News In pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 27 Jun 2022 22:10 IST
1/25
జర్మనీలో నిర్వహించిన జీ7 దేశాల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కలిసి చాయ్‌ తాగుతూ చర్చలు జరిపారు. జర్మనీలో నిర్వహించిన జీ7 దేశాల సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మేక్రాన్‌తో కలిసి చాయ్‌ తాగుతూ చర్చలు జరిపారు.
2/25
లిస్బన్‌లో సోమవారం యునైటెడ్‌ నేషన్స్‌ ఓషియన్‌ సదస్సు ప్రారంభమైంది. జులై  1 వరకు జరగనున్న ఈ సదస్సులో సముద్రాలను సంరక్షించేందుకు అంతర్జాతీయ చట్టాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఆందోళనకారులు సదస్సు జరుగుతున్న భవనం ఎదుట ఇలా చేపలను పోలిన వేషధారణతో వినూత్న నిరసన చేపట్టారు. లిస్బన్‌లో సోమవారం యునైటెడ్‌ నేషన్స్‌ ఓషియన్‌ సదస్సు ప్రారంభమైంది. జులై 1 వరకు జరగనున్న ఈ సదస్సులో సముద్రాలను సంరక్షించేందుకు అంతర్జాతీయ చట్టాలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పలువురు ఆందోళనకారులు సదస్సు జరుగుతున్న భవనం ఎదుట ఇలా చేపలను పోలిన వేషధారణతో వినూత్న నిరసన చేపట్టారు.
3/25
4/25
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అల్లూరి వేషధారణలో ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అల్లూరి వేషధారణలో ప్రదర్శన ఇచ్చి ఆకట్టుకున్నారు.
5/25
ఈ ఏడాది ఖైరతాబాద్‌లో 50 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించనున్నారు. పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా ఖైరతాబాద్‌ గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఈ సందర్భంగా పీజేఆర్‌ కుమార్తె, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి విగ్రహం నమూనా వద్ద పూజలు చేశారు. ఆమె ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఖైరతాబాద్‌లో 50 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించనున్నారు. పంచముఖ మహాలక్ష్మీ గణపతిగా ఖైరతాబాద్‌ గణపతి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్‌ గణేశ్‌ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఈ సందర్భంగా పీజేఆర్‌ కుమార్తె, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి విగ్రహం నమూనా వద్ద పూజలు చేశారు. ఆమె ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
6/25
ఆత్మకూరు ఉపఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా భారీ మెజార్టీతో గెలిచిన విక్రమ్‌రెడ్డిని సీఎం అభినందించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు. ఆత్మకూరు ఉపఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా భారీ మెజార్టీతో గెలిచిన విక్రమ్‌రెడ్డిని సీఎం అభినందించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.
7/25
విద్యుత్తు ఛార్జీలు పెరగడంతో హైదరాబాద్‌ నగరవాసులు పలువురు సౌర పలకలను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కూకట్‌పల్లిలోని మలేసియన్‌ టౌన్‌షిప్‌ భవనాలపై ఏర్పాటు చేసుకున్న సౌర పలకలను ఈ చిత్రంలో చూడవచ్చు. విద్యుత్తు ఛార్జీలు పెరగడంతో హైదరాబాద్‌ నగరవాసులు పలువురు సౌర పలకలను ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కూకట్‌పల్లిలోని మలేసియన్‌ టౌన్‌షిప్‌ భవనాలపై ఏర్పాటు చేసుకున్న సౌర పలకలను ఈ చిత్రంలో చూడవచ్చు.
8/25
ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఇతర జీ7 దేశాల అధినేతలతో వివిధ అంశాలపై చర్చించారు. ప్రధాని నరేంద్ర మోదీ జర్మనీలో జరుగుతున్న జీ7 దేశాల సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జర్మనీ ఛాన్స్‌లర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఇతర జీ7 దేశాల అధినేతలతో వివిధ అంశాలపై చర్చించారు.
9/25
10/25
శ్రీకాకుళంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న అమ్మఒడి’ నిధులను విడుదల చేశారు. అంతకు ముందు సీఎం సభాస్థలికి వాహనంలో వస్తుండగా పలువురు మహిళలు ఆయనకు అభివాదం చేస్తూ అభిమానం చాటుకున్నారు. శ్రీకాకుళంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న అమ్మఒడి’ నిధులను విడుదల చేశారు. అంతకు ముందు సీఎం సభాస్థలికి వాహనంలో వస్తుండగా పలువురు మహిళలు ఆయనకు అభివాదం చేస్తూ అభిమానం చాటుకున్నారు.
11/25
12/25
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెరాస మద్దతు పలికింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ తదితరులు ఆయనతో పాటు వెళ్లి నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. అంతకు ముందు యశ్వంత్‌ సిన్హాతో కేటీఆర్‌ వివిధ అంశాలపై చర్చించారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తెరాస మద్దతు పలికింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌, తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, రంజిత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌ తదితరులు ఆయనతో పాటు వెళ్లి నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొన్నారు. అంతకు ముందు యశ్వంత్‌ సిన్హాతో కేటీఆర్‌ వివిధ అంశాలపై చర్చించారు.
13/25
14/25
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధురలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణ కుటీరంలోని మహిళలతో మాట్లాడారు. ఇక్కడ వితంతువులు, పేద, నిరాశ్రయులైన మహిళలకు నైపుణ్యాలు కల్పించి ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేలా ప్రోత్సహిస్తారు. వితంతువులు పునర్వివాహం చేసుకునేందుకు సాయం సైతం అందిస్తారు. కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని మధురలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న కృష్ణ కుటీరంలోని మహిళలతో మాట్లాడారు. ఇక్కడ వితంతువులు, పేద, నిరాశ్రయులైన మహిళలకు నైపుణ్యాలు కల్పించి ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేలా ప్రోత్సహిస్తారు. వితంతువులు పునర్వివాహం చేసుకునేందుకు సాయం సైతం అందిస్తారు. కార్యక్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనందీబెన్‌ పాల్గొన్నారు.
15/25
16/25
కేంద్ర ప్రభుత్వం సైనిక నియామకాల కోసం అమల్లోకి తీసుకొచ్చిన ‘అగ్ని పథ్‌’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ నేడు సత్యాగ్రహ 

