News in Pics: చిత్రం చెప్పే సంగతులు-02(05-02-2023)

Updated : 05 Feb 2023 20:32 IST
1/26
సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు రాత్రివేళలో అద్భుతంగా కనిపిస్తున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలోని లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు దీపాలు రాత్రివేళలో అద్భుతంగా కనిపిస్తున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుంటున్నారు.
2/26
3/26
చూసేందుకు అచ్చం సింహంలా ఉన్న ఇది ఓ జాగిలం. చౌచౌగా పిలిచే ఈ జాతి కుక్కలు చైనా దేశానికి చెందినవి. కాకినాడ నగరం మహాత్మానగర్‌కు చెందిన బాలా ప్రసాద్‌ తన కుమార్తె దీపికకు బహుమతిగా ఈ కుక్కను రూ. 2లక్షల 40 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు. చుట్టుపక్కల ప్రాంతాలవారు దీనిని ఆసక్తిగా చూస్తుంటారు. చూసేందుకు అచ్చం సింహంలా ఉన్న ఇది ఓ జాగిలం. చౌచౌగా పిలిచే ఈ జాతి కుక్కలు చైనా దేశానికి చెందినవి. కాకినాడ నగరం మహాత్మానగర్‌కు చెందిన బాలా ప్రసాద్‌ తన కుమార్తె దీపికకు బహుమతిగా ఈ కుక్కను రూ. 2లక్షల 40 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు. చుట్టుపక్కల ప్రాంతాలవారు దీనిని ఆసక్తిగా చూస్తుంటారు.
4/26
5/26
కల్యాణ్‌ రామ్ (Kalyan Ram), ఆషిక జంటగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). ఈ రోజు చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆషిక ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. కల్యాణ్‌ రామ్ (Kalyan Ram), ఆషిక జంటగా దర్శకుడు రాజేంద్రరెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘అమిగోస్‌’ (Amigos). ఈ రోజు చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆషిక ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.
6/26
దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు. దిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మర్యాదపూర్వకంగా కలిశారు.
7/26
యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్‌ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పర్యటనలో పాల్గొన్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ప్యాంటుకు అంటుకున్న మట్టిని లోకేష్‌ తుడిచి నిరాడంబరతను చాటుకున్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్‌ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పర్యటనలో పాల్గొన్న మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ప్యాంటుకు అంటుకున్న మట్టిని లోకేష్‌ తుడిచి నిరాడంబరతను చాటుకున్నారు.
8/26
ఈరోజు అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు డా. ప్రతాప్‌రెడ్డి 90వ పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన తన తాత గురించి ట్విటర్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ‘ఎంతో మంది జీవితాలను మీరు నిలబెట్టారు. మీ వారసులుగా మేం కృతజ్ఞతతో ఉంటాం’ అని రామ్‌చరణ్, ప్రతాప్‌రెడ్డి దంపతులతో కలిసి ఉన్న ఫొటోను ఆమె ట్వీట్‌ చేశారు. ఈరోజు అపోలో హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు డా. ప్రతాప్‌రెడ్డి 90వ పుట్టిన రోజు సందర్భంగా ఉపాసన తన తాత గురించి ట్విటర్‌లో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ‘ఎంతో మంది జీవితాలను మీరు నిలబెట్టారు. మీ వారసులుగా మేం కృతజ్ఞతతో ఉంటాం’ అని రామ్‌చరణ్, ప్రతాప్‌రెడ్డి దంపతులతో కలిసి ఉన్న ఫొటోను ఆమె ట్వీట్‌ చేశారు.
9/26
సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ఆశా మాలవ్యను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన మాలవ్య వివిధ రాష్ట్రాలలో సైకిల్‌పై పర్యటన చేస్తూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోంది. సైకిల్‌పై దేశాన్ని చుట్టివస్తున్న ఆశా మాలవ్యను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన మాలవ్య వివిధ రాష్ట్రాలలో సైకిల్‌పై పర్యటన చేస్తూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతోంది.
10/26
ఏలూరు సీఆర్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ మైదానంలో బాలోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఏలూరు సీఆర్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌ మైదానంలో బాలోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
11/26
బాలోత్సవంలో డ్యాన్స్‌ చేస్తున్న విద్యార్థినులు బాలోత్సవంలో డ్యాన్స్‌ చేస్తున్న విద్యార్థినులు
12/26
హుస్సేన్‌సాగర్ తీరంలోని పీపుల్స్‌ ప్లాజా వద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అడవి శేష్‌, పోలీసు అధికారి జయేష్‌ రంజన్‌ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బైక్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. హుస్సేన్‌సాగర్ తీరంలోని పీపుల్స్‌ ప్లాజా వద్ద ఎలక్ట్రిక్‌ వాహనాల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో అడవి శేష్‌, పోలీసు అధికారి జయేష్‌ రంజన్‌ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం బైక్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
13/26
బైక్‌ విన్యాసాలు బైక్‌ విన్యాసాలు
14/26
దివంగత దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం విశ్వనాథ్‌ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు. దివంగత దర్శకుడు, కళాతపస్వి కె. విశ్వనాథ్‌ కుటుంబ సభ్యులను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అనంతరం విశ్వనాథ్‌ చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళి అర్పించారు.
15/26
హీరో అల్లు అర్జున్‌ తన కుమారుడు అయాన్‌ ఇచ్చిన ఓ అందమైన బహుమతి ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘ నా సోల్‌.. అయాన్‌ బాబు నుంచి అందమైన బహుమతి’ అని బన్నీ పొంగిపోయారు. హీరో అల్లు అర్జున్‌ తన కుమారుడు అయాన్‌ ఇచ్చిన ఓ అందమైన బహుమతి ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘ నా సోల్‌.. అయాన్‌ బాబు నుంచి అందమైన బహుమతి’ అని బన్నీ పొంగిపోయారు.
16/26
మాఘ పౌర్ణమి సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా గంగా, యమునా నదుల సంగమం వద్ద ఉన్న పాంటూన్‌ వంతెనపై భక్తులు ఇలా కిక్కిరిసిపోయారు. మాఘ పౌర్ణమి సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో పుణ్యస్నానానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా గంగా, యమునా నదుల సంగమం వద్ద ఉన్న పాంటూన్‌ వంతెనపై భక్తులు ఇలా కిక్కిరిసిపోయారు.
17/26
రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏగా బాధ్యతలు తీసుకున్న నవీన్‌ మిట్టల్‌ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏగా బాధ్యతలు తీసుకున్న నవీన్‌ మిట్టల్‌ సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
18/26
దెందులూరు మండలం గాలయగూడెంలోని అచ్చమ్మ పేరంటాలు తల్లి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. దెందులూరు మండలం గాలయగూడెంలోని అచ్చమ్మ పేరంటాలు తల్లి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా నిర్వహించిన అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు.
19/26
అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమంలో భక్తులు అగ్నిగుండం ప్రవేశం కార్యక్రమంలో భక్తులు
20/26
భారాస బహిరంగ సభలో భాగంగా సీఎం కేసీఆర్ నాందేడ్‌లోని గురుద్వారాకు చేరుకున్నారు. భారాస బహిరంగ సభలో భాగంగా సీఎం కేసీఆర్ నాందేడ్‌లోని గురుద్వారాకు చేరుకున్నారు.
21/26
హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ తన తాజా ఫొటోను ట్విటలో పంచుకున్నారు. ఈ డ్రెస్సులో ఆమె ఓ రాణిలా ఉన్నట్లు ఫొటో ద్వారా తెలుస్తోంది. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ తన తాజా ఫొటోను ట్విటలో పంచుకున్నారు. ఈ డ్రెస్సులో ఆమె ఓ రాణిలా ఉన్నట్లు ఫొటో ద్వారా తెలుస్తోంది.
22/26
సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్‌సీ మైదానంలో ఏర్పాటు చేసిన హెడీఎఫ్‌సీ స్పోర్ట్స్‌ మీట్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను సన్మానించారు. సికింద్రాబాద్‌లోని ఆర్‌ఆర్‌సీ మైదానంలో ఏర్పాటు చేసిన హెడీఎఫ్‌సీ స్పోర్ట్స్‌ మీట్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ లాంఛనంగా ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆయనను సన్మానించారు.
23/26
తిరుమల నూతన పరకామణి భవనంలో హుండీ కానుకల లెక్కింపును ప్రారంభించారు. తితిదే భవనంలో ప్రత్యేక పూజలు, హోమాలు, గోప్రవేశం చేసిన అనంతరం రెండు వందల మంది ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. తిరుమల నూతన పరకామణి భవనంలో హుండీ కానుకల లెక్కింపును ప్రారంభించారు. తితిదే భవనంలో ప్రత్యేక పూజలు, హోమాలు, గోప్రవేశం చేసిన అనంతరం రెండు వందల మంది ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
24/26
హైదరాబాద్‌లో గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సైకిల్‌థాన్‌ ఏర్పాటు చేశారు. ఔత్సాహికులు భారీగా పాల్గొన్నారు. హైదరాబాద్‌లో గచ్చిబౌలి కేర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా సైకిల్‌థాన్‌ ఏర్పాటు చేశారు. ఔత్సాహికులు భారీగా పాల్గొన్నారు.
25/26
మాఘ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామికి వెయ్యి కలశాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. మాఘ పౌర్ణమి సందర్భంగా భద్రాచలంలోని భద్రాద్రి రామయ్య సన్నిధిలో సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రస్వామికి వెయ్యి కలశాలతో సహస్ర కలశాభిషేకం నిర్వహించారు.
26/26
కలశాల కార్యక్రమంలో అర్చకులు కలశాల కార్యక్రమంలో అర్చకులు

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు