News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 03 Jul 2022 10:32 IST
1/9
వర్షాకాలంలో ఇంట్లోకి నీరు చేరుతుండటంతో ఓ యజమాని తన ఇంటిని ఐదు ఫీట్ల ఎత్తుకు మార్చారు. నిజామాబాద్‌ నగరంలోని దుబ్బ సాయిబృందావన్‌ కాలనీలో వడ్ల సత్యనారాయణ గతంలో ఇల్లు కట్టుకున్నారు. రానురాను రోడ్డు ఎత్తు కావడంతో ఏటా వర్షం నీరు ఇంటిలోకే వస్తోంది. దీంతో ఇంటి ఎత్తు పెంచాలని నిర్ణయించుకున్నారు. హరియాణాకు చెందిన ఓమ్‌సింగ్‌ చందన్‌ నేతృత్వంలో హౌజ్‌లిఫ్టింగ్‌ సర్వీస్‌కు పని అప్పగించారు. 120 గజాల ఇంటిని ఐదు ఫీట్ల మేర పైకి లేపడానికి రూ.2.16 లక్షలు ఖర్చయింది. 12 రోజుల సమయం పట్టింది. వర్షాకాలంలో ఇంట్లోకి నీరు చేరుతుండటంతో ఓ యజమాని తన ఇంటిని ఐదు ఫీట్ల ఎత్తుకు మార్చారు. నిజామాబాద్‌ నగరంలోని దుబ్బ సాయిబృందావన్‌ కాలనీలో వడ్ల సత్యనారాయణ గతంలో ఇల్లు కట్టుకున్నారు. రానురాను రోడ్డు ఎత్తు కావడంతో ఏటా వర్షం నీరు ఇంటిలోకే వస్తోంది. దీంతో ఇంటి ఎత్తు పెంచాలని నిర్ణయించుకున్నారు. హరియాణాకు చెందిన ఓమ్‌సింగ్‌ చందన్‌ నేతృత్వంలో హౌజ్‌లిఫ్టింగ్‌ సర్వీస్‌కు పని అప్పగించారు. 120 గజాల ఇంటిని ఐదు ఫీట్ల మేర పైకి లేపడానికి రూ.2.16 లక్షలు ఖర్చయింది. 12 రోజుల సమయం పట్టింది.
2/9
3/9
ఈ జత పొట్టేళ్లు అక్షరాల రూ.లక్ష. బైరెడ్డిపల్లె మండలంలో శనివారం గొర్రెల సంత జరిగింది. పలమనేరు మండలం చెత్తపెంట గ్రామానికి చెందిన గోవర్ధన్‌ సంతలో వీటిని రూ.లక్షకు తమిళనాడుకు చెందిన ఆంబూరువాసులకు విక్రయించాడు. తెల్లగా ఉన్న ఇవి హైదరాబాద్‌ జాతికి చెందిన తగరాలుగా గోవర్ధన్‌ చెబుతున్నాడు. బక్రీద్‌ కోసమే ఏడాది నుంచి వీటిని ప్రత్యేకంగా మేపుతున్నట్లు అతను అంటున్నాడు.  

4/9
శిరస్త్రాణం లేని ప్రయాణం ప్రమాదకరం.... వాహనదారులు తప్పనిసరి నిబంధనలు పాటించాల్సిందే... లేకుంటే జరిమానా తప్పదు! అంటూ కూడళ్లు, సిగ్నళ్ల వద్ద సాధారణ పౌరులకు జరిమానా రాసి, ఫొటోలు తీసే పోలీసులు.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ నిబంధనలు పాటించడం లేదనడానికి ఇదే చక్కటి ఉదాహరణ. శనివారం సంగారెడ్డి- కామారెడ్డి- అకోలా ప్రధాన రహదారిపై బస్టాండు సమీపం నుంచి ఓ పోలీసన్న శిరస్త్రాణం లేకుండా దర్జాగా వెళ్తున్న తీరు ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. శిరస్త్రాణం లేని ప్రయాణం ప్రమాదకరం.... వాహనదారులు తప్పనిసరి నిబంధనలు పాటించాల్సిందే... లేకుంటే జరిమానా తప్పదు! అంటూ కూడళ్లు, సిగ్నళ్ల వద్ద సాధారణ పౌరులకు జరిమానా రాసి, ఫొటోలు తీసే పోలీసులు.. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆ నిబంధనలు పాటించడం లేదనడానికి ఇదే చక్కటి ఉదాహరణ. శనివారం సంగారెడ్డి- కామారెడ్డి- అకోలా ప్రధాన రహదారిపై బస్టాండు సమీపం నుంచి ఓ పోలీసన్న శిరస్త్రాణం లేకుండా దర్జాగా వెళ్తున్న తీరు ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.
5/9
గ్రామం సమీపంలో పెద్ద కొండ.. దానిపై మొక్కలు పచ్చగా కనిపిస్తూ ఆహ్లాదాన్ని నింపుతున్నాయి. కోసిగి మండలం దొడ్డి బెళగల్‌ గ్రామంలో కొండపై పచ్చటి చెట్లతో పచ్చదనం పరచుకుంది. ఇక్కడే తిరుమలేశ్వర స్వామి ఆలయం వద్ద ప్రయాణికులు కాసేపు సేద తీరుతున్నారు. స్వామి కొలువై ఉన్న ఈ కొండపైకి పశువులను తీసుకెళ్లరాదని, చెట్లు ఎవరూ కొట్టరాదని గ్రామంలో కట్టుబాటు పెట్టుకోవడంతో ఇలా పచ్చగా కనిపిస్తోందని గ్రామస్థులు తెలిపారు. 

6/9
ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించిన అధికారులు...పకడ్బందీగా అమలు చేయడం దృష్టిసారించారు. విశాఖ నగరంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో సాగర తీరంలోనూ శుభ్రతా పనులు చేపట్టే కార్యాచరణ అమలు చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ వుడాపార్కుసమీపంలో భారీగా వ్యర్థాలు పేరుకుపోయిన తీరుపై పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించిన అధికారులు...పకడ్బందీగా అమలు చేయడం దృష్టిసారించారు. విశాఖ నగరంలోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అదే సమయంలో సాగర తీరంలోనూ శుభ్రతా పనులు చేపట్టే కార్యాచరణ అమలు చేస్తున్నారు. కానీ, ఇప్పటికీ వుడాపార్కుసమీపంలో భారీగా వ్యర్థాలు పేరుకుపోయిన తీరుపై పర్యాటకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
7/9
చిత్రంలో కనిపిస్తున్నవి పేదల కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రెండు పడకగదుల ఇళ్లు. ఇవి మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ప్రతాపసింగారం గ్రామంలోనివి. వీటికి 2018లో అప్పటి మంత్రులు మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేయగా ఏడాదిన్నర కిందట నిర్మాణం పూర్తయ్యాయి. ఇళ్లు లేని పేద ప్రజల కోసం నిర్మించిన వీటిని ఇంకా లబ్ధిదారులకు అందించకపోవడంతో ఆ గృహాల తలుపులు, కిటికీలు శిథిలావస్థకు చేరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. చిత్రంలో కనిపిస్తున్నవి పేదల కోసం రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రెండు పడకగదుల ఇళ్లు. ఇవి మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం ప్రతాపసింగారం గ్రామంలోనివి. వీటికి 2018లో అప్పటి మంత్రులు మహేందర్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేయగా ఏడాదిన్నర కిందట నిర్మాణం పూర్తయ్యాయి. ఇళ్లు లేని పేద ప్రజల కోసం నిర్మించిన వీటిని ఇంకా లబ్ధిదారులకు అందించకపోవడంతో ఆ గృహాల తలుపులు, కిటికీలు శిథిలావస్థకు చేరి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి.
8/9
కోచిలో శనివారం సముద్ర పరీక్షలకు సిద్ధంగా ఉన్న ఐఏసీ విక్రాంత్‌. త్వరలోనే దీనిని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారు. కోచిలో శనివారం సముద్ర పరీక్షలకు సిద్ధంగా ఉన్న ఐఏసీ విక్రాంత్‌. త్వరలోనే దీనిని భారత నౌకాదళంలో ప్రవేశపెట్టనున్నారు.
9/9
అల్లూరి సీతారామరాజుకు ఏర్పాటు చేసిన తొలి విగ్రహం ఇది. దీన్ని 1965లో పాలకోడేరు మండలం మోగల్లు చెరువు గట్టున నెలకొల్పారు. ఆయన ముఖ్య అనుచరుడు, ప్రథమ లోక్‌సభలో స్వతంత్ర సభ్యుడు మల్లు దొర పర్యవేక్షణలో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు.  

మరిన్ని