దీక్షకు పిలుపునిచ్చింది. మల్కాజిగిరిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు. 
కేంద్ర ప్రభుత్వం సైనిక నియామకాల కోసం అమల్లోకి తీసుకొచ్చిన ‘అగ్ని పథ్‌’ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ టీపీసీసీ నేడు సత్యాగ్రహ దీక్షకు పిలుపునిచ్చింది. మల్కాజిగిరిలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దీక్షలో కూర్చున్నారు.
17/25
హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్ నార్సింగిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు 

ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాల్లో రోగుల సహాయకులకు రూ.5కే 

భోజనం అందించే కార్యక్రమానికి గత నెలలో శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ ఆస్పత్రులకు భోజనం సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా 

ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ఇవాళ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు. హరే కృష్ణ మూవ్‌మెంట్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్ నార్సింగిలో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీహెచ్‌ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానాల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించే కార్యక్రమానికి గత నెలలో శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ ఆస్పత్రులకు భోజనం సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ను ఇవాళ ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పారు.
18/25
19/25
తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తున్న ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్‌, కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవారిని దర్శించుకొని వస్తున్న ప్రముఖ సినీనటుడు శ్రీకాంత్‌, కుటుంబ సభ్యులు
20/25
నటి స్నేహ, ఆమె భర్త ప్రసన్న నటి స్నేహ, ఆమె భర్త ప్రసన్న
21/25
నెల్లూరు నగరం నర్తకి సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద అడ్డుగా కడుతున్న విభాగిని నిర్మాణాన్ని తెదేపా నాయకులు అడ్డుకున్నారు.అక్కడ 

కట్టిన గోడను కూల్చివేశారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 
నెల్లూరు నగరం నర్తకి సెంటర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద అడ్డుగా కడుతున్న విభాగిని నిర్మాణాన్ని తెదేపా నాయకులు అడ్డుకున్నారు.అక్కడ కట్టిన గోడను కూల్చివేశారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
22/25
23/25
హైదరాబాద్‌లోని టీ-హబ్‌ నూతన భవనం ఆదివారం రాత్రి ఇలా విద్యుద్దీపాలతో వెలుగులీనింది. మంత్రి కేటీఆర్‌ ఈ చిత్రాలను తన ట్విటర్‌ 

ఖాతాలో పంచుకున్నారు. రేపు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు. 
హైదరాబాద్‌లోని టీ-హబ్‌ నూతన భవనం ఆదివారం రాత్రి ఇలా విద్యుద్దీపాలతో వెలుగులీనింది. మంత్రి కేటీఆర్‌ ఈ చిత్రాలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. రేపు సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా దీనిని ప్రారంభించనున్నారు.
24/25
25/25

మరిన్ని