News In pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 25 Jun 2022 07:55 IST
1/24
అల్లూరి సీతారామరాజు జిల్లా బీజుమరవలసలో తాగునీటికి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక మూడు నెలలుగా కలుషిత ఊటనీటితో దాహార్తి తీర్చకుంటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బీజుమరవలసలో తాగునీటికి గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. గత్యంతరం లేక మూడు నెలలుగా కలుషిత ఊటనీటితో దాహార్తి తీర్చకుంటున్నారు.
2/24
విశాఖలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సందడి చెందిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మోడలింగ్‌ ప్రిన్సెస్‌ విజేత అనుశ్రీ విశాఖలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సందడి చెందిన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల మోడలింగ్‌ ప్రిన్సెస్‌ విజేత అనుశ్రీ
3/24
చిత్రంలో చూస్తున్న కాల్వ నీటినే 14 లక్షల మంది తాగుతున్నారు. ఇందులో ప్రవహించే నీరే 2.65 లక్షల ఎకరాల ఆయకట్టును తడుపుతోంది. ఇంతటి ప్రాధాన్యమున్న కాల్వ పేరు కేసీ కెనాల్‌. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల వరప్రదాయిని. కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో మురికి కూపాన్ని తలపిస్తోంది. మొత్తం 306 కి.మీ. పొడవున్న ప్రవాహిని ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 234 కి.మీ. ఉంది. కర్నూలు నగరంలోకి రాగానే ఇక్కడి స్టాంటన్‌పురం, బంగారుపేట, ఇందిరాగాంధీనగర్, ధర్మపేట, అశోక్‌నగర్, దేవనగర్, లక్ష్మీనగర్, జొహరాపురం కాలనీల మురుగంతా ఇందులోకి చేరుతోంది. కార్పొరేషన్‌ వ్యర్థాలనూ దీంట్లోనే వేస్తున్నారు. మంచి నీటి వనరును కలుషితం చేయొద్దని జలవనరులశాఖ.. కర్నూలు నగరపాలక సంస్థకు పలుమార్లు లేఖలు రాసింది. అధికారులు స్పందించలేదు. ప్రస్తుతం కాల్వ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కర్నూలు కాటన్‌ విగ్రహం వంతెన వద్ద తీసిన ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది. చిత్రంలో చూస్తున్న కాల్వ నీటినే 14 లక్షల మంది తాగుతున్నారు. ఇందులో ప్రవహించే నీరే 2.65 లక్షల ఎకరాల ఆయకట్టును తడుపుతోంది. ఇంతటి ప్రాధాన్యమున్న కాల్వ పేరు కేసీ కెనాల్‌. కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల వరప్రదాయిని. కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో మురికి కూపాన్ని తలపిస్తోంది. మొత్తం 306 కి.మీ. పొడవున్న ప్రవాహిని ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే 234 కి.మీ. ఉంది. కర్నూలు నగరంలోకి రాగానే ఇక్కడి స్టాంటన్‌పురం, బంగారుపేట, ఇందిరాగాంధీనగర్, ధర్మపేట, అశోక్‌నగర్, దేవనగర్, లక్ష్మీనగర్, జొహరాపురం కాలనీల మురుగంతా ఇందులోకి చేరుతోంది. కార్పొరేషన్‌ వ్యర్థాలనూ దీంట్లోనే వేస్తున్నారు. మంచి నీటి వనరును కలుషితం చేయొద్దని జలవనరులశాఖ.. కర్నూలు నగరపాలక సంస్థకు పలుమార్లు లేఖలు రాసింది. అధికారులు స్పందించలేదు. ప్రస్తుతం కాల్వ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో కర్నూలు కాటన్‌ విగ్రహం వంతెన వద్ద తీసిన ఈ చిత్రం చూస్తే అర్థమవుతుంది.
4/24
గండిపేట వెళ్లే దారిలో రోడ్డుపై వాలుతున్న చెట్టు కొమ్మలు ప్రమాదకరంగా మారడంతో భారీ వృక్షాన్ని నరికేశారు. మోడు  మళ్లీ చిగురించి ఆహ్లాదకరంగా కనిపిస్తోంది. గండిపేట వెళ్లే దారిలో రోడ్డుపై వాలుతున్న చెట్టు కొమ్మలు ప్రమాదకరంగా మారడంతో భారీ వృక్షాన్ని నరికేశారు. మోడు మళ్లీ చిగురించి ఆహ్లాదకరంగా కనిపిస్తోంది.
5/24
స్తంభం అడుగు భాగంలో వెలుగుతున్న దీపం చూసి ఇదేదో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ట్రాఫిక్‌ సిగ్నల్‌ అనుకుంటే పొరబడినట్లే. రహేజా కూడలి నుంచి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఓ వైపు ఉన్న సిగ్నల్‌ పూర్తిగా కిందకు జారిపోయింది. దీంతో వాహనదారులు అయోమయంగా ముందుకు కదులుతున్నారు. స్తంభం అడుగు భాగంలో వెలుగుతున్న దీపం చూసి ఇదేదో కొత్తగా అందుబాటులోకి తీసుకొచ్చిన ట్రాఫిక్‌ సిగ్నల్‌ అనుకుంటే పొరబడినట్లే. రహేజా కూడలి నుంచి ఏఐజీ ఆసుపత్రికి వెళ్లే మార్గంలో ఓ వైపు ఉన్న సిగ్నల్‌ పూర్తిగా కిందకు జారిపోయింది. దీంతో వాహనదారులు అయోమయంగా ముందుకు కదులుతున్నారు.
6/24
కుమారుడు, కోడలు  కూలీ పనులకు పొద్దున్నే వెళ్లారు. పిల్లలను బడికి పంపే బాధ్యత తాత తీసుకున్నాడు. భుజాలపై ఎక్కించుకుంటేనే బడికిపోతానని మనవరాలు మారాం చేయడంతో తాత కాదనలేకపోయాడు. ఆ చిన్నారి సంతోషం తీరుస్తూ ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌లో ఇలా కనిపించాడు. కుమారుడు, కోడలు కూలీ పనులకు పొద్దున్నే వెళ్లారు. పిల్లలను బడికి పంపే బాధ్యత తాత తీసుకున్నాడు. భుజాలపై ఎక్కించుకుంటేనే బడికిపోతానని మనవరాలు మారాం చేయడంతో తాత కాదనలేకపోయాడు. ఆ చిన్నారి సంతోషం తీరుస్తూ ఖైరతాబాద్‌ ఆనంద్‌నగర్‌లో ఇలా కనిపించాడు.
7/24
సౌకర్యవంతంగా ఉండాలి.. చూడటానికీ బాగుండాలి... మార్కెట్లో అందుబాటులో ఉన్నవాటికంటే భిన్నంగా కనిపించాలి... సరిగ్గా ఇవే లక్ష్యాలతో ఐఐటీ హైదరాబాద్‌లోని డిజైన్‌ విభాగ బృందం కుర్చీలను తయారు చేసింది. ఆచార్యుడు నీలకంఠన్‌ కేశవన్‌ పర్యవేక్షణలో ఆకాంక్షసింగ్, వివేకానందచారి కలిసి వీటికి రూపమిచ్చారు. ఐఐటీలోని లాంజ్‌ల్లో వీటిని అందుబాటులో ఉంచారు. సందర్శకులు ఈ కుర్చీల్లో కూర్చుని సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ఆకృతులు బాగా ఉండటంతో వీటి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ డిజైన్లకు సంబంధించి వీరు పేటెంట్‌ కూడా అందుకున్నారు. సౌకర్యవంతంగా ఉండాలి.. చూడటానికీ బాగుండాలి... మార్కెట్లో అందుబాటులో ఉన్నవాటికంటే భిన్నంగా కనిపించాలి... సరిగ్గా ఇవే లక్ష్యాలతో ఐఐటీ హైదరాబాద్‌లోని డిజైన్‌ విభాగ బృందం కుర్చీలను తయారు చేసింది. ఆచార్యుడు నీలకంఠన్‌ కేశవన్‌ పర్యవేక్షణలో ఆకాంక్షసింగ్, వివేకానందచారి కలిసి వీటికి రూపమిచ్చారు. ఐఐటీలోని లాంజ్‌ల్లో వీటిని అందుబాటులో ఉంచారు. సందర్శకులు ఈ కుర్చీల్లో కూర్చుని సరికొత్త అనుభూతిని పొందుతున్నారు. ఆకృతులు బాగా ఉండటంతో వీటి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. ఈ డిజైన్లకు సంబంధించి వీరు పేటెంట్‌ కూడా అందుకున్నారు.
8/24
నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని నీటి శుద్ధి కేంద్రం ఇది. మరమ్మతులకు గురవడంతో రెండేళ్లుగా వినియోగంలో లేదు. ఈ నెల 18న మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా ఉరుకులు పరుగుల మీద బాగుచేసి తెరిచారు. కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే నీటిని అందించారు. మరుసటి రోజు నుంచి మూసేశారు. నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని నీటి శుద్ధి కేంద్రం ఇది. మరమ్మతులకు గురవడంతో రెండేళ్లుగా వినియోగంలో లేదు. ఈ నెల 18న మంత్రి హరీశ్‌రావు పర్యటన సందర్భంగా ఉరుకులు పరుగుల మీద బాగుచేసి తెరిచారు. కేవలం ఆ ఒక్కరోజు మాత్రమే నీటిని అందించారు. మరుసటి రోజు నుంచి మూసేశారు.
9/24
నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని పురాతన చారిత్రక సదర్మాట్‌ ఆనకట్ట జలకళను సంతరించుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకే ఆనకట్టలోకి వరదనీరు చేసి జాలువారుతోంది. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలోని పురాతన చారిత్రక సదర్మాట్‌ ఆనకట్ట జలకళను సంతరించుకుంది. రెండు రోజులుగా కురుస్తున్న చిరుజల్లులకే ఆనకట్టలోకి వరదనీరు చేసి జాలువారుతోంది.
10/24
ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కొత్తగా తాగునీటి కుళాయి కావాలంటే మిషన్‌ భగీరథ కార్మికులు ఇంటి వద్దకు వచ్చి చుట్టూ పరిశీలిస్తారు. పరిసరాల్లో ఎటువైపు భగీరథ పైపులైన్‌ ఉందో ముందు తెలుసుకుంటారు. జాగ్రత్తగా గొయ్యి తవ్వుతారు. ఆతర్వాత పైపులైన్‌ పగలకుండా రంధ్రం చేసి నల్లాను బిగిస్తారు. అయితే పైప్‌లైన్‌ మూడు అడుగుల లోతులో ఉండటంతో నల్లాను బిగించడంతో పాటుగా లీకేజీ లేకుండా చూసేందుకు ఇలా పూర్తిస్థాయిలో గుంతలోకి వెళ్లి పని చేయాల్సి వస్తోంది. ఆదిలాబాద్‌ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో కొత్తగా తాగునీటి కుళాయి కావాలంటే మిషన్‌ భగీరథ కార్మికులు ఇంటి వద్దకు వచ్చి చుట్టూ పరిశీలిస్తారు. పరిసరాల్లో ఎటువైపు భగీరథ పైపులైన్‌ ఉందో ముందు తెలుసుకుంటారు. జాగ్రత్తగా గొయ్యి తవ్వుతారు. ఆతర్వాత పైపులైన్‌ పగలకుండా రంధ్రం చేసి నల్లాను బిగిస్తారు. అయితే పైప్‌లైన్‌ మూడు అడుగుల లోతులో ఉండటంతో నల్లాను బిగించడంతో పాటుగా లీకేజీ లేకుండా చూసేందుకు ఇలా పూర్తిస్థాయిలో గుంతలోకి వెళ్లి పని చేయాల్సి వస్తోంది.
11/24
ఈ చిత్రం చూస్తే అద్దంలా ప్రతిబింబం కనిపిస్తోంది కదూ.. ఈ ప్రతిబింబం వెనక నిర్లక్ష్యం దాగి ఉంది. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో 15రోజులుగా తాగునీటి కూలర్ నుంచి నీరు కారిపోయి ఎక్కడికక్కడ  నిలిచపోయాయి. నిత్యం వందల సంఖ్యలో రోగులు రాకపోకలు సాగించే చోట ఇలా నీరు నిలిచినా పట్టించుకునేవారు కరవయ్యారు. ఈ చిత్రం చూస్తే అద్దంలా ప్రతిబింబం కనిపిస్తోంది కదూ.. ఈ ప్రతిబింబం వెనక నిర్లక్ష్యం దాగి ఉంది. ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆసుపత్రిలో 15రోజులుగా తాగునీటి కూలర్ నుంచి నీరు కారిపోయి ఎక్కడికక్కడ నిలిచపోయాయి. నిత్యం వందల సంఖ్యలో రోగులు రాకపోకలు సాగించే చోట ఇలా నీరు నిలిచినా పట్టించుకునేవారు కరవయ్యారు.
12/24
కాకులు దూరని కారడవి... ఎటు చూసినా పచ్చదనం.. మధ్యలో కృష్ణమ్మ పరుగులు, పలు రకాల పక్షిజాతులు, వన్యప్రాణులు.. జీవ వైవిధ్యంతో అలరారే నల్లమల అటవీ ప్రాంతం అద్భుత దృశ్యాలకు నెలవు. వర్షాకాలంలో పచ్చదనం మరింత పరుచుకుని పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే నల్లమల అటవీ ప్రాంతం వర్షాకాలంలో ఆకుపచ్చ అందాలతో కనువిందు చేస్తోందంటూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. తన కెమెరాలో బంధించిన చిత్రాలను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు. కాకులు దూరని కారడవి... ఎటు చూసినా పచ్చదనం.. మధ్యలో కృష్ణమ్మ పరుగులు, పలు రకాల పక్షిజాతులు, వన్యప్రాణులు.. జీవ వైవిధ్యంతో అలరారే నల్లమల అటవీ ప్రాంతం అద్భుత దృశ్యాలకు నెలవు. వర్షాకాలంలో పచ్చదనం మరింత పరుచుకుని పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే నల్లమల అటవీ ప్రాంతం వర్షాకాలంలో ఆకుపచ్చ అందాలతో కనువిందు చేస్తోందంటూ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. తన కెమెరాలో బంధించిన చిత్రాలను ఆయన తన ట్వీట్‌కు జత చేశారు.
13/24
మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్‌ ఫేజ్‌-1 ప్రధాన రహదారిలో ఓకిడ్స్‌ పాఠశాల ఆవరణలో యాజమాన్యం జిరాఫీ బొమ్మ ఏర్పాటుచేసింది. దారిపై వెళ్లే వారిని అది విశేషంగా ఆకట్టుకుంటుంది. మీర్‌పేట హెచ్‌బీకాలనీ డివిజన్‌ ఫేజ్‌-1 ప్రధాన రహదారిలో ఓకిడ్స్‌ పాఠశాల ఆవరణలో యాజమాన్యం జిరాఫీ బొమ్మ ఏర్పాటుచేసింది. దారిపై వెళ్లే వారిని అది విశేషంగా ఆకట్టుకుంటుంది.
14/24
కేపీహెచ్‌బీ మూడోఫేజ్‌లోని మహిళ, పిల్లల పార్కు ప్రహరీ పక్కన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌ కొనసాగుతోంది. ఎక్కడ జాగా కనిపిస్తే అక్కడ రాత్రుళ్లు నిర్మాణ వ్యర్థాలను వేస్తున్నారు. కేపీహెచ్‌బీ మూడోఫేజ్‌లోని మహిళ, పిల్లల పార్కు ప్రహరీ పక్కన నిర్మాణ వ్యర్థాల డంపింగ్‌ కొనసాగుతోంది. ఎక్కడ జాగా కనిపిస్తే అక్కడ రాత్రుళ్లు నిర్మాణ వ్యర్థాలను వేస్తున్నారు.
15/24
కీసర మండలం రాంపల్లిలో హైమాస్టు విద్యుత్తు స్తంభం మీటరు పెట్టెకు మూత లేదు. చిన్నారులు ఆడుతూ దానికి తగిలి, ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అధికారులు స్పందించి మూత ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కీసర మండలం రాంపల్లిలో హైమాస్టు విద్యుత్తు స్తంభం మీటరు పెట్టెకు మూత లేదు. చిన్నారులు ఆడుతూ దానికి తగిలి, ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అధికారులు స్పందించి మూత ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
16/24
కేపీహెచ్‌బీ రైతుబజారు పక్కన రోడ్డులో చెత్త డంపింగ్‌ను అధికారులు ఆపలేకపోతున్నారు. అక్రమ వ్యాపారాలతో సెల్లార్‌లో పార్కింగ్‌కు ఇబ్బందిగా ఉండగా చెత్త డంపింగ్‌ మరో సమస్యగా మారింది. కేపీహెచ్‌బీ రైతుబజారు పక్కన రోడ్డులో చెత్త డంపింగ్‌ను అధికారులు ఆపలేకపోతున్నారు. అక్రమ వ్యాపారాలతో సెల్లార్‌లో పార్కింగ్‌కు ఇబ్బందిగా ఉండగా చెత్త డంపింగ్‌ మరో సమస్యగా మారింది.
17/24
జేఎన్‌టీయూ ప్రధాన గేటు సమీపంలోని రహదారి మలుపులో పైపులైన్‌ లీకేజీతో వారం నుంచి తాగునీరు వృథా అవుతూ వర్సిటీ రెండో గేటు వద్ద పైవంతెన వరకు పారుతోంది. అధికారులూ ఆపరా? జేఎన్‌టీయూ ప్రధాన గేటు సమీపంలోని రహదారి మలుపులో పైపులైన్‌ లీకేజీతో వారం నుంచి తాగునీరు వృథా అవుతూ వర్సిటీ రెండో గేటు వద్ద పైవంతెన వరకు పారుతోంది. అధికారులూ ఆపరా?
18/24
రహదారిపై వెళ్తున్న కొందరి నిర్లక్ష్యం కారణంగా నిత్యం ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు పరిపాటిగా మారుతున్నా కొందరి వైఖరి మారడం లేదు. నార్సింగి రోడ్డులో ఊసలు లోడ్‌తో ఓ లారీ వెళ్తోంది. ఊసల చివర ఎలాంటి మూత వేయకుండా ప్రమాదకరంగా తరలిస్తున్నారు. నగరంలో దగ్గర..దగ్గరగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ముందు వాహనం సడన్‌గా బ్రేకులు వేస్తే వెనుక వచ్చే వాహనాలు ఢీకొట్టుకుంటాయి. అలాంటి సమయంలో ఇలా నిర్లక్ష్యంగా వెళ్తే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. పోలీసులు ఇలా వెళ్లే వాహనాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. రహదారిపై వెళ్తున్న కొందరి నిర్లక్ష్యం కారణంగా నిత్యం ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రమాదాలు పరిపాటిగా మారుతున్నా కొందరి వైఖరి మారడం లేదు. నార్సింగి రోడ్డులో ఊసలు లోడ్‌తో ఓ లారీ వెళ్తోంది. ఊసల చివర ఎలాంటి మూత వేయకుండా ప్రమాదకరంగా తరలిస్తున్నారు. నగరంలో దగ్గర..దగ్గరగా వాహనాలు ప్రయాణిస్తుంటాయి. ముందు వాహనం సడన్‌గా బ్రేకులు వేస్తే వెనుక వచ్చే వాహనాలు ఢీకొట్టుకుంటాయి. అలాంటి సమయంలో ఇలా నిర్లక్ష్యంగా వెళ్తే ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. పోలీసులు ఇలా వెళ్లే వాహనాలకు అడ్డుకట్ట వేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
19/24
బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానం వద్ద మురుగు సమస్య కొన్నినెలలుగా భక్తులను వేధిస్తుంది. గత్యంతరం లేక మురుగునీటి పక్కనే వంటలు చేయడం, భోజనాలు చేయడం, వాహన పూజలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. దేవాలయం వెనుక ఉన్న శ్రీరామ్‌నగర్‌ కాలనీకి ఆనుకుని ఉన్న మ్యాన్‌హోళ్లు నుంచి ఈ మురుగు వచ్చి దేవాలయం వద్ద నిలిచిపోతుంది. మురుగు సమస్య పరిష్కారానికి జలమండలి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ దేవస్థానం వద్ద మురుగు సమస్య కొన్నినెలలుగా భక్తులను వేధిస్తుంది. గత్యంతరం లేక మురుగునీటి పక్కనే వంటలు చేయడం, భోజనాలు చేయడం, వాహన పూజలు నిర్వహించడం వంటివి చేస్తున్నారు. దేవాలయం వెనుక ఉన్న శ్రీరామ్‌నగర్‌ కాలనీకి ఆనుకుని ఉన్న మ్యాన్‌హోళ్లు నుంచి ఈ మురుగు వచ్చి దేవాలయం వద్ద నిలిచిపోతుంది. మురుగు సమస్య పరిష్కారానికి జలమండలి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
20/24
ఐటీ కారిడార్‌ ప్రాంతంలో రాయదుర్గం మెట్రో స్టేషన్‌ ఎడమవైపు మార్గంలో డ్రైనేజీ పొంగి మురుగు ప్రవహిస్తోంది. స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు అడుగుతీసి అడుగేయలేని స్థితిలో అక్కడ మురుగు చేరుకుంటోంది. ఐటీ కారిడార్‌ ప్రాంతంలో రాయదుర్గం మెట్రో స్టేషన్‌ ఎడమవైపు మార్గంలో డ్రైనేజీ పొంగి మురుగు ప్రవహిస్తోంది. స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు అడుగుతీసి అడుగేయలేని స్థితిలో అక్కడ మురుగు చేరుకుంటోంది.
21/24
మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో హై లైఫ్‌ పేరిట ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శన శుక్రవారం ఆరంభమైంది. సినీనటి సురభి, శాన్విమేఘన ముఖ్య అతిథిలుగా హాజరై జ్యోతిని వెలిగించి ప్రదర్శనను ప్రారంభించారు. ముద్దుగుమ్మలు సురభి, శాన్వీతోపాటు పలువురు రూపదర్శినులు సరికొత్త వస్త్రశ్రేణిలో హొయలుపోయారు. ఈ నెల 26 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో వివిధ నగరాలకు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందించి రంగురంగుల చీరలు, డ్రెస్సులు, ఆభరణాలు, ఫ్యాషన్‌ ఉత్పత్తులు, గృహాలంకరణ వస్తువులు అనేకం కొలువుదీరాయి. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో హై లైఫ్‌ పేరిట ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శన శుక్రవారం ఆరంభమైంది. సినీనటి సురభి, శాన్విమేఘన ముఖ్య అతిథిలుగా హాజరై జ్యోతిని వెలిగించి ప్రదర్శనను ప్రారంభించారు. ముద్దుగుమ్మలు సురభి, శాన్వీతోపాటు పలువురు రూపదర్శినులు సరికొత్త వస్త్రశ్రేణిలో హొయలుపోయారు. ఈ నెల 26 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో వివిధ నగరాలకు చెందిన ఫ్యాషన్‌ డిజైనర్లు రూపొందించి రంగురంగుల చీరలు, డ్రెస్సులు, ఆభరణాలు, ఫ్యాషన్‌ ఉత్పత్తులు, గృహాలంకరణ వస్తువులు అనేకం కొలువుదీరాయి.
