News In Pics: చిత్రం చెప్పే సంగతులు - 1 (09-12-2022)

Updated : 09 Dec 2022 13:30 IST
1/23
గుంటూరు జిల్లా పొన్నూరులో ముస్లిం సోదరులతో తెదేపా అధినేత చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా పాలనలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని పలువురు నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు జిల్లా పొన్నూరులో ముస్లిం సోదరులతో తెదేపా అధినేత చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా పాలనలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని పలువురు నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
2/23
నిజామాబాద్‌లోని రాజారాం స్టేడియంలో రెండో రోజూ పోలీసు అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. వేకువజాము నుంచే వివిధ పోటీల్లో అభ్యర్థులు పాల్గొన్నారు. నిజామాబాద్‌లోని రాజారాం స్టేడియంలో రెండో రోజూ పోలీసు అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. వేకువజాము నుంచే వివిధ పోటీల్లో అభ్యర్థులు పాల్గొన్నారు.
3/23
వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో కొనసాగుతున్న పోలీసు అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలు వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో కొనసాగుతున్న పోలీసు అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలు
4/23
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్‌ తీవ్ర తుపాను ప్రభావంతో తిరుమలలో భారీగా వర్షం కురుస్తోంది. దర్శనానికి వచ్చిన భక్తులు చలిగాలులతో ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్‌ తీవ్ర తుపాను ప్రభావంతో తిరుమలలో భారీగా వర్షం కురుస్తోంది. దర్శనానికి వచ్చిన భక్తులు చలిగాలులతో ఇబ్బందులు పడుతున్నారు.
5/23
ఫిటెనెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. తాజాగా ఆయన దుబాయ్‌లో తన తదుపరి చిత్రం కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ప్రముఖ ఫిటెనెస్‌ ట్రైనర్‌ మినాశ్‌ గాబ్రియెల్‌తో కలిసి ఉన్న ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఫిటెనెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. తాజాగా ఆయన దుబాయ్‌లో తన తదుపరి చిత్రం కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ప్రముఖ ఫిటెనెస్‌ ట్రైనర్‌ మినాశ్‌ గాబ్రియెల్‌తో కలిసి ఉన్న ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
6/23
జూరాల జలాశయం వద్ద పక్షుల సందడి నెలకొంది. ఏటా శీతాకాలంలో ప్రధాన నీటి వనరుల చెంతకు వలస వచ్చే పెయింటెడ్‌ స్టార్క్‌ కొంగలతోపాటు నల్లముక్కు కొంగలు, ఇతర పక్షులు గుంపులుగా వచ్చి చేరుతున్నాయి. గూళ్లు అల్లుకొని సేదతీరుతున్నాయి. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. జూరాల జలాశయం వద్ద పక్షుల సందడి నెలకొంది. ఏటా శీతాకాలంలో ప్రధాన నీటి వనరుల చెంతకు వలస వచ్చే పెయింటెడ్‌ స్టార్క్‌ కొంగలతోపాటు నల్లముక్కు కొంగలు, ఇతర పక్షులు గుంపులుగా వచ్చి చేరుతున్నాయి. గూళ్లు అల్లుకొని సేదతీరుతున్నాయి. ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి.
7/23
పాల్వంచ పట్టణ ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో వానరాల బెడద ఒకటి. దాని నుంచి ఉపశమనం కల్పించేందుకు పాల్వంచ పారిశ్రామికవాడలైన కేటీపీఎస్‌ కాలనీల్లో అధికారులు ఓ వ్యక్తి సాయంతో కొండముచ్చును తిప్పుతున్నారు. కొద్దిరోజులుగా కాలనీల్లో కోతుల సంచారం తక్కువైందని, కొండముచ్చు భయంతో అవి వీధుల్లోకి రావడం లేదని ప్రజలు తెలిపారు.  పాల్వంచ పట్టణ ప్రజలను వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో వానరాల బెడద ఒకటి. దాని నుంచి ఉపశమనం కల్పించేందుకు పాల్వంచ పారిశ్రామికవాడలైన కేటీపీఎస్‌ కాలనీల్లో అధికారులు ఓ వ్యక్తి సాయంతో కొండముచ్చును తిప్పుతున్నారు. కొద్దిరోజులుగా కాలనీల్లో కోతుల సంచారం తక్కువైందని, కొండముచ్చు భయంతో అవి వీధుల్లోకి రావడం లేదని ప్రజలు తెలిపారు.
