News in Pics: చిత్రం చెప్పే సంగతులు -02(21-03-2023)

Updated : 21 Mar 2023 21:04 IST
1/21
తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి తిరుమలలో విద్యుత్తు అలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా విద్యుత్తు కాంతులతో వెలిగిపోతోంది. తెలుగు నూతన సంవత్సరాది ఉగాదిని పురస్కరించుకుని మంగళవారం రాత్రి తిరుమలలో విద్యుత్తు అలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేశారు. దీంతో ఆ ప్రాంతమంతా విద్యుత్తు కాంతులతో వెలిగిపోతోంది.
2/21
విద్యుత్తు కాంతుల్లో తిరుమల విద్యుత్తు కాంతుల్లో తిరుమల
3/21
తమిళ కథానాయకుడు సూర్య నటించిన చిత్రం ‘సూరరై పొట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. తమిళ మాతృకకి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ చిత్రానికీ దర్శకురాలు. నాయకానాయికలుగా అక్షయ్‌ కుమార్‌, రాధిక మదన్‌ నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్‌ 1న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. తమిళ కథానాయకుడు సూర్య నటించిన చిత్రం ‘సూరరై పొట్రు’. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. తమిళ మాతృకకి దర్శకత్వం వహించిన సుధా కొంగర ఈ చిత్రానికీ దర్శకురాలు. నాయకానాయికలుగా అక్షయ్‌ కుమార్‌, రాధిక మదన్‌ నటించారు. ఈ సినిమాను సెప్టెంబర్‌ 1న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
4/21
హీరోయిన్‌ నయనతార తన తాజా ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఓ యాడ్‌ షూట్‌ కోసం నూతన దుస్తులతో అందంగా అలంకరించుకున్న తన ఫొటోలను ట్వీట్‌ చేశారు. హీరోయిన్‌ నయనతార తన తాజా ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ఓ యాడ్‌ షూట్‌ కోసం నూతన దుస్తులతో అందంగా అలంకరించుకున్న తన ఫొటోలను ట్వీట్‌ చేశారు.
5/21
చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భోళాశంకర్’. తమన్నా కథానాయిక కాగా కీర్తి సురేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ మంగళవారం ఖరారైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. చిరంజీవి హీరోగా దర్శకుడు మెహర్‌ రమేశ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘భోళాశంకర్’. తమన్నా కథానాయిక కాగా కీర్తి సురేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా విడుదల తేదీ మంగళవారం ఖరారైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
6/21
హైదరాబాద్‌ మణికొండ పురపాలక పరిధిలో ఇటీవల ప్రారంభించిన చిత్రపురి కాలనీ ప్రహరీ గోడలపై వివిధ రకాల పక్షులు, జంతువులు, పూలు, గ్రామీణ పర్యావరణ బొమ్మలు వేశారు. దీంతో ఈ చిత్రాలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్‌ మణికొండ పురపాలక పరిధిలో ఇటీవల ప్రారంభించిన చిత్రపురి కాలనీ ప్రహరీ గోడలపై వివిధ రకాల పక్షులు, జంతువులు, పూలు, గ్రామీణ పర్యావరణ బొమ్మలు వేశారు. దీంతో ఈ చిత్రాలు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
7/21
పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలలో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా కర్నూలోని ఓ పాఠశాలలో వేడుకగా విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పాఠశాలలో రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా కర్నూలోని ఓ పాఠశాలలో వేడుకగా విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.
8/21
ఆటపాటలతో అలరిస్తున్న విద్యార్థినులు ఆటపాటలతో అలరిస్తున్న విద్యార్థినులు
9/21
హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని మెగా ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక నృత్యాలు, ర్యాంప్‌వాక్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌ రామంతాపూర్‌లోని మెగా ఉమెన్స్‌ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల సాంస్కృతిక నృత్యాలు, ర్యాంప్‌వాక్‌లు విశేషంగా ఆకట్టుకున్నాయి.
10/21
నృత్యాలతో అలరిస్తున్న విద్యార్థినులు నృత్యాలతో అలరిస్తున్న విద్యార్థినులు
11/21
కరీంనగర్‌లో భారత రాష్ట్ర సమితి(BRS) జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా వినోద్ కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌ ఇలా ముచ్చటించారు. నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. కరీంనగర్‌లో భారత రాష్ట్ర సమితి(BRS) జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా వినోద్ కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌ ఇలా ముచ్చటించారు. నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
12/21
భారత పర్యటనలో ఉన్న జపాన్‌ (Japan) ప్రధానమంత్రి ఫుమియో కిషిదకు ప్రధాని నరేంద్ర మోదీ మన దేశ వంటకాలను రుచి చూపించారు. ప్రత్యేకంగా భారత్‌లో ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ అయిన పానీపూరీ (గోల్‌గప్ప)ని ఆయనకు తినిపించారు. మన పానీపూరీ రుచి జపాన్‌ ప్రధానికి ఎంతగానో నచ్చేసిందట. భారత పర్యటనలో ఉన్న జపాన్‌ (Japan) ప్రధానమంత్రి ఫుమియో కిషిదకు ప్రధాని నరేంద్ర మోదీ మన దేశ వంటకాలను రుచి చూపించారు. ప్రత్యేకంగా భారత్‌లో ఫేమస్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ అయిన పానీపూరీ (గోల్‌గప్ప)ని ఆయనకు తినిపించారు. మన పానీపూరీ రుచి జపాన్‌ ప్రధానికి ఎంతగానో నచ్చేసిందట.
13/21
సమంత, దేవ్‌ మోహన్‌ జంటగా గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం ‘శాకుంతలం’. ఈ సినిమా ఏప్రిల్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  సందర్భంగా సమంత తన తాజా ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘శాకుంతలం గురించి అన్ని విషయాలు మాట్లాడుకుందాం’ అని ట్వీట్‌ చేశారు. సమంత, దేవ్‌ మోహన్‌ జంటగా గుణశేఖర్‌ తెరకెక్కించిన ప్రేమకావ్యం ‘శాకుంతలం’. ఈ సినిమా ఏప్రిల్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సమంత తన తాజా ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘శాకుంతలం గురించి అన్ని విషయాలు మాట్లాడుకుందాం’ అని ట్వీట్‌ చేశారు.
14/21
ప్రముఖ హీరో సుమన్‌ కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్‌ చక్రధర్‌రావు స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు. ప్రముఖ హీరో సుమన్‌ కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సహాయ కమిషనర్‌ చక్రధర్‌రావు స్వామివారి చిత్రపటాన్ని ఆయనకు బహూకరించారు.
15/21
నాని (Nani) హీరోగా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్‌ కథానాయిక. సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయి వెళ్లిన నాని అక్కడ రెడ్ ఎఫ్‌ఎం ఇండియా స్టూడియోలో సందడి చేశారు. శ్రోతలతో సరదాగా ముచ్చటించారు. నాని (Nani) హీరోగా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల తెరకెక్కించిన చిత్రం ‘దసరా’ (Dasara). కీర్తి సురేశ్‌ కథానాయిక. సినిమా మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయి వెళ్లిన నాని అక్కడ రెడ్ ఎఫ్‌ఎం ఇండియా స్టూడియోలో సందడి చేశారు. శ్రోతలతో సరదాగా ముచ్చటించారు.
16/21
నానికి ఘనస్వాగతం పలుకుతున్న రెడ్‌ ఎఫ్‌ఎం ఇండియా బృందం నానికి ఘనస్వాగతం పలుకుతున్న రెడ్‌ ఎఫ్‌ఎం ఇండియా బృందం
17/21
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి వద్ద నర్సులు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి వద్ద నర్సులు తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది.
18/21
ప్రకృతి ఒడిలో మైమరిచిపోయేలా ఉండే వాతావరణం.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతిస్తున్నారు.. ప్రకృతి ఒడిలో మైమరిచిపోయేలా ఉండే వాతావరణం.. ప్రపంచ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీనగర్‌లోని తులిప్‌ గార్డెన్‌ను సందర్శించేందుకు పర్యాటకులకు అనుమతిస్తున్నారు..
19/21
20/21
మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో భాగంగా చిత్రబృందం లండన్‌కు వెళ్లింది. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిరత్నంతో లండన్‌లో కలిసి దిగిన ఫొటోను రెహమాన్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చారిత్రక చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-2’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో భాగంగా చిత్రబృందం లండన్‌కు వెళ్లింది. ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిరత్నంతో లండన్‌లో కలిసి దిగిన ఫొటోను రెహమాన్‌ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రబృందం తెలిపింది.
21/21
తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పరిమళ సుగంధ ద్రవ్యాలతో పరిశ్రుభం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని పరిమళ సుగంధ ద్రవ్యాలతో పరిశ్రుభం చేశారు.

మరిన్ని