News In pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 28 Jun 2022 13:13 IST
1/16
తాటిచెట్లను ఎక్కడ చూసినా ఒకే మొదలు నుంచి కాండం ఉండి చివర కొమ్మలు ఉండటం సాధారణం. కానీ, శ్రీకాకుళం జిల్లా జలుమూరు 

మండలంలోని సుబ్రహ్మణ్యపురం సమీపంలోని చెరువు గట్టుపై ఉన్న ఓ తాటిచెట్టు మొదలుభాగం పైన నాలుగు చెట్లుగా విడిపోయింది. 

కొత్తగా గ్రామానికి వచ్చేవారు దీన్ని తిలకించి ఆశ్చర్యపోతున్నారు. దీన్ని ఉద్యానశాఖ అధికారి ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా విత్తనంలో 

ఉత్పరివర్తనం వల్ల, జీన్సులో మార్పుల వల్ల ఇలాంటి మొక్కలు పుడతాయని తాటిచెట్లలో ఇలాంటివి చాలా అరుదని అన్నారు. తాటిచెట్లను ఎక్కడ చూసినా ఒకే మొదలు నుంచి కాండం ఉండి చివర కొమ్మలు ఉండటం సాధారణం. కానీ, శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలోని సుబ్రహ్మణ్యపురం సమీపంలోని చెరువు గట్టుపై ఉన్న ఓ తాటిచెట్టు మొదలుభాగం పైన నాలుగు చెట్లుగా విడిపోయింది. కొత్తగా గ్రామానికి వచ్చేవారు దీన్ని తిలకించి ఆశ్చర్యపోతున్నారు. దీన్ని ఉద్యానశాఖ అధికారి ప్రసాదరావు వద్ద ప్రస్తావించగా విత్తనంలో ఉత్పరివర్తనం వల్ల, జీన్సులో మార్పుల వల్ల ఇలాంటి మొక్కలు పుడతాయని తాటిచెట్లలో ఇలాంటివి చాలా అరుదని అన్నారు.
2/16
మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో తెనాలిలో ఏడాది పొడవునా సాగుతున్న ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో దర్శకేంద్రుడు 

రాఘవేంద్రరావు సోమవారం పాల్గొన్నారు. రోజూ ఎన్టీఆర్‌ చిత్రాలను ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శిస్తున్న తెనాలిలోని పెమ్మసాని థియేటర్‌కు 

రాఘవేంద్రరావు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన తన చిత్రంతో కూడిన ఫ్లెక్సీ వద్ద ఇలా నిలుచున్నారు.   మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో తెనాలిలో ఏడాది పొడవునా సాగుతున్న ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకల్లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోమవారం పాల్గొన్నారు. రోజూ ఎన్టీఆర్‌ చిత్రాలను ప్రేక్షకులకు ఉచితంగా ప్రదర్శిస్తున్న తెనాలిలోని పెమ్మసాని థియేటర్‌కు రాఘవేంద్రరావు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన తన చిత్రంతో కూడిన ఫ్లెక్సీ వద్ద ఇలా నిలుచున్నారు.
3/16
నందికొట్కూరు మండలం నాగలూటి గ్రామంలో అక్రమ తవ్వకాలతో ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అనధికారిక 

తవ్వకాల వల్ల ప్రజలకు ప్రమాదాలు జరిగే ఆస్కారమున్నా సరే.. తమ జేబులు నిండితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామంలో 

దశాబ్దాలుగా నాపరాతి గనుల తవ్వకాలు సాగుతున్నాయి. ఒక్కొక్కరు కొన్ని సెంట్ల విస్తీర్ణానికి మాత్రమే అనుమతి తీసుకుని ఎకరాలకొద్దీ 

తవ్వకాలు సాగిస్తున్నారు. అడ్డు వచ్చిన చెట్లు, విద్యుత్తు స్తంభాలను కూడా వదలడం లేదు. చిత్రంలోని విద్యుత్తు టవరే ఇందుకు 

నిదర్శనం. 11 కేవీ విద్యుత్తు లైనుకు సంబంధించిన ఈ టవర్‌ చుట్టూ తవ్వేశారు. ఇది కూలితే పెను ప్రమాదం తప్పదు. ఇది కీలకమైన 

