News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (26-05-2023)

Updated : 26 May 2023 12:27 IST
1/21
సాగర్‌నగర్‌ బీచ్‌ పరిసరాల్లో సముద్రం గురువారం కొంత మేర వెనక్కి మళ్లడంతో పచ్చదనం వెల్లివిరిసేలా.. హరిత శోభ ఉట్టిపడే రీతిలో పలు ఆకృతుల రాళ్లు బయటపడ్డాయి. నిత్యం అలల ఉద్ధృతితో ఘోషించే సముద్రం ప్రశాంతంగా మారడంతో ఇవి వెలుగుచూశాయి. నిత్యం నీళ్లలో ఉండే ఈ రాళ్లు ఇలా కనిపించడంతో సందర్శకులు ఆసక్తిగా తిలకించారు. సాగర్‌నగర్‌ బీచ్‌ పరిసరాల్లో సముద్రం గురువారం కొంత మేర వెనక్కి మళ్లడంతో పచ్చదనం వెల్లివిరిసేలా.. హరిత శోభ ఉట్టిపడే రీతిలో పలు ఆకృతుల రాళ్లు బయటపడ్డాయి. నిత్యం అలల ఉద్ధృతితో ఘోషించే సముద్రం ప్రశాంతంగా మారడంతో ఇవి వెలుగుచూశాయి. నిత్యం నీళ్లలో ఉండే ఈ రాళ్లు ఇలా కనిపించడంతో సందర్శకులు ఆసక్తిగా తిలకించారు.
2/21
శ్రీకాళహస్తి- కేవీబీపురం రహదారిని ఆనుకొని పలువురు రైతులు పొద్దు తిరుగుడు పంట సాగు చేస్తున్నారు. చాలా ఏపుగా పెరిగిన పంట ప్రస్తుతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటువైపుగా వెళ్లే వాహన చోదకులు, ప్రయాణికులు ఇక్కడి పుష్ప తోటల వద్ద అగి ఎంచక్కా ఫొటోలు తీసుకుని మరీ వెళ్తుండటం విశేషం. శ్రీకాళహస్తి- కేవీబీపురం రహదారిని ఆనుకొని పలువురు రైతులు పొద్దు తిరుగుడు పంట సాగు చేస్తున్నారు. చాలా ఏపుగా పెరిగిన పంట ప్రస్తుతం చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అటువైపుగా వెళ్లే వాహన చోదకులు, ప్రయాణికులు ఇక్కడి పుష్ప తోటల వద్ద అగి ఎంచక్కా ఫొటోలు తీసుకుని మరీ వెళ్తుండటం విశేషం.
3/21
రోహిణికార్తె ఎండలకు రోళ్లు సైతం పగులుతాయని పెద్దలు అంటారు. గురువారం రోహిణి కార్తె ప్రవేశించింది. ఎండలు మండుతుండటంతో నీటిలో ఈత కొడుతూ ఉపశమనం పొందుతున్నారు. గేదెలైతే పగలంతా చెరువులను వదలి రావడంలేదు. తల్లాడ మండలం మల్లారంలో కన్పించిన దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మినిపించింది.  రోహిణికార్తె ఎండలకు రోళ్లు సైతం పగులుతాయని పెద్దలు అంటారు. గురువారం రోహిణి కార్తె ప్రవేశించింది. ఎండలు మండుతుండటంతో నీటిలో ఈత కొడుతూ ఉపశమనం పొందుతున్నారు. గేదెలైతే పగలంతా చెరువులను వదలి రావడంలేదు. తల్లాడ మండలం మల్లారంలో కన్పించిన దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ క్లిక్‌మినిపించింది.
4/21
అకాల వర్షాలు, గాలిదుమారంతో మామిడి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. నేలరాలిన మామిడికాయలకు నల్లని మచ్చలు ఏర్పడ్డాయి. వీటిని ఎవరూ కొనుగోలు చేయకపోవటంతో రైతులు రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 40 వేల ఎకరాలకు పైగా మామిడితోటలు సాగవగా సుమారు 8వేల ఎకరాల్లో పంట దెబ్బతినింది.       అకాల వర్షాలు, గాలిదుమారంతో మామిడి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. నేలరాలిన మామిడికాయలకు నల్లని మచ్చలు ఏర్పడ్డాయి. వీటిని ఎవరూ కొనుగోలు చేయకపోవటంతో రైతులు రోడ్ల పక్కన పారబోస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 40 వేల ఎకరాలకు పైగా మామిడితోటలు సాగవగా సుమారు 8వేల ఎకరాల్లో పంట దెబ్బతినింది.
5/21
ఈ చిత్రంలో చెట్టుకు కాసిన కాయ ప్రత్యేకంగా ఉంది కదూ.. దీనిని ‘మంకీ బ్రెడ్‌ ఫ్రూట్‌’ అంటారు. వీటిని కోతులు ఇష్టపడి తింటాయట. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు ఐదేళ్ల కిందట  మొక్క నాటారు. ఏడాది నుంచి ఈచెట్టు కాయలు కాస్తోంది. కాయలోపల పందిరి దోస గుజ్జు మాదిరి ఉంటుంది. ఈ చిత్రంలో చెట్టుకు కాసిన కాయ ప్రత్యేకంగా ఉంది కదూ.. దీనిని ‘మంకీ బ్రెడ్‌ ఫ్రూట్‌’ అంటారు. వీటిని కోతులు ఇష్టపడి తింటాయట. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు ఐదేళ్ల కిందట మొక్క నాటారు. ఏడాది నుంచి ఈచెట్టు కాయలు కాస్తోంది. కాయలోపల పందిరి దోస గుజ్జు మాదిరి ఉంటుంది.
6/21
నిర్మల్‌ పట్టణంలోని కంచెరోని చెరువులో గురువారం ఈత పోటీలు జరిగాయి.  నిర్వాహకుల్లేరు. ఈతగాళ్లు పాల్గొనలేదు. ఇవేం పోటీలని విస్తుపోకండి. చెరువులో ఉన్న కొంగల మధ్య ఈ పోటీ నెలకొంది. నీటి కొంగలు గుంపులుగా చెరువంతా కలియదిరుగుతూ మునుగుతూ, తేలుతూ, ఒడ్డుకు చేరుకుంటూ.. ఇలా పలురకాల విన్యాసాలతో చూరకులకు కనువిందు చేశాయి. చూసేందుకు ఈత పోటీలను తలపించాయి. నిర్మల్‌ పట్టణంలోని కంచెరోని చెరువులో గురువారం ఈత పోటీలు జరిగాయి. నిర్వాహకుల్లేరు. ఈతగాళ్లు పాల్గొనలేదు. ఇవేం పోటీలని విస్తుపోకండి. చెరువులో ఉన్న కొంగల మధ్య ఈ పోటీ నెలకొంది. నీటి కొంగలు గుంపులుగా చెరువంతా కలియదిరుగుతూ మునుగుతూ, తేలుతూ, ఒడ్డుకు చేరుకుంటూ.. ఇలా పలురకాల విన్యాసాలతో చూరకులకు కనువిందు చేశాయి. చూసేందుకు ఈత పోటీలను తలపించాయి.
7/21
 మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు దారి డంపింగ్‌యార్డు సమీపంలో మార్చి నెలలో రోడ్డుకు ఇరువైపుల మోడుగా కనిపించిన చెట్లు ముందుస్తు వర్షాలతో చిగురించాయి. జూన్‌ మాసంలో కురిసే తొలకరి వర్షాలతో పచ్చదనంగా మారాల్సిన చెట్లు రోహిణి కార్తి నాటికి పచ్చదనంతో కనిపిస్తున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం గుంజేడు దారి డంపింగ్‌యార్డు సమీపంలో మార్చి నెలలో రోడ్డుకు ఇరువైపుల మోడుగా కనిపించిన చెట్లు ముందుస్తు వర్షాలతో చిగురించాయి. జూన్‌ మాసంలో కురిసే తొలకరి వర్షాలతో పచ్చదనంగా మారాల్సిన చెట్లు రోహిణి కార్తి నాటికి పచ్చదనంతో కనిపిస్తున్నాయి.
8/21
తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలోని అగ్రహారపేట వద్ద రూ.85 లక్షలతో నిర్మిస్తున్న వైయస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. సీఎం జగన్‌, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చిత్రాలు శాశ్వతంగా ఉండేలా తలుపులను ఇలా తయారుచేయించారు. పార్టీ కార్యాలయం తరహాలో ఆరోగ్య కేంద్రాన్ని తీర్చిదిద్దడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట పురపాలక సంఘంలోని అగ్రహారపేట వద్ద రూ.85 లక్షలతో నిర్మిస్తున్న వైయస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది. సీఎం జగన్‌, స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చిత్రాలు శాశ్వతంగా ఉండేలా తలుపులను ఇలా తయారుచేయించారు. పార్టీ కార్యాలయం తరహాలో ఆరోగ్య కేంద్రాన్ని తీర్చిదిద్దడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
9/21
నగర అందాలు ఇనుమడింపజేసేలా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో పలు ముఖ్య కూడళ్లలో వాటర్‌ ఫౌంటెయిన్‌లు నిర్మిస్తున్నారు.వాటి నిర్మాణం నత్తనడకన సాగుతుంది. నీటిజాడ లేని ఈ ఫౌంటెయిన్‌లను నిర్భాగ్యులు ఆవాసాలుగా మార్చుకున్నారు. 

10/21
 ఈనెల 29న షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 వాహకనౌక రెండో ప్రయోగ వేదికపైకి చేరింది. తిరువనంతపురంలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌(వీఎస్‌ఎస్‌సీ) శాస్త్రవేత్తల ఆధ్వర్యాన వాహకనౌకకు నాలుగు రోజులుగా వివిధ పరీక్షలు, తనిఖీలు నిర్వహించారు.

11/21
మిషన్‌ భగీరథ పైపులు వేసే క్రమంలో నాణ్యత పాటించకపోవడంతో తరచూ  లీకేజీలతో రక్షితనీరు వృథా అవుతోంది.కామారెడ్డి జిల్లాలోని లింగాపూర్‌ చౌరస్తా సమీపంలో గురువారం ఇందల్‌వాయి-ధర్పల్లి ప్రధాన రహదారి పక్కన వాల్వు ఎగిరిపోవడంతో నీరు పైకి ఉవ్వెత్తున ఎగజిమ్మింది.

12/21
 కోతులు రోజూ కల్లులొట్లు పగలకొట్టడంతో వాటి బారినుంచి ఎలాగైనా బయటపడాలని చెట్టుచుట్టూ కర్రలు నాటి వల ఏర్పాటు చేశాడు. నల్గొండ జిల్లా నూతనకల్‌ మండలం తాళ్లసింగారం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బిక్కి కాటమయ్య. కోతులు రోజూ కల్లులొట్లు పగలకొట్టడంతో వాటి బారినుంచి ఎలాగైనా బయటపడాలని చెట్టుచుట్టూ కర్రలు నాటి వల ఏర్పాటు చేశాడు. నల్గొండ జిల్లా నూతనకల్‌ మండలం తాళ్లసింగారం గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు బిక్కి కాటమయ్య.
13/21
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం నుంచి లింగంపల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా పెరిగిన  చెట్లు పచ్చదనంతో పాటు ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి ఆహ్లాదం పంచుతున్నాయి.

హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం నుంచి లింగంపల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా పెరిగిన చెట్లు పచ్చదనంతో పాటు ఆ మార్గంలో రాకపోకలు సాగించే వారికి ఆహ్లాదం పంచుతున్నాయి.
14/21
  హైదరాబాద్‌ నగర సుందరీకరణలో భాగంగా నార్సింగి కూడలిలో సర్వీసు రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. అక్కడి రాతి గుట్టపై కొత్తగా కళాకృతులు ఏర్పాటు చేస్తున్నారు. చెట్టు నీడన ఓ మనిషి కూర్చున్నట్లు అనిపించేలా ఏర్పాటు చేసిన ఓ శిలా రూపం ఆకట్టుకుంటోంది

15/21
 భారత నౌకాదళం అద్భుత ఘనత సాధించింది. దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ యుద్ధనౌకపై మిగ్‌-29కే యుద్ధ విమానాన్ని రాత్రిపూట విజయవంతంగా దింపింది. బుధవారం రాత్రి చేపట్టిన ఈ ప్రక్రియను ‘చరిత్రాత్మక మైలురాయి’గా పేర్కొంది. 

16/21
 దక్షిణ కొరియాలోని పొచెన్‌లో అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల్లో భాగంగా భారీ సంఖ్యలో గాల్లో ఎగురుతున్న డ్రోన్లు

దక్షిణ కొరియాలోని పొచెన్‌లో అమెరికా-దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాల్లో భాగంగా భారీ సంఖ్యలో గాల్లో ఎగురుతున్న డ్రోన్లు
17/21
అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం లక్స్‌హ్యాట్చీలో అమెజాన్‌ చిలుకలకు సపర్యలు చేస్తున్న రేర్‌ స్పీసిస్‌ కాంట్రవర్సీ ఫౌండేషన్‌కు చెందిన కేర్లాన్‌ పేజ్‌ స్మిత్‌. మార్చి నెల చివరివారంలో మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ స్మగ్లర్‌ 29 చిలుక గుడ్లను తరలిస్తూ అధికారులకు దొరికిపోయాడు. సరిగ్గా ఆ సమయంలోనే గుడ్లు పిల్లలు అవుతుండడంతో వాటి సంరక్షణ బాధ్యతలను తీసుకున్న రేర్‌ స్పీసిస్‌ కాంట్రవర్సీ ఫౌండేషన్‌ 24 చిలుకలను కాపాడింది. 

18/21
హైదరాబాద్‌లోని  నల్లగండ్ల నుంచి వట్టినాగులపల్లి వరకు నిర్మిస్తున్న రోడ్డు ఇది. పనులు జరుగుతున్న సమయంలో దుమ్ము రేగకుండా నీళ్లు చల్లాల్సి ఉండగా.. గుత్తేదారు పట్టించుకోకపోవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. 

19/21
హైదరాబాద్‌లోని  కొత్తపేటలో ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనం ముందు భాగంలో ఇద్దరు చిన్నారులను ఎక్కించుకొని ఇలా ప్రమాదకరంగా వెళ్తున్నారు. రద్దీ రోడ్డుపై ఏమాత్రం అదుపుతప్పినా ప్రాణాపాయమే..

హైదరాబాద్‌లోని కొత్తపేటలో ఓ వ్యక్తి తన ద్విచక్రవాహనం ముందు భాగంలో ఇద్దరు చిన్నారులను ఎక్కించుకొని ఇలా ప్రమాదకరంగా వెళ్తున్నారు. రద్దీ రోడ్డుపై ఏమాత్రం అదుపుతప్పినా ప్రాణాపాయమే..
20/21
 వచ్చే నెలలో దేశవ్యాప్తంగా జరిగే అంతర్జాతీయ యోగా ఉత్సవాలకు సన్నాహకంగా శనివారం ఉదయం సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించే వేడుకలకు నగరంలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. రాజ్‌భవన్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన కటౌట్లు ఆకట్టుకుంటున్నాయి.

21/21
 మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ ఉపయోగించిన 18వ శతాబ్దం నాటి ఈ ఖడ్గం వేలంలో సుమారు 14 మిలియన్‌ పౌండ్లు(రూ.144 కోట్లు) పలికింది.    లండన్‌లోని బోన్హమ్స్‌ ఆక్షన్‌ హౌస్‌ ఈ నెల 23న దీన్ని వేలం వేసింది.

మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్‌ ఉపయోగించిన 18వ శతాబ్దం నాటి ఈ ఖడ్గం వేలంలో సుమారు 14 మిలియన్‌ పౌండ్లు(రూ.144 కోట్లు) పలికింది. లండన్‌లోని బోన్హమ్స్‌ ఆక్షన్‌ హౌస్‌ ఈ నెల 23న దీన్ని వేలం వేసింది.

మరిన్ని