8/23
దట్టమైన అరణ్యంలో ఔషధ గుణాలున్న చెట్ల బెరడులు, ఆకులు తాకుతూ జాలువారుతున్న తలకోన జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీతలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయానికి  వచ్చిన భక్తులు ఇక్కడ స్వీయ చిత్రాలు తీసుకుంటూ, ఈత కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు. దట్టమైన అరణ్యంలో ఔషధ గుణాలున్న చెట్ల బెరడులు, ఆకులు తాకుతూ జాలువారుతున్న తలకోన జలపాతం సందర్శకులకు కనువిందు చేస్తోంది. తిరుపతి జిల్లా శ్రీతలకోన సిద్ధేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన భక్తులు ఇక్కడ స్వీయ చిత్రాలు తీసుకుంటూ, ఈత కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు.
9/23
ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందిస్తున్న ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందిస్తున్న ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారు అలీ
10/23
శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నుంచి పెనుకొండ, అనంతపురానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షాలకు కోతకు గురై భారీ గుంతలు పడ్డాయి. కర్ణాటక సరిహద్దు మురారాయనపల్లి వద్ద రోజూ లారీలు ఇరుక్కుపోతున్నాయి. మురారాయనపల్లి చెరువు సమీప గుంతల్లో గురువారం లారీలు దిగబడ్డాయి. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మురళి, యువకులు అక్కడికెళ్లి నిరసన తెలియజేశారు.  శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నుంచి పెనుకొండ, అనంతపురానికి వెళ్లే ప్రధాన రహదారి వర్షాలకు కోతకు గురై భారీ గుంతలు పడ్డాయి. కర్ణాటక సరిహద్దు మురారాయనపల్లి వద్ద రోజూ లారీలు ఇరుక్కుపోతున్నాయి. మురారాయనపల్లి చెరువు సమీప గుంతల్లో గురువారం లారీలు దిగబడ్డాయి. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షుడు మురళి, యువకులు అక్కడికెళ్లి నిరసన తెలియజేశారు.
11/23
తిరుపతి ఆటోనగర్‌ నుంచి రేణిగుంటకు వెళ్లే మార్గంలో భూగర్భం నుంచి వెళ్లే మురుగు నీటి పైపులైను లీకవుతూ.. మట్టి కోతకు గురై భారీ గొయ్యి ఏర్పడింది. సుమారు 20 మీటర్ల పొడవున రోడ్డు కుంగిపోయింది. నెల కిందట చిన్నగా ఉన్న గొయ్యి.. క్రమంగా విస్తరించిందని స్థానికులు తెలిపారు. అధికారులకు విన్నవించినా స్పందన లేదని తెలిపారు.  తిరుపతి ఆటోనగర్‌ నుంచి రేణిగుంటకు వెళ్లే మార్గంలో భూగర్భం నుంచి వెళ్లే మురుగు నీటి పైపులైను లీకవుతూ.. మట్టి కోతకు గురై భారీ గొయ్యి ఏర్పడింది. సుమారు 20 మీటర్ల పొడవున రోడ్డు కుంగిపోయింది. నెల కిందట చిన్నగా ఉన్న గొయ్యి.. క్రమంగా విస్తరించిందని స్థానికులు తెలిపారు. అధికారులకు విన్నవించినా స్పందన లేదని తెలిపారు.
12/23
విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయి గాయాలపాలైన విద్యార్థిని శశికళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం విషాదం నింపింది.ఈ నేపథ్యంలో ఏలూరు రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తే ప్రయాణికులు ప్రమాదకరంగా పట్టాలు దాటుతున్నారు. చెంతనే పైవంతెన, లిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నా ఇలా పట్టాలపై రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు కదులుతున్న రైళ్లను.. పరిగెడుతూ ఎక్కుతున్నారు. ఏ మాత్రం జారినా ముప్పు తప్పదు. విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వేస్టేషన్లో రైలు-ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయి గాయాలపాలైన విద్యార్థిని శశికళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం విషాదం నింపింది.ఈ నేపథ్యంలో ఏలూరు రైల్వేస్టేషన్‌ను పరిశీలిస్తే ప్రయాణికులు ప్రమాదకరంగా పట్టాలు దాటుతున్నారు. చెంతనే పైవంతెన, లిఫ్ట్‌లు అందుబాటులో ఉన్నా ఇలా పట్టాలపై రాకపోకలు సాగిస్తున్నారు. మరికొందరు కదులుతున్న రైళ్లను.. పరిగెడుతూ ఎక్కుతున్నారు. ఏ మాత్రం జారినా ముప్పు తప్పదు.
13/23
చెరకు నరికివేత సీజన్‌ ప్రారంభం కావడంతో కూలీలు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. పిల్లలతో సహా డిసెంబరు, జనవరి నెలల్లో అక్కడే ఉంటారు. ఎడ్లబండ్లపై కుటుంబ సభ్యులతో వెళుతుండగా శివ్వంపేట మార్గంలో తీసిన చిత్రమిది. చెరకు నరికివేత సీజన్‌ ప్రారంభం కావడంతో కూలీలు సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వలసబాట పడుతున్నారు. పిల్లలతో సహా డిసెంబరు, జనవరి నెలల్లో అక్కడే ఉంటారు. ఎడ్లబండ్లపై కుటుంబ సభ్యులతో వెళుతుండగా శివ్వంపేట మార్గంలో తీసిన చిత్రమిది.
14/23
 భర్త రవీంద్ర జడేజాతో కలిసి విజయోత్సవ ర్యాలీలో భాజపా అభ్యర్థి రివాబా జడేజా. గుజరాత్‌లోని నార్త్‌ జామ్‌నగర్‌ నుంచి ఆమె గెలుపొందారు. భర్త రవీంద్ర జడేజాతో కలిసి విజయోత్సవ ర్యాలీలో భాజపా అభ్యర్థి రివాబా జడేజా. గుజరాత్‌లోని నార్త్‌ జామ్‌నగర్‌ నుంచి ఆమె గెలుపొందారు.
15/23
కరీంనగర్‌ పట్టణంలో మాతా శిశు ఆకృతిలో ఉన్న గ్రీనరీ నమూన, పూలతో అందంగా తీర్చిదిద్దడంతో ఆ ప్రాంతవాసులను ఆకట్టుకుంటుంది. కరీంనగర్‌ పట్టణంలో మాతా శిశు ఆకృతిలో ఉన్న గ్రీనరీ నమూన, పూలతో అందంగా తీర్చిదిద్దడంతో ఆ ప్రాంతవాసులను ఆకట్టుకుంటుంది.
16/23
ఈ చిత్రం ఓ పూదోటను తలపిస్తోంది కదూ.. ఇవి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ వద్ద మెట్రో రైలు ప్రారంభోత్సవ సభావేదిక వద్ద అలంకరణ కోసం తెచ్చిన పూల కుండీలు. ఈ చిత్రం ఓ పూదోటను తలపిస్తోంది కదూ.. ఇవి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ వద్ద మెట్రో రైలు ప్రారంభోత్సవ సభావేదిక వద్ద అలంకరణ కోసం తెచ్చిన పూల కుండీలు.
17/23
చెంగిచర్ల రోడ్డులో గ్యాస్‌ ట్యాంకర్లు రోజుల తరబడి ప్రధాన రహదారిపై నిలుపుతున్నారు. వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయి. చెంగిచర్ల రోడ్డులో గ్యాస్‌ ట్యాంకర్లు రోజుల తరబడి ప్రధాన రహదారిపై నిలుపుతున్నారు. వాహనదారులు రాకపోకలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయి.
18/23
చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో ట్రాక్‌.. దానిపై వేగంగా కదులుతున్న మెట్రో రైలు.. ఈ చిత్రం చూపరులకు ఎంతో హాయినిస్తోంది. సికింద్రాబాద్‌ -రసూల్‌పుర మార్గంలో మెట్రో భవన్‌పై నుంచి చూస్తే ఈ దృశ్యం కనులకు విందుగా అనిపిస్తోంది. చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో ట్రాక్‌.. దానిపై వేగంగా కదులుతున్న మెట్రో రైలు.. ఈ చిత్రం చూపరులకు ఎంతో హాయినిస్తోంది. సికింద్రాబాద్‌ -రసూల్‌పుర మార్గంలో మెట్రో భవన్‌పై నుంచి చూస్తే ఈ దృశ్యం కనులకు విందుగా అనిపిస్తోంది.
19/23
బయోడైవర్సిటీ కూడలిలో కృత్రిమ తేనెతుట్టె ఆకట్టుకుంటోంది. మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలన్న మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో.. ఎల్‌ఈడీ దీపాలతో తేనెతుట్టే ఆకారాన్ని రూపొందించామని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్విటర్‌లో తెలిపారు. బయోడైవర్సిటీ కూడలిలో కృత్రిమ తేనెతుట్టె ఆకట్టుకుంటోంది. మౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలన్న మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో.. ఎల్‌ఈడీ దీపాలతో తేనెతుట్టే ఆకారాన్ని రూపొందించామని పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ట్విటర్‌లో తెలిపారు.
20/23
నల్గొండ చౌరస్తాలో మూడేళ్ల క్రితం పలు కళాకృతులు ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. చౌరస్తా మలుపు వద్ద  ఫుట్‌పాత్‌కు చిన్న చిన్న కుండీలు ఏర్పాటు చేసి అందులో మొక్కలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడలికి కొత్తందాలను తెచ్చిపెట్టాయి. కొద్దిరోజులు నిర్వహణ బాగానే ఉన్నా.. ఆ తర్వాత పర్యవేక్షణ కొరవడడంతో కళాకృతులపై దుమ్ముతో నిండిపోయాయి. ఫుట్‌పాత్‌ గోడ కూలిపోయి కళావిహీనంగా మారింది. నల్గొండ చౌరస్తాలో మూడేళ్ల క్రితం పలు కళాకృతులు ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలతో అలంకరించారు. చౌరస్తా మలుపు వద్ద ఫుట్‌పాత్‌కు చిన్న చిన్న కుండీలు ఏర్పాటు చేసి అందులో మొక్కలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడలికి కొత్తందాలను తెచ్చిపెట్టాయి. కొద్దిరోజులు నిర్వహణ బాగానే ఉన్నా.. ఆ తర్వాత పర్యవేక్షణ కొరవడడంతో కళాకృతులపై దుమ్ముతో నిండిపోయాయి. ఫుట్‌పాత్‌ గోడ కూలిపోయి కళావిహీనంగా మారింది.
21/23
ఔటర్‌ కూడళ్ల సుందరీకరణలో భాగంగా హైదరాబాద్‌-సాగర్‌ రహదారిలోని బొంగుళూరులో తీగ మొక్కలతో ఏర్పాటు చేసిన బుద్ధుడి ఆకృతి ఇది. తుది మెరుగులు దిద్దుతున్నారు. ఔటర్‌ కూడళ్ల సుందరీకరణలో భాగంగా హైదరాబాద్‌-సాగర్‌ రహదారిలోని బొంగుళూరులో తీగ మొక్కలతో ఏర్పాటు చేసిన బుద్ధుడి ఆకృతి ఇది. తుది మెరుగులు దిద్దుతున్నారు.
22/23
మెట్రోరైలు రెండోదశ పనుల శంకుస్థాపన(అంతరచిత్రంలో) అనంతరం శుక్రవారం నార్సింగి వద్ద తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ మైదానంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. గులాబీ తోరణాలు, కటౌట్లతో ప్రాంగణాన్ని అలంకరించారు. మెట్రోరైలు రెండోదశ పనుల శంకుస్థాపన(అంతరచిత్రంలో) అనంతరం శుక్రవారం నార్సింగి వద్ద తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ మైదానంలో సీఎం కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. గులాబీ తోరణాలు, కటౌట్లతో ప్రాంగణాన్ని అలంకరించారు.
23/23
కీసర బస్‌షెల్టర్‌ ఆటోలకు అడ్డాగా మారింది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్సు ఎక్కాలన్నా దిగాలన్నా ఇక్కట్లు తప్పడం లేదు. ఒక్కోసారి ప్రయాణికులు, ఆటో డ్రైవర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది. కీసర బస్‌షెల్టర్‌ ఆటోలకు అడ్డాగా మారింది. ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. బస్సు ఎక్కాలన్నా దిగాలన్నా ఇక్కట్లు తప్పడం లేదు. ఒక్కోసారి ప్రయాణికులు, ఆటో డ్రైవర్లకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంటోంది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు