News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 02 Jul 2022 09:22 IST
1/13
హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం పడటంతో నగరవాసులు కాస్త ఇబ్బందులు పడ్డారు. వర్షంలోనే ప్రయాణాలు కొనసాగించారు. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం పడటంతో నగరవాసులు కాస్త ఇబ్బందులు పడ్డారు. వర్షంలోనే ప్రయాణాలు కొనసాగించారు.
2/13
3/13
4/13
ఎన్టీపీసీ నిర్మించిన నీటిపై తేలియాడే 100 మెగా వాట్ల సౌర విద్యుత్తు కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా రామగుండంలో సాకారమైంది. రూ.423 కోట్ల వ్యయంతో ఎన్టీపీసీ జలాశయంపై 500 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని రూపొందించారు. 40 బ్లాకుల్లో నిర్మించిన ప్రాజెక్టులో ఇన్వర్టర్‌, అన్నీ నీటిపై తేలియాడుతూ ఉంటాయి. గతంలో 80 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తేగా, శుక్రవారం మిగతా 20 మెగావాట్ల పనులు పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రకటించారు. 100 మెగా వాట్ల విద్యుత్తును గోవాకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పరిపాలన భవనంలో సీజీఎం సునీల్‌కుమార్‌.. ప్రాజెక్టు జీఎం అనిల్‌కుమార్‌, సిబ్బందిని అభినందించారు. ఎన్టీపీసీ నిర్మించిన నీటిపై తేలియాడే 100 మెగా వాట్ల సౌర విద్యుత్తు కేంద్రంలో పూర్తిస్థాయి ఉత్పత్తి శుక్రవారం నుంచి ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు. దేశంలోనే అతిపెద్ద పర్యావరణహిత ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా రామగుండంలో సాకారమైంది. రూ.423 కోట్ల వ్యయంతో ఎన్టీపీసీ జలాశయంపై 500 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని రూపొందించారు. 40 బ్లాకుల్లో నిర్మించిన ప్రాజెక్టులో ఇన్వర్టర్‌, అన్నీ నీటిపై తేలియాడుతూ ఉంటాయి. గతంలో 80 మెగావాట్ల విద్యుత్తును అందుబాటులోకి తేగా, శుక్రవారం మిగతా 20 మెగావాట్ల పనులు పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తిని అధికారికంగా ప్రకటించారు. 100 మెగా వాట్ల విద్యుత్తును గోవాకు అందజేస్తున్నారు. ఈ సందర్భంగా పరిపాలన భవనంలో సీజీఎం సునీల్‌కుమార్‌.. ప్రాజెక్టు జీఎం అనిల్‌కుమార్‌, సిబ్బందిని అభినందించారు.
5/13
ఎల్‌.బి.నగర్‌ నందనవనం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునే నల్లాల వద్ద దుస్థితి ఇది. అక్కడే మూత్రశాలలోని కుండీలు సైతం విరిగి పడి ఉన్నాయి. పరిశుభ్రత గురించి చెప్పే బడిలోనే ఈ పరిస్థితి ఉంటే ఎలాగని పలువురు ప్రశ్నిస్తున్నారు? ఎల్‌.బి.నగర్‌ నందనవనం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునే నల్లాల వద్ద దుస్థితి ఇది. అక్కడే మూత్రశాలలోని కుండీలు సైతం విరిగి పడి ఉన్నాయి. పరిశుభ్రత గురించి చెప్పే బడిలోనే ఈ పరిస్థితి ఉంటే ఎలాగని పలువురు ప్రశ్నిస్తున్నారు?
6/13
కేపీహెచ్‌బీకాలనీ ఐదోఫేజ్‌లోని డబుల్‌రోడ్డులో డీమార్ట్‌ నుంచి మలేషియా టౌన్‌షిప్‌ వైపు వచ్చే దారిలో ఒకచోట రోడ్డు కోసుకుపోయి ఇరుకుగా ప్రమాదకరంగా మారింది. గతనెల మరమ్మతుల కోసం రోడ్డు తవ్వి పక్కనే మట్టికుప్ప వదిలేశారు. కేపీహెచ్‌బీకాలనీ ఐదోఫేజ్‌లోని డబుల్‌రోడ్డులో డీమార్ట్‌ నుంచి మలేషియా టౌన్‌షిప్‌ వైపు వచ్చే దారిలో ఒకచోట రోడ్డు కోసుకుపోయి ఇరుకుగా ప్రమాదకరంగా మారింది. గతనెల మరమ్మతుల కోసం రోడ్డు తవ్వి పక్కనే మట్టికుప్ప వదిలేశారు.
7/13
జాతీయ రహదారిపై మూసాపేట జంక్షన్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సమీపంలో భరత్‌నగర్‌ వైపు వర్షాలకు గుంతలు పడి అధ్వానంగా, ప్రమాదకరంగా తయారైంది. రద్దీ రహదారిలో వాహనదారులకు నిత్యం అంతరాయం కలుగుతుంది. జాతీయ రహదారిపై మూసాపేట జంక్షన్‌ ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సమీపంలో భరత్‌నగర్‌ వైపు వర్షాలకు గుంతలు పడి అధ్వానంగా, ప్రమాదకరంగా తయారైంది. రద్దీ రహదారిలో వాహనదారులకు నిత్యం అంతరాయం కలుగుతుంది.
8/13
వేదపండితుల మంత్రాలు.. కళాకారుల నృత్యాలు.. భక్తుల జయజయధ్వానాల నడుమ జగన్నాథ రథయాత్ర శుక్రవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవిల విగ్రహాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి రథాలపైకి చేర్చారు. దేవుళ్ల రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు. వేదపండితుల మంత్రాలు.. కళాకారుల నృత్యాలు.. భక్తుల జయజయధ్వానాల నడుమ జగన్నాథ రథయాత్ర శుక్రవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. జగన్నాథుడు, బలరాముడు, సుభద్రాదేవిల విగ్రహాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి రథాలపైకి చేర్చారు. దేవుళ్ల రథాలను లాగేందుకు భక్తులు పోటీ పడ్డారు.
9/13
10/13
రైతులు సాధారణంగా ఎద్దులతో వ్యవసాయం చేస్తారు. మరికొంత మంది ఆవులు, గేదెలను వినియోగిస్తుంటారు. వినూత్నంగా గుర్రంతో సాగు పనులు చేస్తున్నారు కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని చిన్న నగరికి చెందిన కృష్ణమూర్తి. తనకున్న మూడు ఎకరాల్లో ఆముదం పంట సాగు చేశారు. ఎద్దులు లేకపోవడంతో పెంచుకున్న గుర్రంతోనే కలుపు నివారణ కోసం ఆయన గుంటకు తోలారు. రైతులు సాధారణంగా ఎద్దులతో వ్యవసాయం చేస్తారు. మరికొంత మంది ఆవులు, గేదెలను వినియోగిస్తుంటారు. వినూత్నంగా గుర్రంతో సాగు పనులు చేస్తున్నారు కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని చిన్న నగరికి చెందిన కృష్ణమూర్తి. తనకున్న మూడు ఎకరాల్లో ఆముదం పంట సాగు చేశారు. ఎద్దులు లేకపోవడంతో పెంచుకున్న గుర్రంతోనే కలుపు నివారణ కోసం ఆయన గుంటకు తోలారు.
11/13
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో ప్రవేశాలు పెరిగాయి. కుత్బుల్లాపూర్‌ గాజులరామారవం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 500 వందల మంది వరకు విద్యార్థులు పెరగటంతో ఇలా మధ్యాహ్న భోజనం కోసం పెద్ద ఎత్తున క్యూకట్టి కనిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడంతో ప్రవేశాలు పెరిగాయి. కుత్బుల్లాపూర్‌ గాజులరామారవం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 500 వందల మంది వరకు విద్యార్థులు పెరగటంతో ఇలా మధ్యాహ్న భోజనం కోసం పెద్ద ఎత్తున క్యూకట్టి కనిపించారు.
12/13
తోటలు అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది కూరగాయాలు, పండ్ల, పూల తోటలే కానీ.. ఇది ఈత తోట. అదీ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉంది. హైదరాబాద్‌లోని పాత బోయినపల్లికి చెందిన మహేందర్‌రెడ్డి తనకున్న ఏడెకరాల్లో మొదట్లో సాధారణ పంటలు సాగు చేసేవారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఆ పంటల సాగును కొన్నేళ్ల కిందటే ఆపివేశారు. తెలంగాణ ప్రభుత్వం నీరాను ప్రోత్సహించడం, ఈత తోటలకు నీటి అవసరం ఎక్కువగా ఉండదని తెలుసుకుని ఆ  దిశగా అడుగేశారు. రెండేళ్ల కిందట సంగారెడ్డి నుంచి ఈత, కడియం నుంచి జీలుగు, ఖర్జూర మొక్కలు తెప్పించి ఏడెకరాల్లో వేశారు. ఇందుకోసం రూ.15 లక్షలు ఖర్చు చేశారు. తోటను ఎప్పుడూ సీసీ కెమెరాల సాయంతో పర్యవేక్షిస్తారు. తోటలు అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది కూరగాయాలు, పండ్ల, పూల తోటలే కానీ.. ఇది ఈత తోట. అదీ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఉంది. హైదరాబాద్‌లోని పాత బోయినపల్లికి చెందిన మహేందర్‌రెడ్డి తనకున్న ఏడెకరాల్లో మొదట్లో సాధారణ పంటలు సాగు చేసేవారు. భూగర్భ జలాలు తగ్గిపోవడంతో ఆ పంటల సాగును కొన్నేళ్ల కిందటే ఆపివేశారు. తెలంగాణ ప్రభుత్వం నీరాను ప్రోత్సహించడం, ఈత తోటలకు నీటి అవసరం ఎక్కువగా ఉండదని తెలుసుకుని ఆ దిశగా అడుగేశారు. రెండేళ్ల కిందట సంగారెడ్డి నుంచి ఈత, కడియం నుంచి జీలుగు, ఖర్జూర మొక్కలు తెప్పించి ఏడెకరాల్లో వేశారు. ఇందుకోసం రూ.15 లక్షలు ఖర్చు చేశారు. తోటను ఎప్పుడూ సీసీ కెమెరాల సాయంతో పర్యవేక్షిస్తారు.
13/13
సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ ఎయిర్‌ వార్‌ఫేర్‌ (సీఏడబ్ల్యూ)ను శుక్రవారం చీఫ్‌ ఆఫ్‌ ద ఎయిర్‌స్టాఫ్, ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి సందర్శించారు. ఎయిర్‌ కమాండ్‌ కోర్సులో శిక్షణ పొందుతున్న అధికారులతో సమావేశమయ్యారని రక్షణ, పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఏడబ్ల్యూ కమాండెంట్, ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ కేఎస్‌కే సురేశ్‌ పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని కాలేజ్‌ ఆఫ్‌ ఎయిర్‌ వార్‌ఫేర్‌ (సీఏడబ్ల్యూ)ను శుక్రవారం చీఫ్‌ ఆఫ్‌ ద ఎయిర్‌స్టాఫ్, ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి సందర్శించారు. ఎయిర్‌ కమాండ్‌ కోర్సులో శిక్షణ పొందుతున్న అధికారులతో సమావేశమయ్యారని రక్షణ, పౌర సంబంధాల అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఏడబ్ల్యూ కమాండెంట్, ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ కేఎస్‌కే సురేశ్‌ పాల్గొన్నారు.

మరిన్ని