News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (22-05-2023)

Updated : 22 May 2023 21:27 IST
1/23
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలతో ఈ లోగోను రూపొందించారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆవిష్కరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ప్రభుత్వ ప్రాధాన్య పథకాలతో ఈ లోగోను రూపొందించారు.
2/23
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం చెన్నై, గుజరాత్ జట్ల మధ్య చెన్నైలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా చెన్నై ప్లేయర్‌ మొయిన్ అలీ, గుజరాత్‌ కోచ్‌ నెహ్రా స్టేడియంలో నవ్వులు చిందిస్తున్న ఫొటోను జీటీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ఫ్లే ఆఫ్‌ మ్యాచ్‌లు ఎలా ఉన్నా.. మేము నవ్వుతూనే ఉంటాం’ అని ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా మంగళవారం చెన్నై, గుజరాత్ జట్ల మధ్య చెన్నైలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా చెన్నై ప్లేయర్‌ మొయిన్ అలీ, గుజరాత్‌ కోచ్‌ నెహ్రా స్టేడియంలో నవ్వులు చిందిస్తున్న ఫొటోను జీటీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ‘ఫ్లే ఆఫ్‌ మ్యాచ్‌లు ఎలా ఉన్నా.. మేము నవ్వుతూనే ఉంటాం’ అని ట్వీట్‌ చేసింది.
3/23
జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సుకు హాజరయ్యేందుకు శ్రీనగర్‌ వచ్చిన ప్రతినిధులు దాల్‌ సరస్సులో పడవల్లో తిరిగి అక్కడి అందాలను ఆస్వాదించారు. జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సుకు హాజరయ్యేందుకు శ్రీనగర్‌ వచ్చిన ప్రతినిధులు దాల్‌ సరస్సులో పడవల్లో తిరిగి అక్కడి అందాలను ఆస్వాదించారు.
4/23
ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, గ్రీన్‌ కలిసి దిగిన ఫొటోను ముంబయి జట్టు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఇటీవల ఈ ఇద్దరు సెంచరీలు చేసిన నేపథ్యంలో వీరికి 100/100 అని పోస్టు పెట్టింది. ముంబయి ఇండియన్స్‌ ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, గ్రీన్‌ కలిసి దిగిన ఫొటోను ముంబయి జట్టు తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఇటీవల ఈ ఇద్దరు సెంచరీలు చేసిన నేపథ్యంలో వీరికి 100/100 అని పోస్టు పెట్టింది.
5/23
ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో నటీమణులు డయానా పెంటీ, మౌని రాయ్‌ పాల్గొని సందడి చేశారు. ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో నటీమణులు డయానా పెంటీ, మౌని రాయ్‌ పాల్గొని సందడి చేశారు.
6/23
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సిడ్నీ చేరుకున్నారు. అక్కడి భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సిడ్నీ చేరుకున్నారు. అక్కడి భారతీయులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.
7/23
అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. వాషింగ్టన్‌లో దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటో బాగుందంటూ కార్యకర్తలు, ఆయన ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్‌.. వాషింగ్టన్‌లో దిగిన ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటో బాగుందంటూ కార్యకర్తలు, ఆయన ఫాలోవర్లు కామెంట్లు పెడుతున్నారు.
8/23
సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. సంఘ సంస్కర్త భాగ్యరెడ్డి వర్మ జయంతి సందర్భంగా గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాజ్‌భవన్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
9/23
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ 16వ సీజన్‌ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు, కోచ్‌లు కలిసి దిగిన ఫొటోను ఎస్‌ఆర్‌హెచ్‌ క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌ 16వ సీజన్‌ నుంచి వీడ్కోలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు, కోచ్‌లు కలిసి దిగిన ఫొటోను ఎస్‌ఆర్‌హెచ్‌ క్రికెటర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.
10/23
శ్రీనగర్‌లో నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సుకు సినీనటుడు రామ్‌చరణ్ హాజరయ్యారు. ఆయనకు అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీనగర్‌లో నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సుకు సినీనటుడు రామ్‌చరణ్ హాజరయ్యారు. ఆయనకు అక్కడి అధికారులు ఘన స్వాగతం పలికారు.
11/23
ప్రధాని నరేంద్ర మోదీకి న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్‌ హిప్‌కిన్స్‌ ఆ దేశ క్రికెట్‌ జెర్సీని బహూకరించారు. పపువా న్యూ గినియాలో ఈ నేతలు ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీకి న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్‌ హిప్‌కిన్స్‌ ఆ దేశ క్రికెట్‌ జెర్సీని బహూకరించారు. పపువా న్యూ గినియాలో ఈ నేతలు ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
12/23
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండల కేంద్రంలో ‘కీసర ప్రీమియర్ లీగ్’ క్రికెట్ పోటీలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడి పార్టీ శ్రేణులు, క్రీడాకారులను ఉత్సాహపరిచారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని కీసర మండల కేంద్రంలో ‘కీసర ప్రీమియర్ లీగ్’ క్రికెట్ పోటీలను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాట్‌ పట్టి క్రికెట్‌ ఆడి పార్టీ శ్రేణులు, క్రీడాకారులను ఉత్సాహపరిచారు.
13/23
శ్రీనగర్‌లో సోమవారం జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జీ20 ప్రతినిధులకు శ్రీనగర్‌ విమానాశ్రయంలో మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు. శ్రీనగర్‌లో సోమవారం జీ20 టూరిజం వర్కింగ్‌ గ్రూప్‌ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, జీ20 ప్రతినిధులకు శ్రీనగర్‌ విమానాశ్రయంలో మహిళలు సంప్రదాయ పద్ధతిలో ఘన స్వాగతం పలికారు.
14/23
ముంబయి అచీవర్స్‌ అవార్డ్స్‌ 2023 ప్రదానోత్సవ కార్యక్రమంలో సినీనటి షెర్లీ సేథియా ‘ది రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందుకున్నారు. ముంబయి అచీవర్స్‌ అవార్డ్స్‌ 2023 ప్రదానోత్సవ కార్యక్రమంలో సినీనటి షెర్లీ సేథియా ‘ది రైజింగ్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును అందుకున్నారు.
15/23
ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో శృతిహాసన్‌ మెరిశారు. ఆమె పదునైన చూపులతో చూపరులను ఆకట్టుకున్నారు. ఫ్రాన్స్‌లో నిర్వహిస్తున్న కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో శృతిహాసన్‌ మెరిశారు. ఆమె పదునైన చూపులతో చూపరులను ఆకట్టుకున్నారు.
16/23
హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్‌రావు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అక్కడివారు మంత్రితో సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటో తీసుకొని సంబరపడ్డారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో కొత్తగా ఎంపికైన 1,061 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు మంత్రి హరీశ్‌రావు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అక్కడివారు మంత్రితో సెల్ఫీలు, గ్రూప్‌ ఫొటో తీసుకొని సంబరపడ్డారు.
17/23
కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా తపసిపుడి గ్రామానికి చేరుకున్న సీఎం.. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా బందరు పోర్టు శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా తపసిపుడి గ్రామానికి చేరుకున్న సీఎం.. సముద్రుడికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. మచిలీపట్నం పోర్టు డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ పైలాన్‌ను జగన్‌ ఆవిష్కరించారు.
18/23
కర్ణాటకలో సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ విధాన సౌధ ప్రవేశద్వారం వద్ద ఇలా ప్రణమిల్లి సమావేశాలకు హాజరయ్యారు. కర్ణాటకలో సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ విధాన సౌధ ప్రవేశద్వారం వద్ద ఇలా ప్రణమిల్లి సమావేశాలకు హాజరయ్యారు.
19/23
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా నాలుగు జట్లు గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జట్లకు అభినందనలు తెలుపుతూ ‘ఐపీఎల్‌’ తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా నాలుగు జట్లు గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌, ముంబయి ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా జట్లకు అభినందనలు తెలుపుతూ ‘ఐపీఎల్‌’ తన ట్విటర్‌ ఖాతాలో ఈ ఫొటోను పంచుకుంది.
20/23
ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీఎం కప్‌ పేరున నిర్వహిస్తున్న  క్రీడా పోటీలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సీఎం కప్‌ పేరున నిర్వహిస్తున్న క్రీడా పోటీలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. వివిధ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు.
21/23
తెలంగాణ ఉద్యమకారుడు పిట్టల రవీందర్ తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన్ను అభినందించారు. తెలంగాణ ఉద్యమకారుడు పిట్టల రవీందర్ తెలంగాణ మత్స్య సహకార సంఘాల సమాఖ్య ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయన్ను అభినందించారు.
22/23
మాదాపూర్‌ శిల్పకళావేదికలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు నియామక పత్రాల జారీ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అర్హులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు. మాదాపూర్‌ శిల్పకళావేదికలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు నియామక పత్రాల జారీ కార్యక్రమానికి మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా అర్హులైన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్లకు నియామక పత్రాలు అందజేశారు.
23/23
వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీకి లిఖితపూర్వక లేఖ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనినాష్‌ను అరెస్టు చేస్తే ఊరుకునేది లేదని  వైకాపా కార్యకర్తలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశ్వభారతి ఆసుపత్రి ఎదుట బైఠాయించిన పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ అధికారులు కర్నూలు ఎస్పీకి లిఖితపూర్వక లేఖ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనినాష్‌ను అరెస్టు చేస్తే ఊరుకునేది లేదని వైకాపా కార్యకర్తలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశ్వభారతి ఆసుపత్రి ఎదుట బైఠాయించిన పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
Tags :

మరిన్ని