News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (29-05-2023)

Updated : 29 May 2023 12:28 IST
1/15
తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుపై అభిమానంతో ‘ఎన్టీఆర్‌’  అనే మూడు అక్షరాలతో సుందరమైన చిత్రాన్ని గీసి ఔరా అనిపించాడో చిత్రకారుడు. ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌ పార్సగుట్టకు చెందిన  రాము వారం రోజులపాటు శ్రమించి గీశాడు. తెదేపా వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుపై అభిమానంతో ‘ఎన్టీఆర్‌’ అనే మూడు అక్షరాలతో సుందరమైన చిత్రాన్ని గీసి ఔరా అనిపించాడో చిత్రకారుడు. ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్‌ పార్సగుట్టకు చెందిన రాము వారం రోజులపాటు శ్రమించి గీశాడు.
2/15
యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులు ఆదివారం తీవ్ర ఎండ వేడితో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మాడ వీధుల్లో కాలుతున్న నల్లరాతి బండలపై నడవలేక పలువురు పరుగులు పెట్టారు. కొండపై ప్రయాణ ప్రాంగణం వద్ద చెప్పులు వదిలిన భక్తులు సీసీరోడ్డు మీదుగా గుడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు కాళ్లకు వస్త్రాలు, ప్లాస్టిక్‌ కవర్లు చుట్టుకొని లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులు ఆదివారం తీవ్ర ఎండ వేడితో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మాడ వీధుల్లో కాలుతున్న నల్లరాతి బండలపై నడవలేక పలువురు పరుగులు పెట్టారు. కొండపై ప్రయాణ ప్రాంగణం వద్ద చెప్పులు వదిలిన భక్తులు సీసీరోడ్డు మీదుగా గుడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. వృద్ధులు కాళ్లకు వస్త్రాలు, ప్లాస్టిక్‌ కవర్లు చుట్టుకొని లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వెళ్లారు.
3/15
హైదరాబాద్‌లోని నిజాంపేట ప్రగతినగర్‌ నుంచి బాచుపల్లి ప్రధాన రోడ్డు వరకు రెండు కిలోమీటర్ల మేర రెండు వైపులా పచ్చని చెట్లు పందిళ్లలా పరుచుకోవడంతో ప్రయాణికులు మండుతున్న ఎండల్లోనూ చల్లటి నీడలో ప్రయాణం సాగిస్తున్నారు. హైదరాబాద్‌లోని నిజాంపేట ప్రగతినగర్‌ నుంచి బాచుపల్లి ప్రధాన రోడ్డు వరకు రెండు కిలోమీటర్ల మేర రెండు వైపులా పచ్చని చెట్లు పందిళ్లలా పరుచుకోవడంతో ప్రయాణికులు మండుతున్న ఎండల్లోనూ చల్లటి నీడలో ప్రయాణం సాగిస్తున్నారు.
4/15
గ్రామ, ప్రాంతం వేరైనప్పుడు ఒకచోట వాన.. మరో చోట ఎండ  కాస్తే పెద్దగా పట్టించుకోమనుకోండి. కానీ ఒకే రోడ్డులో ఒకవైపు గీత గీసినట్లుగా వాన పడడం.. మరో వైపు చుక్క తడి లేక  పోవడం దగ్గరుండి గమనిస్తే ఎంత విచిత్రంగా ఉంటుంది. ఇలాంటి ‘చిత్రమే’ ఆదివారం మామడ, దిమ్మదుర్తి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కనిపించింది. గ్రామ, ప్రాంతం వేరైనప్పుడు ఒకచోట వాన.. మరో చోట ఎండ కాస్తే పెద్దగా పట్టించుకోమనుకోండి. కానీ ఒకే రోడ్డులో ఒకవైపు గీత గీసినట్లుగా వాన పడడం.. మరో వైపు చుక్క తడి లేక పోవడం దగ్గరుండి గమనిస్తే ఎంత విచిత్రంగా ఉంటుంది. ఇలాంటి ‘చిత్రమే’ ఆదివారం మామడ, దిమ్మదుర్తి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై కనిపించింది.
5/15
  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌లు బస్తీ ప్రజలకు ఉపయోగకరంగా మారాయి. వేసవి నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉత్సాహంగా వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.

జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌లు బస్తీ ప్రజలకు ఉపయోగకరంగా మారాయి. వేసవి నేపథ్యంలో ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఉత్సాహంగా వెళ్లి కసరత్తులు చేస్తున్నారు.
6/15
కాకినాడ జిల్లాలోని తుని గ్రామీణంలో తలుపులమ్మవారి లోవ దేవస్థానానికి వెలమకొత్తూరుకు చెందిన భక్తులు బోనాలతో కాలినడకన తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనార్థం వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. 

7/15
ఒక్క ఆకు కూడా లేదు, చెట్టంతా గులాబీ రంగు పుష్పాలతో కళకళలాడుతోంది. చూపరులకు కనువిందు చేస్తోంది.నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి పడమర ఉన్న గిరిజన కాలనీలో ఉన్న ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ కెమెరాతో బంధించింది.

8/15
సిద్దిపేట  జిల్లాలోని రాజీవ్‌ రహదారి, కొండపాక మండలంలోని పలు గ్రామాలను కలిపే బందారం దర్గా మార్గం, దుద్దెడ నుంచి మర్పడ్గ, సిరిసినగండ్ల వెళ్లే రహదారులు పూలు సింగారించుకున్నట్లుగా సరికొత్త శోభను సంతరించుకున్నాయి. సిద్దిపేట జిల్లాలోని రాజీవ్‌ రహదారి, కొండపాక మండలంలోని పలు గ్రామాలను కలిపే బందారం దర్గా మార్గం, దుద్దెడ నుంచి మర్పడ్గ, సిరిసినగండ్ల వెళ్లే రహదారులు పూలు సింగారించుకున్నట్లుగా సరికొత్త శోభను సంతరించుకున్నాయి.
9/15
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పంగిడిపల్లి సర్పంచి ప్రియాంక మహాజన్‌ గ్రామంలో ఖాళీ మద్యం సీసాలను పంచాయతీ సిబ్బందితో సేకరించారు. హరితహారం నర్సరీ, రైతు వేదిక చుట్టూ వాటితో గద్దెలను నిర్మించారు. ఖాళీ సీసాలతో చేపట్టిన ఈ నిర్మాణాలను చూసి గ్రామస్థులు అభినందిస్తున్నారు.

10/15
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకాలనీ రమ్య గ్రౌండ్స్‌ వద్ద వంద కిలోల కేకు కోస్తున్న తెదేపా నేతలు
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీకాలనీ రమ్య గ్రౌండ్స్‌ వద్ద వంద కిలోల కేకు కోస్తున్న తెదేపా నేతలు
11/15
హైదరాబాద్‌: ఉప్పల్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
హైదరాబాద్‌: ఉప్పల్‌లోని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
12/15
 హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం ఓ ఆభరణాల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో నటి దిశా పటానీ పాల్గొని సందడి చేసింది. రూపదర్శినులు క్యాట్‌ వాక్‌ చేసి సందర్శకులను అలరించారు
హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఆదివారం ఓ ఆభరణాల ప్రదర్శన నిర్వహించారు. ఇందులో నటి దిశా పటానీ పాల్గొని సందడి చేసింది. రూపదర్శినులు క్యాట్‌ వాక్‌ చేసి సందర్శకులను అలరించారు
13/15
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో వాలీబాల్, కబడ్డీ సీఎం కప్‌ పోటీలు జరిగాయి. రంగారెడ్డి, ఆదిలాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జనగామ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో వాలీబాల్, కబడ్డీ సీఎం కప్‌ పోటీలు జరిగాయి. రంగారెడ్డి, ఆదిలాబాద్, సూర్యాపేట, సిద్దిపేట, జనగామ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.
14/15
హైదరాబాద్‌లోని  మెహిదీపట్నానికి చెందిన ఆటో డ్రైవర్‌ హసన్‌.. తన ఆటో ఎక్కే ప్రయాణికులకు ఎండ వేడి తగలకుండా వాహనంపై ఇలా గ్రీన్‌ మ్యాట్‌ వేయించారు. ఆటో పైభాగం నుంచి గాలి వచ్చేలా రూఫ్‌ టాప్‌నకు డోర్‌ సైతం ఏర్పాటు చేసుకున్నారు. 

15/15
 దిల్లీలో ఆదివారం నూతన పార్లమెంటు భవనం ప్రారంభం సందర్భంగా మఠాధిపతులు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తోడురాగా సెంగోల్‌ను తీసుకొని వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

దిల్లీలో ఆదివారం నూతన పార్లమెంటు భవనం ప్రారంభం సందర్భంగా మఠాధిపతులు, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా తోడురాగా సెంగోల్‌ను తీసుకొని వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

మరిన్ని