News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (31-05-2023)

Updated : 31 May 2023 20:14 IST
1/23
సినీనటి కాజల్‌ అగర్వాల్‌ తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. సినీనటి కాజల్‌ అగర్వాల్‌ తన తాజా ఫొటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫొటోకు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.
2/23
కరీంనగర్‌లో బుధవారం వేంకటేశ్వరస్వామి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీనివాసుని కల్యాణ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌, వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్‌లో బుధవారం వేంకటేశ్వరస్వామి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం శ్రీనివాసుని కల్యాణ శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్‌, వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.
3/23
మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ టైటిల్‌ను ఖరారు చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. మహేశ్‌బాబు- త్రివిక్రమ్‌ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సూపర్‌స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఈ సినిమా టైటిల్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘గుంటూరు కారం’ టైటిల్‌ను ఖరారు చేసింది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది.
4/23
కర్నూలు నగరంలోని తుంగభద్ర నదిలో నీటి కుంటలు ఆకట్టుకుంటున్నాయి. నీరులేక వెలవెలబోతున్న నదిలో అక్కడక్కడ నీటి జాడలు కనువిందు చేస్తున్నాయి. నదీ ప్రవాహం లేకపోయినా ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరడంతో పచ్చిక పరుచుకొని ఆహ్లాదాన్ని పంచుతోంది. కర్నూలు నగరంలోని తుంగభద్ర నదిలో నీటి కుంటలు ఆకట్టుకుంటున్నాయి. నీరులేక వెలవెలబోతున్న నదిలో అక్కడక్కడ నీటి జాడలు కనువిందు చేస్తున్నాయి. నదీ ప్రవాహం లేకపోయినా ఇటీవల కురిసిన వర్షాలకు నీరు చేరడంతో పచ్చిక పరుచుకొని ఆహ్లాదాన్ని పంచుతోంది.
5/23
బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ వద్ద ఏర్పాటు చేసిన చిన్నారి చెఫ్‌ల బొమ్మలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ వద్ద ఏర్పాటు చేసిన చిన్నారి చెఫ్‌ల బొమ్మలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
6/23
న్యూయార్క్‌లోని 42వ స్ట్రీట్‌లో భవనాల మధ్య అస్తమిస్తున్న సూర్యుడు ఇలా కనువిందు చేశాడు. ఇలా సరిగ్గా భవనాల మధ్యలో రావడాన్ని అక్కడ మాన్‌హట్టన్‌హెంగ్‌ అంటారు. మంగళవారం చోటు చేసుకున్న ఈ దృశ్యాన్ని తమ చరవాణుల్లో బంధించడానికి ప్రజలు ఎగబడ్డారు. న్యూయార్క్‌లోని 42వ స్ట్రీట్‌లో భవనాల మధ్య అస్తమిస్తున్న సూర్యుడు ఇలా కనువిందు చేశాడు. ఇలా సరిగ్గా భవనాల మధ్యలో రావడాన్ని అక్కడ మాన్‌హట్టన్‌హెంగ్‌ అంటారు. మంగళవారం చోటు చేసుకున్న ఈ దృశ్యాన్ని తమ చరవాణుల్లో బంధించడానికి ప్రజలు ఎగబడ్డారు.
7/23
కాకినాడ జేఎన్‌టీయూలో స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ పట్టాలు పొందిన విద్యార్థులు తల్లిదండ్రులు, మిత్రులతో ఫొటోలు తీసుకొని సంబరాలు చేసుకున్నారు. కాకినాడ జేఎన్‌టీయూలో స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్‌డీ పట్టాలు పొందిన విద్యార్థులు తల్లిదండ్రులు, మిత్రులతో ఫొటోలు తీసుకొని సంబరాలు చేసుకున్నారు.
8/23
చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిని కలిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ కూకట్‌పల్లి మీదుగా ప్రగతిభవన్‌ చేరుకున్నారు. ఈక్రమంలో కేపీహెచ్‌బీ కాలనీ వద్ద పోలీసులు వాహనాలు నిలిపేసిన దృశ్యాన్ని చిత్రంలో చూడొచ్చు. చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతిని కలిసిన అనంతరం సీఎం కేసీఆర్‌ కూకట్‌పల్లి మీదుగా ప్రగతిభవన్‌ చేరుకున్నారు. ఈక్రమంలో కేపీహెచ్‌బీ కాలనీ వద్ద పోలీసులు వాహనాలు నిలిపేసిన దృశ్యాన్ని చిత్రంలో చూడొచ్చు.
9/23
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఖాజాగూడ, బయోడైవర్సిటీ తదితర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఖాజాగూడ, బయోడైవర్సిటీ తదితర ప్రాంతాల్లో బుధవారం వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమై వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు.
10/23
ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని పుష్కర్‌లో బ్రహ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు ప్రతేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్‌లోని పుష్కర్‌లో బ్రహ్మ ఆలయాన్ని దర్శించుకున్నారు. అర్చకులు ప్రతేక పూజలు నిర్వహించి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు.
11/23
ముఖ్యమంత్రి కేసీఆర్ చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి వెంట ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ఉన్నారు.
12/23
నిజామాబాద్‌ శివారు మాధవనగర్‌లోని బసవ గార్డెన్‌ సమీపంలో భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య గృహప్రవేశం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన బాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్సీ కవిత ఒకరికొకరు ఎదురుపడి నమస్కరించుకున్నారు. నిజామాబాద్‌ శివారు మాధవనగర్‌లోని బసవ గార్డెన్‌ సమీపంలో భాజపా జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య గృహప్రవేశం నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన బాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎమ్మెల్సీ కవిత ఒకరికొకరు ఎదురుపడి నమస్కరించుకున్నారు.
13/23
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నిజాంపేటలో 5కె రన్‌ నిర్వహించారు. పొగాకు వినియోగం కారణంగా కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని పరుగు తీశారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నిజాంపేటలో 5కె రన్‌ నిర్వహించారు. పొగాకు వినియోగం కారణంగా కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు చేపట్టిన ఈ కార్యక్రమంలో నగరవాసులు ఉత్సాహంగా పాల్గొని పరుగు తీశారు.
14/23
మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామంలో భారాస నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎడ్లబండిపై గ్రామంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మంత్రి పువ్వాడ అజయ్‌ ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామంలో భారాస నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎడ్లబండిపై గ్రామంలో పర్యటించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు.
15/23
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లిన భారత జట్టు క్రీడాకారులు మహ్మద్‌ సిరాజ్‌, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనాద్కత్‌ ఇలా సరదాగా ముచ్చటించుకుంటూ కనిపించారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లిన భారత జట్టు క్రీడాకారులు మహ్మద్‌ సిరాజ్‌, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనాద్కత్‌ ఇలా సరదాగా ముచ్చటించుకుంటూ కనిపించారు.
16/23
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను (Brahmana Samkshema Sadan) సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని ఆయన అన్నారు. బ్రాహ్మణుల్లోనూ చాలామంది పేదలున్నారని చెప్పారు. బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్‌పల్లిలో విప్రహిత బ్రాహ్మణ సంక్షేమ సదన్‌ను (Brahmana Samkshema Sadan) సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. పురవాసుల హితం కోరేవారే పురోహితులు అని ఆయన అన్నారు. బ్రాహ్మణుల్లోనూ చాలామంది పేదలున్నారని చెప్పారు. బ్రాహ్మణ పరిషత్‌కు ఏటా రూ.100కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
17/23
కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శాన్‌ ఫ్రాన్సిస్కోలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయులతో సమావేశమై ముచ్చటించారు. అంతకు ముందు వారు ఆయనకు హారతులిచ్చి ఆత్మీయస్వాగతం పలికారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శాన్‌ ఫ్రాన్సిస్కోలో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి భారతీయులతో సమావేశమై ముచ్చటించారు. అంతకు ముందు వారు ఆయనకు హారతులిచ్చి ఆత్మీయస్వాగతం పలికారు.
18/23
భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఇంగ్లాండ్‌లో ప్రాక్టీసు చేస్తున్న ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘రోజుకు 24 గంటలు.. దేశంపై ప్రేమతో’ అని అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు. ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం టీమిండియా ఇంగ్లాండ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే. భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ ఇంగ్లాండ్‌లో ప్రాక్టీసు చేస్తున్న ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘రోజుకు 24 గంటలు.. దేశంపై ప్రేమతో’ అని అర్థం వచ్చేలా పోస్టు పెట్టారు. ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం టీమిండియా ఇంగ్లాండ్‌ వెళ్లిన సంగతి తెలిసిందే.
19/23
తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
20/23
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నేడు. ‘మనకు ఆహారం అవసరం..  పొగాకు కాదు’ అనే నినాదంతో పొగాకు నిర్మూలనకు  ప్రతి ఒక్కరూ కృషి చేయాలని  ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో తీర్చిదిద్దిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం నేడు. ‘మనకు ఆహారం అవసరం.. పొగాకు కాదు’ అనే నినాదంతో పొగాకు నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో తీర్చిదిద్దిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది.
21/23
 పుష్ప-2 సినిమా ఆర్టిస్టులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పరిధిలోని విజయవాడ-హైదరాబాద్ హైవేపై చోటుచేసుకుంది. పుష్ప-2 సినిమా ఆర్టిస్టులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు.. రోడ్డు పక్కన నిలిపిన ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి పరిధిలోని విజయవాడ-హైదరాబాద్ హైవేపై చోటుచేసుకుంది.
22/23
టాలీవుడ్‌ లెజెండ్‌..  సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని  ఎస్‌ఎస్‌ఎంబీ28 చిత్రబృందం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో మహేష్‌ మాస్‌ లుక్‌లో కనిపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, మహేష్‌ కాంబినేషన్‌లో చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. టాలీవుడ్‌ లెజెండ్‌.. సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఎస్‌ఎస్‌ఎంబీ28 చిత్రబృందం ఓ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో మహేష్‌ మాస్‌ లుక్‌లో కనిపించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌, మహేష్‌ కాంబినేషన్‌లో చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది.
23/23
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని పోతునూరులో శ్రీ కోదండరామాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలంలోని పోతునూరులో శ్రీ కోదండరామాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Tags :

మరిన్ని