News In Pics: చిత్రం చెప్పే సంగతులు -2 (09-12-2022)

Updated : 09 Dec 2022 21:46 IST
1/24
సినీ నటీమణులు మెహరీన్‌, అనసూయ ఒంగోలులో నిర్వహించిన ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. సినీ నటీమణులు మెహరీన్‌, అనసూయ ఒంగోలులో నిర్వహించిన ఓ వస్త్రదుకాణ ప్రారంభోత్సవంలో పాల్గొని సందడి చేశారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.
2/24
3/24
ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రత 7డిగ్రీలుగా నమోదైంది. గురువారం రాత్రి నుంచి చలి పెరగడంతో శుక్రవారం ఉదయం తరగతి గదిలో పాఠాలు వినే పరిస్థితి లేకుండా పోయింది. పెరిగిన చలితీవ్రత దృష్ట్యా గుడిహత్నూర్‌ మండలంలోని గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహంలో అన్ని తరగతులనూ ఎండ ముదిరే వరకు ఇలా ఆరుబయటే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చలికి గదుల్లో ఇబ్బందులు పడుతుండటంతో ఇలా చేస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రత 7డిగ్రీలుగా నమోదైంది. గురువారం రాత్రి నుంచి చలి పెరగడంతో శుక్రవారం ఉదయం తరగతి గదిలో పాఠాలు వినే పరిస్థితి లేకుండా పోయింది. పెరిగిన చలితీవ్రత దృష్ట్యా గుడిహత్నూర్‌ మండలంలోని గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహంలో అన్ని తరగతులనూ ఎండ ముదిరే వరకు ఇలా ఆరుబయటే నిర్వహిస్తున్నారు. విద్యార్థులు చలికి గదుల్లో ఇబ్బందులు పడుతుండటంతో ఇలా చేస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.
4/24
మాండౌస్‌ తుపాను ప్రభావంతో చెన్నై తీరంలో సముద్రం ఇలా భారీ అలలతో ఎగిసిపడుతూ కనిపించింది. తుపాను కారణంగా ఇప్పటికే తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మాండౌస్‌ తుపాను ప్రభావంతో చెన్నై తీరంలో సముద్రం ఇలా భారీ అలలతో ఎగిసిపడుతూ కనిపించింది. తుపాను కారణంగా ఇప్పటికే తమిళనాడు, ఏపీ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
5/24
హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లవ్ యూ రామ్’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ పాల్గొన్నారు. సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్రబృందానికి వారు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘లవ్ యూ రామ్’ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌, ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ పాల్గొన్నారు. సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్రబృందానికి వారు శుభాకాంక్షలు తెలిపారు.
6/24
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బాపట్ల నియోజకవర్గం అప్పికట్లలోని ఓ చాయ్‌ దుకాణంలో టీ తాగారు. చాయ్‌ దుకాణ నిర్వాహకులతో పాటు స్థానికులతో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు బాపట్ల నియోజకవర్గం అప్పికట్లలోని ఓ చాయ్‌ దుకాణంలో టీ తాగారు. చాయ్‌ దుకాణ నిర్వాహకులతో పాటు స్థానికులతో మాట్లాడి కష్టసుఖాలు తెలుసుకున్నారు.
7/24
గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పొన్నూరు నియోజకవర్గం చింతలపూడిలో శతాధిక వృద్ధురాలు ధూళిపాళ్ల ఇందిరాదేవి(102)ని పలకరించారు. దీంతో ఆమె సంతోషంతో చంద్రబాబును ఇలా ఆశీర్వదించారు. గుంటూరు జిల్లా పర్యటనలో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పొన్నూరు నియోజకవర్గం చింతలపూడిలో శతాధిక వృద్ధురాలు ధూళిపాళ్ల ఇందిరాదేవి(102)ని పలకరించారు. దీంతో ఆమె సంతోషంతో చంద్రబాబును ఇలా ఆశీర్వదించారు.
8/24
హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ‘లగ్జరీ లైఫ్‌స్టైల్‌ ఎక్స్‌పో’ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటి రాశీసింగ్‌ పాల్గొని సందడి చేశారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో ‘లగ్జరీ లైఫ్‌స్టైల్‌ ఎక్స్‌పో’ కర్టెన్‌రైజర్‌ ఈవెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో సినీనటి రాశీసింగ్‌ పాల్గొని సందడి చేశారు.
9/24
సినీనటి దివి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ స్కిన్, హెయిర్‌, డెంటల్‌ క్లినిక్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. సినీనటి దివి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ స్కిన్, హెయిర్‌, డెంటల్‌ క్లినిక్‌కు సంబంధించిన వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
10/24
నెల్లూరులో మాండౌస్‌ తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. నెల్లూరులో మాండౌస్‌ తుపాను ప్రభావంతో భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులపై నీరు నిలవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
11/24
తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ‘భారాస’ ఆవిర్భావ వేడుకల అనంతరం ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇలా వీరతిలకం దిద్దారు. ‘భారాస’ జైత్రయాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ‘భారాస’ ఆవిర్భావ వేడుకల అనంతరం ఇంటికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇలా వీరతిలకం దిద్దారు. ‘భారాస’ జైత్రయాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆమె ఆకాంక్షించారు.
12/24
బాబీ(కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రంలో రవితేజకు సంబంధిచిన ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 12న 11.07గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13, 2023న సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది. బాబీ(కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రంలో రవితేజకు సంబంధిచిన ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 12న 11.07గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13, 2023న సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది.
13/24
విజయవాడ రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయుధ దళాల జెండా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం ఏటా డిసెంబర్ 7న నిర్వహిస్తున్నట్లు, ఇది వారిని గౌరవించుకునే శుభతరుణమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సాయిధ దళాల శౌర్యం, విధి నిర్వహణపై అంకితభావాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు. విజయవాడ రాజ్‌భవన్‌లో శుక్రవారం సాయుధ దళాల జెండా దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సాయుధ దళాల పతాక దినోత్సవం ఏటా డిసెంబర్ 7న నిర్వహిస్తున్నట్లు, ఇది వారిని గౌరవించుకునే శుభతరుణమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సాయిధ దళాల శౌర్యం, విధి నిర్వహణపై అంకితభావాన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని తెలిపారు.
14/24
క్రికెటర్‌ రవీంద్ర జడేజా.. గుజరాత్‌ ఎన్నికల్లో జామ్‌నగర్‌ నార్త్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తన సతీమణి రీవాబాకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘హలో ఎమ్మెల్యే.. మీరు దీనికి అర్హులు. మీ గెలుపుతో జామ్‌నగర్‌ ప్రజలు గెలిచారు. ప్రతి ఓటరుకు నేను మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అంటూ పోస్టు పెట్టారు. క్రికెటర్‌ రవీంద్ర జడేజా.. గుజరాత్‌ ఎన్నికల్లో జామ్‌నగర్‌ నార్త్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తన సతీమణి రీవాబాకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘హలో ఎమ్మెల్యే.. మీరు దీనికి అర్హులు. మీ గెలుపుతో జామ్‌నగర్‌ ప్రజలు గెలిచారు. ప్రతి ఓటరుకు నేను మనసారా కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అంటూ పోస్టు పెట్టారు.
15/24
ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ వైద్య సిబ్బంది ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఉస్మానియా వైద్య కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ‘రోగుల ప్రాణాలతో చెలగాటం వద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నినాదాలిచ్చారు. ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ వైద్య సిబ్బంది ఉస్మానియా ఆసుపత్రి నుంచి ఉస్మానియా వైద్య కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. ‘రోగుల ప్రాణాలతో చెలగాటం వద్దు’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించడంతో పాటు నినాదాలిచ్చారు.
16/24
సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, రాజీవ్‌ గాంధీ బీమా చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు జానారెడ్డి, గీతారెడ్డి, మల్లు రవి, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, రాజీవ్‌ గాంధీ బీమా చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు జానారెడ్డి, గీతారెడ్డి, మల్లు రవి, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.
17/24
పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా సెట్స్‌ను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సందర్శించి పవన్‌ కల్యాణ్‌, క్రిష్‌తో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా సెట్స్‌ను దర్శకుడు హరీశ్‌ శంకర్‌ సందర్శించి పవన్‌ కల్యాణ్‌, క్రిష్‌తో ముచ్చటించారు. సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వారిని అడిగి తెలుసుకున్నారు.
18/24
సంతోష్‌ శోభన్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమాకు ‘కళ్యాణం కమనీయం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. అనిల్‌ కుమార్‌ ఆళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంతోష్‌ శోభన్‌, ప్రియా భవానీ శంకర్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమాకు ‘కళ్యాణం కమనీయం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. అనిల్‌ కుమార్‌ ఆళ్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
19/24
ప్రభాస్‌ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా సెట్లోకి దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వెళ్లారు. ప్రభాస్‌తో మాట్లాడి సినీ విశేషాలను ఆసక్తిగా తెలుసుకున్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా దర్శకుడు నాగ్ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ప్రాజెక్ట్ కె’(వర్కింగ్‌ టైటిల్‌). ఈ సినిమా సెట్లోకి దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు వెళ్లారు. ప్రభాస్‌తో మాట్లాడి సినీ విశేషాలను ఆసక్తిగా తెలుసుకున్నారు.
20/24
గుంటూరు జిల్లా పొన్నూరులో ముస్లిం సోదరులతో తెదేపా అధినేత చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా పాలనలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని పలువురు నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.	గుంటూరు జిల్లా పొన్నూరులో ముస్లిం సోదరులతో తెదేపా అధినేత చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వైకాపా పాలనలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని పలువురు నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
21/24
నిజామాబాద్‌లోని రాజారాం స్టేడియంలో రెండో రోజూ పోలీసు అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. వేకువజాము నుంచే వివిధ పోటీల్లో అభ్యర్థులు పాల్గొన్నారు.	నిజామాబాద్‌లోని రాజారాం స్టేడియంలో రెండో రోజూ పోలీసు అభ్యర్థులకు శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. వేకువజాము నుంచే వివిధ పోటీల్లో అభ్యర్థులు పాల్గొన్నారు.
22/24
వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో కొనసాగుతున్న పోలీసు అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలు	వరంగల్‌ కాకతీయ విశ్వవిద్యాలయం మైదానంలో కొనసాగుతున్న పోలీసు అభ్యర్థుల శారీరక సామర్థ్య పరీక్షలు
23/24
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్‌ తీవ్ర తుపాను ప్రభావంతో తిరుమలలో భారీగా వర్షం కురుస్తోంది. దర్శనానికి వచ్చిన భక్తులు చలిగాలులతో ఇబ్బందులు పడుతున్నారు.	ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్‌ తీవ్ర తుపాను ప్రభావంతో తిరుమలలో భారీగా వర్షం కురుస్తోంది. దర్శనానికి వచ్చిన భక్తులు చలిగాలులతో ఇబ్బందులు పడుతున్నారు.
24/24
ఫిటెనెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. తాజాగా ఆయన దుబాయ్‌లో తన తదుపరి చిత్రం కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ప్రముఖ ఫిటెనెస్‌ ట్రైనర్‌ మినాశ్‌ గాబ్రియెల్‌తో కలిసి ఉన్న ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.	ఫిటెనెస్‌ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. తాజాగా ఆయన దుబాయ్‌లో తన తదుపరి చిత్రం కోసం జిమ్‌లో కసరత్తులు చేస్తున్నారు. ప్రముఖ ఫిటెనెస్‌ ట్రైనర్‌ మినాశ్‌ గాబ్రియెల్‌తో కలిసి ఉన్న ఈ ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

మరిన్ని