News In Pics: చిత్రం చెప్పే సంగతులు 02 (09-06-2023)

Updated : 09 Jun 2023 21:32 IST
1/20
హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్‌ మైదానంలో సోలిటైర్ బిజినెస్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సమ్మిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్స్ హాజరై ఫొటోలకు పోజులిచ్చారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజ్‌ మైదానంలో సోలిటైర్ బిజినెస్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ సమ్మిట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్స్ హాజరై ఫొటోలకు పోజులిచ్చారు.
2/20
ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి నెల్లూరు నుంచి తిరుపతికి 12 విద్యుత్‌ బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బస్సులో ప్రయాణించి సౌకర్యాలను పరిశీలించారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి నెల్లూరు నుంచి తిరుపతికి 12 విద్యుత్‌ బస్సులను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బస్సులో ప్రయాణించి సౌకర్యాలను పరిశీలించారు.
3/20
దక్షిణ కొరియాలో నిర్వహించిన ఆసియా అండర్‌- 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మంచి ప్రదర్శన చేసింది. ఈ మేరకు ఆటగాళ్లను ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ప్రశంసించారు. ‘మా అథ్లెట్‌లు గొప్ప ప్రదర్శన ఇచ్చారు. వారికి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు. దక్షిణ కొరియాలో నిర్వహించిన ఆసియా అండర్‌- 20 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ మంచి ప్రదర్శన చేసింది. ఈ మేరకు ఆటగాళ్లను ప్రధాని మోదీ ట్విటర్ వేదికగా ప్రశంసించారు. ‘మా అథ్లెట్‌లు గొప్ప ప్రదర్శన ఇచ్చారు. వారికి శుభాకాంక్షలు’ అని ట్వీట్‌ చేశారు.
4/20
మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 540 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ రూ. 5,40,62,640 ల చెక్కులను పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 540 మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ రూ. 5,40,62,640 ల చెక్కులను పంపిణీ చేశారు.
5/20
విజయవాడ రమేష్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. విజయవాడ రమేష్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ను తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు.
6/20
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా నడిపల్లిలో నిర్వహించిన సంక్షేమ సంబరాలకు కవిత హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు ఆమెను గజమాలతో సన్మానించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా నడిపల్లిలో నిర్వహించిన సంక్షేమ సంబరాలకు కవిత హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు ఆమెను గజమాలతో సన్మానించారు.
7/20
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్‌ నైట్‌ 151/5 స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమ్ఇండియా మరో 145 పరుగులు జోడించి 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51) అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. దీనికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్‌ నైట్‌ 151/5 స్కోరుతో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమ్ఇండియా మరో 145 పరుగులు జోడించి 296 పరుగులకు ఆలౌటైంది. అజింక్య రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51) అర్ధశతకాలు సాధించారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 109 పరుగులు జోడించారు. దీనికి సంబంధించిన ఫొటోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది.
8/20
హాంకాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లో డచ్‌ కళాకారుడు ఫ్లోరెంటిజన్‌ హాఫ్‌మన్‌ రూపొందించిన ‘డక్స్‌’ ఆర్ట్‌ ఇన్‌స్టాలేషన్‌ను చూపరులు ఆసక్తిగా తిలకించారు. హాంకాంగ్‌లోని విక్టోరియా హార్బర్‌లో డచ్‌ కళాకారుడు ఫ్లోరెంటిజన్‌ హాఫ్‌మన్‌ రూపొందించిన ‘డక్స్‌’ ఆర్ట్‌ ఇన్‌స్టాలేషన్‌ను చూపరులు ఆసక్తిగా తిలకించారు.
9/20
హీరో మహేశ్‌ బాబు తన తాజా ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కొత్త లుక్‌లో కనిపిస్తున్న ఈ ఫొటోలను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. హీరో మహేశ్‌ బాబు తన తాజా ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. కొత్త లుక్‌లో కనిపిస్తున్న ఈ ఫొటోలను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు.
10/20
నల్గొండలోని ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫిష్‌ ఫుడ్ ఫెస్టివల్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ హాజరై చేప వంటకాలను రుచి చూశారు. నల్గొండలోని ఎన్జీ కాలేజీలో ఏర్పాటు చేసిన ఫిష్‌ ఫుడ్ ఫెస్టివల్‌కు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ హాజరై చేప వంటకాలను రుచి చూశారు.
11/20
సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు 30 మంది దివ్వాంగులకు ట్రై స్కూటీలను అందించారు. ఈ సందర్భంగా వారు  స్కూటీలను నడిపి ఆనందం వ్యక్తం చేశారు. సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి హరీశ్‌రావు 30 మంది దివ్వాంగులకు ట్రై స్కూటీలను అందించారు. ఈ సందర్భంగా వారు స్కూటీలను నడిపి ఆనందం వ్యక్తం చేశారు.
12/20
హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఇండియా జువెల్లరీ డైమండ్ ప్రదర్శనను ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నగలు, బంగారు ఆభరణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరవాసులు, వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఇండియా జువెల్లరీ డైమండ్ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన నగలు, బంగారు ఆభరణాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నగరవాసులు, వ్యాపారులు ఉత్సాహంగా పాల్గొన్నారు..
13/20
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎపీ ఎన్జీవో, ఉద్యోగ సంఘాల నేతలు  సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఎపీ ఎన్జీవో, ఉద్యోగ సంఘాల నేతలు సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యోగులకు రావాల్సిన రాయితీల సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రిని కోరారు.
14/20
నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా నయన్‌ తన పిల్లలతో దిగిన ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘వీళ్లే నా ప్రపంచం’ అని ట్వీట్‌ చేసింది. నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లిరోజు నేడు. ఈ సందర్భంగా నయన్‌ తన పిల్లలతో దిగిన ఫొటోలను ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘వీళ్లే నా ప్రపంచం’ అని ట్వీట్‌ చేసింది.
15/20
గిరిజన వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా వర్ధంతిని పురస్కరించుకొని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బండి సంజయ్‌ తదితరులు నివాళులు అర్పించారు. గిరిజన వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్‌ బిర్సా ముండా వర్ధంతిని పురస్కరించుకొని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి బండి సంజయ్‌ తదితరులు నివాళులు అర్పించారు.
16/20
 బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. కాజల్‌ కథానాయిక. శ్రీలీల ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈ నెల 10న 108 థియేటర్లలో సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫైనల్‌ కంటెంట్‌ చెకింగ్‌ పూర్తయిదంటూ అనిల్‌ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్‌ ఓ ఫొటోను పంచుకున్నారు. బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘భగవంత్‌ కేసరి’. కాజల్‌ కథానాయిక. శ్రీలీల ముఖ్యభూమిక పోషిస్తున్నారు. ఈ నెల 10న 108 థియేటర్లలో సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫైనల్‌ కంటెంట్‌ చెకింగ్‌ పూర్తయిదంటూ అనిల్‌ రావిపూడి, సంగీత దర్శకుడు తమన్‌ ఓ ఫొటోను పంచుకున్నారు.
17/20
గుంటూరు జిల్లా నంబూరులోని హజ్ క్యాంప్ వద్ద  తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హజ్‌ యాత్రికులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాత్రికులకు మిఠాయిలు, యాత్రలో ఉపయోగపడే వస్తువుల కిట్‌ను అందజేశారు. గుంటూరు జిల్లా నంబూరులోని హజ్ క్యాంప్ వద్ద తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు హజ్‌ యాత్రికులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యాత్రికులకు మిఠాయిలు, యాత్రలో ఉపయోగపడే వస్తువుల కిట్‌ను అందజేశారు.
18/20
నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లిరోజు నేడు. ప్రేమికులుగా ఉన్న వీరిద్దరు గతేడాది జూన్‌ 9న  వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా తన భర్త విఘ్నేష్‌తో దిగిన  ఫొటోలను నయన్‌ ట్విటర్‌లో పంచుకున్నారు. నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లిరోజు నేడు. ప్రేమికులుగా ఉన్న వీరిద్దరు గతేడాది జూన్‌ 9న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తాజాగా తన భర్త విఘ్నేష్‌తో దిగిన ఫొటోలను నయన్‌ ట్విటర్‌లో పంచుకున్నారు.
19/20
భారత పేస్‌ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ ఇంట పెళ్లి బాజా మోగింది. గురువారం రచన కృష్ణతో అతడి పరిణయం జరిగింది. ఈ వేడుకకు టీమ్‌ఇండియా ఆటగాళ్లు బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌, మయాంక్‌ అగర్వాల్‌ తదితరులు హాజరై సందడి చేశారు. భారత పేస్‌ బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ ఇంట పెళ్లి బాజా మోగింది. గురువారం రచన కృష్ణతో అతడి పరిణయం జరిగింది. ఈ వేడుకకు టీమ్‌ఇండియా ఆటగాళ్లు బుమ్రా, శ్రేయస్‌ అయ్యర్‌, మయాంక్‌ అగర్వాల్‌ తదితరులు హాజరై సందడి చేశారు.
20/20
మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు హైదరాబాద్‌ పాతబస్తీలోని తమ నివాసంలో చేపమందును పంపిణీ చేసి ఉదారతను చాటారు. మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు హైదరాబాద్‌ పాతబస్తీలోని తమ నివాసంలో చేపమందును పంపిణీ చేసి ఉదారతను చాటారు.

మరిన్ని