News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (08-12-2022)

Updated : 08 Dec 2022 20:05 IST
1/16
తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ ఆలయ మాడ వీధుల్లో భక్తులను క‌టాక్షించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తూ ఆలయ మాడ వీధుల్లో భక్తులను క‌టాక్షించారు.
2/16
చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల కట్టడం నిర్వహణ లోపం కారణంగా అధ్వానంగా మారుతోంది. పలు చోట్ల భవనంపై పిచ్చి మొక్కలు పెరిగాయి. గోడలు బీటలు వారుతున్నాయి. లోపలి గదుల్లో పెచ్చులూడి పడుతున్నాయి. అధికారులు మాత్రం తూతూమంత్రంగా మరమ్మతులు చేసి.. ఆ తరువాత పట్టించుకోవడం లేదు. చారిత్రక ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కళాశాల కట్టడం నిర్వహణ లోపం కారణంగా అధ్వానంగా మారుతోంది. పలు చోట్ల భవనంపై పిచ్చి మొక్కలు పెరిగాయి. గోడలు బీటలు వారుతున్నాయి. లోపలి గదుల్లో పెచ్చులూడి పడుతున్నాయి. అధికారులు మాత్రం తూతూమంత్రంగా మరమ్మతులు చేసి.. ఆ తరువాత పట్టించుకోవడం లేదు.
3/16
రాయదుర్గం మెట్రోస్టేషన్‌ రహేజ మైండ్‌ స్పేస్‌ వద్ద మెట్రో రెండో దశ విస్తరణ పనులకు శుక్రవారం సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారాస నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. అధికారులు కార్యక్రమం జరిగే స్థలాన్ని ముస్తాబు చేస్తున్నారు. రాయదుర్గం మెట్రోస్టేషన్‌ రహేజ మైండ్‌ స్పేస్‌ వద్ద మెట్రో రెండో దశ విస్తరణ పనులకు శుక్రవారం సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారాస నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా.. అధికారులు కార్యక్రమం జరిగే స్థలాన్ని ముస్తాబు చేస్తున్నారు.
4/16
హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ షూరూంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిస్తున్న యువ కథానాయికలు రష్మిక, మెహ్రీన్‌ హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఓ షూరూంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై ఫొటోలకు పోజులిస్తున్న యువ కథానాయికలు రష్మిక, మెహ్రీన్‌
5/16
హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న రేసింగ్‌ లీగ్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రేసర్లకు, కార్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా టైర్లతో రక్షణ ఏర్పాటు చేశారు. సందర్శకులు రేసు వీక్షించడానికి వీలుగా భారీ స్క్రీన్‌లు నెలకొల్పారు. హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న రేసింగ్‌ లీగ్‌కు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రేసర్లకు, కార్లకు ఎలాంటి ప్రమాదం జరగకుండా టైర్లతో రక్షణ ఏర్పాటు చేశారు. సందర్శకులు రేసు వీక్షించడానికి వీలుగా భారీ స్క్రీన్‌లు నెలకొల్పారు.
6/16
విజయవాడ నగరంలో ఓ నూతన షాపింగ్‌మాల్‌ను మంత్రి జోగి రమేశ్‌, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటులు రామ్‌, మెహ్రీన్‌ హాజరై సందడి చేశారు. విజయవాడ నగరంలో ఓ నూతన షాపింగ్‌మాల్‌ను మంత్రి జోగి రమేశ్‌, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్‌, మల్లాది విష్ణులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీనటులు రామ్‌, మెహ్రీన్‌ హాజరై సందడి చేశారు.
7/16
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమం ఇవాళ గుంటూరు జిల్లా నారాకోడూరులో నిర్వహించారు. తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు రాకతో దారులన్నీ జనసంద్రంగా మారాయి. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ కార్యక్రమం ఇవాళ గుంటూరు జిల్లా నారాకోడూరులో నిర్వహించారు. తెదేపా జాతీయాధ్యక్షుడు చంద్రబాబు రాకతో దారులన్నీ జనసంద్రంగా మారాయి.
8/16
కరీంనగర్‌లోని వి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ కుమార్తె వివాహ విందుకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నూతన వధూవరులు గగన్‌దీప్‌ కౌర్‌, మనేందర్‌ సింగ్‌లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. కరీంనగర్‌లోని వి కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ కుమార్తె వివాహ విందుకు సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నూతన వధూవరులు గగన్‌దీప్‌ కౌర్‌, మనేందర్‌ సింగ్‌లను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.
