News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (13-05-2023)

Updated : 13 May 2023 21:34 IST
1/30
తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. భక్తులు అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ఊరేగింపులో పాల్గొన్నారు. కళాకారుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. భక్తులు అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ఊరేగింపులో పాల్గొన్నారు. కళాకారుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
2/30
ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. పోప్‌ ఫ్రాన్సిస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత తొలిసారి వీరిద్దరు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. పోప్‌ ఫ్రాన్సిస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన తర్వాత తొలిసారి వీరిద్దరు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
3/30
శనివారం సాయంత్రం ఖైరతాబాద్‌ నుంచి అమీర్‌పేట వరకు రెండు వైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనాలు ఇలా బారులుతీరాయి. సోమాజిగూడ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో కనిపించిందీ దృశ్యం. శనివారం సాయంత్రం ఖైరతాబాద్‌ నుంచి అమీర్‌పేట వరకు రెండు వైపులా ట్రాఫిక్‌ నిలిచిపోయి వాహనాలు ఇలా బారులుతీరాయి. సోమాజిగూడ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో కనిపించిందీ దృశ్యం.
4/30
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర శనివారం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం కె.స్టార్ గొడౌన్‌ క్యాంపు సైట్‌ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆత్మకూరులో నిర్వహించిన బహిరంగసభకు ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర శనివారం నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం కె.స్టార్ గొడౌన్‌ క్యాంపు సైట్‌ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆత్మకూరులో నిర్వహించిన బహిరంగసభకు ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
5/30
బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీదీ ఆయనకు ఘన స్వాగతం పలికి వివిధ అంశాలపై చర్చించారు. సల్మాన్‌కు భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూరాలని ఆమె ఆకాంక్షించారు. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌.. పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీని ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. దీదీ ఆయనకు ఘన స్వాగతం పలికి వివిధ అంశాలపై చర్చించారు. సల్మాన్‌కు భవిష్యత్తులో మరిన్ని విజయాలు చేకూరాలని ఆమె ఆకాంక్షించారు.
6/30
ఐపీఎల్‌ 16 సీజన్‌లో భాగంగా దిల్లీ, పంజాబ్‌ జట్ల మధ్య దిల్లీలో మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత టాస్‌ గెలిచిన దిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్‌లు వార్నర్‌, ధావన్‌ ఇలా ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఐపీఎల్‌ 16 సీజన్‌లో భాగంగా దిల్లీ, పంజాబ్‌ జట్ల మధ్య దిల్లీలో మ్యాచ్‌ జరుగుతోంది. తొలుత టాస్‌ గెలిచిన దిల్లీ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్‌లు వార్నర్‌, ధావన్‌ ఇలా ఆప్యాయంగా పలకరించుకున్నారు.
7/30
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయన్ను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు ఆయన్ను సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
8/30
కొండగట్టులో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఆలయంలో హోమం, సుందరకాండ పారాయణం, అభిషేకం నివేదన, తీర్థ ప్రసాద వితరణ చేశారు. కొండగట్టులో హనుమాన్‌ జయంతి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా శనివారం ఆలయంలో హోమం, సుందరకాండ పారాయణం, అభిషేకం నివేదన, తీర్థ ప్రసాద వితరణ చేశారు.
9/30
ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులకు ప్రతీకారంగా.. పాలస్తీనా తమ దేశంలోని గాజా నగరం నుంచి ఇజ్రాయెల్‌ వైపు క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ క్షిపణి దాడులకు ప్రతీకారంగా.. పాలస్తీనా తమ దేశంలోని గాజా నగరం నుంచి ఇజ్రాయెల్‌ వైపు క్షిపణులను ప్రయోగించింది.
10/30
మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.
11/30
వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక ఓ మహిళ ఇలా తలపై అట్ట పెట్టుకొని వెళ్తున్న దృశ్యం కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో కనిపించింది. వేసవికాలం ఎండలు మండిపోతున్నాయి. ఎండ వేడిని తట్టుకోలేక ఓ మహిళ ఇలా తలపై అట్ట పెట్టుకొని వెళ్తున్న దృశ్యం కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో కనిపించింది.
12/30
హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌ హోటల్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడల్స్‌ నూతన డిజైన్ల దుస్తులు, ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీలోని నోవాటెల్‌ హోటల్‌లో సూత్ర ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడల్స్‌ నూతన డిజైన్ల దుస్తులు, ఆభరణాలు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు.
13/30
సినీనటుడు గోపీచంద్‌.. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి రేష్మతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. తనతో ఇన్నేళ్లు గొప్పగా గడిచాయని, ఆమె వల్లే జీవితానికి పరిపూర్ణత వచ్చిందని చెబుతూ పోస్టు పెట్టారు. సినీనటుడు గోపీచంద్‌.. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి రేష్మతో కలిసి దిగిన ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. తనతో ఇన్నేళ్లు గొప్పగా గడిచాయని, ఆమె వల్లే జీవితానికి పరిపూర్ణత వచ్చిందని చెబుతూ పోస్టు పెట్టారు.
14/30
రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, అజింక్య రహానే కలిసి దిగిన ఫొటోను ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌’ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇక్కడ ఉన్నారు, మీరు ఈరోజు ఏ ‘ఆర్‌’ను ఎంచుకుంటారు అని పోస్టు పెట్టింది. రవీంద్ర జడేజా, రుతురాజ్‌ గైక్వాడ్‌, అజింక్య రహానే కలిసి దిగిన ఫొటోను ‘చెన్నై సూపర్‌ కింగ్స్‌’ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఇక్కడ ఉన్నారు, మీరు ఈరోజు ఏ ‘ఆర్‌’ను ఎంచుకుంటారు అని పోస్టు పెట్టింది.
15/30
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇలా వేలితో విక్టరీ సింబల్‌ను చూపారు. ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనికి మంచి క్యాప్షన్‌ పెట్టండంటూ పలువురు కోరుతున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఇలా వేలితో విక్టరీ సింబల్‌ను చూపారు. ఈ ఫొటో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనికి మంచి క్యాప్షన్‌ పెట్టండంటూ పలువురు కోరుతున్నారు.
16/30
విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా కోటలో శనివారం యోగోత్సవం నిర్వహించారు. ఆయుష్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని మహారాజా కోటలో శనివారం యోగోత్సవం నిర్వహించారు. ఆయుష్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.
17/30
అస్సాం రాష్ట్రం కర్బీ ఆంగ్‌లాంగ్‌ జిల్లాలోని జోంగ్‌తాంగ్‌ గ్రామంలో తివా గిరిజనులు ఖేల్‌చవా వేడుకను ఘనంగా నిర్వహించారు. అభివృద్ధి కోసం, గ్రామాన్ని దుష్ట శక్తుల బారి నుంచి రక్షించేందుకు ఐదేళ్లకోసారి తివా గిరిజన తెగలో పురుషులు ఈ పండగ చేసుకుంటారు. అస్సాం రాష్ట్రం కర్బీ ఆంగ్‌లాంగ్‌ జిల్లాలోని జోంగ్‌తాంగ్‌ గ్రామంలో తివా గిరిజనులు ఖేల్‌చవా వేడుకను ఘనంగా నిర్వహించారు. అభివృద్ధి కోసం, గ్రామాన్ని దుష్ట శక్తుల బారి నుంచి రక్షించేందుకు ఐదేళ్లకోసారి తివా గిరిజన తెగలో పురుషులు ఈ పండగ చేసుకుంటారు.
18/30
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, లఖ్‌నవూ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు క్రికెట్ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్‌, గౌతమ్‌ గంభీర్‌లు ఇలా కలిసి నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, లఖ్‌నవూ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు క్రికెట్ దిగ్గజాలు ముత్తయ్య మురళీధరన్‌, గౌతమ్‌ గంభీర్‌లు ఇలా కలిసి నవ్వుతూ ఫొటోకు పోజిచ్చారు.
19/30
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, లఖ్‌నవూ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా స్టేడియంలో అభిమానుల సందడి నెలకొంది. ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌, లఖ్‌నవూ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా స్టేడియంలో అభిమానుల సందడి నెలకొంది.
20/30
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన భద్రాచలం క్రీడాకారిణి గొంగడి త్రిషకు క్రికెట్‌ దిగ్గజం లారా జ్ఞాపికను అందజేశారు. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన భద్రాచలం క్రీడాకారిణి గొంగడి త్రిషకు క్రికెట్‌ దిగ్గజం లారా జ్ఞాపికను అందజేశారు.
21/30
పంజాబ్‌లోని జలందర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆప్‌ విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం భగవంత్‌మాన్‌ను దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు. పంజాబ్‌లోని జలందర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆప్‌ విజయం సాధించింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం భగవంత్‌మాన్‌ను దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలిపారు.
22/30
రాజధాని పరిధిలోని తుళ్లూరులో అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా అంబేడ్కర్‌ స్మృతివనంకు పాదయాత్ర తలపెట్టిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. రాజధాని పరిధిలోని తుళ్లూరులో అమరావతి రైతుల దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆర్‌-5 జోన్‌కు వ్యతిరేకంగా అంబేడ్కర్‌ స్మృతివనంకు పాదయాత్ర తలపెట్టిన రైతులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది.
23/30
హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి శ్రియా పాల్గొన్నారు. నూతన డిజైన్ల ఆభరణాలతో ఆమె ఫొటోలకు పోజులిచ్చారు. శ్రియాను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ నగల దుకాణం ప్రారంభోత్సవంలో సినీనటి శ్రియా పాల్గొన్నారు. నూతన డిజైన్ల ఆభరణాలతో ఆమె ఫొటోలకు పోజులిచ్చారు. శ్రియాను చూసేందుకు అభిమానులు తరలివచ్చారు.
24/30
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం కనబరుస్తుండటంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వద్ద పార్టీ శ్రేణులు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం కనబరుస్తుండటంతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌ వద్ద పార్టీ శ్రేణులు రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నాయి.
25/30
కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రెడ్‌హిల్స్‌ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గదను బహూకరించారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యంలో కొనసాగుతుండటంతో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి రెడ్‌హిల్స్‌ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గదను బహూకరించారు.
26/30
తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వేంకటేశ్వర ఆలయానికి శనివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి వేంకటేశ్వర ఆలయానికి శనివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
27/30
కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ శిమ్లాలోని హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీ శిమ్లాలోని హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.
28/30
‘శుద్ధ తిరుమల.. సుందర తిరుమల’ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని అలిపిరిలో స్వచ్ఛత కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ‘శుద్ధ తిరుమల.. సుందర తిరుమల’ కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని అలిపిరిలో స్వచ్ఛత కార్యక్రమాన్ని సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.
29/30
నాగచైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కస్టడీ’. ఈ నెల 12న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు రూ.7.4కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. నాగచైతన్య, కృతి శెట్టి జంటగా వెంకట్‌ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కస్టడీ’. ఈ నెల 12న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు రూ.7.4కోట్ల గ్రాస్‌ వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది.
30/30
పంజా వైష్ణవ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌రెడ్డి దర్శకత్వంలో ‘పీవీటీ04’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీలీల.. ‘చిత్ర’ అనే పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. పంజా వైష్ణవ్‌తేజ్‌ హీరోగా శ్రీకాంత్‌రెడ్డి దర్శకత్వంలో ‘పీవీటీ04’(వర్కింగ్‌ టైటిల్‌) సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీలీల.. ‘చిత్ర’ అనే పాత్ర పోషిస్తున్నట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ ఫొటోను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.

మరిన్ని