లైను కావడంతో జిల్లా మొత్తం విద్యుత్తు సరఫరా ఆగిపోయే ఆస్కారముంది. నందికొట్కూరు మండలం నాగలూటి గ్రామంలో అక్రమ తవ్వకాలతో ప్రకృతి వనరులను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. అనధికారిక తవ్వకాల వల్ల ప్రజలకు ప్రమాదాలు జరిగే ఆస్కారమున్నా సరే.. తమ జేబులు నిండితే చాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామంలో దశాబ్దాలుగా నాపరాతి గనుల తవ్వకాలు సాగుతున్నాయి. ఒక్కొక్కరు కొన్ని సెంట్ల విస్తీర్ణానికి మాత్రమే అనుమతి తీసుకుని ఎకరాలకొద్దీ తవ్వకాలు సాగిస్తున్నారు. అడ్డు వచ్చిన చెట్లు, విద్యుత్తు స్తంభాలను కూడా వదలడం లేదు. చిత్రంలోని విద్యుత్తు టవరే ఇందుకు నిదర్శనం. 11 కేవీ విద్యుత్తు లైనుకు సంబంధించిన ఈ టవర్‌ చుట్టూ తవ్వేశారు. ఇది కూలితే పెను ప్రమాదం తప్పదు. ఇది కీలకమైన లైను కావడంతో జిల్లా మొత్తం విద్యుత్తు సరఫరా ఆగిపోయే ఆస్కారముంది.
4/16
పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం క్వారీలో యంత్రాల వినియోగం ఎక్కువగా ఉంది. నిత్యం వందల లీటర్ల డీజిల్‌ అవసరమవుతోంది. 

రాష్ట్రంలో లీటర్‌ ధర రూ.99.87 ఉంటే కర్ణాటకలో రూ.8లు తక్కువగా ఉంది. దీంతో క్వారీ వాసులు ఆటోలో 15 క్యాన్లలో(ఒక్క క్యాన్‌లో 

50లీటర్లు) ఇలా డీజిల్‌ను నిత్యం తరలిస్తున్నారు. ధర తక్కువగా ఉండడంతో అధిక వాహనాలకు ఆ డీజిల్‌నే వాడుతున్నారు. పెద్దకడబూరు మండలం చిన్నతుంబళం క్వారీలో యంత్రాల వినియోగం ఎక్కువగా ఉంది. నిత్యం వందల లీటర్ల డీజిల్‌ అవసరమవుతోంది. రాష్ట్రంలో లీటర్‌ ధర రూ.99.87 ఉంటే కర్ణాటకలో రూ.8లు తక్కువగా ఉంది. దీంతో క్వారీ వాసులు ఆటోలో 15 క్యాన్లలో(ఒక్క క్యాన్‌లో 50లీటర్లు) ఇలా డీజిల్‌ను నిత్యం తరలిస్తున్నారు. ధర తక్కువగా ఉండడంతో అధిక వాహనాలకు ఆ డీజిల్‌నే వాడుతున్నారు.
5/16
గుంతకల్లులో సోమవారం నిర్వహించిన వైకాపా ప్లీనరీ సభకు భారీగా తరలివచ్చినా.. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాట్లాడుతుండగానే 

వెళ్లిపోయారు. మంత్రి ఉష ప్రసంగం తర్వాత ఒక్కొక్కరుగా వెనుదిరిగారు. కుర్చీలు ఖాళీ అయ్యాయి. గుంతకల్లులో సోమవారం నిర్వహించిన వైకాపా ప్లీనరీ సభకు భారీగా తరలివచ్చినా.. ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మాట్లాడుతుండగానే వెళ్లిపోయారు. మంత్రి ఉష ప్రసంగం తర్వాత ఒక్కొక్కరుగా వెనుదిరిగారు. కుర్చీలు ఖాళీ అయ్యాయి.
6/16
గుంటూరు జిల్లా పాలనాధికారి భవన సముదాయంలోని జిల్లా సహకార అధికారి కార్యాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. 

సోమవారం కురిసిన చిన్నపాటి వర్షానికే కార్యాలయమంతా నీరు చేరింది. విధులు నిర్వహించే వీలులేకున్నా, విలువైన పత్రాలు 

తడిసిపోతున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. గుంటూరు జిల్లా పాలనాధికారి భవన సముదాయంలోని జిల్లా సహకార అధికారి కార్యాలయం పూర్తిగా శిథిలమై ప్రమాదకరంగా మారింది. సోమవారం కురిసిన చిన్నపాటి వర్షానికే కార్యాలయమంతా నీరు చేరింది. విధులు నిర్వహించే వీలులేకున్నా, విలువైన పత్రాలు తడిసిపోతున్నా పట్టించుకునేవారు కరవయ్యారు.
7/16
8/16
ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం విజయవాడ 

బందరురోడ్డులో 125 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శనగా వెళుతున్న విద్యార్థులు ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం విజయవాడ బందరురోడ్డులో 125 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శనగా వెళుతున్న విద్యార్థులు
9/16
రెండు రోజులుగా కురిసిన వర్షాలకు లంక భూములు బురదమయమం కావడంతో ఆ ప్రాంతంలో ఉంటున్న కోతులు భారీ సంఖ్యలో తమ 

పిల్లలతో పొడిగా ఉండే ప్రదేశాలకు వలస వస్తున్నాయి. సోమవారం కంకిపాడు మండలం మద్దూరు-రొయ్యూరు(వయా 

కాసరనేనివారిపాలెం) వరకు రహదారిపై గుంపులుగా చేరి ప్రయాణికులను బెదిరిస్తున్నాయి.  ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వీటిని 

గుర్తించకుండా గుంపు దగ్గరకు వస్తే.. అవి వెళ్లి పోయేవరకు కదలకుండా ఉండాలని చెబుతున్నారు. లంక భూముల్లో మొక్కజొన్న, చెరకు, 

పండ్ల తోటలకు ఇవి నష్టాన్ని చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని దూరంగా తరిమే చర్యలు తీసుకోవాలని అటవీ 

శాఖను కోరుతున్నారు. రెండు రోజులుగా కురిసిన వర్షాలకు లంక భూములు బురదమయమం కావడంతో ఆ ప్రాంతంలో ఉంటున్న కోతులు భారీ సంఖ్యలో తమ పిల్లలతో పొడిగా ఉండే ప్రదేశాలకు వలస వస్తున్నాయి. సోమవారం కంకిపాడు మండలం మద్దూరు-రొయ్యూరు(వయా కాసరనేనివారిపాలెం) వరకు రహదారిపై గుంపులుగా చేరి ప్రయాణికులను బెదిరిస్తున్నాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు వీటిని గుర్తించకుండా గుంపు దగ్గరకు వస్తే.. అవి వెళ్లి పోయేవరకు కదలకుండా ఉండాలని చెబుతున్నారు. లంక భూముల్లో మొక్కజొన్న, చెరకు, పండ్ల తోటలకు ఇవి నష్టాన్ని చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీటిని దూరంగా తరిమే చర్యలు తీసుకోవాలని అటవీ శాఖను కోరుతున్నారు.
10/16
విశాఖ జిల్లా గుడ్లవానిపాలెం, సాగర్‌నగర్, ముసలయ్య పాలెం తదితర ప్రాంతాల్లో సముద్రం సోమవారం అల్లకల్లోలంగా కనిపించింది. 

కెరటాల ఉద్ధృతితో సాగర జలాలు సాధారణ రోజుల కంటే బాగా ముందుకు చొచ్చు కొచ్చాయి. అలల బీభత్సానికి సహజ సిద్ధ అందాలకు 

నెలవైన ఇసుక తిన్నెలు జలమయమై కరిగిపోయాయి. కనుచూపు మేర సాగరం కోతకు గురైన దృశ్యాలు కనిపించాయి. విశాఖ జిల్లా గుడ్లవానిపాలెం, సాగర్‌నగర్, ముసలయ్య పాలెం తదితర ప్రాంతాల్లో సముద్రం సోమవారం అల్లకల్లోలంగా కనిపించింది. కెరటాల ఉద్ధృతితో సాగర జలాలు సాధారణ రోజుల కంటే బాగా ముందుకు చొచ్చు కొచ్చాయి. అలల బీభత్సానికి సహజ సిద్ధ అందాలకు నెలవైన ఇసుక తిన్నెలు జలమయమై కరిగిపోయాయి. కనుచూపు మేర సాగరం కోతకు గురైన దృశ్యాలు కనిపించాయి.
11/16
సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రయాణికులు సులువుగా సమీప బస్టాండ్లకు వెళ్లేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఉచిత బ్యాటరీ వాహనాన్ని 

సోమవారం ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ యాదగిరితో కలిసి డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ ఎ.కె.గుప్తా ప్రారంభించారు. ప్రస్తుతం వృద్ధులు, 

దివ్యాంగులు, చంటి పిల్లలున్నవారికి ప్రాధాన్యమిస్తారు. సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ ఏడీఆర్‌ఎం రాథోడ్, డీసీఎం బసవరాజు తదితరులు 

పాల్గొన్నారు.     సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రయాణికులు సులువుగా సమీప బస్టాండ్లకు వెళ్లేందుకు టీఎస్‌ఆర్టీసీ ప్రవేశపెట్టిన ఉచిత బ్యాటరీ వాహనాన్ని సోమవారం ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఈడీ యాదగిరితో కలిసి డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ ఎ.కె.గుప్తా ప్రారంభించారు. ప్రస్తుతం వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలున్నవారికి ప్రాధాన్యమిస్తారు. సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌ ఏడీఆర్‌ఎం రాథోడ్, డీసీఎం బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
12/16
నగరంలో మరోదఫా హరిత హారానికి అధికార యంత్రాంగం శ్రీకారం చుడుతోంది. నగర శివారు కొంగరకలాన్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ 

ప్రాంగణంలో 39 వేల మొక్కలు నాటారు. వానలకు అవి పచ్చందాలతో కళకళలాడుతున్నాయి. నగరంలో మరోదఫా హరిత హారానికి అధికార యంత్రాంగం శ్రీకారం చుడుతోంది. నగర శివారు కొంగరకలాన్‌లో రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ప్రాంగణంలో 39 వేల మొక్కలు నాటారు. వానలకు అవి పచ్చందాలతో కళకళలాడుతున్నాయి.
13/16
ఎంత అదృష్టం? క్షణంలో ప్రమాదం తప్పింది. చిన్నారిని ఎత్తుకుని ఓ మహిళ యూసఫ్‌గూడ కూడలిలో రహదారిపై విభాగినిని అడ్డంగా 

దాటే యత్నంలో మరోవైపు నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సును చూసి ఒక్కసారిగా ఆగింది. ఆ ఒక్క క్షణం చూడకుండా ఏమాత్రం 

ముందుకు వెళ్లినా చిన్నారి సహా ప్రమాదానికి గురయ్యే వారే. ఎంత అదృష్టం? క్షణంలో ప్రమాదం తప్పింది. చిన్నారిని ఎత్తుకుని ఓ మహిళ యూసఫ్‌గూడ కూడలిలో రహదారిపై విభాగినిని అడ్డంగా దాటే యత్నంలో మరోవైపు నుంచి వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సును చూసి ఒక్కసారిగా ఆగింది. ఆ ఒక్క క్షణం చూడకుండా ఏమాత్రం ముందుకు వెళ్లినా చిన్నారి సహా ప్రమాదానికి గురయ్యే వారే.
14/16
అసలే వర్షాకాలం.. వానలకు వరద ఉప్పొంగే సమయం.. సరూర్‌నగర్‌ చెరువు కట్ట భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది. రక్షణ రాళ్లు 

తొలగిపోయి..  మట్టి రాలిపడుతూ భయం గొలుపుతోంది. అటువైపు వేలాది గృహాలు ఉన్నాయి. భారీ వర్షాలకు ప్రమాదాలు 

జరగకమునుపే అధికారులు మేల్కొవాల్సిన అవసరం ఉంది. అసలే వర్షాకాలం.. వానలకు వరద ఉప్పొంగే సమయం.. సరూర్‌నగర్‌ చెరువు కట్ట భద్రత ప్రశ్నార్ధకంగా మారుతోంది. రక్షణ రాళ్లు తొలగిపోయి.. మట్టి రాలిపడుతూ భయం గొలుపుతోంది. అటువైపు వేలాది గృహాలు ఉన్నాయి. భారీ వర్షాలకు ప్రమాదాలు జరగకమునుపే అధికారులు మేల్కొవాల్సిన అవసరం ఉంది.
15/16
ఇటీవల వర్షాలకు మున్నేరు వరద క్రమంగా పెరుగుతోంది. ఖమ్మం ప్రకాశ్‌నగర్‌ ఆనకట్ట వద్ద చెక్‌డ్యాం అలుగు పారుతుండటంతో చేపల 

వేటకు పడవలతో దిగారు. సుందర దృశ్యాలు చూపరులకు వినోదం పంచాయి. సోమవారం కనిపించిన దృశ్యమిది. ఇటీవల వర్షాలకు మున్నేరు వరద క్రమంగా పెరుగుతోంది. ఖమ్మం ప్రకాశ్‌నగర్‌ ఆనకట్ట వద్ద చెక్‌డ్యాం అలుగు పారుతుండటంతో చేపల వేటకు పడవలతో దిగారు. సుందర దృశ్యాలు చూపరులకు వినోదం పంచాయి. సోమవారం కనిపించిన దృశ్యమిది.
16/16
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులో వరి నాటేందుకు సిద్ధంగా ఉన్న నారు మడి నీటిలో గ్రామ 

శివారులో ఉన్న రాళ్లగుట్ట పెదవుల ఆకారంలో కనిపిస్తుంది. నారుమడి నీటిలో రెండు పెదవుల కలయిక లాగా ప్రకృతి సౌందర్య దృశ్యం ఆ 

దారి నుంచి వెళ్లే రైతులకు కనువిందు చేస్తోంది.  యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామ శివారులో వరి నాటేందుకు సిద్ధంగా ఉన్న నారు మడి నీటిలో గ్రామ శివారులో ఉన్న రాళ్లగుట్ట పెదవుల ఆకారంలో కనిపిస్తుంది. నారుమడి నీటిలో రెండు పెదవుల కలయిక లాగా ప్రకృతి సౌందర్య దృశ్యం ఆ దారి నుంచి వెళ్లే రైతులకు కనువిందు చేస్తోంది.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని