవి అటూ ఇటూ కదులుతూ శబ్ధం చేస్తుండటంతో పక్షులు దరి చేరడంలేదని ఆ రైతు ‘ఈనాడు’కు తెలిపాడు. యాసంగిలో పక్షుల బారి నుంచి నారును కాపాడుకునేందుకు అన్నదాతలు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా ఆత్మకూరు నుంచి రామన్‌పాడుకు వెళ్లే మార్గంలో ఓ నారుమడికి నలువైపులా కర్రలు పాతి, తాడును కట్టి వాటికి నీలిరంగు ప్లాస్టిక్‌ కవర్లను వేలాడదీశారు. గాలికి అవి అటూ ఇటూ కదులుతూ శబ్ధం చేస్తుండటంతో పక్షులు దరి చేరడంలేదని ఆ రైతు ‘ఈనాడు’కు తెలిపాడు.
14/22
పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల నియామక ప్రక్రియలో కీలకమైన శారీరక సామర్థ్య పరీక్షలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. నిజామాబాద్‌ రాజారాం స్టేడియంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు బుధవారం ట్రయల్‌రన్‌ నిర్వహించారు. పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై పోస్టుల నియామక ప్రక్రియలో కీలకమైన శారీరక సామర్థ్య పరీక్షలు గురువారం నుంచి మొదలుకానున్నాయి. నిజామాబాద్‌ రాజారాం స్టేడియంలో పకడ్బందీ ఏర్పాట్లు చేసిన అధికారులు బుధవారం ట్రయల్‌రన్‌ నిర్వహించారు.
15/22
రాజస్థాన్‌లోని దారాలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌   అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ నేతలు సచిన్‌ పైలట్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా. రాజస్థాన్‌లోని దారాలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, పార్టీ నేతలు సచిన్‌ పైలట్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా.
16/22
కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం తమిళనాడులోని మైలాపూరు కపాలీశ్వరస్వామి ఆలయ కొలను వద్ద దీపాలు వెలిగిస్తున్న భక్తులు. కార్తిక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం తమిళనాడులోని మైలాపూరు కపాలీశ్వరస్వామి ఆలయ కొలను వద్ద దీపాలు వెలిగిస్తున్న భక్తులు.
17/22
బీసీ మహాసభ నేపథ్యంలో.. ఒంగోలు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి నుంచే బారికేడ్లు పెట్టిన పోలీసులు. బీసీ మహాసభ నేపథ్యంలో.. ఒంగోలు జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి నుంచే బారికేడ్లు పెట్టిన పోలీసులు.
18/22
పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు బుధవారం ముగిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారికి పూలంగి సేవ, బిల్వార్చన, పూర్ణాహుతి పూజలు, దత్త హోమాలు, పల్లకీ సేవలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పిఠాపురంలోని శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో దత్త జయంతి సప్తాహ మహోత్సవాలు బుధవారం ముగిశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్వామి వారికి పూలంగి సేవ, బిల్వార్చన, పూర్ణాహుతి పూజలు, దత్త హోమాలు, పల్లకీ సేవలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.
19/22
 కొల్లేరుకు వచ్చే అందాల అతిథి స్పాట్‌ బిల్డ్‌ పెలికాన్‌. స్థానికంగా దీనిని గూడబాతు అని పిలుస్తారు. ఇది 4 నుంచి 6 కిలోల వరకు బరువు ఉంటుంది. ఫిలిప్పీన్స్‌ దేశంలో పుట్టి అక్కడి నుంచి విస్తరించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. మనదేశంతో పాటు శ్రీలంక, కంబోడియా, దక్షిణ తూర్పు ఆసియాలో మాత్రమే నివాసం ఉంటాయి. ప్రస్తుతం ఈ జాతి పక్షులు 18 వేల వరకు ఉంటాయని అటవీశాఖ అధికారుల అంచనా. కొల్లేరుకు వచ్చే అందాల అతిథి స్పాట్‌ బిల్డ్‌ పెలికాన్‌. స్థానికంగా దీనిని గూడబాతు అని పిలుస్తారు. ఇది 4 నుంచి 6 కిలోల వరకు బరువు ఉంటుంది. ఫిలిప్పీన్స్‌ దేశంలో పుట్టి అక్కడి నుంచి విస్తరించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. మనదేశంతో పాటు శ్రీలంక, కంబోడియా, దక్షిణ తూర్పు ఆసియాలో మాత్రమే నివాసం ఉంటాయి. ప్రస్తుతం ఈ జాతి పక్షులు 18 వేల వరకు ఉంటాయని అటవీశాఖ అధికారుల అంచనా.
20/22
కడప నగరంలోని అమీన్‌పీర్‌ దర్గా (పెద్దదర్గా) ఉరుసు బుధవారం వేడుకగా ప్రారంభమైంది. దర్గాను రంగురంగుల విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సందర్శించి ప్రార్థనలు చేశారు. కడప నగరంలోని అమీన్‌పీర్‌ దర్గా (పెద్దదర్గా) ఉరుసు బుధవారం వేడుకగా ప్రారంభమైంది. దర్గాను రంగురంగుల విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సందర్శించి ప్రార్థనలు చేశారు.
21/22
అల్లూరి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం చింతపల్లిలో అత్యల్పంగా 11.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు. ఉదయం వేళల్లో పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. చలి తీవ్రత కూడా బాగా పెరగడంతో స్థానికులు వణికిపోతున్నారు. అల్లూరి జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం చింతపల్లిలో అత్యల్పంగా 11.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్థానం వాతావరణ విభాగం నోడల్‌ అధికారి డాక్టర్‌ ఎం.సురేష్‌కుమార్‌ తెలిపారు. ఉదయం వేళల్లో పొగమంచు వర్షాన్ని తలపిస్తోంది. చలి తీవ్రత కూడా బాగా పెరగడంతో స్థానికులు వణికిపోతున్నారు.
22/22
 రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు మూడో రోజు బుధవారం విశాఖలో     హోరాహోరీగా సాగాయి. తూగో 8-1 గోల్స్‌ తేడాతో నెల్లూరుపై, విజయనగరం 7-2తో కృష్ణా జట్టుపై, కర్నూలు 7-0తో శ్రీకాకుళంపై, అనంతపురం 5-0తో కడపపై, విశాఖ 4-1తో గుంటూరు జట్లపై గెలిచి సెమిస్‌లో ప్రవేశించాయి. రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు మూడో రోజు బుధవారం విశాఖలో హోరాహోరీగా సాగాయి. తూగో 8-1 గోల్స్‌ తేడాతో నెల్లూరుపై, విజయనగరం 7-2తో కృష్ణా జట్టుపై, కర్నూలు 7-0తో శ్రీకాకుళంపై, అనంతపురం 5-0తో కడపపై, విశాఖ 4-1తో గుంటూరు జట్లపై గెలిచి సెమిస్‌లో ప్రవేశించాయి.

మరిన్ని