9/16
బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో  ‘టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌’ రెండో రోజూ కొనసాగింది. హిమాయత్‌నగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ విద్యార్థులు రూపొందించిన కలెక్షన్లు ధరించి మోడళ్లు ర్యాంప్‌పై సందడి చేశారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో ‘టైమ్స్‌ ఫ్యాషన్‌ వీక్‌’ రెండో రోజూ కొనసాగింది. హిమాయత్‌నగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ విద్యార్థులు రూపొందించిన కలెక్షన్లు ధరించి మోడళ్లు ర్యాంప్‌పై సందడి చేశారు.
10/16
హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దీంతో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హిమాచల్‌ ప్రజలకు సుపరిపాలన అందుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దీంతో హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ వద్ద ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో హిమాచల్‌ ప్రజలకు సుపరిపాలన అందుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
11/16
దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ.. మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో గాంధీనగర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, పార్టీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలుగా గుజరాత్‌లో ఏకఛత్రాధిపత్యం సాగిస్తున్న భారతీయ జనతా పార్టీ.. మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. దీంతో గాంధీనగర్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, పార్టీ అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ శ్రేణులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.
12/16
నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో డోలు వాయిస్తున్న ఆ పార్టీ నేత, సినీనటి కవిత నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో డోలు వాయిస్తున్న ఆ పార్టీ నేత, సినీనటి కవిత
13/16
మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఓ పాట చిత్రీకరణ నిమిత్తం ఆయన కథానాయిక శ్రుతిహాసన్‌తో కలిసి యూరప్‌ వెళ్లారు. తన కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకెళ్లిన చిరు ‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర 😊’ అంటూ సరదా వ్యాఖ్య జోడించి ఈ చిత్రాలను ట్విటర్‌లో పోస్టు చేశారు.    మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఓ పాట చిత్రీకరణ నిమిత్తం ఆయన కథానాయిక శ్రుతిహాసన్‌తో కలిసి యూరప్‌ వెళ్లారు. తన కుటుంబ సభ్యులను కూడా వెంట తీసుకెళ్లిన చిరు ‘ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్‌తో ఇటు వీరయ్య యాత్ర 😊’ అంటూ సరదా వ్యాఖ్య జోడించి ఈ చిత్రాలను ట్విటర్‌లో పోస్టు చేశారు.
14/16
పోలీసు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తెలంగాణ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. పరుగు పందెం, షాట్ పుట్, లాంగ్ జంప్ విభాగాల్లో అభ్యర్థుల సామర్థ్యాలను పరీక్షించారు. హైదరాబాద్‌ కొండాపూర్‌ 8వ పోలీస్‌ బెటాలియన్‌లో జరుగుతున్న దేహాదారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులను ఈ చిత్రాల్లో చూడొచ్చు. పోలీసు రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు తెలంగాణ వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. పరుగు పందెం, షాట్ పుట్, లాంగ్ జంప్ విభాగాల్లో అభ్యర్థుల సామర్థ్యాలను పరీక్షించారు. హైదరాబాద్‌ కొండాపూర్‌ 8వ పోలీస్‌ బెటాలియన్‌లో జరుగుతున్న దేహాదారుఢ్య పరీక్షలకు హాజరైన అభ్యర్థులను ఈ చిత్రాల్లో చూడొచ్చు.
15/16
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘#NBK 108’ (వర్కింగ్ టైటిల్‌) షూటింగ్‌ పూజా కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తొలి షాట్‌ను చిత్రీకరించారు. అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా.. దిల్‌రాజు కెమెరా స్విఛాన్‌ చేశారు. నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘#NBK 108’ (వర్కింగ్ టైటిల్‌) షూటింగ్‌ పూజా కార్యక్రమం ఇవాళ నిర్వహించారు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు తొలి షాట్‌ను చిత్రీకరించారు. అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టగా.. దిల్‌రాజు కెమెరా స్విఛాన్‌ చేశారు.
16/16
అడివి శేష్‌ కథానాయకుడిగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన ‘హిట్‌ 2’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయయాత్రలో భాగంగా చిత్రబృందం రాజమహేంద్రవరం వెళ్లింది. జ్ఞాపకం కోసం అక్కడి కళాశాల విద్యార్థులతో నటీనటులు, దర్శకుడు ఇలా సెల్ఫీ తీసుకున్నారు.	అడివి శేష్‌ కథానాయకుడిగా దర్శకుడు శైలేష్‌ కొలను తెరకెక్కించిన ‘హిట్‌ 2’కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. విజయయాత్రలో భాగంగా చిత్రబృందం రాజమహేంద్రవరం వెళ్లింది. జ్ఞాపకం కోసం అక్కడి కళాశాల విద్యార్థులతో నటీనటులు, దర్శకుడు ఇలా సెల్ఫీ తీసుకున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు