News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (04-06-2023)

Updated : 04 Jun 2023 12:23 IST
1/14
సర్వజనాసుత్రిలో రోగుల బంధువులకు ఆరుబయట పడిగాపులు తప్పటం లేదు. ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల కోసం వచ్చే బంధువులకు అక్కడ అనుమతి లేకపోవటంతో ఆరుబయట చెట్ల కింద ఉంటున్నారు. తమతో పాటు వచ్చిన చిన్నారులను నిద్రపుచ్చేందుకు చెట్లకు ఊయలలు కట్టుకుంటున్నారు. సర్వజనాసుత్రిలో రోగుల బంధువులకు ఆరుబయట పడిగాపులు తప్పటం లేదు. ఆసుపత్రిలో వివిధ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల కోసం వచ్చే బంధువులకు అక్కడ అనుమతి లేకపోవటంతో ఆరుబయట చెట్ల కింద ఉంటున్నారు. తమతో పాటు వచ్చిన చిన్నారులను నిద్రపుచ్చేందుకు చెట్లకు ఊయలలు కట్టుకుంటున్నారు.
2/14
 పార్వతీపురం  జిల్లా  కురుపాం మండలంలోని పూతికవలస శివారులో శనివారం ఏనుగుల గుంపు తిష్ఠ వేసింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పార్వతీపురం జిల్లా కురుపాం మండలంలోని పూతికవలస శివారులో శనివారం ఏనుగుల గుంపు తిష్ఠ వేసింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
3/14
 అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో  టైర్లతో కూడిన ఎద్దులబండి మరో వాహనం ఎక్కింది. ఎద్దులతో పాటు, బండిని, దాంతోటే గడ్డిని మరో ప్రాంతానికి తరలించడానికి యజమాని ఈ ఏర్పాటు చేశారు. ఎద్దులను మినీ వ్యాన్‌లో ఎక్కించి, దీనికి బండిని కట్టారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో టైర్లతో కూడిన ఎద్దులబండి మరో వాహనం ఎక్కింది. ఎద్దులతో పాటు, బండిని, దాంతోటే గడ్డిని మరో ప్రాంతానికి తరలించడానికి యజమాని ఈ ఏర్పాటు చేశారు. ఎద్దులను మినీ వ్యాన్‌లో ఎక్కించి, దీనికి బండిని కట్టారు.
4/14
అనకాపల్లి: జాతీయ రహదారిపై విజయవాడ నుంచి విశాఖ మార్గంలో శనివారం ఓ లారీపై వెళ్లిన సామగ్రిని చూసి జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు.  దీని కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌ అవాంతరాలు తప్పలేదు. అనకాపల్లి: జాతీయ రహదారిపై విజయవాడ నుంచి విశాఖ మార్గంలో శనివారం ఓ లారీపై వెళ్లిన సామగ్రిని చూసి జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. దీని కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌ అవాంతరాలు తప్పలేదు.
5/14
రోజురోజుకు ద్విచక్రవాహన చోరీలు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొంగలు ఒకడుగు ముందే ఉంటున్నారు. యథేచ్ఛగా ఎత్తుకెళ్లిపోతున్నారు.ఈ భయంతోనే నిజామాబాద్‌ నగరానికి చెందిన వ్యక్తి వాహనానికి హ్యాండిల్‌కు తాళం వేసినా.. నమ్మకం లేక ఇనుప గొలుసు, తాళం వెంట తీసుకెళ్తున్నారు. రోజురోజుకు ద్విచక్రవాహన చోరీలు పెరిగిపోతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొంగలు ఒకడుగు ముందే ఉంటున్నారు. యథేచ్ఛగా ఎత్తుకెళ్లిపోతున్నారు.ఈ భయంతోనే నిజామాబాద్‌ నగరానికి చెందిన వ్యక్తి వాహనానికి హ్యాండిల్‌కు తాళం వేసినా.. నమ్మకం లేక ఇనుప గొలుసు, తాళం వెంట తీసుకెళ్తున్నారు.
6/14
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఖమ్మం లకారం ట్యాంకుబండ్‌ విద్యుత్తు వెలుగులతో  కనువిందు చేస్తోంది. భారీ జాతీయజెండా, రహదారులు, తీగల వంతెన, మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ఆహ్లాదం పంచుతున్నాయి. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల సందర్భంగా ఖమ్మం లకారం ట్యాంకుబండ్‌ విద్యుత్తు వెలుగులతో కనువిందు చేస్తోంది. భారీ జాతీయజెండా, రహదారులు, తీగల వంతెన, మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ ఆహ్లాదం పంచుతున్నాయి.
7/14
జనగామలో ఆదివారం మైత్రేయి కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో హై రేంజ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కోసం చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం సాధన చేస్తూ కనిపించారు. జనగామలో ఆదివారం మైత్రేయి కూచిపూడి కళాక్షేత్రం ఆధ్వర్యంలో హై రేంజ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కోసం చిన్నారులు నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శనివారం సాధన చేస్తూ కనిపించారు.
8/14
జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రుద్రమదేవి విగ్రహం, వాటర్‌ ఫౌంటేన్‌ రంగురంగుల విద్యుత్తు దీప కాంతుల్లో జిగేలుమన్నాయి. శనివారం రాత్రి ముస్తాబైన ఆర్టీసీ జంక్షన్‌ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది. జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రుద్రమదేవి విగ్రహం, వాటర్‌ ఫౌంటేన్‌ రంగురంగుల విద్యుత్తు దీప కాంతుల్లో జిగేలుమన్నాయి. శనివారం రాత్రి ముస్తాబైన ఆర్టీసీ జంక్షన్‌ పట్టణ ప్రజలను ఆకట్టుకుంది.
9/14
మహబూబాబాద్‌  జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. శనివారం రైతు దినోత్సవం పురస్కరించుకొని పలు గ్రామాల్లో బతుకమ్మలు.. బోనమెత్తుకుని రైతులు, అధికారులు, నేతలు ప్రదర్శన నిర్వహించారు. మహబూబాబాద్‌ జిల్లాలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జోరుగా సాగుతున్నాయి. శనివారం రైతు దినోత్సవం పురస్కరించుకొని పలు గ్రామాల్లో బతుకమ్మలు.. బోనమెత్తుకుని రైతులు, అధికారులు, నేతలు ప్రదర్శన నిర్వహించారు.
10/14
హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలు పర్యాటకంగా వెలుగొందుతున్నాయి. వివిధ పార్కులు, నూతన సచివాలయం,  అమరవీరుల జ్యోతి, అంబేడ్కర్‌ విగ్రహం, సాగర్‌లో బోటింగ్‌ తదితర వాటిని ఏర్పాటు చేయడంతో సందర్శకులు పోటెత్తుతున్నారు. అయితే సాగర్‌లోని చెత్త, వ్యర్థాలతో భరించలేని దుర్వాసన వస్తోంది. హైదరాబాద్‌ నగరంలోని హుస్సేన్‌సాగర్‌ పరిసర ప్రాంతాలు పర్యాటకంగా వెలుగొందుతున్నాయి. వివిధ పార్కులు, నూతన సచివాలయం, అమరవీరుల జ్యోతి, అంబేడ్కర్‌ విగ్రహం, సాగర్‌లో బోటింగ్‌ తదితర వాటిని ఏర్పాటు చేయడంతో సందర్శకులు పోటెత్తుతున్నారు. అయితే సాగర్‌లోని చెత్త, వ్యర్థాలతో భరించలేని దుర్వాసన వస్తోంది.
11/14
మేడ్చల్: మల్కాజిగిరిలో శనివారం అర్నిత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. యువ డిజైనర్లు రూపొందించిన దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేశారు. జెన్నీ కాస్టెల్లా, మాధవి, శిరీష, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
మేడ్చల్: మల్కాజిగిరిలో శనివారం అర్నిత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌ ఆధ్వర్యంలో ఫ్యాషన్‌ షో నిర్వహించారు. యువ డిజైనర్లు రూపొందించిన దుస్తుల్లో ర్యాంప్‌ వాక్‌ చేశారు. జెన్నీ కాస్టెల్లా, మాధవి, శిరీష, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.
12/14
ఆహ్లాద వాతావరణంలో విజ్ఞానాన్ని పంచేలా పలు ఆకృతులతో ఆకట్టుకుంటున్న  ఈ ఉద్యానం  హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పత్రికానగర్‌లో కొలువైంది.  జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్‌ సైన్స్‌ పేరిట నిర్మిస్తున్న ఈ పార్కు పనులు తుది దశకు చేరాయి. ఆహ్లాద వాతావరణంలో విజ్ఞానాన్ని పంచేలా పలు ఆకృతులతో ఆకట్టుకుంటున్న ఈ ఉద్యానం హైదరాబాద్‌లోని మాదాపూర్‌ పత్రికానగర్‌లో కొలువైంది. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఇంటరాక్టివ్‌ సైన్స్‌ పేరిట నిర్మిస్తున్న ఈ పార్కు పనులు తుది దశకు చేరాయి.
13/14
హైదరాబాద్‌: తెలంగాణ  రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం రైతు దినోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో పలువురు మంత్రులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు శనివారం రైతు దినోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాల్లో పలువురు మంత్రులు పాల్గొన్నారు.
14/14
హైదరాబాద్‌: బన్సీలాల్‌పేటలోని మెట్లబావి అంధకారంలో మగ్గుతోంది. శనివారం సాయంత్రం అక్కడికి వచ్చిన సుమారు వందమంది పర్యాటకులు ప్రవేశ టికెట్లను తీసుకుని చీకటి  పడగానే లోపలికి వెళ్లేందుకు పడిగాపులు కాశారు.  వెలుతురు లేకుండా అక్కడ చూడ్డానికేముంటుంది, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పర్యాటకులు సిబ్బందిని కోరారు. అలాంటి నిబంధనలేం తమకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

హైదరాబాద్‌: బన్సీలాల్‌పేటలోని మెట్లబావి అంధకారంలో మగ్గుతోంది. శనివారం సాయంత్రం అక్కడికి వచ్చిన సుమారు వందమంది పర్యాటకులు ప్రవేశ టికెట్లను తీసుకుని చీకటి పడగానే లోపలికి వెళ్లేందుకు పడిగాపులు కాశారు. వెలుతురు లేకుండా అక్కడ చూడ్డానికేముంటుంది, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని పర్యాటకులు సిబ్బందిని కోరారు. అలాంటి నిబంధనలేం తమకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు.

మరిన్ని