News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 03 Jul 2022 11:22 IST
1/30
ప‌రేడ్‌గ్రౌండ్‌లో భాజ‌పా విజ‌య సంక‌ల్ప స‌భ ముగిసిన త‌ర్వాత భాజ‌పా శ్రేణులు తిరుగు ప్రయణంలో ఒక్కసారిగా స‌మీపంలోని ప‌రేడ్ గ్రౌండ్ మెట్రో స్టేష‌న్‌కు పోటెత్తాయి. దీంతో తొక్కిస‌లాట జ‌ర‌గ‌కుండా గేట్లు మూసేశారు. ఒకేసారి వేలాది మంది రావ‌డం.. అప్పటికే టిక్కెట్ కౌంట‌ర్లు, ఫ్లాట్‌ఫాంపై జ‌నం ర‌ద్దీగా ఉండ‌టంతో  ప్రయాణికుల‌ను అదుపు చేసేందుకు కొంత సేపు గేట్లు మూసేశారు. క్రమక్రమంగా ప్రయాణికుల‌ను లోప‌లికి పంపించారు. అంత‌కుముందు సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు భ‌ద్రతా దృష్ట్యా  ప్యార‌డైజ్‌, ప‌రేడ్ గ్రౌండ్‌,  జేబీఎస్ స్టేష‌న్లను మూసేశారు. స‌భ ముగిశాక తిరిగి తెరిచారు. ప‌రేడ్‌గ్రౌండ్‌లో భాజ‌పా విజ‌య సంక‌ల్ప స‌భ ముగిసిన త‌ర్వాత భాజ‌పా శ్రేణులు తిరుగు ప్రయణంలో ఒక్కసారిగా స‌మీపంలోని ప‌రేడ్ గ్రౌండ్ మెట్రో స్టేష‌న్‌కు పోటెత్తాయి. దీంతో తొక్కిస‌లాట జ‌ర‌గ‌కుండా గేట్లు మూసేశారు. ఒకేసారి వేలాది మంది రావ‌డం.. అప్పటికే టిక్కెట్ కౌంట‌ర్లు, ఫ్లాట్‌ఫాంపై జ‌నం ర‌ద్దీగా ఉండ‌టంతో ప్రయాణికుల‌ను అదుపు చేసేందుకు కొంత సేపు గేట్లు మూసేశారు. క్రమక్రమంగా ప్రయాణికుల‌ను లోప‌లికి పంపించారు. అంత‌కుముందు సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు భ‌ద్రతా దృష్ట్యా ప్యార‌డైజ్‌, ప‌రేడ్ గ్రౌండ్‌, జేబీఎస్ స్టేష‌న్లను మూసేశారు. స‌భ ముగిశాక తిరిగి తెరిచారు.
2/30
3/30
శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది. ఇందులో భాగంగా రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య  స్వామివారు పెద్దశేష వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీనివాసమంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవం మూడు రోజుల పాటు జరుగనుంది. ఇందులో భాగంగా రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య స్వామివారు పెద్దశేష వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు.
4/30
5/30
ఇంటర్నేషనల్ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ఫ్రీ డే సందర్భంగా పాలిథీన్‌ సంచుల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సందేశమిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఇంటర్నేషనల్ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ ఫ్రీ డే సందర్భంగా పాలిథీన్‌ సంచుల వినియోగాన్ని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సందేశమిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
6/30
హైదరాబాద్‌కు చెందిన ఓ బాలిక పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న భాజపా విజయ సంకల్ప సభకు తలపాగా, దండతో వచ్చింది. వీటిని ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరించి అభిమానాన్ని చాటుకుంటానని ఉత్సాహంగా చెప్పింది. హైదరాబాద్‌కు చెందిన ఓ బాలిక పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న భాజపా విజయ సంకల్ప సభకు తలపాగా, దండతో వచ్చింది. వీటిని ప్రధాని నరేంద్ర మోదీకి బహూకరించి అభిమానాన్ని చాటుకుంటానని ఉత్సాహంగా చెప్పింది.
7/30
ఆస్ర్టేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్‌ ఉక్రెయిన్‌లోని కీవ్‌లో పర్యటించారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న భవనాలు, ప్రదేశాలను ఆయన పరిశీలించారు. ఆస్ర్టేలియా ప్రధాని ఆంటోని అల్బనీస్‌ ఉక్రెయిన్‌లోని కీవ్‌లో పర్యటించారు. యుద్ధం కారణంగా దెబ్బతిన్న భవనాలు, ప్రదేశాలను ఆయన పరిశీలించారు.
8/30
9/30
సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో నిర్వహించిన అమ్మవారి ఎదుర్కోలు ఘటోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహాకాళి దేవాలయంలో నిర్వహించిన అమ్మవారి ఎదుర్కోలు ఘటోత్సవంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ పాల్గొన్నారు.
10/30
11/30
కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌ నుంచి ఇందిరా పార్కు వరకు ర్యాలీ చేశారు.
12/30
13/30
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి భక్తులు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్‌లోని మహంకాళీ జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తీసుకొచ్చారు. కమిటీ ఛైర్మన్ రాకేశ్‌ తివారీ, ఇతర కమిటీ సభ్యులు, తెలంగాణకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. జోగిని విశా క్రాంతి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మకు తెలంగాణ నుంచి భక్తులు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్‌లోని మహంకాళీ జాతర, ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనం తీసుకొచ్చారు. కమిటీ ఛైర్మన్ రాకేశ్‌ తివారీ, ఇతర కమిటీ సభ్యులు, తెలంగాణకు చెందిన కళాకారులు ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొన్నారు. జోగిని విశా క్రాంతి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
14/30
15/30
16/30
హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో భాజపా నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభకు ప్రజా గాయకుడు గద్దర్‌ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వినేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో భాజపా నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభకు ప్రజా గాయకుడు గద్దర్‌ హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాన్ని వినేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
17/30
హైదరాబాద్‌లో శుక్రవారం వర్షం కురవడంతో బెలూన్ల అమ్మకందారులు తడవకుండా ఓ చోటు కోసం పరుగెత్తుతూ కనిపించారు. హైదరాబాద్‌లో శుక్రవారం వర్షం కురవడంతో బెలూన్ల అమ్మకందారులు తడవకుండా ఓ చోటు కోసం పరుగెత్తుతూ కనిపించారు.
18/30
19/30
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో హిందూ ప్రాజెక్టు నుంచి కొండాపూర్‌ ఆర్టీఏ వెళ్లే రోడ్డును పూర్తిగా మూసేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను హఫీజ్‌పేట మీదుగా మల్లించారు. మూసి ఉన్న రోడ్డులో అంబులెన్స్‌ రావడంతో బ్యారికేడ్‌ను తొలగించి వాహనాన్ని పంపించారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌ పర్యటన నేపథ్యంలో హిందూ ప్రాజెక్టు నుంచి కొండాపూర్‌ ఆర్టీఏ వెళ్లే రోడ్డును పూర్తిగా మూసేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను హఫీజ్‌పేట మీదుగా మల్లించారు. మూసి ఉన్న రోడ్డులో అంబులెన్స్‌ రావడంతో బ్యారికేడ్‌ను తొలగించి వాహనాన్ని పంపించారు.
20/30
21/30
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనే ప్రతినిధులకు వడ్డించే రుచికరమైన వంటకాలను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ఇందులో భాగంగా తెలంగాణ వంటకాల గురించి ప్రతినిధులు ప్రధానికి వివరించారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనే ప్రతినిధులకు వడ్డించే రుచికరమైన వంటకాలను ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ఇందులో భాగంగా తెలంగాణ వంటకాల గురించి ప్రతినిధులు ప్రధానికి వివరించారు.
22/30
23/30
24/30
విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ‘జనవాణి-జనసేన భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతులు స్వీకరించి అండగా ఉంటానని జనసేనాని భరోసా ఇచ్చారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య ఆడిటోరియంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ‘జనవాణి-జనసేన భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి వినతులు స్వీకరించి అండగా ఉంటానని జనసేనాని భరోసా ఇచ్చారు.
25/30
వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 113వ రోజుకు చేరింది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం గరిడేపల్లి మండలం చంద్రయ్య గూడెంలో ప్రారంభమైంది. పారెడ్డిగూడెం, గానుగబండ తండా, కొండాయి గూడెం, సీతారామపురం మీదుగా ఆమె యాత్ర సాగనుంది. సాయంత్రం లింగగిరి గ్రామంలో షర్మిల మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర 113వ రోజుకు చేరింది. హుజూర్‌నగర్‌ నియోజకవర్గం గరిడేపల్లి మండలం చంద్రయ్య గూడెంలో ప్రారంభమైంది. పారెడ్డిగూడెం, గానుగబండ తండా, కొండాయి గూడెం, సీతారామపురం మీదుగా ఆమె యాత్ర సాగనుంది. సాయంత్రం లింగగిరి గ్రామంలో షర్మిల మాట-ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
26/30
ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్‌లో వాతావరణ మార్పుల కారణంగా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హార్బర్‌ సమీపంలో ప్రయాణిస్తున్న బోటు ఇలా ఆటుపోట్లకు గురైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ హార్బర్‌లో వాతావరణ మార్పుల కారణంగా బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణశాఖ అధికారులు తెలిపారు. హార్బర్‌ సమీపంలో ప్రయాణిస్తున్న బోటు ఇలా ఆటుపోట్లకు గురైంది.
27/30
28/30
భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటున్న ప్రతినిధులకు తెలంగాణ వంటకాల రుచి చూపించనున్నారు. మధ్యాహ్నం ప్రధాని సహా ప్రతినిధులకు అందించే వంటకాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరిశీలించారు. ఇందుకు సంబంధించి.. వంట మనిషి యాదమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటున్న ప్రతినిధులకు తెలంగాణ వంటకాల రుచి చూపించనున్నారు. మధ్యాహ్నం ప్రధాని సహా ప్రతినిధులకు అందించే వంటకాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరిశీలించారు. ఇందుకు సంబంధించి.. వంట మనిషి యాదమ్మను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
29/30
చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దర్శించుకున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన యోగి.. పాతబస్తీకి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యూపీ సీఎం స్వయంగా హారతిచ్చారు.
చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ దర్శించుకున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన యోగి.. పాతబస్తీకి వెళ్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా యూపీ సీఎం స్వయంగా హారతిచ్చారు.
30/30
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్యారిస్‌ పర్యటన ముగిసింది. తన కుమార్తె హర్ష కాన్వకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన ఈ ఉదయం తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. సీఎస్‌ సమీర్‌ శర్మ, మంత్రి జోగి రమేశ్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్యారిస్‌ పర్యటన ముగిసింది. తన కుమార్తె హర్ష కాన్వకేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన ఈ ఉదయం తిరిగి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. సీఎస్‌ సమీర్‌ శర్మ, మంత్రి జోగి రమేశ్‌, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఇతర ఉన్నతాధికారులు ఆయనకు స్వాగతం పలికారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని