News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (03-06-2023)

Updated : 03 Jun 2023 12:29 IST
1/19
సింగరేణి గనుల్లో కార్మికుల విధులకు శిల్పరూపం ఇస్తూ గోదావరిఖని ఫ్లైవింక్లయిన్‌ కూడలిలో ఏర్పాటు చేసిన విగ్రహాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. సింగరేణి గనుల్లో కార్మికుల విధులకు శిల్పరూపం ఇస్తూ గోదావరిఖని ఫ్లైవింక్లయిన్‌ కూడలిలో ఏర్పాటు చేసిన విగ్రహాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి.
2/19
మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలానికి చెందిన మంతటి ఓం ప్రకాష్‌ అనే వ్యక్తి  70 సుద్దముక్కలతో 15 రోజులు రాష్ట్ర సచివాలయ భవన సమూహాన్ని, ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల భవనాన్ని 10 రోజుల పాటు రూపొందించారు. మెదక్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలానికి చెందిన మంతటి ఓం ప్రకాష్‌ అనే వ్యక్తి 70 సుద్దముక్కలతో 15 రోజులు రాష్ట్ర సచివాలయ భవన సమూహాన్ని, ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల భవనాన్ని 10 రోజుల పాటు రూపొందించారు.
3/19
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులో వందేళ్ల చరిత్ర కలిగిన రావి చెట్టు నీడనిస్తూ కాలనీ వాసుల పూజలందుకుంటోంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఈ వృక్షం చుట్టూ దాతల సాయంతో కాంక్రిటు స్లాబ్‌ వేసి గుడిగా తీర్చిదిద్దుతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కాకర్లపల్లి రోడ్డులో వందేళ్ల చరిత్ర కలిగిన రావి చెట్టు నీడనిస్తూ కాలనీ వాసుల పూజలందుకుంటోంది. శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఎదురుగా ఉన్న ఈ వృక్షం చుట్టూ దాతల సాయంతో కాంక్రిటు స్లాబ్‌ వేసి గుడిగా తీర్చిదిద్దుతున్నారు.
4/19
కొందరు యువకులు వారి అభిరుచులకు అనుగుణంగా 25 థీమ్స్‌తో చిన్న ఫిల్మ్‌ సిటీలను నెలకొల్పి అందుబాటులోకి తెచ్చారు.  హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఏడాది కిందట దీన్ని ప్రారంభించారు. ఫ్రీ, పోస్టు వెడ్డింగ్‌, మెటర్నిటీ, బేబీ షూట్స్ నిర్వహించేలా సౌకర్యాలు కల్పించారు. కొందరు యువకులు వారి అభిరుచులకు అనుగుణంగా 25 థీమ్స్‌తో చిన్న ఫిల్మ్‌ సిటీలను నెలకొల్పి అందుబాటులోకి తెచ్చారు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఏడాది కిందట దీన్ని ప్రారంభించారు. ఫ్రీ, పోస్టు వెడ్డింగ్‌, మెటర్నిటీ, బేబీ షూట్స్ నిర్వహించేలా సౌకర్యాలు కల్పించారు.
5/19
అనంతపురం  జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. గొంతు తడుపుకొనేందుకు ప్రజలు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ చిత్రాలే నిదర్శనం. గొంతు తడుపుకొనేందుకు ప్రజలు నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది.
6/19
 నిరుపయోగ రైలు విడి భాగాలతో తయారు చేసిన జిరాఫీ, నెమలి, పిల్లి నమూనాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ గ్యారేజీ ముందు ఆర్సీరోడ్డులో వీటిని ఏర్పాటు చేశారు. నిరుపయోగ రైలు విడి భాగాలతో తయారు చేసిన జిరాఫీ, నెమలి, పిల్లి నమూనాలు నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్‌ గ్యారేజీ ముందు ఆర్సీరోడ్డులో వీటిని ఏర్పాటు చేశారు.
7/19
తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి అమ్మవారు తెప్పపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించారు. తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం రాత్రి అమ్మవారు తెప్పపై ఊరేగుతూ భక్తులకు సాక్షాత్కరించారు.
8/19
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా.. నల్గొండలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వాటి నిర్వహణ లేక మొక్క దశలోనే ఎండిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా.. నల్గొండలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వాటి నిర్వహణ లేక మొక్క దశలోనే ఎండిపోతున్నాయి.
9/19
తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగాచిన్నారుల నృత్య ప్రదర్శన  గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌ 



తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగాచిన్నారుల నృత్య ప్రదర్శన గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌
10/19
 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా  ఖమ్మం జిల్లాలోని మధిర పెద్ద చెరువులో స్విమ్మర్లు  ఈతకొడుతూ జాతీయ జెండాకు శుక్రవారం గౌరవ వందనం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లాలోని మధిర పెద్ద చెరువులో స్విమ్మర్లు ఈతకొడుతూ జాతీయ జెండాకు శుక్రవారం గౌరవ వందనం సమర్పించారు.
11/19
ఖమ్మం జిల్లాలోని పాల్వంచ-ములకలపల్లి ప్రధాన రహదారిపై కుంటినాగులగూడెం వద్ద ఇరువైపులా  గతంలో చెట్లు కొద్దిరోజుల క్రితం ఎండిపోయి కనిపించాయి. ఇప్పుడవి పచ్చదనాన్ని సంతరించుకుని కళకళలాడుతూ  కనిపించాయి. ఖమ్మం జిల్లాలోని పాల్వంచ-ములకలపల్లి ప్రధాన రహదారిపై కుంటినాగులగూడెం వద్ద ఇరువైపులా గతంలో చెట్లు కొద్దిరోజుల క్రితం ఎండిపోయి కనిపించాయి. ఇప్పుడవి పచ్చదనాన్ని సంతరించుకుని కళకళలాడుతూ కనిపించాయి.
12/19
 ఖమ్మం: భద్రాచలం ఏరియా నుంచి ఖమ్మం మార్కెట్‌కు వెళ్తున్న ఓ మిర్చి లోడు వాహనంపై రైతులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పాల్వంచ మండలం నాగారంకాలనీ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద కనిపించిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ కెమెరా క్లిక్‌మనిపించింది. ఖమ్మం: భద్రాచలం ఏరియా నుంచి ఖమ్మం మార్కెట్‌కు వెళ్తున్న ఓ మిర్చి లోడు వాహనంపై రైతులు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పాల్వంచ మండలం నాగారంకాలనీ ఆర్టీఏ చెక్‌పోస్టు వద్ద కనిపించిన ఈ దృశ్యాన్ని ‘న్యూస్‌టుడే’ కెమెరా క్లిక్‌మనిపించింది.
13/19
గద్వాల పైవంతెన నుంచి అయిజకు వెళ్లే ప్రధానరహదారి అధ్వానంగా మారింది. గుంతలు, కంకరతేలిన రోడ్డుపై వాహనాల రాకపోకలతో దుమ్ము లేస్తోంది. దారి స్పష్టంగా కనిపించని స్థాయిలో ఉంటోంది. గద్వాల పైవంతెన నుంచి అయిజకు వెళ్లే ప్రధానరహదారి అధ్వానంగా మారింది. గుంతలు, కంకరతేలిన రోడ్డుపై వాహనాల రాకపోకలతో దుమ్ము లేస్తోంది. దారి స్పష్టంగా కనిపించని స్థాయిలో ఉంటోంది.
14/19
 హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన  తెలంగాణ రాష్ట్రావతరణ  ఉత్సవాల్లో  కళాకారిణులతో కలిసి నృత్యం చేస్తున్న గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్రావతరణ ఉత్సవాల్లో కళాకారిణులతో కలిసి నృత్యం చేస్తున్న గవర్నర్‌ తమిళిసై
15/19
  తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా  హైదరాబాద్‌లోని హైకోర్టులో పేరిణి నృత్యాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులు.

తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని హైకోర్టులో పేరిణి నృత్యాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులు.
16/19
మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన సుభాష్‌ చంద్రసోని, అతని కుటుంబసభ్యులు శ్రీవారి భక్తులు. స్వామివారిపై విశ్వాసంతో వారు ధరించే ప్రతి ఆభరణంలోనూ శ్రీవారి రూపం ఉండేలా చూసుకుంటారు. మెడలో శ్రీవారి ప్రతిమ బంగారు లాకెట్లు వేసుకొని తిరుగుతుంటే భక్తులంతా ఆసక్తిగా చూశారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాంకు చెందిన సుభాష్‌ చంద్రసోని, అతని కుటుంబసభ్యులు శ్రీవారి భక్తులు. స్వామివారిపై విశ్వాసంతో వారు ధరించే ప్రతి ఆభరణంలోనూ శ్రీవారి రూపం ఉండేలా చూసుకుంటారు. మెడలో శ్రీవారి ప్రతిమ బంగారు లాకెట్లు వేసుకొని తిరుగుతుంటే భక్తులంతా ఆసక్తిగా చూశారు.
17/19
హైదరాబాద్‌: భానుడి భగభగలతో శుక్రవారం మధ్యాహ్నం హబ్సిగూడ ప్రధాన రహదారి  నిర్మానుష్యంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే చౌరస్తాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి. హైదరాబాద్‌: భానుడి భగభగలతో శుక్రవారం మధ్యాహ్నం హబ్సిగూడ ప్రధాన రహదారి నిర్మానుష్యంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే చౌరస్తాలు కర్ఫ్యూ వాతావరణాన్ని తలపించాయి.
18/19
 ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం వార్షికోత్సవం  సందర్భంగా శుక్రవారం మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో నిర్వహించిన ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు
19/19
 ప్రపంచ సైకిల్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గుజరాత్‌లోని సూరత్‌లో సైకిల్‌ ఆకారంలో నిల్చున్న స్వామినారాయణ గురుకుల ప్రాంగణం విద్యార్థులు ప్రపంచ సైకిల్‌ దినోత్సవం సందర్భంగా శుక్రవారం గుజరాత్‌లోని సూరత్‌లో సైకిల్‌ ఆకారంలో నిల్చున్న స్వామినారాయణ గురుకుల ప్రాంగణం విద్యార్థులు
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు