News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (04-06-2023)

Updated : 04 Jun 2023 22:29 IST
1/35
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో సురక్ష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ ఏర్పాటు చేశారు. నటుడు అడివి శేష్‌ హాజరై పోలీసు అధికారులతో ముచ్చటించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో సురక్ష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో పరేడ్‌ ఏర్పాటు చేశారు. నటుడు అడివి శేష్‌ హాజరై పోలీసు అధికారులతో ముచ్చటించారు.
2/35
నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన భారాస జిల్లా కార్యాలయం, సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ఆదివారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి.. కేసీఆర్‌ను సన్మానించి నిర్మల్‌ పెయింటింగ్‌ను బహూకరించారు. నిర్మల్‌లో నూతనంగా నిర్మించిన భారాస జిల్లా కార్యాలయం, సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ఆదివారం సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి.. కేసీఆర్‌ను సన్మానించి నిర్మల్‌ పెయింటింగ్‌ను బహూకరించారు.
3/35
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో డ్రోన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్‌ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో డ్రోన్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్‌ చిత్రాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
4/35
తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞానికి సీఎం జగన్‌ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఉన్న గోశాలలో శాంతి యజ్ఞం నిర్వహించారు. ఈ యజ్ఞానికి సీఎం జగన్‌ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
5/35
భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్వీట్‌ చేసింది. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఇంగ్లాండ్‌లోని ఓవల్‌ మైదానంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జూన్‌ 7 నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను బీసీసీఐ ట్వీట్‌ చేసింది.
6/35
ఏలూరు జిల్లా దెందులూరు మండలం కోవలిలో తెదేపా ఆధ్వర్యంలో ‘ఏరువాక పౌర్ణమి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్‌ చంద్రబాబు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం కోవలిలో తెదేపా ఆధ్వర్యంలో ‘ఏరువాక పౌర్ణమి’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్‌ చంద్రబాబు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
7/35
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై మహిళా సురక్ష సంబరాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్‌, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌, సీపీ సీవీ ఆనంద్‌ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సినీనటుడు నాని, క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ హాజరై సందడి చేశారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై మహిళా సురక్ష సంబరాలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్‌, మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి, డీజీపీ అంజనీకుమార్‌, సీపీ సీవీ ఆనంద్‌ పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా సినీనటుడు నాని, క్రీడాకారిణి నైనా జైస్వాల్‌ హాజరై సందడి చేశారు.
8/35
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘సురక్ష దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది జాతీయ జెండా రంగుల్లో నీటిని వదులుతున్న దృశ్యమిది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘సురక్ష దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది జాతీయ జెండా రంగుల్లో నీటిని వదులుతున్న దృశ్యమిది.
9/35
నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు లోకేశ్‌ను ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నారా లోకేశ్‌ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు లోకేశ్‌ను ఘనంగా సన్మానించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
10/35
బ్యాంకాక్‌లో ఆదివారం ప్రైడ్ పరేడ్‌ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా థాయ్‌, విదేశీయులు చేసిన కవాతు విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి కవాతు చేసే వారితో ఇలా సెల్ఫీ తీసుకొని సంబరపడ్డారు. బ్యాంకాక్‌లో ఆదివారం ప్రైడ్ పరేడ్‌ కవాతు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా థాయ్‌, విదేశీయులు చేసిన కవాతు విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి కవాతు చేసే వారితో ఇలా సెల్ఫీ తీసుకొని సంబరపడ్డారు.
11/35
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తితిదే ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్, శ్రీవారి భక్తుల సహకారంతో శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవ ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో తితిదే ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్, శ్రీవారి భక్తుల సహకారంతో శ్రీ వేంకటేశ్వర స్వామి రథోత్సవ ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సాహంగా ఊరేగింపులో పాల్గొన్నారు.
12/35
నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్మల్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్‌కు మంత్రి, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు. నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్‌ నిర్మల్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి ఇంటికి వెళ్లిన కేసీఆర్‌కు మంత్రి, కుటుంబ సభ్యులు ఘనస్వాగతం పలికారు.
13/35
హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, దుర్గం చెరువు పరిసరాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, దుర్గం చెరువు పరిసరాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడటంతో ప్రజలు వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందారు.
14/35
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్‌ పోలీసు శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 50 మందితో కూడిన స్పెషల్‌ ఫోర్స్‌ ఆకట్టుకునే విన్యాసాలు చేసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్‌ పోలీసు శాఖ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని ఏఎంబీ మాల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 50 మందితో కూడిన స్పెషల్‌ ఫోర్స్‌ ఆకట్టుకునే విన్యాసాలు చేసింది.
15/35
మేకల మెడలకు గంటలు కట్టారేంటీ అనుకుంటున్నారా.. ఆకులు, అలములు తినేందుకు మేకలు తుప్పల్లో తిరుగుతుంటాయి. అక్కడ ఉండే క్రిమీ కీటకాలు, విష పురుగులు గంటల శబ్దానికి పారిపోతాయని తణుకుకు చెందిన రైతు తోట శ్రీనివాసరావు చెబుతున్నాడు. స్టీలు జగ్గులు, గ్లాసుల్లో ఇనుప చువ్వలు అమర్చి ఈ గంటలను తయారు చేసినట్లు రైతు తెలిపాడు. మేకల మెడలకు గంటలు కట్టారేంటీ అనుకుంటున్నారా.. ఆకులు, అలములు తినేందుకు మేకలు తుప్పల్లో తిరుగుతుంటాయి. అక్కడ ఉండే క్రిమీ కీటకాలు, విష పురుగులు గంటల శబ్దానికి పారిపోతాయని తణుకుకు చెందిన రైతు తోట శ్రీనివాసరావు చెబుతున్నాడు. స్టీలు జగ్గులు, గ్లాసుల్లో ఇనుప చువ్వలు అమర్చి ఈ గంటలను తయారు చేసినట్లు రైతు తెలిపాడు.
16/35
క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ అడవిలో విహార యాత్రకు వెళ్లిన ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. ‘వైఫై సిగ్నల్‌ తక్కువగా ఉన్న ప్రాంతంలో తిరుగుదాం’ అని ట్వీట్‌ చేశాడు. క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ అడవిలో విహార యాత్రకు వెళ్లిన ఫొటోలను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నాడు. ‘వైఫై సిగ్నల్‌ తక్కువగా ఉన్న ప్రాంతంలో తిరుగుదాం’ అని ట్వీట్‌ చేశాడు.
17/35
తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం చివరి రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం చివరి రోజైన ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు స్వర్ణ కవచంలో భక్తులకు దర్శనమిచ్చారు.
18/35
క్రికెటర్‌ రింకూ సింగ్‌ మాల్దీవుల్లో దిగిన తన తాజా ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రింకూ సింగ్‌ కోల్‌కతా తరఫున ఆడి మంచి ప్రదర్శన ఇచ్చాడు. క్రికెటర్‌ రింకూ సింగ్‌ మాల్దీవుల్లో దిగిన తన తాజా ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో రింకూ సింగ్‌ కోల్‌కతా తరఫున ఆడి మంచి ప్రదర్శన ఇచ్చాడు.
19/35
అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అక్కడి రూజ్‌వెల్ట్‌ హౌస్‌లో వివిధ రంగాల నిపుణులతో సమావేశమయ్యారు. రూజ్‌వెల్ట్‌ హౌస్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ నివాసం కావడం విశేషం. అమెరికా పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అక్కడి రూజ్‌వెల్ట్‌ హౌస్‌లో వివిధ రంగాల నిపుణులతో సమావేశమయ్యారు. రూజ్‌వెల్ట్‌ హౌస్‌ అమెరికా మాజీ అధ్యక్షుడు రూజ్‌వెల్ట్‌ నివాసం కావడం విశేషం.
20/35
హైదరాబాద్‌లో ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూలో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులను ఈ చిత్రంలో చూడొచ్చు. హైదరాబాద్‌లో ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూలో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులను ఈ చిత్రంలో చూడొచ్చు.
21/35
త్వరలో జగన్నాథుడి రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో భక్తులు పెద్దఎత్తున పాల్గొని జలయాత్ర చేశారు. ఉత్సవంలో భాగంగా ఏనుగులను అలంకరించి ఊరేగించారు. త్వరలో జగన్నాథుడి రథయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌లో భక్తులు పెద్దఎత్తున పాల్గొని జలయాత్ర చేశారు. ఉత్సవంలో భాగంగా ఏనుగులను అలంకరించి ఊరేగించారు.
22/35
ఒడిశాలోని బాలేశ్వర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి ఫొటోలను అధికారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబ సభ్యులు ఈ ఫొటోల్లో తమవారున్నారేమోనని వెతుకుతూ కనిపించారు. మరోవైపు ఈ రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. ఒడిశాలోని బాలేశ్వర్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి ఫొటోలను అధికారులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదంలో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబ సభ్యులు ఈ ఫొటోల్లో తమవారున్నారేమోనని వెతుకుతూ కనిపించారు. మరోవైపు ఈ రైలు ప్రమాదంలో 275 మంది మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు.
23/35
పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ(వర్కింగ్ టైటిల్‌)’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా పవన్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోను చిత్రబృందం ట్విటర్‌లో పంచుకుంది. పవన్‌ కల్యాణ్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓజీ(వర్కింగ్ టైటిల్‌)’. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా పవన్‌ షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోను చిత్రబృందం ట్విటర్‌లో పంచుకుంది.
24/35
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్లాస్టిక్‌ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిన ప్రపంచం పేరుతో గ్లోబ్‌ను ప్రదర్శించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ వద్ద ఓ స్వచ్ఛంద సంస్థ సభ్యులు ప్లాస్టిక్‌ వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలతో నిండిన ప్రపంచం పేరుతో గ్లోబ్‌ను ప్రదర్శించారు.
25/35
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ‘సురక్ష దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శిల్పారామంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించి పరిశీలించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో ‘సురక్ష దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శిల్పారామంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించి పరిశీలించారు.
26/35
సినీనటుడు శర్వానంద్‌ శనివారం రాత్రి రక్షితారెడ్డిని వివాహమాడారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. సినీనటుడు శర్వానంద్‌ శనివారం రాత్రి రక్షితారెడ్డిని వివాహమాడారు. ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జైపుర్‌లోని లీలా ప్యాలెస్‌ వేదికగా వీరి పెళ్లి ఘనంగా జరిగింది. సుమారు రెండు రోజుల పాటు జరిగిన ఈ పెళ్లి వేడుకల్లో రామ్‌చరణ్‌, సిద్దార్థ్‌, అదితిరావు హైదరీతోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సందడి చేశారు.
27/35
ఒడిశాలోని బాలేశ్వర్‌లో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులను కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ పరిశీలించారు. ఒడిశాలోని బాలేశ్వర్‌లో రైలు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ట్రాక్‌ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ పనులను కేంద్ర మంత్రులు అశ్వనీ వైష్ణవ్‌, ధర్మేంద్ర ప్రధాన్‌ పరిశీలించారు.
28/35
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్ష దినోత్సవం’లో సినీ నటుడు నిఖిల్ పాల్గొన్నారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డీజీపీ అంజనీ కుమార్, సీపీ సీవీ ఆనంద్, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులను చిత్రంలో చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్ష దినోత్సవం’లో సినీ నటుడు నిఖిల్ పాల్గొన్నారు. మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, డీజీపీ అంజనీ కుమార్, సీపీ సీవీ ఆనంద్, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులను చిత్రంలో చూడొచ్చు.
29/35
విజయవాడ కనకదుర్గ ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దుర్గామల్లేశ్వరస్వామి విగ్రహాన్ని ఇంద్రకీలాద్రి చుట్టూ ఊరేగించారు. విజయవాడ కనకదుర్గ ఆలయంలో గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దుర్గామల్లేశ్వరస్వామి విగ్రహాన్ని ఇంద్రకీలాద్రి చుట్టూ ఊరేగించారు.
30/35
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి మలయప్పస్వామివారు బంగారు కవచంలో 
పునః దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరిరోజు ఉభయదేవేరులతో కలిసి మలయప్పస్వామివారు బంగారు కవచంలో పునః దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు.
31/35
ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ జన్మదిన వేడుకలను శనివారం రాత్రి ప్రభాస్‌ దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. వీరిద్దరి కాంబోలో ‘సలార్‌’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ జన్మదిన వేడుకలను శనివారం రాత్రి ప్రభాస్‌ దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ నీల్‌ కేకు కోసి సంబరాలు చేసుకున్నారు. వీరిద్దరి కాంబోలో ‘సలార్‌’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
32/35
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో ఏరువాక పౌర్ణమి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొని సాగు పనులకు శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం బొబ్బర్లంక గ్రామంలో ఏరువాక పౌర్ణమి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొని సాగు పనులకు శ్రీకారం చుట్టారు.
33/35
క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను శనివారం వివాహమాడారు. పలువురు క్రికెటర్లు ఈ వేడుకకు హాజరయ్యారు. క్రికెటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ తన ప్రేయసి ఉత్కర్ష పవార్‌ను శనివారం వివాహమాడారు. పలువురు క్రికెటర్లు ఈ వేడుకకు హాజరయ్యారు.
34/35
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా నగరవ్యాప్తంగా పోలీసులు ఆదివారం ‘సురక్ష దినోత్సవం’ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ నుంచి లిబర్టీ, అబిడ్స్, చార్మినార్, ఎంజే మార్కెట్, రవీంద్ర భారతి, తెలుగుతల్లి విగ్రహం మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు వాహనాల ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకల సందర్భంగా నగరవ్యాప్తంగా పోలీసులు ఆదివారం ‘సురక్ష దినోత్సవం’ నిర్వహించారు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్ నుంచి లిబర్టీ, అబిడ్స్, చార్మినార్, ఎంజే మార్కెట్, రవీంద్ర భారతి, తెలుగుతల్లి విగ్రహం మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం వరకు వాహనాల ర్యాలీ నిర్వహించారు.
35/35
ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్‌ పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. ఒడిశాలోని బాలేశ్వర్‌లో జరిగిన రైలు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్‌ పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు.
Tags :

మరిన్ని