News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (24-05-2023)

Updated : 24 May 2023 09:57 IST
1/18
ట్యాంక్‌బండ్‌పై తీగజాతి మొక్కలను పెంచుతున్నారు. వాటిలో కొన్ని పెరిగి దిగువకు (లోయర్‌ ట్యాంక్‌) వస్తున్నాయి. అవి పర్యాటకులు, ప్రయాణికులకు కనువిందు చేస్తున్నాయి. 

2/18
ముషీరాబాద్‌ నియోజకవర్గంలోని కట్టమైసమ్మ ఆలయం సమీపంలో పైవంతెన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దారిలో ఒకవైపు మాత్రమే వాహనాలు వెళ్తున్నాయి. రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

3/18
వినాయక్‌నగర్‌ డివిజన్‌లోని తూర్పు చంద్రిగిరికాలనీలో ప్రధాన రోడ్డు గుంతలు పడి అధ్వానంగా తయారైంది. భూగర్భ డ్రైనేజీ కోసం గత ఏడాది తవ్విన గుంతను అధికారులు నాసిరకం తారు వేసి అతుకులతో మమ అనిపించారు. నెల కూడా గడవక ముందే తిరిగి గుంతలు పడ్డాయి. దీంతో చాలా రోజులుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  

4/18
 మాదాపూర్‌లోని హైటెక్స్, నోవాటెల్‌ హోటల్‌ ప్రాంగణంలో 30 ఏళ్లుగా ఉన్న ఓ భారీ వృక్షం ఇటీవల కురిసిన వర్షానికి నేలకొరిగింది. ఎన్నో ఏళ్లుగా స్వచ్ఛమైన వాయువును అందిస్తున్న ఈ చెట్టును రక్షించుకునేందుకు స్థానికుల ముందుకు వచ్చారు. స్థానిక నాయకుడు రాధాకృష్ణ యాదవ్, వాటా ఫౌండేషన్, నోవాటెల్‌ యాజమాన్యంతో కలిసి భారీ గుంతను తీసి అందులో నేలకొరిగిన వృక్షాన్ని నాటి పునర్జీవం పోశారు. 

5/18
అద్దం కనిపిస్తే మనుషులేనా మేమూ చూసుకొని వయ్యారాలు పోతాం అన్నట్లుందీ చిత్రం. నిలిపి ఉంచిన ఓ ద్విచక్ర వాహన అద్దంలో తన రూపం చూసుకొని మురిసిపోతూ ముద్దాడుతున్న ఈ  బుజ్జి పిట్ట కూకట్‌పల్లి బస్టాప్‌ వద్ద కనిపించడంతో ఈనాడు క్లిక్‌మనిపించింది. 

6/18
  భార్యాభర్తల అనురాగానికి నిదర్శనంగా నిలుస్తున్నారు ఈ వృద్ధ దంపతులు. ఇతరులపై ఆధారపడకుండా, ఒకరికి ఒకరు తోడుగా తమ పనులు తామే చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రం సంగారెడ్డి ఇంద్రకాలనీలో మాణిక్‌రెడ్డి, అమృత దంపతులు నివాసం ఉంటున్నారు. 

7/18
హరితహారంలో భాగంగా కొన్నేళ్ల క్రితం  సంగారెడ్డి  జిల్లా  కొండాపూర్‌ మండలం గంగారం శివారులో రోడ్డుకు ఇరువైపులా గుల్‌మోర్‌ మొక్కలు నాటారు. చక్కగా సంరక్షించారు. ప్రస్తుతం వృక్షాలుగా ఎదిగాయి. ఆ మార్గంలో ప్రయాణించేవారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

8/18
విజయవాడ గుణదలలోని విద్యుత్తుసౌధ వద్ద వాహనాల పార్కింగ్‌ స్టాండు ఇది. ఆ షెడ్డుపై కూడా సోలార్‌ ప్యానళ్లు అమర్చి విద్యుత్తు ఉత్పత్తి చేస్తున్నారు కార్యాలయ భవనాలు, ఇళ్లముందు వీటిని అమరుస్తున్న అధికారులు... ఇప్పుడు పార్కింగ్‌ ప్రదేశాల్లో కూడా అమర్చి పర్యావరణానికి హాని కలగకుండా హరిత ఇంధనం ఉత్పత్తి చేస్తున్నారు. 

9/18
  విజయనగరం: ఉత్తరాంధ్రుల కల్పవల్లి పైడితల్లి మంగళవారం బూరెల నైవేద్యం, పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పంచామృతాభిషేకాలు జరిగాయి. ధర్మపురిలో వేంచేసిఉన్న పైడితల్లి అమ్మవారి చల్లదనం మహోత్సవాలు ప్రారంభం కాగా భక్తులు తరలివచ్చారు

10/18
 ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం దురదపాడుకు చెందిన సున్నం నాగులు అనే గిరిజన రైతు రెండు ఎకరాల్లో జీడిమామిడి మొక్కలను నాటారు.     ప్రస్తుత వేసవి తీవ్రతకు అవి ఎండిపోకుండా ఇదిగో ఇలా మొక్కల చుట్టూ రక్షణగా చీరలను ఏర్పాటు చేశారు.

11/18
 ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా పశుసంపద ఉమ్మడి చందంపేట మండలంలో ఉంటుంది. వేసవికాలం కావడంతో కృష్ణా బ్యాక్‌ వాటర్‌ ఒట్టి పోవడంతో పశువులు నీటి కోసం అల్లాడుతున్నాయి. 	

12/18
హైదరాబాద్‌: నిన్నటిదాకా ఒకే రంగు వెలుగులతో ఆకట్టుకున్న నూతన సచివాలయం మంగళవారం వేర్వేరు వర్ణాల్లో కనిపించింది. సాగర తీరానికి విచ్చేసే సందర్శకులను ఆకట్టుకుంటోంది.  

13/18
 సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ ఎదుట ఏర్పాటు చేసిన దుబాయ్‌ ఎగ్జిబిషన్‌లో బుర్జ్‌ ఖలీఫా, మలేసియా పెట్రోనాస్‌ ట్విన్‌ టవర్స్, లండన్‌ బ్రిడ్జి లాంటి ప్రపంచంలోని ఎత్తయిన ఆకాశహర్మ్యాల నమూనాలను ఉంచారు. అవి సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి.

14/18
  సిడ్నీలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని వినేందుకు భారీగా తరలివచ్చిన ప్రవాస భారతీయులు

15/18
రద్దీ మార్గాల్లో పాదచారులు సులువుగా రోడ్డు దాటేందుకు నగరంలో 30 చోట్ల పెలికాన్‌ సిగ్నల్‌ వ్యవస్థ ఏర్పాటైంది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై రెండు చోట్ల    ఈ  సిగ్నళ్లు ఏర్పాటుచేసి వీటిపై సందర్శకులకు అవగాహన కలిగించేందుకు ట్రాఫిక్‌ వాలంటీర్లను నియమించారు. ఆ విధుల్లో భాగంగా వాలంటీరు సందర్శకులను రోడ్డు దాటిస్తున్న చిత్రాలివి. 

16/18
కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ లారీలో  దిల్లీ నుంచి చండీగఢ్‌ వరకూ 250 కి.మీ.ల మేర ప్రయాణించారు.  డ్రైవరుతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

17/18
 తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని  నూతన సచివాలయం ఎదురుగా సుమారు 3.29 ఎకరాల్లో స్మారక భవనం నిర్మిస్తున్న  ఈ నాలుగు అంతస్తుల కేంద్రం భాగ్యనగర పర్యాటక కీర్తికిరీటంలో మరో కలికితురాయిగా చేరబోతోంది. ప్రమిద ఆకారంలో భవనాన్ని నిర్మించి విద్యుత్తు దీపాలు ఏర్పాటు చేశారు. ఇది చూడటానికి మండుతున్న జ్యోతిలా కనిపిస్తోంది.

18/18
సిడ్నీలో ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, నరేంద్రమోదీల ఆత్మీయ ఆలింగనం

మరిన్ని