News In Pics: చిత్రం చెప్పే సంగతులు

Updated : 05 Jul 2022 13:44 IST
1/20
హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీలో భారీ వర్షాల కారణంగా బురదలో కూరుకుపోయిన వాహనాలు హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండీలో భారీ వర్షాల కారణంగా బురదలో కూరుకుపోయిన వాహనాలు
2/20
రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని గాయత్రి జలపాతం నీటి ఉద్ధృతితో ఎగసిపడుతోంది. 200 అడుగుల ఎత్తునుంచి జాలువారే సెలయేటి సవ్వడి వీనులవిందు చేస్తోంది. ఇదే జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం సోమవారం జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి జలధారలు పరవళ్లు తొక్కుతూ దిగువకు దుంకుతున్నాయి. పర్యాటకులను ముగ్ధులను చేస్తున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలతో ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని గాయత్రి జలపాతం నీటి ఉద్ధృతితో ఎగసిపడుతోంది. 200 అడుగుల ఎత్తునుంచి జాలువారే సెలయేటి సవ్వడి వీనులవిందు చేస్తోంది. ఇదే జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం సోమవారం జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి జలధారలు పరవళ్లు తొక్కుతూ దిగువకు దుంకుతున్నాయి. పర్యాటకులను ముగ్ధులను చేస్తున్నాయి.
3/20
4/20
విజయవాడ సుందరీకరణలో భాగంగా బందరు రోడ్డులోని డీసీపీ బంగ్లా నుంచి పశువుల ఆసుపత్రి జంక్షన్‌ వరకు డివైడర్లపై స్తంభాలకు ఆకర్షణీయమైన దీపాలు అమర్చిన దృశ్యం విజయవాడ సుందరీకరణలో భాగంగా బందరు రోడ్డులోని డీసీపీ బంగ్లా నుంచి పశువుల ఆసుపత్రి జంక్షన్‌ వరకు డివైడర్లపై స్తంభాలకు ఆకర్షణీయమైన దీపాలు అమర్చిన దృశ్యం
5/20
వేసవి సెలవులు పూర్తవడంతో మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభవుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని చెబుతున్న నాడు-నేడు పనులు మాత్రం ఇంకా చాలా పాఠశాలల్లో మందకొడిగా సాగుతున్నాయి. నంద్యాల పట్టణం పద్మావతినగర్‌లోని టెక్కె పురపాలక ప్రాథమిక పాఠశాలలో రూ.19.99 లక్షలతో మొదటి విడత నాడు-నేడు పనులు చేపట్టారు. ఇసుక, సిమెంటు, ఇనుము రావడం ఆలస్యం కావడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా గండేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇదే రకమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి. వేసవి సెలవులు పూర్తవడంతో మంగళవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభవుతున్నాయి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని చెబుతున్న నాడు-నేడు పనులు మాత్రం ఇంకా చాలా పాఠశాలల్లో మందకొడిగా సాగుతున్నాయి. నంద్యాల పట్టణం పద్మావతినగర్‌లోని టెక్కె పురపాలక ప్రాథమిక పాఠశాలలో రూ.19.99 లక్షలతో మొదటి విడత నాడు-నేడు పనులు చేపట్టారు. ఇసుక, సిమెంటు, ఇనుము రావడం ఆలస్యం కావడంతో పనుల్లో జాప్యం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా గండేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ ఇదే రకమైన పరిస్థితులు దర్శనమిస్తున్నాయి.
6/20
7/20
8/20
కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామస్థులు సుమారు 400 మంది ట్రాక్టర్లపై ‘స్పందన’ కార్యక్రమానికి తరలివచ్చారు. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా పోలవరం, పుష్కర కాలువ మధ్య పాములచెరువు ప్రాంతంలో అధికారులు పలువురికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇరువైపులా కాలువలతో ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు వద్దని, వేరే చోట ఇవ్వాలంటూ ఏడాదిగా వీరు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో జగ్గంపేటలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో తమ గోడును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లపై వచ్చారు. రోడ్డుపై బైఠాయించి... కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు బయటకు రావాలంటూ నినదించారు. కలెక్టర్‌ వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామస్థులు సుమారు 400 మంది ట్రాక్టర్లపై ‘స్పందన’ కార్యక్రమానికి తరలివచ్చారు. ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా పోలవరం, పుష్కర కాలువ మధ్య పాములచెరువు ప్రాంతంలో అధికారులు పలువురికి ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇరువైపులా కాలువలతో ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రాంతంలో తమకు ఇళ్ల స్థలాలు వద్దని, వేరే చోట ఇవ్వాలంటూ ఏడాదిగా వీరు వివిధ రూపాల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో జగ్గంపేటలో సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో తమ గోడును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ట్రాక్టర్లపై వచ్చారు. రోడ్డుపై బైఠాయించి... కలెక్టర్‌ కృతికా శుక్లా, ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు బయటకు రావాలంటూ నినదించారు. కలెక్టర్‌ వచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
9/20
ఇక్కడ సూక్తులు, బోధనకు తోడ్పడే చిత్రాలతో హడావిడిగా సొబగులు అద్దుకుంటున్నది కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పురపాలక ఉన్నత పాఠశాల తరగతి గది. మంగళవారం ఆదోని పట్టణంలో పర్యటించనున్న సీఎం జగన్‌ ఈ పాఠశాలలో నాడు-నేడు పనులను పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో తరగతి గదుల్లో బొమ్మలు గీయడం, టైల్స్, బండ పరుపులు, మధ్యాహ్న భోజనం షెడ్డు, కుళాయిలు, శుద్ధజల యంత్రం మరమ్మతులు తదితర పనులు హడావుడిగా చేపట్టారు.  

10/20
11/20
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 125 మంది బాలురు, పెద్దలు అల్లూరి సీతారామరాజు వేషధారణలో చేసిన ర్యాలీ ఆకట్టుకుంది.  మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 125 మంది బాలురు, పెద్దలు అల్లూరి సీతారామరాజు వేషధారణలో చేసిన ర్యాలీ ఆకట్టుకుంది.
12/20
ఆదోనిలోని పురపాలక మైదానంలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యాకానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మైదానంలోని ప్రహరీని అధికారులు మూడుచోట్ల కూల్చివేశారు. సభకు వచ్చే జనం కోసం మూడు చోట్ల గోడను కూల్చి మార్గం ఏర్పాటు చేశారు. జనం రావడానికి ఇబ్బందుల్లేకుండా, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా కూలగొట్టినట్లు... కార్యక్రమం అనంతరం పునర్నిర్మిస్తామని అధికారులు తెలిపారు. ఆదోనిలోని పురపాలక మైదానంలో మంగళవారం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విద్యాకానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మైదానంలోని ప్రహరీని అధికారులు మూడుచోట్ల కూల్చివేశారు. సభకు వచ్చే జనం కోసం మూడు చోట్ల గోడను కూల్చి మార్గం ఏర్పాటు చేశారు. జనం రావడానికి ఇబ్బందుల్లేకుండా, భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా కూలగొట్టినట్లు... కార్యక్రమం అనంతరం పునర్నిర్మిస్తామని అధికారులు తెలిపారు.
13/20
ప్రభుత్వం ముందుగా జులై 4వ తేదీ పాఠశాలలు పునఃప్రారంభిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత 5వ తేదీ మార్చారు. ఈ విషయం తెలియని చాలా మంది చిన్నారులు సోమవారం పాఠశాలలకు వచ్చి తలుపులు తీయకపోవడంతో నిరాశగా వెనుదిరిగారు. నెల్లూరులో కనిపించింది ఈ దృశ్యం.

14/20
జగనన్న విద్యాకానుకలో భాగంగా పాఠశాల విద్యార్థులకు సరఫరా చేస్తున్న స్కూల్‌ బ్యాగులను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ప్రాథమిక పాఠశాలల పిల్లలకు ఇచ్చిన వాటిని చూస్తే హ్యాండ్‌బ్యాగులా.. స్కూల్‌ బ్యాగులా అన్న సందేహం కలగకమానదు.  ఆరు నుంచి పదో తరగతి వరకూ పిల్లలకు ఇచ్చిన బ్యాగుల సైజు గతంతో పోలిస్తే బాగా తగ్గిపోయింది. పామర్రులో ఓ విద్యార్థికి ఇచ్చిన బ్యాగ్‌ ఇది.

15/20
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్‌ సభ్యులు బొబ్బిలిలో సోమవారం 125 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు.  విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా రోటరీ క్లబ్‌ సభ్యులు బొబ్బిలిలో సోమవారం 125 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు.
16/20
అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భీమవరంలో ప్రధాని నరేంద్రమోదీ రిమోట్‌ ద్వారా ఆవిష్కరించారు. ప్రధాని రిమోట్‌లో మీట నొక్కగానే విగ్రహం ముందు ఉన్న తెర తొలగిపోవాలి. ఏర్పాట్లలో లోపం వల్ల అది కదల్లేదు.  కార్మికులు చేతులతో కొంచెం కొంచెంగా తెరను పక్కకు లాగాల్సి వచ్చింది. తెరకు రింగులు అమర్చితే వెంటనే తొలగించే వీలుండేది. తీగతో కట్టడం వల్ల ఇబ్బంది ఎదురైంది. భారీ విగ్రహం చుట్టూ అమర్చిన తెర గాలికి ఎగిరిపోకుండా చూసేందుకు సిబ్బంది, నిర్వాహకులు ఉదయం నుంచి అవస్థలు పడ్డారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఆయన 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని భీమవరంలో ప్రధాని నరేంద్రమోదీ రిమోట్‌ ద్వారా ఆవిష్కరించారు. ప్రధాని రిమోట్‌లో మీట నొక్కగానే విగ్రహం ముందు ఉన్న తెర తొలగిపోవాలి. ఏర్పాట్లలో లోపం వల్ల అది కదల్లేదు. కార్మికులు చేతులతో కొంచెం కొంచెంగా తెరను పక్కకు లాగాల్సి వచ్చింది. తెరకు రింగులు అమర్చితే వెంటనే తొలగించే వీలుండేది. తీగతో కట్టడం వల్ల ఇబ్బంది ఎదురైంది. భారీ విగ్రహం చుట్టూ అమర్చిన తెర గాలికి ఎగిరిపోకుండా చూసేందుకు సిబ్బంది, నిర్వాహకులు ఉదయం నుంచి అవస్థలు పడ్డారు.
17/20
హైదరాబాద్‌ నగరంలో ఇల్లో, ఇంటి స్థలమో ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది అని సామాన్య, మధ్యతరగతి ప్రజలు భావిస్తుంటారు. ఎవరన్నా ఇవి ఉచితంగా ఇస్తామంటే.. ఇంకేముంది వారి ముందు వాలిపోతారు. దీనికి నిదర్శనమే రవీంద్రభారతి వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో కన్పించిన ఈ చిత్రం. తమ పార్టీ గెలిస్తే 100 గజాల స్థలం ఇస్తామని ఓ పార్టీ నేత ప్రకటించడంతో ఆధార్, ఓటరు కార్డులతో ఇలా బారులు తీరారు. హైదరాబాద్‌ నగరంలో ఇల్లో, ఇంటి స్థలమో ఉంటే అంతకన్నా కావాల్సింది ఏముంటుంది అని సామాన్య, మధ్యతరగతి ప్రజలు భావిస్తుంటారు. ఎవరన్నా ఇవి ఉచితంగా ఇస్తామంటే.. ఇంకేముంది వారి ముందు వాలిపోతారు. దీనికి నిదర్శనమే రవీంద్రభారతి వద్ద ఓ అపార్ట్‌మెంట్‌లో కన్పించిన ఈ చిత్రం. తమ పార్టీ గెలిస్తే 100 గజాల స్థలం ఇస్తామని ఓ పార్టీ నేత ప్రకటించడంతో ఆధార్, ఓటరు కార్డులతో ఇలా బారులు తీరారు.
18/20
నిమ్స్‌ ఆసుపత్రిలో నరాలు, కీళ్ల నొప్పులకు సంబంధించి ఇక్కడి వైద్యులకు మంచి పేరుంది. దాంతో ఆ విభాగాల వద్ద రోగులు నిత్యం బారులు తీరుతున్నారు. ఒకరోజు ముందుగానే నగరానికి చేరుకొని తెల్లవారుజామునే ఆసుపత్రి వద్ద వరుస కడుతున్నారు. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో చిత్రమిది. నిమ్స్‌ ఆసుపత్రిలో నరాలు, కీళ్ల నొప్పులకు సంబంధించి ఇక్కడి వైద్యులకు మంచి పేరుంది. దాంతో ఆ విభాగాల వద్ద రోగులు నిత్యం బారులు తీరుతున్నారు. ఒకరోజు ముందుగానే నగరానికి చేరుకొని తెల్లవారుజామునే ఆసుపత్రి వద్ద వరుస కడుతున్నారు. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో చిత్రమిది.
19/20
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదో తరగతి(తెలుగు మాధ్యమం)లో ఇద్దరు విద్యార్థులు మాత్రమే విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాలలో ఆరు నుంచి పది వరకు 64 మంది విద్యార్థులు ఉండగా ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో తొమ్మిదో తరగతి వరకు మాత్రమే ఆంగ్లమాధ్యమం ఉండగా పదో తరగతిలో ఆంగ్లమాధ్యమానికి అనుమతి రాకపోవడంతో విద్యార్థులు ఇద్దరు మాత్రమే ఉన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. గత సంవత్సరం అయిదుగురు విద్యార్థులు విద్యనభ్యసించగా అందరు ఉత్తీర్ణత పొందినట్లు పేర్కొన్నారు.  

20/20
స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని గజ్వేల్‌కు చెందిన రామకోటి భక్త సమాజం వ్యవస్థాపకుడు రామకోటి రామరాజు ఆవాలతో అల్లూరి చిత్రాన్ని గీసి అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ చిత్రాన్ని సోమవారం ఎమ్మెల్సీ యాదవరెడ్డి, బల్దియా ఛైర్మన్‌ రాజమౌళి ఆవిష్కరించారు. 

మరిన్ని