News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (28-05-2023)

Updated : 28 May 2023 22:08 IST
1/33
విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో ఆదివారం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సినీ నటులు, ప్రముఖులు, నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో ఆదివారం ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా సినీ నటులు, ప్రముఖులు, నాయకులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
2/33
మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో ఓ స్టూడియోను ఘనంగా ప్రారంభించారు. ఈవెంట్‌లో పలువురు సోషలైట్స్‌, సెలిబ్రిటీలు హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు. మాదాపూర్‌లోని కావూరిహిల్స్‌లో ఓ స్టూడియోను ఘనంగా ప్రారంభించారు. ఈవెంట్‌లో పలువురు సోషలైట్స్‌, సెలిబ్రిటీలు హాజరై ఫొటోలకు పోజులిచ్చి సందడి చేశారు.
3/33
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. దీనికి సంబంధిచిన వివరాలు ఈ చిత్రంలో చూడొచ్చు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ‘మహానాడు’ బహిరంగ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. దీనికి సంబంధిచిన వివరాలు ఈ చిత్రంలో చూడొచ్చు
4/33
ఇంగ్లాండ్‌ దేశం నార్త్‌ యార్క్‌షైర్‌లోని గేపింగ్‌ గిల్‌ గుహను(బ్రిటన్‌లో అతి పెద్ద గుహ) పలువురు సందర్శించారు. ఈ గుహలోకి ఒక వారం మాత్రమే సందర్శకులను అనుమతించనున్నారు. గుహపైన ఉన్న రంధ్రం నుంచి వారు లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. తిరిగి ఇదే మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. గుహ కింది నుంచి పైకప్పు వరకు 110 మీటర్ల ఎత్తు ఉంటుంది.. ఇంగ్లాండ్‌ దేశం నార్త్‌ యార్క్‌షైర్‌లోని గేపింగ్‌ గిల్‌ గుహను(బ్రిటన్‌లో అతి పెద్ద గుహ) పలువురు సందర్శించారు. ఈ గుహలోకి ఒక వారం మాత్రమే సందర్శకులను అనుమతించనున్నారు. గుహపైన ఉన్న రంధ్రం నుంచి వారు లోపలికి ప్రవేశించాల్సి ఉంటుంది. తిరిగి ఇదే మార్గంలో వెళ్లాల్సి ఉంటుంది. గుహ కింది నుంచి పైకప్పు వరకు 110 మీటర్ల ఎత్తు ఉంటుంది..
5/33
ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య ఆదివారం జరగనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల కెప్టెన్‌లు ధోనీ, పాండ్య కలిసి దిగిన ఫొటోలను హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సీవీ ఆనంద్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘అందరితో పాటు నేనూ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్నా. ధోనీ కోసం చెన్నై కప్‌ గెలవాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్‌ చేశారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య ఆదివారం జరగనుంది. ఈ సందర్భంగా ఇరుజట్ల కెప్టెన్‌లు ధోనీ, పాండ్య కలిసి దిగిన ఫొటోలను హైదరాబాద్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సీవీ ఆనంద్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘అందరితో పాటు నేనూ ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం ఎదురు చూస్తున్నా. ధోనీ కోసం చెన్నై కప్‌ గెలవాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్‌ చేశారు.
6/33
భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ తన జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మొక్కలు నాటి హరితస్ఫూర్తిని చాటారు. భారాస ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ తన జన్మదినం సందర్భంగా గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మొక్కలు నాటి హరితస్ఫూర్తిని చాటారు.
7/33
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ దశదిన కర్మ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరై ఆమె చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించారు.
8/33
రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘మహానాడు’ బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు రాజమహేంద్రవరంలో నిర్వహించిన ‘మహానాడు’ బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన ప్రజలు, అభిమానులు
9/33
హైదరాబాద్‌లోని ఓ ఆభరణాల సంస్థ ఇటీవల వివిధ గిన్నిస్‌ రికార్డులను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన వేడుకకు సినీనటి దిశా పటానీ అతిథిగా హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఓ ఆభరణాల సంస్థ ఇటీవల వివిధ గిన్నిస్‌ రికార్డులను నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన వేడుకకు సినీనటి దిశా పటానీ అతిథిగా హాజరై ఫొటోలకు పోజులిస్తూ సందడి చేశారు.
10/33
రాజమహేంద్రవరంలో తెదేపా ‘మహానాడు’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు హాజరై ప్రజలకు అభివాదం చేశారు. అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాజమహేంద్రవరంలో తెదేపా ‘మహానాడు’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు హాజరై ప్రజలకు అభివాదం చేశారు. అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
11/33
గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య తన కుమారున్ని ఎత్తుకొని అభిమానులకు హాయ్ చెబుతున్న ఫొటోను జీటీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే. గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య తన కుమారున్ని ఎత్తుకొని అభిమానులకు హాయ్ చెబుతున్న ఫొటోను జీటీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ఐపీఎల్‌ 16వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చెన్నై, గుజరాత్‌ జట్ల మధ్య అహ్మదాబాద్‌లో ఆదివారం జరగనున్న విషయం తెలిసిందే.
12/33
రాఘవ లారెన్స్‌ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. నటి రాధిక శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను రాధిక తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘వాసు, లారెన్స్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని ఆమె ట్వీట్‌ చేశారు. రాఘవ లారెన్స్‌ హీరోగా పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘చంద్రముఖి 2’. నటి రాధిక శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను రాధిక తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘వాసు, లారెన్స్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని ఆమె ట్వీట్‌ చేశారు.
13/33
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున మంచి ప్రదర్శన ఇచ్చిన రింకూ సింగ్‌ తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోను ఆయన తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘వాళ్లకు మంచి పేరు తెచ్చావు.. నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్విస్తారు’ అని పలువురు ఫ్యాన్స్‌ ఈ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తరఫున మంచి ప్రదర్శన ఇచ్చిన రింకూ సింగ్‌ తన ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫొటోను ఆయన తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ‘వాళ్లకు మంచి పేరు తెచ్చావు.. నీ తల్లిదండ్రులు నిన్ను చూసి గర్విస్తారు’ అని పలువురు ఫ్యాన్స్‌ ఈ పోస్టు కింద కామెంట్లు పెడుతున్నారు.
14/33
విశాఖపట్నంలోని వివిధ కళాశాలల్లో ఆదివారం సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. పరీక్ష అనంతరం ఓ కళాశాల ముందు అభ్యర్థిని ఇలా నవ్వుతూ కనిపించింది. విశాఖపట్నంలోని వివిధ కళాశాలల్లో ఆదివారం సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. పరీక్ష అనంతరం ఓ కళాశాల ముందు అభ్యర్థిని ఇలా నవ్వుతూ కనిపించింది.
15/33
సరూర్ నగర్‌లోని ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ పోటీల్లో ఆదివారం వాలీబాల్ క్రీడా విభాగంలో వివిధ జట్లు పోటాపోటీగా తలపడ్డాయి. సరూర్ నగర్‌లోని ఇండోర్ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న సీఎం కప్‌ పోటీల్లో ఆదివారం వాలీబాల్ క్రీడా విభాగంలో వివిధ జట్లు పోటాపోటీగా తలపడ్డాయి.
16/33
విశ్వక్‌ సేన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం వీఎస్‌11(వర్కింగ్‌ టైటిల్‌). ఆదివారం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మహనీయుడికి నివాళిగా సినిమాకు సంబంధించిన ఈ ఫొటోను విశ్వక్‌సేన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. విశ్వక్‌ సేన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం వీఎస్‌11(వర్కింగ్‌ టైటిల్‌). ఆదివారం ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మహనీయుడికి నివాళిగా సినిమాకు సంబంధించిన ఈ ఫొటోను విశ్వక్‌సేన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు.
17/33
రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ‘మహానాడు’ సభను వీక్షించేందుకు షేక్‌ బాషా అనే వ్యక్తి గుంటూరు జిల్లా గురజాల నుంచి ద్విచక్రవాహనంపై వచ్చి తెదేపాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న ‘మహానాడు’ సభను వీక్షించేందుకు షేక్‌ బాషా అనే వ్యక్తి గుంటూరు జిల్లా గురజాల నుంచి ద్విచక్రవాహనంపై వచ్చి తెదేపాపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
18/33
సురవరం ప్రతాప్‌రెడ్డి జయంతి సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సురవరం ప్రతాప్‌రెడ్డి జయంతి సందర్భంగా మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
19/33
పార్లమెంట్‌ నూతన భవనం నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు. పార్లమెంట్‌ నూతన భవనం నిర్మాణంలో పాలుపంచుకున్న కార్మికులను ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు.
20/33
దుబాయ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌(ఐఫా) ప్రదానోత్సవంలో సినీనటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఇలా మెరిశారు. దుబాయ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌(ఐఫా) ప్రదానోత్సవంలో సినీనటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ ఇలా మెరిశారు.
21/33
ఐపీఎల్‌  16వ సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఇప్పటి వరకు గెలిచిన, ఓడిన మ్యాచ్‌ల వివరాలను ‘రోడ్‌ టు ది ఫైనల్‌’ పేరుతో ‘ఐపీఎల్‌’ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఇప్పటి వరకు గెలిచిన, ఓడిన మ్యాచ్‌ల వివరాలను ‘రోడ్‌ టు ది ఫైనల్‌’ పేరుతో ‘ఐపీఎల్‌’ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.
22/33
బెర్లిన్‌లో కార్నివాల్‌ ఆఫ్‌ కల్చర్స్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ‘గ్రూపో చిలీ’ అనే నాట్య బృందంలోని ఓ నర్తకి ఇలా విభిన్న వేషధారణలో నృత్యం చేస్తున్న దృశ్యం ఆకట్టుకుంది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఈ ఉత్సవాన్ని నిర్వహించడం విశేషం. బెర్లిన్‌లో కార్నివాల్‌ ఆఫ్‌ కల్చర్స్‌ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా ‘గ్రూపో చిలీ’ అనే నాట్య బృందంలోని ఓ నర్తకి ఇలా విభిన్న వేషధారణలో నృత్యం చేస్తున్న దృశ్యం ఆకట్టుకుంది. కరోనా కారణంగా మూడేళ్ల తర్వాత ఈ ఉత్సవాన్ని నిర్వహించడం విశేషం.
23/33
చిలీలోని శాంటియాగోలో వేల మంది ప్రజలు ఇలా సైకిల్‌ ఆకారంలో నిల్చొని గిన్నిస్‌ రికార్డు కోసం ప్రయత్నించారు. చిలీలో నిర్వహించనున్న పాన్‌ అమెరికన్‌ గేమ్స్‌-2023 ప్రచారం కోసం అక్కడి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. చిలీలోని శాంటియాగోలో వేల మంది ప్రజలు ఇలా సైకిల్‌ ఆకారంలో నిల్చొని గిన్నిస్‌ రికార్డు కోసం ప్రయత్నించారు. చిలీలో నిర్వహించనున్న పాన్‌ అమెరికన్‌ గేమ్స్‌-2023 ప్రచారం కోసం అక్కడి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
24/33
ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలో యుగపురుషుడి విగ్రహానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా రాజమహేంద్రవరంలో యుగపురుషుడి విగ్రహానికి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పూలమాల వేసి నివాళులర్పించారు.
25/33
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్‌ జట్లు అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం తలపడనున్నాయి. ఈ సందర్భంగా స్టేడియంలో ధోనీ, గుజరాత్‌ జట్టు సభ్యులు ఇలా సరదాగా ముచ్చటించుకుంటున్న ఫొటోను జీటీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘వీరి స్నేహం ఇలా మొదలైంది’ అని ట్వీట్‌ చేసింది. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఫైనల్‌ మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్‌ జట్లు అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం తలపడనున్నాయి. ఈ సందర్భంగా స్టేడియంలో ధోనీ, గుజరాత్‌ జట్టు సభ్యులు ఇలా సరదాగా ముచ్చటించుకుంటున్న ఫొటోను జీటీ తన ట్విటర్ ఖాతాలో పంచుకుంది. ‘వీరి స్నేహం ఇలా మొదలైంది’ అని ట్వీట్‌ చేసింది.
26/33
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు పార్లమెంట్‌ నూతన భవనం సమీపంలో నిరసనకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ పలువురు పార్లమెంట్‌ నూతన భవనం సమీపంలో నిరసనకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు.
27/33
వేసవి సెలవులు, వారాంతం కావడంతో ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో స్వామి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది. వేసవి సెలవులు, వారాంతం కావడంతో ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. దీంతో స్వామి దర్శనం కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి వచ్చింది.
28/33
దుబాయ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌(ఐఫా) ప్రదానోత్సవంలో సినీనటి రాశీఖన్నా మెరిశారు. దుబాయ్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌(ఐఫా) ప్రదానోత్సవంలో సినీనటి రాశీఖన్నా మెరిశారు.
29/33
పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ వేసిన సైకతం ఆకట్టుకుంది. పార్లమెంట్‌ నూతన భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ఒడిశాలోని పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ వేసిన సైకతం ఆకట్టుకుంది.
30/33
అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశించిన ప్రధానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం వారు గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన పార్లమెంట్‌ నూతన భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. ప్రధాన ద్వారం నుంచి పార్లమెంట్‌ ఆవరణలోకి ప్రవేశించిన ప్రధానికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా స్వాగతం పలికారు. అనంతరం వారు గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు.
31/33
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన ఆదివారం స్వామివారు సింహ వాహనంపై అనంత స్వామి అలంకారంలో దర్శనమిచ్చారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో మూడో రోజైన ఆదివారం స్వామివారు సింహ వాహనంపై అనంత స్వామి అలంకారంలో దర్శనమిచ్చారు.
32/33
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ.. కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, బాలకృష్ణ.. కోటిపల్లి బస్టాండ్ సెంటర్‌లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
33/33
తెదేపా వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొని తెలుగు రాష్ట్రాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెదేపా వ్యవస్థాపకులు, దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద ఆయన కుటుంబసభ్యులు నివాళులర్పించారు. నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌ తదితరులు కార్యక్రమంలో పాల్గొని తెలుగు రాష్ట్రాలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు