News In Pics: చిత్రం చెప్పే సంగతులు 01 (05-06-2023)

Updated : 05 Jun 2023 07:51 IST
1/18
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్తు అంశంపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కరీంనగర్‌ జిల్లాలోని విద్యుత్తు కార్యాలయాలను లైట్లతో అలంకరించారు. ఎస్ఈ కార్యాలయం, సబ్‌స్టేషన్లు ఆదివారం రాత్రి వెలుగులతో జిగేలుమన్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యుత్తు అంశంపై కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కరీంనగర్‌ జిల్లాలోని విద్యుత్తు కార్యాలయాలను లైట్లతో అలంకరించారు. ఎస్ఈ కార్యాలయం, సబ్‌స్టేషన్లు ఆదివారం రాత్రి వెలుగులతో జిగేలుమన్నాయి.
2/18
ప్రపంచ పర్యావరణ దినోత్సం సందర్భంగా కామారెడ్డికి చెందిన ప్రొఫెసర్‌ డా.సామల కరుణాకర్‌రెడ్డి గీసిన చిత్రం ఆకట్టుకుంటోంది. సమాజంలో జరుగుతున్న పరిమాణాలతో పుడమి తల్లి అనారోగ్యానికి గురైనట్లు చూపారు. నేల తల్లికి సెలైన్‌ పెట్టినట్లు చూపుతూ.. ప్రస్తుతం పర్యావరణం ఎలా ఉందో ఆలోచింపజేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సం సందర్భంగా కామారెడ్డికి చెందిన ప్రొఫెసర్‌ డా.సామల కరుణాకర్‌రెడ్డి గీసిన చిత్రం ఆకట్టుకుంటోంది. సమాజంలో జరుగుతున్న పరిమాణాలతో పుడమి తల్లి అనారోగ్యానికి గురైనట్లు చూపారు. నేల తల్లికి సెలైన్‌ పెట్టినట్లు చూపుతూ.. ప్రస్తుతం పర్యావరణం ఎలా ఉందో ఆలోచింపజేశారు.
3/18
జనగామ-సిద్దిపేట మార్గంలో శామీర్‌పేట సమీపంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లతో రోడ్డు హరిత సోయగాన్ని సంతరించుకుంది. రహదారిపై పచ్చని తోరణంలా ఉన్న వృక్షాలు ప్రయాణికులు, వాహనదారులకు ఆహ్లాదం పంచుతున్నారు. జనగామ-సిద్దిపేట మార్గంలో శామీర్‌పేట సమీపంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లతో రోడ్డు హరిత సోయగాన్ని సంతరించుకుంది. రహదారిపై పచ్చని తోరణంలా ఉన్న వృక్షాలు ప్రయాణికులు, వాహనదారులకు ఆహ్లాదం పంచుతున్నారు.
4/18
తెలంగాణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఏఎంబీ మాల్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. 50 మంది స్పెషల్‌ ఫోర్స్‌తో స్ట్రైకింగ్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఆయుధాలతో కూడిన ప్రదర్శన ఆకట్టుకుంది. తెలంగాణ దశబ్ది ఉత్సవాల్లో భాగంగా సైబరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో గచ్చిబౌలి ఏఎంబీ మాల్‌లో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. 50 మంది స్పెషల్‌ ఫోర్స్‌తో స్ట్రైకింగ్‌ డ్రిల్‌ నిర్వహించారు. ఆయుధాలతో కూడిన ప్రదర్శన ఆకట్టుకుంది.
5/18
విశాఖపట్నం: కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత అంబికాబాగ్‌ సీతారామాలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం రాత్రి సీతారామస్వాములకు పుష్పయాగం నిర్వహించారు. విశాఖపట్నం: కనకమహాలక్ష్మి అమ్మవారి దత్తత అంబికాబాగ్‌ సీతారామాలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆదివారం రాత్రి సీతారామస్వాములకు పుష్పయాగం నిర్వహించారు.
6/18
 విశాఖపట్నం:  మోదకొండమ్మ పండగ ఈనెల 6న భారీగా చేయనున్న తరుణంలో ఆదివారం బస్టాండు వీధి, కొబ్బరితోట వీధి ప్రజలు అమ్మవారికి సారె సమర్పించారు. విశాఖపట్నం: మోదకొండమ్మ పండగ ఈనెల 6న భారీగా చేయనున్న తరుణంలో ఆదివారం బస్టాండు వీధి, కొబ్బరితోట వీధి ప్రజలు అమ్మవారికి సారె సమర్పించారు.
7/18
 తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారి విభాగినిలో స్తంభాలను విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం రాత్రి పట్టణంలో వర్షం కురిసి.. ప్రధాన రహదారిపై పలుచోట్ల వరద నిలిచింది. రాత్రి వేళ ఆ వరదలో విద్యుత్తు వెలుగులు ప్రతిబింబిస్తూ.. ఆ మార్గంలో వెళ్తున్న వారిని ఆకట్టుకున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారి విభాగినిలో స్తంభాలను విద్యుత్తు దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివారం రాత్రి పట్టణంలో వర్షం కురిసి.. ప్రధాన రహదారిపై పలుచోట్ల వరద నిలిచింది. రాత్రి వేళ ఆ వరదలో విద్యుత్తు వెలుగులు ప్రతిబింబిస్తూ.. ఆ మార్గంలో వెళ్తున్న వారిని ఆకట్టుకున్నాయి.
8/18
నిజామాబాద్‌ జిల్లా పిట్లం మండల కేంద్రం సమీపంలోని 161 నంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న మిషన్‌ భగీరథ పైపులైను వాల్వు లీకేజీ కావడంతో నీళ్లు ఎగిసిపడ్డాయి నిజామాబాద్‌ జిల్లా పిట్లం మండల కేంద్రం సమీపంలోని 161 నంబరు జాతీయ రహదారి పక్కనే ఉన్న మిషన్‌ భగీరథ పైపులైను వాల్వు లీకేజీ కావడంతో నీళ్లు ఎగిసిపడ్డాయి
9/18
 హైదరాబాద్‌లోని లింగంపల్లి గ్రామంలో రెండు పడక గదులు ఇళ్లు నిర్మించిన స్థలంలో కొంత మిగలడంతో క్రీడా ప్రాంగణం బోర్డును ఏర్పాటు చేసి వదిలేశారు. అక్కడ ఆడుకోవడానికి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. సాధన చేయడానికి అనువుగా మైదానం లేకపోవడంతో క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని లింగంపల్లి గ్రామంలో రెండు పడక గదులు ఇళ్లు నిర్మించిన స్థలంలో కొంత మిగలడంతో క్రీడా ప్రాంగణం బోర్డును ఏర్పాటు చేసి వదిలేశారు. అక్కడ ఆడుకోవడానికి ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు. సాధన చేయడానికి అనువుగా మైదానం లేకపోవడంతో క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
10/18
  తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మూడోరోజు ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని  ఉప్పల్‌ జంక్షన్‌లో తెలంగాణ మ్యాప్‌ ఆకారంలో రాచకొండ పోలీసుల మానవహారం  నిర్వహించారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మూడోరోజు ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ జంక్షన్‌లో తెలంగాణ మ్యాప్‌ ఆకారంలో రాచకొండ పోలీసుల మానవహారం నిర్వహించారు.
11/18
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మూడోరోజు ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని  ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖ ప్రత్యేకంగా టెక్నాలజీ ఎక్స్‌పో ఆకట్టుకుంది. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మూడోరోజు ఆదివారం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ మార్గ్‌లోని బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖ ప్రత్యేకంగా టెక్నాలజీ ఎక్స్‌పో ఆకట్టుకుంది.
12/18
13/18
14/18
ఎండైనా.. వానైనా వారు బయట తిరగాల్సిందే. సకాలంలో ఆహారం అందజేయాల్సిందే. ప్రస్తుతం మాడు పగిలే ఎండలకు అలసిపోయి పని మధ్యలో పలువురు ఫుడ్‌ డెలివరీ చేసే యువకులు..  హైదరాబాద్‌లోని  విప్రో కూడలి నుంచి గచ్చిబౌలి ఐఐఐటీ దారిలో చెట్ల నీడన సేద తీరుతూ కనిపించారు. ఎండైనా.. వానైనా వారు బయట తిరగాల్సిందే. సకాలంలో ఆహారం అందజేయాల్సిందే. ప్రస్తుతం మాడు పగిలే ఎండలకు అలసిపోయి పని మధ్యలో పలువురు ఫుడ్‌ డెలివరీ చేసే యువకులు.. హైదరాబాద్‌లోని విప్రో కూడలి నుంచి గచ్చిబౌలి ఐఐఐటీ దారిలో చెట్ల నీడన సేద తీరుతూ కనిపించారు.
15/18
హైదరాబాద్‌: మండు వేసవిలోనూ పచ్చదనంతో నిండుగా కనిపిస్తున్న దుర్గం చెరువు పరిసరాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ సేద తీరేందుకు ప్రజలు తరలొస్తున్నారు. హైదరాబాద్‌: మండు వేసవిలోనూ పచ్చదనంతో నిండుగా కనిపిస్తున్న దుర్గం చెరువు పరిసరాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఉదయం, సాయంత్రం వేళ సేద తీరేందుకు ప్రజలు తరలొస్తున్నారు.
16/18
 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలోని రైస్‌ మిల్లు పరిసరాల్లో ధాన్యం ట్రాక్టర్లను చిత్రంలో చూడొచ్చు. రైతులు ధాన్యం లోడ్లు తీసుకొచ్చి మిల్లు పక్కనే ఉన్న ఖాళీ లేఅవుట్‌లో నిలిపి మూడు నుంచి 5 రోజుల పాటు ఎదురుచూస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం భగ్గేశ్వరం గ్రామంలోని రైస్‌ మిల్లు పరిసరాల్లో ధాన్యం ట్రాక్టర్లను చిత్రంలో చూడొచ్చు. రైతులు ధాన్యం లోడ్లు తీసుకొచ్చి మిల్లు పక్కనే ఉన్న ఖాళీ లేఅవుట్‌లో నిలిపి మూడు నుంచి 5 రోజుల పాటు ఎదురుచూస్తున్నారు.
17/18
ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం  కొర్టికల్‌(బి)లో ఈదురుగాలులకు ఓ ఇంటి రేకు ఎగిరిపోయి చెట్టు కొమ్మల్లో  ప్రమాదకరంగా ఇరుక్కుంది ఇలా. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం కొర్టికల్‌(బి)లో ఈదురుగాలులకు ఓ ఇంటి రేకు ఎగిరిపోయి చెట్టు కొమ్మల్లో ప్రమాదకరంగా ఇరుక్కుంది ఇలా.
18/18
 తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి  హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద నిర్వహించిన డ్రోన్‌ షో అబ్బురపరచింది. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 500 డ్రోన్లు వాటికి అమర్చిన లేజర్‌ కాంతులు వెదజల్లుతూ ఈ ప్రాంతాన్ని శోభాయమానం చేశాయి. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని దుర్గం చెరువు వద్ద నిర్వహించిన డ్రోన్‌ షో అబ్బురపరచింది. పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాదాపు 500 డ్రోన్లు వాటికి అమర్చిన లేజర్‌ కాంతులు వెదజల్లుతూ ఈ ప్రాంతాన్ని శోభాయమానం చేశాయి.
Tags :

మరిన్ని