News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (26-05-2023)

Updated : 26 May 2023 22:10 IST
1/23
హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం యోగా మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, నాయకులు పరిశీలించారు. హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో శనివారం యోగా మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, నాయకులు పరిశీలించారు.
2/23
హైదరాబాద్‌ విద్యానగర్‌లోని జాతీయ స్కిల్‌ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కౌశల్‌ మహోత్సవ్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో విద్యార్థులు సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు. హైదరాబాద్‌ విద్యానగర్‌లోని జాతీయ స్కిల్‌ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కౌశల్‌ మహోత్సవ్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో విద్యార్థులు సెల్ఫీలు తీసుకొని మురిసిపోయారు.
3/23
రాజమహేంద్రవరంలో శనివారం నుంచి తెదేపా ఆధ్వర్యంలో ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ భారీ కటౌట్‌లు చూడ చక్కగా ఉన్నాయి. రాజమహేంద్రవరంలో శనివారం నుంచి తెదేపా ఆధ్వర్యంలో ‘మహానాడు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ భారీ కటౌట్‌లు చూడ చక్కగా ఉన్నాయి.
4/23
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా క్వాలిఫయర్‌ -2 కోసం ముంబయి, గుజరాత్‌ జట్లు అహ్మదాబాద్‌లో తలపడుతున్నాయి. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్‌లు హార్దిక్‌ పాండ్య, రోహిత్‌ శర్మ ఇలా ఫొటోకు పోజిచ్చారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా క్వాలిఫయర్‌ -2 కోసం ముంబయి, గుజరాత్‌ జట్లు అహ్మదాబాద్‌లో తలపడుతున్నాయి. మ్యాచ్‌కు ముందు ఇరుజట్ల కెప్టెన్‌లు హార్దిక్‌ పాండ్య, రోహిత్‌ శర్మ ఇలా ఫొటోకు పోజిచ్చారు.
5/23
అశ్విన్‌బాబు, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిడింబ’. చిత్ర బృందం తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. కార్యక్రమంలో నందితా శ్వేత ఇలా మెరిశారు. అశ్విన్‌బాబు, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో అనిల్‌ కన్నెగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హిడింబ’. చిత్ర బృందం తాజాగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది. కార్యక్రమంలో నందితా శ్వేత ఇలా మెరిశారు.
6/23
ఐపీఎల్‌ 16వ సీజన్‌ తుది దశకు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌, ముంబయి జట్లు క్వాలిఫయర్-2లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య.. జట్టు సభ్యుల్లో స్ఫూర్తిని నింపుతూ కనిపించాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌ తుది దశకు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్‌, ముంబయి జట్లు క్వాలిఫయర్-2లో తలపడుతున్నాయి. ఈ సందర్భంగా మ్యాచ్‌కు ముందు గుజరాత్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య.. జట్టు సభ్యుల్లో స్ఫూర్తిని నింపుతూ కనిపించాడు.
7/23
అనంతపురం జిల్లాలోని నరసనాయునికుంట గ్రామ సమీపంలో దానిమ్మ తోటకు రైతు ఇలా గ్రో కవర్స్‌ ముసుగేసి రక్షణ అందిస్తున్నాడు. దీంతో తోటకు తెగుళ్లు సోకకుండా ఉంటుందని రైతు చెబుతున్నాడు. అనంతపురం జిల్లాలోని నరసనాయునికుంట గ్రామ సమీపంలో దానిమ్మ తోటకు రైతు ఇలా గ్రో కవర్స్‌ ముసుగేసి రక్షణ అందిస్తున్నాడు. దీంతో తోటకు తెగుళ్లు సోకకుండా ఉంటుందని రైతు చెబుతున్నాడు.
8/23
చార్మినార్‌, మక్కా మసీదు సందర్శనకు వచ్చిన పలువురు వేసవి ఎండల ధాటికి వివిధ రకాల గొడుగులు, టోపీలు ధరించి కనిపించారు. చార్మినార్‌, మక్కా మసీదు సందర్శనకు వచ్చిన పలువురు వేసవి ఎండల ధాటికి వివిధ రకాల గొడుగులు, టోపీలు ధరించి కనిపించారు.
9/23
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఐడీపీఎల్‌లోని చౌరస్తాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా టైల్స్‌, చెట్లతో పార్క్‌ను ఏర్పాటు చేశారు. బస్టాప్‌తో పాటు పాదచారులు నడవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని బాలానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి ఐడీపీఎల్‌లోని చౌరస్తాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా టైల్స్‌, చెట్లతో పార్క్‌ను ఏర్పాటు చేశారు. బస్టాప్‌తో పాటు పాదచారులు నడవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
10/23
బోస్నియాలోని వైస్‌గ్రాడ్‌ పట్టణంలో డ్రినా నదీ తీరంలో ప్లాస్టిక్‌, చెత్త పెద్దఎత్తున పేరుకుపోయింది. రెండు దశాబ్దాలుగా టన్నుల కొద్ది చెత్త ఇక్కడ పోగుపడి నదిలో కలుస్తోంది. ఇక్కడ ఏటా సుమారు 10నుంచి 15వేల క్యూబిక్‌ మీటర్ల చెత్త వచ్చి చేరుతుండగా... దాన్ని తొలగించేందుకు సుమారు 6నెలల సమయం పడుతోంది. బోస్నియాలోని వైస్‌గ్రాడ్‌ పట్టణంలో డ్రినా నదీ తీరంలో ప్లాస్టిక్‌, చెత్త పెద్దఎత్తున పేరుకుపోయింది. రెండు దశాబ్దాలుగా టన్నుల కొద్ది చెత్త ఇక్కడ పోగుపడి నదిలో కలుస్తోంది. ఇక్కడ ఏటా సుమారు 10నుంచి 15వేల క్యూబిక్‌ మీటర్ల చెత్త వచ్చి చేరుతుండగా... దాన్ని తొలగించేందుకు సుమారు 6నెలల సమయం పడుతోంది.
11/23
భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌లోని మహాశక్తి దేవాలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హంపి పీఠాధిపతి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.
12/23
మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’(వర్కింగ్‌ టైటిల్‌). సినిమా టైటిల్‌ను ఈ నెల 31న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎంబీ28’(వర్కింగ్‌ టైటిల్‌). సినిమా టైటిల్‌ను ఈ నెల 31న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది.
13/23
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పండితులు వారికి వేదాశీర్వచనాలిచ్చారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు ఆయనకు లాంఛనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం పండితులు వారికి వేదాశీర్వచనాలిచ్చారు.
14/23
తుర్కియేలో ఫిబ్రవరిలో తీవ్ర భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఇళ్లు కోల్పోయిన బాధితులు అక్కడి కహ్రమన్మరస్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. తుర్కియేలో ఫిబ్రవరిలో తీవ్ర భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ విపత్తులో ఇళ్లు కోల్పోయిన బాధితులు అక్కడి కహ్రమన్మరస్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
15/23
క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. లండన్‌ మార్నింగ్స్‌ అని పోస్టు పెట్టారు. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ లండన్‌ పర్యటనకు వెళ్లారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. లండన్‌ మార్నింగ్స్‌ అని పోస్టు పెట్టారు.
16/23
అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మిత్ర్‌ క్లినిక్‌ను సందర్శించారు. ఇందులో అన్నిరకాల వైద్య సేవలను ట్రాన్స్‌జెండర్లే అందిస్తుంటారు. అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి హైదరాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మిత్ర్‌ క్లినిక్‌ను సందర్శించారు. ఇందులో అన్నిరకాల వైద్య సేవలను ట్రాన్స్‌జెండర్లే అందిస్తుంటారు.
17/23
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్, ముంబయి ఇండియన్స్‌ మధ్య శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్‌లో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు సంబంధించిన వ్యక్తులు ప్రాక్టీసు అనంతరం మైదానంలో ముచ్చటించుకుంటున్న ఫొటోను గుజరాత్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఫొటోలో సచిన్‌ తెందూల్కర్‌, డేవిడ్‌ మిల్లర్‌, శుభ్‌మన్‌గిల్‌, పొలార్డ్‌ తదితరులను చూడవచ్చు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్, ముంబయి ఇండియన్స్‌ మధ్య శుక్రవారం సాయంత్రం అహ్మదాబాద్‌లో క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లకు సంబంధించిన వ్యక్తులు ప్రాక్టీసు అనంతరం మైదానంలో ముచ్చటించుకుంటున్న ఫొటోను గుజరాత్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఫొటోలో సచిన్‌ తెందూల్కర్‌, డేవిడ్‌ మిల్లర్‌, శుభ్‌మన్‌గిల్‌, పొలార్డ్‌ తదితరులను చూడవచ్చు.
18/23
చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ.. ఆ జట్టు సభ్యుడు పతిరాన కుటుంబాన్ని చెన్నైలో కలిశారు. ఈ సందర్భంగా ధోనీ.. ‘మీరు పతిరాన గురించి చింతించవద్దు. ఆయన ఎప్పుడూ నాతోనే ఉంటాడు’ అని వారికి భరోసా ఇచ్చారు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ.. ఆ జట్టు సభ్యుడు పతిరాన కుటుంబాన్ని చెన్నైలో కలిశారు. ఈ సందర్భంగా ధోనీ.. ‘మీరు పతిరాన గురించి చింతించవద్దు. ఆయన ఎప్పుడూ నాతోనే ఉంటాడు’ అని వారికి భరోసా ఇచ్చారు.
19/23
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని దిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రాజకీయ అంశాలపై వారు చర్చించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీని దిల్లీలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ రాజకీయ అంశాలపై వారు చర్చించారు.
20/23
తెలంగాణలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పాలిసెట్‌’ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ విడుదల చేశారు. తెలంగాణలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పాలిసెట్‌’ ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ విడుదల చేశారు.
21/23
ఫ్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్‌ రెడ్‌ కార్పెట్‌పై మెరిసిపోతున్నారు. నటి అదితిరావు హైదరీ పసువు వర్ణంతో  ఉన్న పొడవైన గౌనులో  చూపరులను ఆకట్టుకుంది. ఫ్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా సినీ తారలు, సెలిబ్రిటీస్‌ రెడ్‌ కార్పెట్‌పై మెరిసిపోతున్నారు. నటి అదితిరావు హైదరీ పసువు వర్ణంతో ఉన్న పొడవైన గౌనులో చూపరులను ఆకట్టుకుంది.
22/23
ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు హైదరాబాద్‌ బయల్దేరారు. తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడిన నేపథ్యంలో కర్నూలు నుంచి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున  అవినాష్‌  అనుచరులు విశ్వభారతి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి నేడు హైదరాబాద్‌ బయల్దేరారు. తల్లి శ్రీలక్ష్మి ఆరోగ్యం మెరుగుపడిన నేపథ్యంలో కర్నూలు నుంచి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. ఆ సమయంలో పెద్ద ఎత్తున అవినాష్‌ అనుచరులు విశ్వభారతి ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.
23/23
 ఆర్‌-5 జోన్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పట్టాల పంపిణీకి నేడు సీఎం జగన్‌ రానున్న నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఆర్‌-5 జోన్‌ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాల పంపిణీకి వ్యతిరేకంగా రాజధాని రైతులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో పట్టాల పంపిణీకి నేడు సీఎం జగన్‌ రానున్న నేపథ్యంలో రాజధాని అమరావతి పరిధిలోని వెలగపూడి, మందడం, కృష్ణాయపాలెం తదితర గ్రామాల్లో ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు.
Tags :

మరిన్ని