News In pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 28 Jun 2022 20:26 IST
1/20
ఏలూరు జిల్లా మండవల్లి మండలం కొవ్వాడలంకకు చెందిన రైతు సాయిబాబు తన పశువులను వాహనదారులు ఢీ కొట్టకుండా సరికొత్త 

ఉపాయం ఆలోచించారు. వాడిపడేసిన తెల్లని డబ్బాలను వాటి మెడలో కట్టారు. వింతగా కన్పిస్తున్న వీటిని చూసి అల్లంత దూరం నుంచే 

వాహన చోదకులు అప్రమత్తం అవుతున్నారని ఆయన తెలిపారు. 	ఏలూరు జిల్లా మండవల్లి మండలం కొవ్వాడలంకకు చెందిన రైతు సాయిబాబు తన పశువులను వాహనదారులు ఢీ కొట్టకుండా సరికొత్త ఉపాయం ఆలోచించారు. వాడిపడేసిన తెల్లని డబ్బాలను వాటి మెడలో కట్టారు. వింతగా కన్పిస్తున్న వీటిని చూసి అల్లంత దూరం నుంచే వాహన చోదకులు అప్రమత్తం అవుతున్నారని ఆయన తెలిపారు.
2/20
3/20
నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని సుగాలిమెట్ట వద్ద గాలేరు-నగరి కాలువ వెడల్పు పనులు జరుగుతున్నాయి. గోరుకల్లు నుంచి అవుకు వరకు సుమారు 57కిలోమీటర్ల మేర రూ.1247 కోట్లతో కాలువ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకుండా కూలీలు కాంక్రీటు వేస్తున్నారు. దీంతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలోని సుగాలిమెట్ట వద్ద గాలేరు-నగరి కాలువ వెడల్పు పనులు జరుగుతున్నాయి. గోరుకల్లు నుంచి అవుకు వరకు సుమారు 57కిలోమీటర్ల మేర రూ.1247 కోట్లతో కాలువ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకుండా కూలీలు కాంక్రీటు వేస్తున్నారు. దీంతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారిందని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
4/20
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద సాయంత్రం వర్షం కురిసిన అనంతరం ఆకాశం ఇలా నీలి రంగులోకి మారింది. అదే దృశ్యం 

హుస్సేన్‌సాగర్‌లో ప్రతిబింబిస్తూ కనువిందు చేసింది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద సాయంత్రం వర్షం కురిసిన అనంతరం ఆకాశం ఇలా నీలి రంగులోకి మారింది. అదే దృశ్యం హుస్సేన్‌సాగర్‌లో ప్రతిబింబిస్తూ కనువిందు చేసింది.
5/20
హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా మారడంతో నగర ప్రజలు విహారానికి మొగ్గు చూపుతున్నారు. ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని 

హుస్సేన్‌సాగర్‌ పడవల్లో విహరిస్తూ ఆస్వాదిస్తున్నారు. రకరకాల బోట్లు ఇక్కడ అందుబాటులో ఉండటంతో సాగరతీరం సందర్శకులతో 

కళకళలాడుతోంది. హైదరాబాద్‌లో వాతావరణం చల్లగా మారడంతో నగర ప్రజలు విహారానికి మొగ్గు చూపుతున్నారు. ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని హుస్సేన్‌సాగర్‌ పడవల్లో విహరిస్తూ ఆస్వాదిస్తున్నారు. రకరకాల బోట్లు ఇక్కడ అందుబాటులో ఉండటంతో సాగరతీరం సందర్శకులతో కళకళలాడుతోంది.
6/20
7/20
శ్రీలంకలో వంట గ్యాస్‌ నిల్వలు నిండుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం 

సమీపంలో పేర్చిన ఖాళీ సిలిండర్లను ఈ చిత్రంలో చూడొచ్చు. శ్రీలంకలో వంట గ్యాస్‌ నిల్వలు నిండుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గాలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం సమీపంలో పేర్చిన ఖాళీ సిలిండర్లను ఈ చిత్రంలో చూడొచ్చు.
8/20
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు మంచి నీటి క్యాన్లను ద్విచక్ర వాహనంపై పెట్టుకొని ఓ వ్యక్తి దూసుకెళ్తున్న ఈ దృశ్యం 

నారాయణగూడ రహదారిలో కనిపించింది. వాటిలో ఏ ఒక్కటి జారినా ఇతనికే కాదు.. పక్కనున్న వాహనదారులకు ప్రమాదమే మరి! ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఆరు మంచి నీటి క్యాన్లను ద్విచక్ర వాహనంపై పెట్టుకొని ఓ వ్యక్తి దూసుకెళ్తున్న ఈ దృశ్యం నారాయణగూడ రహదారిలో కనిపించింది. వాటిలో ఏ ఒక్కటి జారినా ఇతనికే కాదు.. పక్కనున్న వాహనదారులకు ప్రమాదమే మరి!
9/20
హైదరాబాద్‌ నగరం లాలాగూడ రైల్వే ఆస్పత్రి చౌరస్తాలోని ట్రాఫిక్‌ ఐలాండ్‌లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ఈ నాలుగు సన్నాయి 

బొమ్మలు వాహనదారుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి. హైదరాబాద్‌ నగరం లాలాగూడ రైల్వే ఆస్పత్రి చౌరస్తాలోని ట్రాఫిక్‌ ఐలాండ్‌లో జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ఈ నాలుగు సన్నాయి బొమ్మలు వాహనదారుల్ని ప్రత్యేకంగా ఆకర్షిస్తున్నాయి.
10/20
ఈ నెల 30న గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు భక్తులు ముందుగానే కోటకు తరలి 

వస్తున్నారు. కోటలోని మెట్లకు పసుపు, కుంకుమ రాసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక 

పూజలు చేస్తున్నారు.  ఈ నెల 30న గోల్కొండ కోటలో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు భక్తులు ముందుగానే కోటకు తరలి వస్తున్నారు. కోటలోని మెట్లకు పసుపు, కుంకుమ రాసి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
11/20
12/20
13/20
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఆమె 

మొక్కలు నాటారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా, కలెక్టర్‌ పమేలా సత్పతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ ఎయిమ్స్‌ను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో ఆమె మొక్కలు నాటారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌ వికాస్‌ భాటియా, కలెక్టర్‌ పమేలా సత్పతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
14/20
నేడు విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణా-వాణి ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, 

శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ వీరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. భవిష్యత్‌ చదువులకు తోడ్పాటునందిస్తామని 

చెప్పారు. సీఈసీ గ్రూపులో చదువుతున్న వీణకు 712 మార్కులు రాగా.. వాణి 707 మార్కులు సాధించింది. నేడు విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో అవిభక్త కవలలు వీణా-వాణి ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ వీరికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసారు. భవిష్యత్‌ చదువులకు తోడ్పాటునందిస్తామని చెప్పారు. సీఈసీ గ్రూపులో చదువుతున్న వీణకు 712 మార్కులు రాగా.. వాణి 707 మార్కులు సాధించింది.
15/20
దివంగత ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌లోని పీవీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ

సురభి వాణీదేవి, మంత్రి నిరంజన్‌రెడ్డి తదితరులు దివంగత ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతి సందర్భంగా నెక్లెస్‌ రోడ్‌లోని పీవీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, మంత్రి నిరంజన్‌రెడ్డి తదితరులు
16/20
17/20
హైదరాబాద్‌ అమీర్‌పేటలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులకు వినికిడి పరికరాలు, ఎలక్ట్రానిక్‌ 

చేతికర్రలు, బ్యాటరీ వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి వారితో కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్‌ అమీర్‌పేటలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా దివ్యాంగులకు వినికిడి పరికరాలు, ఎలక్ట్రానిక్‌ చేతికర్రలు, బ్యాటరీ వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి వారితో కాసేపు ముచ్చటించారు.
18/20
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్‌ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు తిరుపతి మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. గత 3 

మాసాలుగా పనిముట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా 

పోయిందని, దీంతో ఈ నిరసన చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రంగనాయకులు, నాయకులు 

తాతారావు, సుబ్రమణ్యం, ఎలుమలై, ఇందుమతి, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్‌ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు తిరుపతి మున్సిపల్ ఆఫీస్ ఎదుట నిరసనకు దిగారు. గత 3 మాసాలుగా పనిముట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని, దీంతో ఈ నిరసన చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రంగనాయకులు, నాయకులు తాతారావు, సుబ్రమణ్యం, ఎలుమలై, ఇందుమతి, షణ్ముగం తదితరులు పాల్గొన్నారు.
19/20
తమకు ఎనిమిది నెలలుగా జీతాలు అందడం లేదంటూ హైదరాబాద్‌లోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయం వద్ద రెసిడెంట్‌ డాక్టర్లు 

ఆందోళన చేశారు. జీతాలు రాక తమ కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎనిమిది నెలలుగా జీతాలు అందడం లేదంటూ హైదరాబాద్‌లోని వైద్య విద్య సంచాలకుల కార్యాలయం వద్ద రెసిడెంట్‌ డాక్టర్లు ఆందోళన చేశారు. జీతాలు రాక తమ కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
20/20
సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్ అరెస్టును నిరసిస్తూ నారాయణగూడ వైఎంసీఏ వద్ద సీపీఐ నాయకులు ధర్నా చేశారు. మాజీ ఎంపీ 

అజీజ్‌ పాషా, సీపీఐ నగర పార్టీ నేతలు నరసింహ తదితరులు పాల్గొన్నారు. సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్ అరెస్టును నిరసిస్తూ నారాయణగూడ వైఎంసీఏ వద్ద సీపీఐ నాయకులు ధర్నా చేశారు. మాజీ ఎంపీ అజీజ్‌ పాషా, సీపీఐ నగర పార్టీ నేతలు నరసింహ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని