News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (30-05-2023)

Updated : 30 May 2023 09:18 IST
1/14
హైదరాబాద్‌ జూబ్లీహల్స్‌లోని ఓ పబ్‌లో వన్యప్రాణులు దర్శనమిచ్చాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-36/10లోని ఆ పబ్‌లో వారాంతంలో ఇవి దర్శనమివ్వడంతో కొందరు వ్యక్తులు.. వాటి చిత్రాలను, వీడియోలను తమ ట్విటర్‌ ఖాతాల్లో పోస్టు చేశారు. పిల్లి, పాము, తొండ తదితర వన్యప్రాణులను పబ్‌కు వచ్చిన వారు పట్టుకోవడం ఒంటిమీద పెట్టుకోవడం చేస్తున్నారు. హైదరాబాద్‌ జూబ్లీహల్స్‌లోని ఓ పబ్‌లో వన్యప్రాణులు దర్శనమిచ్చాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌-36/10లోని ఆ పబ్‌లో వారాంతంలో ఇవి దర్శనమివ్వడంతో కొందరు వ్యక్తులు.. వాటి చిత్రాలను, వీడియోలను తమ ట్విటర్‌ ఖాతాల్లో పోస్టు చేశారు. పిల్లి, పాము, తొండ తదితర వన్యప్రాణులను పబ్‌కు వచ్చిన వారు పట్టుకోవడం ఒంటిమీద పెట్టుకోవడం చేస్తున్నారు.
2/14
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్‌ సముదాయం ముస్తాబవుతోంది. చేర్యాలకు చెందిన నకాశీ చిత్రకారులు తమదైన శైలిలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా చిత్రాలు వేశారు. కలెక్టర్‌ కార్యాలయ ముఖద్వారం, పాలనాధికారి గది ముందుభాగంలో ఈ చిత్రాలు ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్‌ సముదాయం ముస్తాబవుతోంది. చేర్యాలకు చెందిన నకాశీ చిత్రకారులు తమదైన శైలిలో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా చిత్రాలు వేశారు. కలెక్టర్‌ కార్యాలయ ముఖద్వారం, పాలనాధికారి గది ముందుభాగంలో ఈ చిత్రాలు ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు.
3/14
మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలోని పాలేరు వాగు వేసవిలో ఎడారిని తలపించేది. రాష్ట్ర ప్రభుత్వం వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టింది. దీంతో వరదనీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భజలాలు పెరిగేందుకు ఇవి దోహదపడుతున్నాయి. పాలేరువాగుపై పెద్దముప్పారం, రామవరం, ఆగాపేట, నిదానపురం, కుమ్మరికుంట్ల, వేములపల్లి, రేపోణి, లక్ష్మీపురం శివారుల్లో పది చెక్‌డ్యాంలను నిర్మించారు. పంటలకు ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయడంతో పాలేరువాగులోని చెక్‌డ్యాంలు పూర్తిగా నిండి నిండు వేసవిలో జలకళను సంతరించుకున్నాయి. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలంలోని పాలేరు వాగు వేసవిలో ఎడారిని తలపించేది. రాష్ట్ర ప్రభుత్వం వాగుపై చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టింది. దీంతో వరదనీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భజలాలు పెరిగేందుకు ఇవి దోహదపడుతున్నాయి. పాలేరువాగుపై పెద్దముప్పారం, రామవరం, ఆగాపేట, నిదానపురం, కుమ్మరికుంట్ల, వేములపల్లి, రేపోణి, లక్ష్మీపురం శివారుల్లో పది చెక్‌డ్యాంలను నిర్మించారు. పంటలకు ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయడంతో పాలేరువాగులోని చెక్‌డ్యాంలు పూర్తిగా నిండి నిండు వేసవిలో జలకళను సంతరించుకున్నాయి.
4/14
మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో రహదారి నియమావళి ఉల్లంఘన యథేచ్చగా  కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణిస్తున్నారు. ఆటోలు, ఇతర వాహనాల్లో పరిమితి మించి ప్రయాణిస్తున్నారు.  సోమవారం పట్టణంలో ఇలా రహదారి నియమాలను ఖాతరు చేయకుండా ప్రయాణించారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో రహదారి నియమావళి ఉల్లంఘన యథేచ్చగా కొనసాగుతోంది. ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి ప్రయాణిస్తున్నారు. ఆటోలు, ఇతర వాహనాల్లో పరిమితి మించి ప్రయాణిస్తున్నారు. సోమవారం పట్టణంలో ఇలా రహదారి నియమాలను ఖాతరు చేయకుండా ప్రయాణించారు.
5/14
సీఎం కప్‌-2023 క్రీడ సంబురాలు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలు విభాగాల్లో జరిగిన పోటీలు ఆద్యంతం ఉత్కంఠ రేపాయి. సీఎం కప్‌-2023 క్రీడ సంబురాలు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సోమవారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పలు విభాగాల్లో జరిగిన పోటీలు ఆద్యంతం ఉత్కంఠ రేపాయి.
6/14
హైదరాబాద్‌ లో సచివాలయం ఎదురుగా నిర్మిస్తున్న తెలంగాణ అమరుల స్మృతి చిహ్నం ప్రారంభానికి సిద్ధమవుతోంది. సుమారు 3.29 ఎకరాల్లో దాదాపు రూ.179 కోట్ల వ్యయంతో దీనిని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రమిద ఆకారంలో నాలుగు అంతస్తుల భవనంతో పాటు పైన నిరంతరం వెలిగే జ్యోతి చిహ్నాన్ని ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌ లో సచివాలయం ఎదురుగా నిర్మిస్తున్న తెలంగాణ అమరుల స్మృతి చిహ్నం ప్రారంభానికి సిద్ధమవుతోంది. సుమారు 3.29 ఎకరాల్లో దాదాపు రూ.179 కోట్ల వ్యయంతో దీనిని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రమిద ఆకారంలో నాలుగు అంతస్తుల భవనంతో పాటు పైన నిరంతరం వెలిగే జ్యోతి చిహ్నాన్ని ఏర్పాటుచేశారు.
7/14
 కొత్త సీవీసీగా ప్రవీణ్‌కుమార్‌ శ్రీవాస్తవతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. కొత్త సీవీసీగా ప్రవీణ్‌కుమార్‌ శ్రీవాస్తవతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సోమవారం ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
8/14
 హైదరాబాద్‌:  ఎల్బీ స్టేడియంలో సోమవారం ‘సీఎం కప్‌-2023 తెలంగాణ క్రీడా సంబురాలు’ వేడుక వైభవంగా జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్‌: ఎల్బీ స్టేడియంలో సోమవారం ‘సీఎం కప్‌-2023 తెలంగాణ క్రీడా సంబురాలు’ వేడుక వైభవంగా జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
9/14
 హైదరాబాద్‌ లో కేపీహెచ్‌బీ వంతెనపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలివి. కొన్ని నెలలుగా విరిగిపోయి వేలాడుతున్నాయి. లైట్లు కూడా పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి. హైదరాబాద్‌ లో కేపీహెచ్‌బీ వంతెనపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలివి. కొన్ని నెలలుగా విరిగిపోయి వేలాడుతున్నాయి. లైట్లు కూడా పడిపోయే పరిస్థితిలో ఉన్నాయి.
10/14
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్న వేడుకలకు అన్నిశాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమయం దగ్గర పడడంతో పనులు చకచకా సాగుతున్నాయి. కొత్త సచివాలయం ప్రాంగణంలో వెలుగులీనుతున్న విద్యుద్దీపాలు, ఇతర ఏర్పాట్లను చిత్రంలో చూడొచ్చు.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు నగరం సిద్ధమవుతోంది. జూన్‌ 2 నుంచి ప్రారంభం కానున్న వేడుకలకు అన్నిశాఖల సమన్వయంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమయం దగ్గర పడడంతో పనులు చకచకా సాగుతున్నాయి. కొత్త సచివాలయం ప్రాంగణంలో వెలుగులీనుతున్న విద్యుద్దీపాలు, ఇతర ఏర్పాట్లను చిత్రంలో చూడొచ్చు..
11/14
 రోలుగుంట మండలం భోగాపురం సమీపంలో చింత చెట్టును గొడ్డళ్లతో నరికేసి, రంపాలతో కోసేయగా.. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వేగంగా కొత్త చిగుళ్లు వచ్చాయి. రోలుగుంట మండలం భోగాపురం సమీపంలో చింత చెట్టును గొడ్డళ్లతో నరికేసి, రంపాలతో కోసేయగా.. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వేగంగా కొత్త చిగుళ్లు వచ్చాయి.
12/14
 కేపీహెచ్‌బీ పాత రైతుబజార్‌ పైవంతెనపై సోమవారం ఉదయం భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పూర్తిగా అష్ట దిగ్బంధం చేసినట్టు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేపీహెచ్‌బీ పాత రైతుబజార్‌ పైవంతెనపై సోమవారం ఉదయం భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పూర్తిగా అష్ట దిగ్బంధం చేసినట్టు వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
13/14
ఓ వ్యాపారి తన ద్విచక్రవాహనంపై ప్లాస్టిక్‌ పూలహారాలు, వివిధ రకాల పూజా సామగ్రిని ఉంచుకొని గ్రామాల్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. రోజూ సుమారు 10 గ్రామాల్లో తిరిగి వీటిని అమ్ముతానని ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి-వల్మిడి ప్రధాన రహదారిపై తీసిన చిత్రమిది. ఓ వ్యాపారి తన ద్విచక్రవాహనంపై ప్లాస్టిక్‌ పూలహారాలు, వివిధ రకాల పూజా సామగ్రిని ఉంచుకొని గ్రామాల్లో విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. రోజూ సుమారు 10 గ్రామాల్లో తిరిగి వీటిని అమ్ముతానని ఆయన ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి-వల్మిడి ప్రధాన రహదారిపై తీసిన చిత్రమిది.
14/14
మహబూబ్‌నగర్‌లో పట్టణంలోని క్లాక్‌టవర్‌ కూడలి అంటే తెలియనివారు ఉండరు. ఇలాంటి క్లాక్‌టవర్‌ కూడలిలో గడియారాలు పనిచేయటం లేదు. ఒక్కోవైపు గడియారం ఒక సమయాన్ని చూపిస్తోంది.
 మహబూబ్‌నగర్‌లో పట్టణంలోని క్లాక్‌టవర్‌ కూడలి అంటే తెలియనివారు ఉండరు. ఇలాంటి క్లాక్‌టవర్‌ కూడలిలో గడియారాలు పనిచేయటం లేదు. ఒక్కోవైపు గడియారం ఒక సమయాన్ని చూపిస్తోంది.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు