News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(04-02-2023)

Updated : 04 Feb 2023 22:18 IST
1/25
విశాఖలోని రుషికొండ చట్టూ తవ్వేసి పచ్చదనం లేకుండా చేశారు. కొండ చుట్టూ అడవిని కొట్టేసి మొక్కలు నాటారు. ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోందని ఇలా పచ్చని పరదా పరుస్తున్నారు. దీంతో అడవిని కొట్టేసి పరదా అలంకరించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలోని రుషికొండ చట్టూ తవ్వేసి పచ్చదనం లేకుండా చేశారు. కొండ చుట్టూ అడవిని కొట్టేసి మొక్కలు నాటారు. ప్రస్తుతం బోసిపోయి కనిపిస్తోందని ఇలా పచ్చని పరదా పరుస్తున్నారు. దీంతో అడవిని కొట్టేసి పరదా అలంకరించడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
2/25
యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారి విమాన రథోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం స్వామివారి విమాన రథోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు.
3/25
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వామి, అమ్మవార్లకు వారికి వివిధ రకాల గరుడ సేవలు నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం శ్రీరామనగరంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రాంగణంలో సమతా కుంభ్‌-2023 బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం స్వామి, అమ్మవార్లకు వారికి వివిధ రకాల గరుడ సేవలు నిర్వహించారు.
4/25
సమతా కుంభ్‌ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన గరుడ సేవలు సమతా కుంభ్‌ ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన గరుడ సేవలు
5/25
ఐసీసీ వుమెన్‌ టీ20 వరల్డ్‌కప్‌ పోటీలు ఫిబ్రవరి 10నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ట్రోఫీతో నిర్వహించిన ఫొటోషూట్‌లో వివిధ దేశాల జట్లు పాల్గొన్నాయి. ఐసీసీ వుమెన్‌ టీ20 వరల్డ్‌కప్‌ పోటీలు ఫిబ్రవరి 10నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ట్రోఫీతో నిర్వహించిన ఫొటోషూట్‌లో వివిధ దేశాల జట్లు పాల్గొన్నాయి.
6/25
ఈ కాంపౌండ్ వాల్ లోనికి వెళ్తే రంగుల లోకంలోకి వెళ్లినట్లే అనిపిస్తుంది! హైదరాబాద్‌లోని కైత్లాపూర్‌లో రంగు రంగుల ఇళ్లు, పడవలు, లైట్‌ హౌస్‌, గుడిసెలు ఒకేచోట కనువిందు చేస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల సెట్స్‌లో ప్రతిరోజు సినిమాలు, సీరియళ్ల షూటింగ్‌లు నిర్వహిస్తుంటారు. ఈ కాంపౌండ్ వాల్ లోనికి వెళ్తే రంగుల లోకంలోకి వెళ్లినట్లే అనిపిస్తుంది! హైదరాబాద్‌లోని కైత్లాపూర్‌లో రంగు రంగుల ఇళ్లు, పడవలు, లైట్‌ హౌస్‌, గుడిసెలు ఒకేచోట కనువిందు చేస్తాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల సెట్స్‌లో ప్రతిరోజు సినిమాలు, సీరియళ్ల షూటింగ్‌లు నిర్వహిస్తుంటారు.
7/25
అమెరికన్‌ నటి, గాయని కిరా కొసరిన్‌ లాస్‌ ఏంజెలెస్‌లో నిర్వహించిన ‘మ్యూజికేర్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరై సందడి చేశారు. అమెరికన్‌ నటి, గాయని కిరా కొసరిన్‌ లాస్‌ ఏంజెలెస్‌లో నిర్వహించిన ‘మ్యూజికేర్స్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరై సందడి చేశారు.
8/25
ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ సైన్సు డిగ్రీ కళాశాలలో మొబైల్‌ ఫోన్లు చూసి విద్యార్థులు ఇంటర్నల్‌ పరీక్షలు రాశారు. ఇంటర్నల్‌ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని విద్యార్థుల వాట్సాప్‌ గ్రూప్‌నకు పంపించినట్లు, అవి చూసి సమాధానాలు రాస్తున్నారని పరీక్ష నిర్వాహకులు జాకీర్‌ హుస్సేన్‌ చెప్పారు. నిర్వాహకుల తీరుతో విద్యార్థులు చూచిరాతల పర్వానికి అలవాటు పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆదిలాబాద్‌ పట్టణంలోని ప్రభుత్వ సైన్సు డిగ్రీ కళాశాలలో మొబైల్‌ ఫోన్లు చూసి విద్యార్థులు ఇంటర్నల్‌ పరీక్షలు రాశారు. ఇంటర్నల్‌ పరీక్ష ప్రశ్నాపత్రాన్ని విద్యార్థుల వాట్సాప్‌ గ్రూప్‌నకు పంపించినట్లు, అవి చూసి సమాధానాలు రాస్తున్నారని పరీక్ష నిర్వాహకులు జాకీర్‌ హుస్సేన్‌ చెప్పారు. నిర్వాహకుల తీరుతో విద్యార్థులు చూచిరాతల పర్వానికి అలవాటు పడుతున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
9/25
అనిక సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్‌ టి. రమేష్‌  దర్శకత్వంలో తెరకెక్కిన ‘బుట్టబొమ్మ’ నేడు విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం విజయోత్సవ సంబరాలు నిర్వహించింది. కార్యక్రమానికి అనిక సురేంద్రన్‌ హాజరై సందడి చేశారు. అనిక సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ఠ ప్రధాన పాత్రల్లో శౌరి చంద్రశేఖర్‌ టి. రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బుట్టబొమ్మ’ నేడు విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం విజయోత్సవ సంబరాలు నిర్వహించింది. కార్యక్రమానికి అనిక సురేంద్రన్‌ హాజరై సందడి చేశారు.
10/25
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో చేనేత సహకార సంఘాన్ని కేరళలోని ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు సందర్శించారు . అక్కడి దుస్తులను పరిశీలించి నాణ్యత బాగుందని కొనియాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో చేనేత సహకార సంఘాన్ని కేరళలోని ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థులు సందర్శించారు . అక్కడి దుస్తులను పరిశీలించి నాణ్యత బాగుందని కొనియాడారు.
11/25
మాజీ క్రికెటర్లు సౌరవ్‌ గంగూలీ, మహేంద్ర సింగ్‌ ధోనీ కలిసి ముచ్చటించుకున్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో వీరి ఫ్యాన్స్‌ ఈ పోస్టులకు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మాజీ క్రికెటర్లు సౌరవ్‌ గంగూలీ, మహేంద్ర సింగ్‌ ధోనీ కలిసి ముచ్చటించుకున్నారు. ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీంతో వీరి ఫ్యాన్స్‌ ఈ పోస్టులకు లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
12/25
నాందేడ్‌లో ఆదివారం నిర్వహించనున్న భారాస సభకు సర్వం సిద్ధం చేశారు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, టీఎస్ఐఐసీ ఛైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లుతో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి... స‌భా ప్రాంగ‌ణానికి వెళ్లి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. నాందేడ్‌లో ఆదివారం నిర్వహించనున్న భారాస సభకు సర్వం సిద్ధం చేశారు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, టీఎస్ఐఐసీ ఛైర్మ‌న్ గ్యాద‌రి బాల‌మ‌ల్లుతో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి... స‌భా ప్రాంగ‌ణానికి వెళ్లి ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు.
13/25
పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది కుమార్తెను పాక్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది వివాహమాడారు. పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది కుమార్తెను పాక్‌ స్టార్‌ పేసర్‌ షాహీన్‌ షా అఫ్రిది వివాహమాడారు.
14/25
వివాహ వేడుకకు హాజరైన క్రికెటర్లు వివాహ వేడుకకు హాజరైన క్రికెటర్లు
15/25
హైదరాబాద్ విద్యానగర్ డీడీ కాలనీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్‌ పోటీలు నిర్వహించారు. నగరంలోని వివిధ హోటల్ మేనేజ్‌మెంట్‌ కళాశాలల విద్యార్థులు పాల్గొని పూలతో ఆకర్షణీయ ఆకృతులను తీర్చిదిద్దారు. హైదరాబాద్ విద్యానగర్ డీడీ కాలనీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో ఫ్లవర్‌ అరేంజ్‌మెంట్‌ పోటీలు నిర్వహించారు. నగరంలోని వివిధ హోటల్ మేనేజ్‌మెంట్‌ కళాశాలల విద్యార్థులు పాల్గొని పూలతో ఆకర్షణీయ ఆకృతులను తీర్చిదిద్దారు.
16/25
చాక్లెట్లు, పూలతో ఆకట్టుకునే రూపం తీర్చిదిద్దిన విద్యార్థిని చాక్లెట్లు, పూలతో ఆకట్టుకునే రూపం తీర్చిదిద్దిన విద్యార్థిని
17/25
అఖిల్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య కథానాయిక. ఏప్రిల్‌ 28న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. అఖిల్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య కథానాయిక. ఏప్రిల్‌ 28న సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
18/25
పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం.రత్నం జన్మదినం సందర్భంగా చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. సినిమా సెట్స్‌లో పవన్‌, ఎ.ఎం.రత్నం కలిసి దిగిన ఫొటోను ఈ సందర్భంగా పంచుకుంది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. నిర్మాత ఎ.ఎం.రత్నం జన్మదినం సందర్భంగా చిత్రబృందం ట్విటర్‌ వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపింది. సినిమా సెట్స్‌లో పవన్‌, ఎ.ఎం.రత్నం కలిసి దిగిన ఫొటోను ఈ సందర్భంగా పంచుకుంది.
19/25
‘ఈ ఫొటోలో కనిపిస్తున్న బేబీ విమానంలో ఉందా? లేదా రైలు సీటులో ఉందా?.. ఊహించి చెప్పండి’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ బేబీ ఫొటోను ట్వీట్ చేశారు. రైల్వేలో ఉన్న మెరుగైన సదుపాయాలను ఉద్దేశిస్తూ ఆయన ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ‘ఈ ఫొటోలో కనిపిస్తున్న బేబీ విమానంలో ఉందా? లేదా రైలు సీటులో ఉందా?.. ఊహించి చెప్పండి’ అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ బేబీ ఫొటోను ట్వీట్ చేశారు. రైల్వేలో ఉన్న మెరుగైన సదుపాయాలను ఉద్దేశిస్తూ ఆయన ఈ ఫొటోను ట్విటర్‌లో పంచుకున్నారు.
20/25
నర్సంపేట నియోజకవర్గంలో వైతెపా అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె ప్రజలను పలకరిస్తూ..  వారి బాగోగులను తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఓ వృద్ధుడితో ఫొటో దిగి ముచ్చటించారు. నర్సంపేట నియోజకవర్గంలో వైతెపా అధ్యక్షురాలు షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె ప్రజలను పలకరిస్తూ.. వారి బాగోగులను తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగా ఓ వృద్ధుడితో ఫొటో దిగి ముచ్చటించారు.
21/25
సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర(పెద్దగట్టు జాతర)ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వారికి మకరతోరణం తరలింపులో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని డోలు వాయించి ఆకట్టుకున్నారు. సూర్యాపేట జిల్లాలోని దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి జాతర(పెద్దగట్టు జాతర)ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వామి వారికి మకరతోరణం తరలింపులో మంత్రి జగదీశ్‌రెడ్డి పాల్గొని డోలు వాయించి ఆకట్టుకున్నారు.
22/25
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా హైటెక్‌సిటీ మెడికవర్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో క్యాన్సర్‌ వారియర్లను మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సన్మానించారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్బంగా హైటెక్‌సిటీ మెడికవర్‌ క్యాన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో క్యాన్సర్‌ వారియర్లను మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు సన్మానించారు.
23/25
కల్యాణ్‌ రామ్ (Kalyan Ram) హీరోగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్నారు. ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఫిబ్రవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. కల్యాణ్‌ రామ్ (Kalyan Ram) హీరోగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో ఫిబ్రవరి 5న నిర్వహించనున్నారు. ఈ వేడుకకు హీరో ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఫిబ్రవరి 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
24/25
ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో  అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వి. రజిని పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.. ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వి. రజిని పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి..
25/25
ఈ రోజు ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో మెడికల్‌ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్‌ నివారణ పట్ల అవగాహన కలిగి ఉండాలని వారు ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ రోజు ప్రపంచ క్యాన్సర్‌ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లాలో మెడికల్‌ కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్‌ నివారణ పట్ల అవగాహన కలిగి ఉండాలని వారు ప్లకార్డులను ప్రదర్శించారు.

మరిన్ని