News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Published : 04 Jul 2022 11:42 IST
1/28
బంజారాహిల్స్‌లోని లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థులు ఎథినిక్ డే సెలబ్రేషన్‌ను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, ఫ్యాషన్ షో ఆకట్టుకున్నాయి. బంజారాహిల్స్‌లోని లకోటియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ విద్యార్థులు ఎథినిక్ డే సెలబ్రేషన్‌ను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. విద్యార్థులు చేసిన నృత్యాలు, ఫ్యాషన్ షో ఆకట్టుకున్నాయి.
2/28
3/28
4/28
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, రామాంతపూర్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌, రామాంతపూర్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
5/28
6/28
7/28
పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో సోమవారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి ఆప్యాయంగా పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెద అమిరంలో సోమవారం అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలు నిర్వహించి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి, ప్రముఖ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి ఆప్యాయంగా పలకరించుకొని ఆలింగనం చేసుకున్నారు.
8/28
9/28
పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ పూర్తయిన తర్వాత ప్రధానితో మంత్రి రోజా సెల్ఫీ తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ పూర్తయిన తర్వాత ప్రధానితో మంత్రి రోజా సెల్ఫీ తీసుకున్నారు.
10/28
బడంగ్‌పేట్‌ మేయర్ పారిజాత, పలువురు తెరాస నేతలు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో దిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. బడంగ్‌పేట్‌ మేయర్ పారిజాత, పలువురు తెరాస నేతలు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో దిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.
11/28
12/28
ప్యారిస్‌లో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో మోడల్స్‌ వినూత్న దుస్తులను ధరించి ర్యాంప్‌ వాక్‌తో ఆకట్టుకున్నారు.
ప్యారిస్‌లో నిర్వహించిన ఓ ఫ్యాషన్‌ షోలో మోడల్స్‌ వినూత్న దుస్తులను ధరించి ర్యాంప్‌ వాక్‌తో ఆకట్టుకున్నారు.
13/28
14/28
15/28
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో 27వేల మద్యం సీసాలను బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు. గత రెండేళ్లుగా తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వీటి విలువ సుమారు రూ.30లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఆధ్వర్యంలో 27వేల మద్యం సీసాలను బుల్డోజర్‌తో ధ్వంసం చేశారు. గత రెండేళ్లుగా తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన వీటి విలువ సుమారు రూ.30లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.
16/28
17/28
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్‌ తదితరులు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం సాగిన నాటి పోరాటంలో ఆయన చేసిన త్యాగాలను మంత్రులు గుర్తు చేసుకున్నారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి సందర్భంగా మంత్రులు కేటీఆర్‌, శ్రీనివాస్ గౌడ్‌ తదితరులు ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. భూమి కోసం, భుక్తి కోసం సాగిన నాటి పోరాటంలో ఆయన చేసిన త్యాగాలను మంత్రులు గుర్తు చేసుకున్నారు.
18/28
అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతుల కుమార్తె పసల కృష్ణభారతికి ప్రధాని పాదాభివందనం చేశారు. ఆమె తల్లిదండ్రులు దేశం కోసం చేసిన త్యాగాన్ని ఆయన ప్రశంసించారు. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భీమవరం వచ్చారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులు పసల కృష్ణమూర్తి-అంజలక్ష్మి దంపతుల కుమార్తె పసల కృష్ణభారతికి ప్రధాని పాదాభివందనం చేశారు. ఆమె తల్లిదండ్రులు దేశం కోసం చేసిన త్యాగాన్ని ఆయన ప్రశంసించారు.
19/28
స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అమాయక గిరిజనులు నిరంకుశ పాలనలో నలిగిపోతుంటే వారిలో ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చిన వ్యక్తి అల్లూరి అని కొనియాడారు. స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అమాయక గిరిజనులు నిరంకుశ పాలనలో నలిగిపోతుంటే వారిలో ధైర్యం నింపి నిప్పు కణాల్లా మార్చిన వ్యక్తి అల్లూరి అని కొనియాడారు.
20/28
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, దాని చుట్టు పక్కలి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో వరద తాకిడి పెరిగి పలు చోట్ల ఇళ్లు, రహదారులు నీట మునిగాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెరుగుతున్న వరద నీటి మట్టం కారణంగా దాదాపు 30వేల మంది ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం, దాని చుట్టు పక్కలి ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. దీంతో వరద తాకిడి పెరిగి పలు చోట్ల ఇళ్లు, రహదారులు నీట మునిగాయి. వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. పెరుగుతున్న వరద నీటి మట్టం కారణంగా దాదాపు 30వేల మంది ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
21/28
22/28
పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ప్రసంగంలో ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’ అనే విప్లవ గీతాన్ని ఆయన ప్రస్తావించారు.  పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మోదీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ప్రసంగంలో ‘తెలుగు వీర లేవరా.. దీక్షబూని సాగరా..’ అనే విప్లవ గీతాన్ని ఆయన ప్రస్తావించారు.
23/28
24/28
ప్రధాని నరేంద్రమోదీ భీమవరం పర్యటనను అడ్డుకోవడానికి యత్నించిన కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌ను అరెస్టు చేసి రాజమండ్రి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లోనే ‘గో బ్యాక్‌ మోదీ.. ’ అంటూ వారు నినాదాలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ భీమవరం పర్యటనను అడ్డుకోవడానికి యత్నించిన కాంగ్రెస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజనాథ్‌ను అరెస్టు చేసి రాజమండ్రి త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లోనే ‘గో బ్యాక్‌ మోదీ.. ’ అంటూ వారు నినాదాలు చేశారు.
25/28
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి సీఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో పాటు పలువురు భాజపా నేతలు ఘనస్వాగతం పలికారు.
ఏపీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానికి సీఎం జగన్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో పాటు పలువురు భాజపా నేతలు ఘనస్వాగతం పలికారు.
26/28
27/28
అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ భీమవరంలో అల్లూరి విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పలువురు కళాకారులు వీధుల్లో ఇలా ప్రదర్శన చేశారు. అల్లూరి సీతారామరాజు జయంత్యుత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ భీమవరంలో అల్లూరి విగ్రహం ఆవిష్కరించనున్నారు. ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పలువురు కళాకారులు వీధుల్లో ఇలా ప్రదర్శన చేశారు.
28/28
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని ఆయన విగ్రహం వద్ద తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం అల్లూరి వేషధారణలో సందడి చేస్తున్న చిన్నారులతో కేటీఆర్‌ ముచ్చటించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌లోని ఆయన విగ్రహం వద్ద తెరాస కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ నివాళులర్పించారు. అనంతరం అల్లూరి వేషధారణలో సందడి చేస్తున్న చిన్నారులతో కేటీఆర్‌ ముచ్చటించారు.

మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని