News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 02 Jul 2022 19:49 IST
1/19
కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోసిగి మండలం చింతకుంటలో నీటి సరఫరా చేస్తున్నప్పటికీ శివారు కాలనీల్లోకి పైపులైన్ల లీకేజీతో తాగునీరు అందడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాగునీటి పైపులైన్లు మురుగు కాలువలో ఉండటంతో మురుగు నీటిలోనే బిందెలను పెట్టి తాగునీటిని పట్టుకుంటున్నారు. లీకేజీలో వృథాపోగా బొట్టుబొట్టుగా వస్తున్న నీటిని ఒడిసి పట్టుకుంటున్నారు. చిన్నారులు సైతం ప్రమాదకరంగా కాలువ వద్ద నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో తాగునీటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కోసిగి మండలం చింతకుంటలో నీటి సరఫరా చేస్తున్నప్పటికీ శివారు కాలనీల్లోకి పైపులైన్ల లీకేజీతో తాగునీరు అందడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తాగునీటి పైపులైన్లు మురుగు కాలువలో ఉండటంతో మురుగు నీటిలోనే బిందెలను పెట్టి తాగునీటిని పట్టుకుంటున్నారు. లీకేజీలో వృథాపోగా బొట్టుబొట్టుగా వస్తున్న నీటిని ఒడిసి పట్టుకుంటున్నారు. చిన్నారులు సైతం ప్రమాదకరంగా కాలువ వద్ద నుంచి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
2/19
3/19
దక్షిణ హాంగ్‌ కాంగ్‌ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ చైనా సముద్రంలో ఓ కార్గో నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో సుమారు 24మంది సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. ఆ ప్రాంతంలో ఏర్పడిన చబా తుపాను కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ హాంగ్‌ కాంగ్‌ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న దక్షిణ చైనా సముద్రంలో ఓ కార్గో నౌక మునిగిపోయింది. ఈ ఘటనలో సుమారు 24మంది సిబ్బంది గల్లంతైనట్లు సమాచారం. ఆ ప్రాంతంలో ఏర్పడిన చబా తుపాను కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
4/19
5/19
కొన్ని సార్లు వాహనదారులు వేగంగా వెళ్లి తనిఖీలు చేస్తున్న పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఆదిలాబాద్‌ పట్టణంలోని ట్రాఫిక్‌ పోలీసులు రెండంచెల తనిఖీ చేపట్టారు. పట్టణ ట్రాఫిక్‌ పోలీసులు ఓ చోట వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. అక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతంలో మరో టీమ్‌ను అందుబాటులో ఉంచారు. మొదట ఉన్నవారి నుంచి తప్పించుకుంటే వాకీ టాకీలో ముందు ఉన్న పోలీసులకు సమాచారం అందించి పట్టుకుంటున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఆపిన వెంటనే వాహనం నిలిపితే చాలావరకు హెచ్చరించి మరోసారి తప్పు చేయొద్దంటూ జాగ్రత్తలు చెప్పి వదిలేస్తున్నారు. కొన్ని సార్లు వాహనదారులు వేగంగా వెళ్లి తనిఖీలు చేస్తున్న పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఉంటారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఆదిలాబాద్‌ పట్టణంలోని ట్రాఫిక్‌ పోలీసులు రెండంచెల తనిఖీ చేపట్టారు. పట్టణ ట్రాఫిక్‌ పోలీసులు ఓ చోట వాహనాలను ఆపి తనిఖీలు నిర్వహించారు. అక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతంలో మరో టీమ్‌ను అందుబాటులో ఉంచారు. మొదట ఉన్నవారి నుంచి తప్పించుకుంటే వాకీ టాకీలో ముందు ఉన్న పోలీసులకు సమాచారం అందించి పట్టుకుంటున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు ఆపిన వెంటనే వాహనం నిలిపితే చాలావరకు హెచ్చరించి మరోసారి తప్పు చేయొద్దంటూ జాగ్రత్తలు చెప్పి వదిలేస్తున్నారు.
6/19
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలికారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్వాగతం పలికారు.
7/19
హైదరాబాద్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్  గ్యాలరీలో లాలిమ నాయిర్‌ రూపొందించిన చిత్రకళా ప్రదర్శన  ప్రారంభమైంది. ప్రదర్శనలో  20వర్ణ చిత్రాలను ఉంచారు. ఇవి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో లాలిమ నాయిర్‌ రూపొందించిన చిత్రకళా ప్రదర్శన ప్రారంభమైంది. ప్రదర్శనలో 20వర్ణ చిత్రాలను ఉంచారు. ఇవి చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
8/19
9/19
10/19
ఉత్తర్‌ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య శనివారం ఉదయం చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య శనివారం ఉదయం చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
11/19
12/19
ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. మనీహెయిస్ట్ వెబ్‌ సిరీస్‌లో దొంగలను పోలిన వస్ర్తధారణతో కాచిగూడ రైల్వే స్టేషన్‌, బ్యాంకులు, పెట్రోలు బంకుల వద్ద ‘బై బై మోదీ’ అని తెలుపుతూ ప్లకార్డును పట్టుకొని కనిపించాడు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో ఓ వ్యక్తి వినూత్నంగా నిరసన తెలిపాడు. మనీహెయిస్ట్ వెబ్‌ సిరీస్‌లో దొంగలను పోలిన వస్ర్తధారణతో కాచిగూడ రైల్వే స్టేషన్‌, బ్యాంకులు, పెట్రోలు బంకుల వద్ద ‘బై బై మోదీ’ అని తెలుపుతూ ప్లకార్డును పట్టుకొని కనిపించాడు.
13/19
14/19
హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సినీనటి, భాజపా నేత ఖుష్బూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సరదాగా కోలాటం ఆడటంతో పాటు గిరిజన మహిళలతో కలిసి ఫొటోలు దిగి సందడి చేశారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు సినీనటి, భాజపా నేత ఖుష్బూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె సరదాగా కోలాటం ఆడటంతో పాటు గిరిజన మహిళలతో కలిసి ఫొటోలు దిగి సందడి చేశారు.
15/19
16/19
డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. డీఆర్డీవో ఛైర్మన్ సతీశ్‌రెడ్డి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకు ముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేశారు.
17/19
18/19
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, తెరాస శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, తెరాస శ్రేణులు ఘనస్వాగతం పలికాయి.
19/19

మరిన్ని