News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (03-06-2023)

Updated : 03 Jun 2023 22:02 IST
1/33
హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో అర్నిత ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఫ్యాషన్ డిజైన్‌ యాన్యువల్‌ గ్రాడ్యుయేషన్ షో నిర్వహించారు. ఎలిగాన్స్‌ -2023 థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అందాల సుందరీమణులు ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు. హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో అర్నిత ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఫ్యాషన్ డిజైన్‌ యాన్యువల్‌ గ్రాడ్యుయేషన్ షో నిర్వహించారు. ఎలిగాన్స్‌ -2023 థీమ్‌తో ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో అందాల సుందరీమణులు ర్యాంప్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.
2/33
జమ్ములో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహా సంప్రోక్షణను తిరుమలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. జమ్ములో తితిదే ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ మహా సంప్రోక్షణను తిరుమలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు.
3/33
మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా శనివారం మంత్రి మహమూద్‌ అలీ ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి హరీశ్‌రావు పుట్టినరోజు సందర్భంగా శనివారం మంత్రి మహమూద్‌ అలీ ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
4/33
ఇంగ్లాండ్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌7 నుంచి మొదలవనుంది. స్టార్‌ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌ ప్రసారం కానున్న సందర్భంగా మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ సినిమా పోస్టర్‌తో కూడిన కోహ్లీ ఫొటోను ఛానెల్‌ ట్విటర్‌లో పంచుకుంది. ‘ఈ మ్యాచ్‌లో కోహ్లీ రప్ఫాడిస్తాడా?’ అని ట్వీట్‌ చేసింది. ఇంగ్లాండ్‌లో భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌7 నుంచి మొదలవనుంది. స్టార్‌ స్పోర్ట్స్‌లో ఈ మ్యాచ్‌ ప్రసారం కానున్న సందర్భంగా మహేశ్‌ బాబు ‘గుంటూరు కారం’ సినిమా పోస్టర్‌తో కూడిన కోహ్లీ ఫొటోను ఛానెల్‌ ట్విటర్‌లో పంచుకుంది. ‘ఈ మ్యాచ్‌లో కోహ్లీ రప్ఫాడిస్తాడా?’ అని ట్వీట్‌ చేసింది.
5/33
వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లాండ్‌ వెళ్లిన యశస్వి జైస్వాల్‌, అశ్విన్‌ కలిసి ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్న అశ్విన్‌.. చిన్న పైయన్‌(చిన్న బాలుడు) అని పోస్టు పెట్టారు. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ కోసం ఇంగ్లాండ్‌ వెళ్లిన యశస్వి జైస్వాల్‌, అశ్విన్‌ కలిసి ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటోను తన ఇన్‌స్టా ఖాతాలో పంచుకున్న అశ్విన్‌.. చిన్న పైయన్‌(చిన్న బాలుడు) అని పోస్టు పెట్టారు.
6/33
ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రయాణికులతో నిండిపోయింది. ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండటంతో అక్కడ రద్దీ నెలకొంది. ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. దీంతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్రయాణికులతో నిండిపోయింది. ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండటంతో అక్కడ రద్దీ నెలకొంది.
7/33
సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం పథకం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని తెలుపుతూ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఈ ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అప్పనపల్లి గ్రామంలోని కేసీఆర్‌ అర్బన్‌ పార్కులో శనివారం చిరుత కనిపించిందని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన హరితహారం పథకం ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని తెలుపుతూ ఎంపీ సంతోష్‌కుమార్‌ ఈ ఫొటోను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అప్పనపల్లి గ్రామంలోని కేసీఆర్‌ అర్బన్‌ పార్కులో శనివారం చిరుత కనిపించిందని ఆయన తెలిపారు.
8/33
ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నటులు కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్‌, తదితరులను ఘనంగా సత్కరించారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ అవార్డ్స్‌ వేడుకను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ నటులు కోట శ్రీనివాసరావు, చంద్రమోహన్‌, తదితరులను ఘనంగా సత్కరించారు.
9/33
తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శనివారం మలయప్పస్వామి ముత్యపు కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకంలో భాగంగా రెండో రోజు శనివారం మలయప్పస్వామి ముత్యపు కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఉత్సవమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.
10/33
ప్రముఖ సినీనటుడు చిరంజీవి హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌లో క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి వైద్య సిబ్బందితో సరదాగా ముచ్చటించారు. ప్రముఖ సినీనటుడు చిరంజీవి హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌లో క్యాన్సర్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి వైద్య సిబ్బందితో సరదాగా ముచ్చటించారు.
11/33
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మూడు చింతలపల్లిలో నిర్వహించిన సంబరాల్లో మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌ చేసి అలరించారు. అంతకుముందు భారాస నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా మూడు చింతలపల్లిలో నిర్వహించిన సంబరాల్లో మంత్రి మల్లారెడ్డి డ్యాన్స్‌ చేసి అలరించారు. అంతకుముందు భారాస నాయకులు మంత్రికి ఘన స్వాగతం పలికారు.
12/33
శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీకి చెందిన పలువురు శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. గురుద్వారాలకు సంబంధించిన వివిధ సమస్యలను ఆయనకు వివరించారు. శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీకి చెందిన పలువురు శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను మర్యాదపూర్వకంగా కలిశారు. గురుద్వారాలకు సంబంధించిన వివిధ సమస్యలను ఆయనకు వివరించారు.
13/33
కరీంనగర్‌లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. వాతావరణం చల్లగా మారడంతో ఎండల వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు. కరీంనగర్‌లో శనివారం సాయంత్రం వర్షం కురిసింది. వాతావరణం చల్లగా మారడంతో ఎండల వేడి నుంచి ప్రజలు ఉపశమనం పొందారు.
14/33
ఒడిశాలోని బాలేశ్వర్‌లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. దీంతో ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఇలా ప్రయాణికుల రద్దీ నెలకొంది. ఒడిశాలోని బాలేశ్వర్‌లో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ సందర్భంగా అధికారులు పలు రైళ్లను రద్దు చేశారు. దీంతో ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఇలా ప్రయాణికుల రద్దీ నెలకొంది.
15/33
ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, అందుతున్న సహాయక చర్యలపై ఆయన ఆరా తీశారు. ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరు, అందుతున్న సహాయక చర్యలపై ఆయన ఆరా తీశారు.
16/33
ముంబయిలో వట పూర్ణిమ పండగను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మర్రిచెట్టుకు ఇలా దారం చుట్టి పూజించారు. ముంబయిలో వట పూర్ణిమ పండగను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు మర్రిచెట్టుకు ఇలా దారం చుట్టి పూజించారు.
17/33
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా భారాస నాయకులు 250 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టి రైతు సంక్షేమ పథకాలను గురించి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లిలో ఘనంగా నిర్వహించారు. రైతు దినోత్సవం సందర్భంగా భారాస నాయకులు 250 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టి రైతు సంక్షేమ పథకాలను గురించి కొనియాడారు.
18/33
వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనంతో మనసుకు ప్రశాంతత లభించిందని ఆయన తెలిపారు. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కాశీ విశ్వనాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనంతో మనసుకు ప్రశాంతత లభించిందని ఆయన తెలిపారు. కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ను అభివృద్ధి చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
19/33
స్పైనోసారస్‌ అస్థిపంజరాన్ని చికాగోలోని ఫీల్డ్‌ మ్యూజియంలో ప్రదర్శించారు. 46 అడుగుల పొడవుతో ఉన్న ఈ అస్థిపంజరం చూపరులను ఆకట్టుకుంటోంది. స్పైనోసారస్‌ అస్థిపంజరాన్ని చికాగోలోని ఫీల్డ్‌ మ్యూజియంలో ప్రదర్శించారు. 46 అడుగుల పొడవుతో ఉన్న ఈ అస్థిపంజరం చూపరులను ఆకట్టుకుంటోంది.
20/33
ఒడిశాలో మహా విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. ఘటనానంతరం కనిపించిన దృశ్యం ఇది. ఒడిశాలో మహా విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 278 మంది మృతి చెందారు. ఘటనానంతరం కనిపించిన దృశ్యం ఇది.
21/33
జపాన్‌లోని టోయోకావా, ఐచి ప్రిఫెక్చర్‌లలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో కార్లు, ఇతర వాహనాలు వరద నీటిలో నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. జపాన్‌లోని టోయోకావా, ఐచి ప్రిఫెక్చర్‌లలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. దీంతో కార్లు, ఇతర వాహనాలు వరద నీటిలో నిలిచిపోయాయి. ముంపు ప్రాంతాల్లోని ప్రజలు ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు.
22/33
టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ భారతదేశ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఆయన భారత్‌ ఎప్పుడు వచ్చారు అని ఆలోచిస్తున్నారా? అదేం లేదండి.. ఏఐ సృష్టించిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ భారతదేశ సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఆయన భారత్‌ ఎప్పుడు వచ్చారు అని ఆలోచిస్తున్నారా? అదేం లేదండి.. ఏఐ సృష్టించిన ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
23/33
సినీనటుడు అడివి శేష్‌.. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ తల్లిదండ్రులను కలిసి ముచ్చటించారు. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్‌’ సినిమా గతేడాది విడుదలై విజయం సాధించింది. సినీనటుడు అడివి శేష్‌.. మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ తల్లిదండ్రులను కలిసి ముచ్చటించారు. అడివి శేష్‌ ప్రధాన పాత్రలో సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘మేజర్‌’ సినిమా గతేడాది విడుదలై విజయం సాధించింది.
24/33
తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి రైతు వేదికను స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కార్యక్రమానికి ఆమె ఎడ్లబండిపై వచ్చి భారాస శ్రేణుల్లో జోష్‌ నింపారు. తెలంగాణ రైతు దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలం పద్మాజివాడి రైతు వేదికను స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కార్యక్రమానికి ఆమె ఎడ్లబండిపై వచ్చి భారాస శ్రేణుల్లో జోష్‌ నింపారు.
25/33
అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌ల వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా వారి కుమార్తె శ్వేతా బచ్చన్‌ ఇన్‌స్టా వేదికగా తల్లిదండ్రులు గతంలో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇన్నేళ్లు బంధాన్ని విజయవంతంగా కొనసాగించడానికి రహస్యమేంటని తాను తల్లిని ప్రశ్నించగా.. ప్రేమ అని ఆమె బదులిచ్చినట్లు చెబుతూ శ్వేత పోస్టు పెట్టారు. అమితాబ్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌ల వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా వారి కుమార్తె శ్వేతా బచ్చన్‌ ఇన్‌స్టా వేదికగా తల్లిదండ్రులు గతంలో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇన్నేళ్లు బంధాన్ని విజయవంతంగా కొనసాగించడానికి రహస్యమేంటని తాను తల్లిని ప్రశ్నించగా.. ప్రేమ అని ఆమె బదులిచ్చినట్లు చెబుతూ శ్వేత పోస్టు పెట్టారు.
26/33
రైతు దినోత్సవం, మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజు నేపథ్యంలో సిద్ధిపేట పత్తి మార్కెట్‌యార్డులో ధాన్యంతో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రాలను తీర్చిదిద్దారు. రైతు దినోత్సవం, మంత్రి హరీశ్‌రావు పుట్టిన రోజు నేపథ్యంలో సిద్ధిపేట పత్తి మార్కెట్‌యార్డులో ధాన్యంతో సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌రావు చిత్రాలను తీర్చిదిద్దారు.
27/33
భారత క్రీడాకారులు రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ నూతన టెస్టు జెర్సీల్లో కనిపించారు. ఈ నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత క్రీడాకారులు ఈ జెర్సీలను వినియోగించనున్నారు. భారత క్రీడాకారులు రోహిత్‌శర్మ, విరాట్‌ కోహ్లీ నూతన టెస్టు జెర్సీల్లో కనిపించారు. ఈ నెల 7 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో భారత క్రీడాకారులు ఈ జెర్సీలను వినియోగించనున్నారు.
28/33
 హైదరాబాద్‌ ఐటీసీ కోహినూర్‌లో నిర్వహించిన గ్లోబల్‌ వ్యాక్సిన్‌ కొల్బరేటివ్‌ జీ20 సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయ,  అధికారులు అపర్ణ, జయేశ్‌రంజన్, యువరాజ్ తదితరులు హైదరాబాద్‌ ఐటీసీ కోహినూర్‌లో నిర్వహించిన గ్లోబల్‌ వ్యాక్సిన్‌ కొల్బరేటివ్‌ జీ20 సదస్సుకు హాజరైన కేంద్ర మంత్రి మనసుఖ్ మాండవీయ, అధికారులు అపర్ణ, జయేశ్‌రంజన్, యువరాజ్ తదితరులు
29/33
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జూన్‌ 14 నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. అన్నవరం నుంచి భీమవరం వరకు వారాహి యాత్ర రూట్‌మ్యాప్‌ను జనసేన పార్టీ ట్విటర్‌లో షేర్‌ చేసింది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ జూన్‌ 14 నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వారాహి యాత్ర ప్రారంభించబోతున్నారు. అన్నవరం నుంచి భీమవరం వరకు వారాహి యాత్ర రూట్‌మ్యాప్‌ను జనసేన పార్టీ ట్విటర్‌లో షేర్‌ చేసింది.
30/33
ప్రపంచ సైకిల్‌ డే సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని  హెచ్‌ఐసీసీ నుంచి సైకిల్‌ రైడ్‌ను ప్రారంభించారు. కార్యక్రరమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌తో పాటు నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచ సైకిల్‌ డే సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నుంచి సైకిల్‌ రైడ్‌ను ప్రారంభించారు. కార్యక్రరమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌తో పాటు నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
31/33
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు సంతపేట కూడలిలో చంద్రబాబు నాయుడి చిత్రపటానికి తెదేపా బీసీ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో బీసీలకు ప్రాధాన్యం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు సంతపేట కూడలిలో చంద్రబాబు నాయుడి చిత్రపటానికి తెదేపా బీసీ నాయకులు, కార్యకర్తలు క్షీరాభిషేకం చేశారు. పార్టీ మేనిఫెస్టోలో బీసీలకు ప్రాధాన్యం కల్పించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమం చేపట్టారు.
32/33
ఒడిశాలో మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఒడిశాలో మాటలకందని మహా విషాదం చోటుచేసుకుంది. బాలేశ్వర్‌ జిల్లాలో శుక్రవారం అనూహ్య రీతిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో వందల మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. 900 మందికి పైగా గాయాలపాలయ్యారు.
33/33
ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆఫ్ లైన్ విధానంలో జరిగే  ఈ పరీక్షలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఆఫ్ లైన్ విధానంలో జరిగే ఈ పరీక్షలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారు.
Tags :

మరిన్ని