News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (24-05-2023)

Updated : 24 May 2023 20:34 IST
1/21
చేపల వేటకు సంబంధించిన రెండు మాసాల విరామం కొనసాగుతుండటంతో విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారులు తమ పడవలకు మరమ్మతులు చేస్తున్నారు. మరికొందరు కొత్త పడవల్ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. చేపల వేటకు సంబంధించిన రెండు మాసాల విరామం కొనసాగుతుండటంతో విశాఖలోని ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారులు తమ పడవలకు మరమ్మతులు చేస్తున్నారు. మరికొందరు కొత్త పడవల్ని తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
2/21
చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగుతోంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్‌ శర్మ, కృనాల్‌ పాండ్య ఐపీఎల్‌ ట్రోఫీతో కలిసి దిగిన ఫొటోను ముంబయి తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య ఎలిమినేటర్‌ మ్యాచ్‌ జరుగుతోంది. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్లు రోహిత్‌ శర్మ, కృనాల్‌ పాండ్య ఐపీఎల్‌ ట్రోఫీతో కలిసి దిగిన ఫొటోను ముంబయి తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.
3/21
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర బుధవారం జమ్మలమడుగు  నియోజకవర్గంలోని జంగాలపల్లె గ్రామంలో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా లోకేశ్‌ ప్రజల సమస్యలు తెలుసకుంటూ ముందుకు సాగారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర బుధవారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని జంగాలపల్లె గ్రామంలో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానికులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనస్వాగతం పలికారు. దారి పొడవునా లోకేశ్‌ ప్రజల సమస్యలు తెలుసకుంటూ ముందుకు సాగారు.
4/21
శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సు ముగింపు సందర్భంగా నేడు తీసుకున్న ఫొటోను రామ్‌చరణ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సినిమాల ద్వారా మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజెప్పే అవకాశం తనకు రావడంపై గర్విస్తున్నట్లు చెబుతూ రామ్‌చరణ్‌ పోస్టు పెట్టారు. శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సు ముగింపు సందర్భంగా నేడు తీసుకున్న ఫొటోను రామ్‌చరణ్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, తదితరులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సినిమాల ద్వారా మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజెప్పే అవకాశం తనకు రావడంపై గర్విస్తున్నట్లు చెబుతూ రామ్‌చరణ్‌ పోస్టు పెట్టారు.
5/21
జేసన్‌ హోల్డర్‌తో యుజ్వేంద్ర చాహల్‌ కలిసి దిగిన ఫొటోను రాజస్థాన్‌ రాయల్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. జేసన్ హోల్డర్‌తో ఫొటో తీసుకునే విధానాన్ని తెలిపే బెగినర్స్‌ గైడ్‌ ఇది అని ఫన్నీగా పోస్టు పెట్టింది. ఈ పోస్టు కింద మరింత ఫన్నీగా ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు. జేసన్‌ హోల్డర్‌తో యుజ్వేంద్ర చాహల్‌ కలిసి దిగిన ఫొటోను రాజస్థాన్‌ రాయల్స్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. జేసన్ హోల్డర్‌తో ఫొటో తీసుకునే విధానాన్ని తెలిపే బెగినర్స్‌ గైడ్‌ ఇది అని ఫన్నీగా పోస్టు పెట్టింది. ఈ పోస్టు కింద మరింత ఫన్నీగా ఫ్యాన్స్‌ కామెంట్లు పెడుతున్నారు.
6/21
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారులు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో వేసవి శిక్షణా శిబిరంలో భాగంగా స్కేటింగ్‌లో శిక్షణ పొందుతున్న చిన్నారులు
7/21
సినీనటి కంగనా రనౌత్‌ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్న ఆమె.. శివుడిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, హర హర మహదేవ్‌ అని తెలుపుతూ పోస్టు పెట్టారు. సినీనటి కంగనా రనౌత్‌ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో పంచుకున్న ఆమె.. శివుడిని దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని, హర హర మహదేవ్‌ అని తెలుపుతూ పోస్టు పెట్టారు.
8/21
కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో మంత్రి మల్లారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో మంత్రి మల్లారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
9/21
ఆదివారం ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్‌ భవనం సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బుధవారం వెల్లడించారు. ఆదివారం ప్రారంభం కానున్న కొత్త పార్లమెంట్‌ భవనం సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది. ఆ ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా బుధవారం వెల్లడించారు.
10/21
స్టువర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా.. రవితేజ నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను వినూత్నంగా గోదావరి మధ్యలో రాజమండ్రి రైల్వే వంతెనపై ఆవిష్కరించారు. రవితేజ అభిమానుల ఆకలి తీర్చేలా ‘టైగర్ నాగేశ్వరరావు’ను తీర్చిదిద్దినట్లు దర్శకుడు వంశీ తెలిపారు. స్టువర్టుపురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా.. రవితేజ నటిస్తున్న చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను వినూత్నంగా గోదావరి మధ్యలో రాజమండ్రి రైల్వే వంతెనపై ఆవిష్కరించారు. రవితేజ అభిమానుల ఆకలి తీర్చేలా ‘టైగర్ నాగేశ్వరరావు’ను తీర్చిదిద్దినట్లు దర్శకుడు వంశీ తెలిపారు.
11/21
శ్రీనగర్‌లోని నిశాత్ బాగ్‌లో జీ20 విదేశీ ప్రతినిధులు కశ్మీర్‌ సంప్రదాయ వస్త్రధారణలో హాజరై సందడి చేశారు. బుధవారం శ్రీనగర్‌లో టూరిజం వర్కింగ్ గ్రూప్‌ సదస్సు ముగిసింది. శ్రీనగర్‌లోని నిశాత్ బాగ్‌లో జీ20 విదేశీ ప్రతినిధులు కశ్మీర్‌ సంప్రదాయ వస్త్రధారణలో హాజరై సందడి చేశారు. బుధవారం శ్రీనగర్‌లో టూరిజం వర్కింగ్ గ్రూప్‌ సదస్సు ముగిసింది.
12/21
సిడ్నీలోని ఒపెరా హౌస్‌, సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జి వద్ద ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఒపెరా హౌస్‌, సిడ్నీ హర్బర్‌ బ్రిడ్జిపై భారతదేశ జాతీయ జెండా రంగులను ప్రదర్శించడాన్ని చిత్రంలో చూడొచ్చు. సిడ్నీలోని ఒపెరా హౌస్‌, సిడ్నీ హార్బర్‌ బ్రిడ్జి వద్ద ప్రధాని నరేంద్రమోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ కలిసి ఫొటోలు తీసుకున్నారు. ఒపెరా హౌస్‌, సిడ్నీ హర్బర్‌ బ్రిడ్జిపై భారతదేశ జాతీయ జెండా రంగులను ప్రదర్శించడాన్ని చిత్రంలో చూడొచ్చు.
13/21
భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు పనులను చేపట్టారు. స్వామివారికి వచ్చిన నగదు, కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు. భద్రాచలంలోని సీతారామచంద్రస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు పనులను చేపట్టారు. స్వామివారికి వచ్చిన నగదు, కానుకలను ఆలయ సిబ్బంది లెక్కించారు.
14/21
హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘సీడ్‌ మేళా-2023’ను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన విత్తనాలు, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల స్టాళ్లను ఆయన పరిశీలించారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ‘సీడ్‌ మేళా-2023’ను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రదర్శనకు ఉంచిన విత్తనాలు, వ్యవసాయ సంబంధిత ఉత్పత్తుల స్టాళ్లను ఆయన పరిశీలించారు.
15/21
హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సినీనటి శాన్వీమేఘన పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో హైలైఫ్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో సినీనటి శాన్వీమేఘన పాల్గొని ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
16/21
‘బలగం’ సినిమా దర్శకుడు వేణు.. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కోసం సమయం కేటాయించినందుకు సుకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘బలగం’ సినిమా దర్శకుడు వేణు.. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన కోసం సమయం కేటాయించినందుకు సుకుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
17/21
ఝార్ఖండ్‌ రాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అక్కడి డియోఘర్‌లోని బాబా వైద్యనాథ్‌ ధామ్‌ క్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఝార్ఖండ్‌ రాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అక్కడి డియోఘర్‌లోని బాబా వైద్యనాథ్‌ ధామ్‌ క్షేత్రాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
18/21
ప్రధాని నరేంద్ర మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌తో భేటీ అయ్యారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న మోదీ.. భేటీలో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. గతేడాది నుంచి తాము ఆరోసారి భేటీ అయినట్లు చెప్పారు. క్రికెట్‌ పరిభాషలో ఇది టీ20 మోడ్‌ అని పోస్టు పెట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌తో భేటీ అయ్యారు. ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్న మోదీ.. భేటీలో వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు. గతేడాది నుంచి తాము ఆరోసారి భేటీ అయినట్లు చెప్పారు. క్రికెట్‌ పరిభాషలో ఇది టీ20 మోడ్‌ అని పోస్టు పెట్టారు.
19/21
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యాదీవెన బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులను దీవించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో విద్యాదీవెన బహిరంగ సభ నిర్వహించారు. కార్యక్రమంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులను దీవించారు.
20/21
దుండిగల్‌లోని బహదూర్‌పల్లి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎంగా ఎన్టీఆర్‌ చేసిన సేవలను వారు గుర్తు చేశారు. దుండిగల్‌లోని బహదూర్‌పల్లి చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎంగా ఎన్టీఆర్‌ చేసిన సేవలను వారు గుర్తు చేశారు.
21/21
గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి క్యాలిఫయర్‌ మ్యాచ్‌లో గెలిచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకొని ‘సూపర్‌ ఫ్యామిలీ’ అంటూ జట్టు సభ్యులకు అభినందనలు తెలిపింది. గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన తొలి క్యాలిఫయర్‌ మ్యాచ్‌లో గెలిచి చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఈ నేపథ్యంలో సీఎస్కే తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకొని ‘సూపర్‌ ఫ్యామిలీ’ అంటూ జట్టు సభ్యులకు అభినందనలు తెలిపింది.

మరిన్ని