22/24
ఐడీఏ బొల్లారంలో రోడ్డుమీద రేగుతున్న దుమ్ము వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇదే దారిలో పారిశ్రామిక వ్యర్థాలు పోగై ఉండటంతో రసాయనాలు పేరుకుని కొన్ని నెలలుగా ఉన్నందున ఇక్కడ రేగే దుమ్ము కళ్లలో పడితే అనారోగ్యం పాలు కావాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. చాలాచోట్ల పారిశ్రామిక వ్యర్థాలు కాలువలా పారుతూ రోడ్డు పైకి వస్తున్నాయి. సమీప రోడ్లన్నీ రంగుమారి అధ్వాన్నంగా మారినా పట్టించుకోవడం లేదు. ఐడీఏ బొల్లారంలో రోడ్డుమీద రేగుతున్న దుమ్ము వాహనదారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇదే దారిలో పారిశ్రామిక వ్యర్థాలు పోగై ఉండటంతో రసాయనాలు పేరుకుని కొన్ని నెలలుగా ఉన్నందున ఇక్కడ రేగే దుమ్ము కళ్లలో పడితే అనారోగ్యం పాలు కావాల్సి వస్తుందేమోనని భయపడుతున్నారు. చాలాచోట్ల పారిశ్రామిక వ్యర్థాలు కాలువలా పారుతూ రోడ్డు పైకి వస్తున్నాయి. సమీప రోడ్లన్నీ రంగుమారి అధ్వాన్నంగా మారినా పట్టించుకోవడం లేదు.
23/24
కేపీహెచ్‌బీకాలనీ డివిజన్‌ వసంత్‌నగర్‌ కాలనీ లోపలి నుంచి జేఎన్‌టీయూ మెట్రోస్టేషన్‌ సర్వీసు రోడ్డులోకి వచ్చే మలుపులో ప్రమాదం నెలకొంది. మలుపులో రోడ్డు కోసుకుపోయి అధ్వానంగా రాళ్లు, రప్పలతో కనిపిస్తుంది. వాహనదారులకు అంతరాయం కలుగుతుంది. కేపీహెచ్‌బీకాలనీ డివిజన్‌ వసంత్‌నగర్‌ కాలనీ లోపలి నుంచి జేఎన్‌టీయూ మెట్రోస్టేషన్‌ సర్వీసు రోడ్డులోకి వచ్చే మలుపులో ప్రమాదం నెలకొంది. మలుపులో రోడ్డు కోసుకుపోయి అధ్వానంగా రాళ్లు, రప్పలతో కనిపిస్తుంది. వాహనదారులకు అంతరాయం కలుగుతుంది.
24/24
కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌ నుంచి దేవీనగర్‌కు వెళ్లే రోడ్డులో మలుపు వద్ద మంజీరా స్లూయిజ్‌వాల్వ్‌ గుంతతో ప్రమాదం పొంచిఉంది. మలుపు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడం.. గుంతపై మూత లేకపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. కూకట్‌పల్లి సంగీత్‌నగర్‌ నుంచి దేవీనగర్‌కు వెళ్లే రోడ్డులో మలుపు వద్ద మంజీరా స్లూయిజ్‌వాల్వ్‌ గుంతతో ప్రమాదం పొంచిఉంది. మలుపు వద్ద రోడ్డు ఇరుకుగా ఉండడం.. గుంతపై మూత లేకపోవడంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుంది.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని