News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (01-06-2023)

Updated : 01 Jun 2023 12:26 IST
1/19
ఈత చెట్టుకు అన్ని ముళ్లలాంటి ఆకులు ఉంటాయి. అయినా పిచ్చుకలు ఆ చెట్టునే ఆవాసంగా మార్చుకున్నాయి. నారాయణఖేడ్‌ - హైదరాబాద్‌ రహదారి పట్టణ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈత చెట్టుకు పిచ్చుకలు పదుల సంఖ్యలో గూళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. రోడ్డువెంట వెళ్లే వాహనదారులు దీనిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈత చెట్టుకు అన్ని ముళ్లలాంటి ఆకులు ఉంటాయి. అయినా పిచ్చుకలు ఆ చెట్టునే ఆవాసంగా మార్చుకున్నాయి. నారాయణఖేడ్‌ - హైదరాబాద్‌ రహదారి పట్టణ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఈత చెట్టుకు పిచ్చుకలు పదుల సంఖ్యలో గూళ్లను ఏర్పాటు చేసుకున్నాయి. రోడ్డువెంట వెళ్లే వాహనదారులు దీనిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
2/19
సంగారెడ్డి పురపాలిక పరిధిలోని కరుణ పాఠశాల పక్క వీధిలో బుధవారం మిషన్ భగీరథ పైప్‌లైన్‌ పగిలింది. దీంతో మంచినీరు భారీగా ఫౌంటెయిన్‌లా ఎగిసిపడింది. సమారు 20 నిమిషాల పాటు నీరు వృథా అయింది. సంగారెడ్డి పురపాలిక పరిధిలోని కరుణ పాఠశాల పక్క వీధిలో బుధవారం మిషన్ భగీరథ పైప్‌లైన్‌ పగిలింది. దీంతో మంచినీరు భారీగా ఫౌంటెయిన్‌లా ఎగిసిపడింది. సమారు 20 నిమిషాల పాటు నీరు వృథా అయింది.
3/19
జూన్‌ రెండో వారం నుంచి విత్తనాలు నాటితే జులైలో పంట పొలాలు పచ్చని మొక్కలతో కళకళలాడుతాయి. పచ్చని పొలాల్లో ఆరుద్ర పురుగులు కనివిందు చేస్తాయి. పిల్లలు పెద్దలు వాటిని ముట్టుకొని మురిసిపోతారు. బుధవారం వరంగల్‌ నగర సమీపంలోని పొలాల వద్ద ఆరుద్ర పురుగులు కనిపించాయి. ఈ సారి ముందే రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. జూన్‌ రెండో వారం నుంచి విత్తనాలు నాటితే జులైలో పంట పొలాలు పచ్చని మొక్కలతో కళకళలాడుతాయి. పచ్చని పొలాల్లో ఆరుద్ర పురుగులు కనివిందు చేస్తాయి. పిల్లలు పెద్దలు వాటిని ముట్టుకొని మురిసిపోతారు. బుధవారం వరంగల్‌ నగర సమీపంలోని పొలాల వద్ద ఆరుద్ర పురుగులు కనిపించాయి. ఈ సారి ముందే రావడంతో అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు.
4/19
 నెల్లూరు  జిల్లా  పొదలకూరు మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిమ్మయార్డులో దుకాణాల్లోకి వర్షపునీరు చేరడంతో నిమ్మకాయల బస్తాలు తడచిపోయాయి.
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు, వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిమ్మయార్డులో దుకాణాల్లోకి వర్షపునీరు చేరడంతో నిమ్మకాయల బస్తాలు తడచిపోయాయి.
5/19
  విశాఖ నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమవర్మ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్‌ సహకారంతో పోలీసు సిబ్బందికి యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు. విశాఖ నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమవర్మ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్‌ సహకారంతో పోలీసు సిబ్బందికి యోగా శిక్షణ తరగతులు నిర్వహించారు.
6/19
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జగిత్యాల కలెక్టరేట్, ఎస్పీ క్యాంపు కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. జాతీయ జెండా రంగులతో రాత్రి వేళ కార్యాలయాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం జగిత్యాల కలెక్టరేట్, ఎస్పీ క్యాంపు కార్యాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. జాతీయ జెండా రంగులతో రాత్రి వేళ కార్యాలయాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.
7/19
విశాఖపట్నం  జిల్లా  భీమిలి మండలం చిప్పాడ గ్రామదేవత సుత్తమ్మతల్లిని ఆ గ్రామస్థులు వెయ్యి అరటిపండ్లతో బుధవారం ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం చిప్పాడ గ్రామదేవత సుత్తమ్మతల్లిని ఆ గ్రామస్థులు వెయ్యి అరటిపండ్లతో బుధవారం ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
8/19
విశాఖపట్నం: ఆర్‌కే బీచ్‌లోని ఎన్‌టీఆర్‌ విగ్రహం సమీపంలో ప్రయాణికుల కోసం బస్‌ షెల్టర్‌లు కొత్తగా నిర్మించాలనుకున్న అధికారులు ఇటీవల ఉన్నవి తీసేశారు. రోజులు గడుస్తున్నా ఏర్పాటు చేయలేదు. సాగర తీరానికి వచ్చిన పర్యాటకులు బస్సుల కోసం ఎండలోనే వేచి ఉండాల్సి వస్తోంది. విశాఖపట్నం: ఆర్‌కే బీచ్‌లోని ఎన్‌టీఆర్‌ విగ్రహం సమీపంలో ప్రయాణికుల కోసం బస్‌ షెల్టర్‌లు కొత్తగా నిర్మించాలనుకున్న అధికారులు ఇటీవల ఉన్నవి తీసేశారు. రోజులు గడుస్తున్నా ఏర్పాటు చేయలేదు. సాగర తీరానికి వచ్చిన పర్యాటకులు బస్సుల కోసం ఎండలోనే వేచి ఉండాల్సి వస్తోంది.
9/19
అనంతపురం గ్రామీణం నరసనాయునికుంట సమీపంలో దానిమ్మ తోటకు రక్షణగా ఇలా ముసుగేశారు. రైతులు దానిమ్మ చెట్టంతా కప్పేలా ప్రత్యేక  మెటీరియల్‌తో తయారైన గ్రోవర్స్‌ని చుట్టి తెగుళ్ల నుంచి రక్షణ పొందుతున్నారు. అనంతపురం గ్రామీణం నరసనాయునికుంట సమీపంలో దానిమ్మ తోటకు రక్షణగా ఇలా ముసుగేశారు. రైతులు దానిమ్మ చెట్టంతా కప్పేలా ప్రత్యేక మెటీరియల్‌తో తయారైన గ్రోవర్స్‌ని చుట్టి తెగుళ్ల నుంచి రక్షణ పొందుతున్నారు.
10/19
ఇది నిజామాబాద్‌ శివారులోని అర్సపల్లి చెరువు. ఇలా గుర్రపు డెక్కతో నిండిపోయింది. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని, చేపలకు ఆక్సిజన్‌ అందక చనిపోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఇది నిజామాబాద్‌ శివారులోని అర్సపల్లి చెరువు. ఇలా గుర్రపు డెక్కతో నిండిపోయింది. దీనివల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందని, చేపలకు ఆక్సిజన్‌ అందక చనిపోతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
11/19
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో హనుమకొండ కలెక్టరేట్‌తో పాటు కలెక్టర్‌ బంగ్లా, విద్యుత్తు భవనాన్ని రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. రాత్రి సమయంలో మిరుమిట్లు గొలుపుతూ ఆ భవనాలు జిగేల్‌ మనిపించాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో హనుమకొండ కలెక్టరేట్‌తో పాటు కలెక్టర్‌ బంగ్లా, విద్యుత్తు భవనాన్ని రంగు రంగుల విద్యుత్తు దీపాలతో అలంకరించారు. రాత్రి సమయంలో మిరుమిట్లు గొలుపుతూ ఆ భవనాలు జిగేల్‌ మనిపించాయి.
12/19
హైదరాబాద్‌ నగర సుందరీకరణలోభాగంగా జీహెచ్‌ఎంసీ యంత్రాంగం.. మలక్‌పేట రైల్వే స్టేషన్‌ సమీపంలోని అజంపురా రైల్వే అండర్‌పాస్‌ వద్ద జింకల బొమ్మలను ఇటీవల ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ నగర సుందరీకరణలోభాగంగా జీహెచ్‌ఎంసీ యంత్రాంగం.. మలక్‌పేట రైల్వే స్టేషన్‌ సమీపంలోని అజంపురా రైల్వే అండర్‌పాస్‌ వద్ద జింకల బొమ్మలను ఇటీవల ఏర్పాటు చేశారు.
13/19
హైదరాబాద్‌లోని చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిని కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూకట్‌పల్లి మీదుగా ప్రగతిభవన్‌ చేరుకుంటుండటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపారు.

హైదరాబాద్‌లోని చందానగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ సముదాయంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిని, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామిని కలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూకట్‌పల్లి మీదుగా ప్రగతిభవన్‌ చేరుకుంటుండటంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపారు.
14/19
హైదరాబాద్‌లోని పటాన్‌చెరు నుంచి ముత్తంగి ఔటర్‌ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా వరదకాలువపై ఎటువంటి మూతల్లేకుండా వదిలిపెట్టారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని పటాన్‌చెరు నుంచి ముత్తంగి ఔటర్‌ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా వరదకాలువపై ఎటువంటి మూతల్లేకుండా వదిలిపెట్టారు. రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయి.
15/19
తెలంగాణ ప్రభుత్వం-రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాట్స్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన చీఫ్‌ మినిస్టర్‌(సీఎం) కప్‌-2023 క్రీడా పోటీలు బుధవారం హైదరాబాద్‌లోని  ఎల్బీ స్టేడియంలో ఘనంగా ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వం-రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ(శాట్స్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన చీఫ్‌ మినిస్టర్‌(సీఎం) కప్‌-2023 క్రీడా పోటీలు బుధవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా ముగిశాయి.
16/19
ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సేకరించిన 150 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని బుధవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలోని 11 గోశాలలకు వితరణగా అందజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సేకరించిన 150 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని బుధవారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఖమ్మంలోని 11 గోశాలలకు వితరణగా అందజేశారు.
17/19
శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి కుమారుడు అభిలాష్‌రెడ్డి వివాహానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. శంషాబాద్‌లోని జేడీ కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సీవీ భాస్కర్‌రెడ్డి కుమారుడు అభిలాష్‌రెడ్డి వివాహానికి సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
18/19
తిరుపతి జిల్లాలోని తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు బుధవారం రాత్రి కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు పద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలు బుధవారం రాత్రి కనులపండువగా ప్రారంభమయ్యాయి. ఐదురోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొదటి రోజు రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
19/19
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాన కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు. రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని నూతన సచివాలయ భవనం రాత్రిపూట ఇలా కాంతులీనుతూ జిగేల్‌మంటోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ప్రధాన కార్యాలయాలను ముస్తాబు చేస్తున్నారు. రంగురంగుల విద్యుత్తు దీపాలతో అలంకరిస్తున్నారు. హైదరాబాద్‌లోని నూతన సచివాలయ భవనం రాత్రిపూట ఇలా కాంతులీనుతూ జిగేల్‌మంటోంది.
Tags :

మరిన్ని